మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్(1896–1995)

మొరార్జీ దేశాయ్ గారి పూర్తి పేరు మొరార్జీ రాంచోడ్జి దేశాయ్, దేశాయ్ గారు పూర్వ బొంబాయి ప్రొవిన్సులో ఉన్న బుల్సర్ జిల్లా భాదేలి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు గ్రామంలో పేరున్న పండితులు మరియు ఉపాధ్యాయులు.

బొంబాయి లోని విల్సన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి , ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు, 1930లో జరిగిన గోద్రా అల్లర్ల కు జిల్లా అధికారిగా నైతిక బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ గారికి ముఖ్య అనుచరులుగా కొనసాగారు1937లో బొంబాయి ప్రొవిన్సుకు ఎన్నికయ్యి రెవెన్యూ, హోం శాఖల మంత్రిగా పనిచేశారు, స్వాతంత్ర్య అనంతరం 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్య 1956 వరకు కొనసాగారు. దేశాయ్ గారి హయాంలోనే బొంబాయి రాష్ట్రం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.

1957,1962,1967,1971,1977 లలో వరుసగా ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. నెహ్రూ, ఇందిరా గాంధీ మంత్రి వర్గాల్లో ఆయన చేపట్టిన కేంద్ర మంత్రి పదవి ఉందంటే అది ప్రాధాన్యత లేని శాఖలు మాత్రమే. 1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చిలిపోతే సంప్రదాయ కాంగ్రెస్ వాదులు దేశాయ్ గారి పక్షాన, యువ నాయకులు ఇందిరా గాంధీ పక్షాన నిలిచారు.

లోక్ నాయక్ జె.పి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమం లో పాల్గొన్నందుకు జైలుకు వెళ్లారు. 1977లో జె.పి గారు స్థాపించిన జనతా పార్టీలో చేరి దేశవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో జనతాపార్టీ విజయం సాధించడంతో దేశానికి తొలి కాంగ్రేసేతర ప్రధానమంత్రి గా ఎన్నికయ్యారు.

దేశాయ్ గారి మనవడు మధుకేశ్వర్ దేశాయ్ గారు ప్రస్తుతం భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు గా పనిచేస్తున్నారు. దేశాయ్ గారు తన మూత్రాన్ని స్వయంగా పొదున్నే తాగేవారు , ఆయన దృష్టిలో మూత్రం సర్వరోగ నివారిణి అని విశ్వసించిన మొదటి రాజకీయ నాయకుడు.

%d bloggers like this: