రామ్ మాధవ్(1964)
- రామ్ మాధవ్ గారు ఆగస్టు 22,1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో సూర్యనారాయణ , జానకీ దేవి దంపతులకు జన్మించారు.
- అమలాపురం పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసారు, మైసూర్ దూర విశ్వవిద్యాలయం ద్వారా రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.
- చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ లో చేరి సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1981 నుండి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు.
- ఆర్ ఎస్ ఎస్ లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకులు అధిక సంఖ్యలో చేరడంలో కీలకంగా వ్యవహరించారు.
- ఆర్ ఎస్ ఎస్ లో వివిధ స్థాయిల్లో పనిచేసిన మాధవ్ గారు పాత్రికేయులు కూడా, జాగృతి అనే వార పత్రిక సంపాదకులు కూడా పనిచేసారు, అలాగే ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వివిధ పత్రికల్లో కూడా పనిచేసారు.
- ఆర్ ఎస్ ఎస్ కార్యవర్గ సభ్యుడిగా దేశం మొత్తం పర్యటించారు. అలాగే ఆర్ ఎస్ ఎస్ మేధావులు వర్గంలో ముఖ్యులు.2003 నుంచి 2014 వరకు ఆర్ ఎస్ ఎస్ అధికార ప్రతినిధి గా పనిచేసారు.
- 2014 ఎన్నికల్లో లో ఆర్ ఎస్ ఎస్ ను బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు.
- 2014లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2020 వరకు పనిచేసారు.
- ఈశాన్య, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేశారు.
- విదేశాంగ విధానం మీద అత్యంత స్పష్టమైన అవగాహన కలిగిన భారత రాజకీయ నాయకుల్లో ముఖ్యులు.
- ఇండియా ఫౌండేషన్ అనే మేధావుల చర్చ వేదికను స్థాపించి దేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చలకు అనేక మంది మేధావులను ఆహ్వానించారు.
పత్రిక రంగంలో 20 సంవత్సరాల పైగా పని చేసిన అనుభవంతో పాటు దేశంలో ప్రముఖమైన వివిధ పత్రిక సంపాదకులతో బలమైన పరిచయాలు కలిగి ఉన్న వ్యక్తి ఒక్క రామ్ మాధవ్ గారే.
You must log in to post a comment.