
National Voters Day is celebrated in India on January 25 annually.
The National Voters’ Day (NVD) is celebrated across the country to mark the foundation day of Election Commission of India, the autonomous constitutional authority responsible for conducting elections. The Manmohan Singh government initiated this in 2011. On this day, the government holds campaigns to encourage voters (particularly young voters) to participate in the political process. National Awards are given for excellence and innovation in election processes. These awards recognise the contribution of the election machinery, government departments, media and PSUs.


ప్రజాస్వామ్యం, ఎన్నికలపై యువతీ, యువకుల్లో ఆసక్తిని పెంచేందుకు… 18 ఏళ్లు దాటిన వారిని ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా జనవరి 25న జరుపుకుంటున్నదే జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ రోజున ఓటు ఎందుకు వెయ్యాలి? దాని గొప్పదనం ఏంటి? ఓటు వెయ్యకపోతే కొంపలు ఎందుకు మునుగుతాయి? అనే అంశాలపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తాయి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు.
ఓటు వెయ్యకపోతే ఏమవుతుంది?
అవినీతి, కుళ్లు రాజకీయాలను చూసే యువతకు ఓటు పట్ల ఆసక్తి తగ్గుతోంది. “నేను ఒక్కణ్ని ఓటు వెయ్యకపోతే ఏమవుతుంది… ఏం కాదులే” అని చాలా మంది భావిస్తున్నారు. నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రం కదా.. అలాగే అందరూ ఓటు వేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అంతేకాదు.. ఓటు వేస్తే అదో కిక్కు. ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించగలం. నడిరోడ్డున నిలబెట్టి నిలదియ్యగలం. కాబట్టే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఓటు వేసేయాలి. ప్రజాస్వామ్య వ్యతిరేకులకు చుక్కలు చూపించాలి.
అలా పుట్టింది ఈ రోజు:
జనవరి 25 అనేది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India (ECI) స్థాపించిన రోజు. 1950 జనవరి 25న దాన్ని స్థాపించారు. దాన్ని గుర్తుచేసుకుంటూ… 2011లో తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవం జరిపారు. అలా ఇది మొదలైంది. ECI సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ… కేంద్ర న్యాయ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలో ఎన్నికల్ని చక్కగా జరిపేలా చెయ్యడం ఈ సంస్థ బాధ్యత.

You must log in to post a comment.