డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్.. కమలం

ఇది ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ‘పితాహాయ’ అని కూడా పిలుస్తారు. లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు. ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసదారులతో పాటు ఈ పండు వియత్నాంలోకి ప్రవేశించింది. ఆ దేశంలో దీన్ని ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.

చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంకలలో కూడా ఈ పండ్లను విరివిగా పండిస్తున్నారు. భారతదేశంలో 1990లనుంచీ వీటి పెంపకం ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఈ పండ్ల తోటల పెంపకం పెరిగింది. సాంప్రదాయ పంటలకు బదులుగా కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు డ్రాగన్ పండ్ల తోటలవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. గుజరాత్‌తోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. గుజరాత్‌లోని అనేకమంది రైతులు ఈ పండ్ల పెంపకం గురించి తెలుసుకోవడం కోసం పూణె వెళుతుంటారు. ఇంటర్నెట్‌లో కూడా విస్తారమైన సమాచారం లభ్యమవుతోంది.

ఎరుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ పండ్లకు డిమాండ్ ఎక్కువ

ఈ పండ్ల లోపలి భాగం రెండు రకాలుగా ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఎరుపు పండ్లకు డిమాండ్ ఎక్కువ. అయితే, భారతదేశంలో అనేకమంది దీన్ని స్థానిక ఫలంగానే భావిస్తున్నారు. డెంగ్యూ వచ్చిన రోగులలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిదని చెబుతారు.

గుజరాత్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు

%d bloggers like this:
Available for Amazon Prime