వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వివాహ జీవితం చాలా అందమైనది మరియు ముఖ్యమైనది. మానవ మనుగడ కోసం మరియు మన సుఖం కోసం వివాహం అనే ఒక బలమైన వ్యవస్థను మనం (అనగా మన మానవ జాతి) ఏర్పాటుచేసుకున్నాము. మానవుడు మనిషిగా పరిణామం చెందుతూ, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టిక్స్ తో వచ్చే ఇబ్బందులను హేతుబద్దంగా అధ్యయనం చేసి వివాహం యొక్క నియమాలను, వివాహ చట్టాలు మన సుఖం కోసం లేదా మనుగడ కోసం మనం ఎర్పరుచుకున్నాం. వివాహ జీవితం ఎంత అందమైనదో, అంతే కఠినమైనది. ఇద్దరు ఆలోచనలు, వ్యక్తిత్వాలు, బాధ్యతలు, కలసికట్టుగా జీవితాంతం ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ప్రేమ ఆప్యాయతల మధ్య ప్రయాణం సాగించాలి అంటే ఎంతో ఓర్పు, సహనం అవసరం. ఈ ప్రయాణం మధ్యలో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఎన్నో చిన్ని చిన్న కారణాలు పెద్దవిగా మారి దంపతులు విడిపోవడానికి కారణాలవుతున్నాయి.…

Read More

మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది?

మనిషి శరీరం చాలా వరకు బోలుగా ఉంటుంది. ఊపిరితుత్తులు, జీర్ణ వ్యవస్థ మొదలైన పెద్ద పెద్ద దేహ భాగాలు బోలుగా ఉంటాయి. కాబట్టి మనిషి దేహం నీటిలో తేలుతుంది. కానీ మనం మిగతా శరీర భాగాలని (కాళ్ళు, చేతులు) సమంగా అమార్చగలిగితేనే. లేకపోతే మునిగిపోతాము. ఆ విధంగా ప్రయత్నం చేసినవారు నీటిపై తేలుతారు. మన మెదడు మన నియంత్రణ లో ఉంటే నీటిపై తేలటం తేలికైన పనే. మనం మునిగిపోయేది భయం వలన మాత్రమే. చనిపోయాక మెదడు ఎలాగూ పనిచేయదు కాబట్టి భయం, కళ్ళు చేతుల కదలికలు ఉండవు కాబట్టి శవం నీటిలో తేలుతుంది.

Read More

రోలర్ కోష్టర్

ముందుగా ఆ రోలర్ కోష్టర్ నీ విద్యుత్తు శక్తి తో ఆ పట్టాలు ఉన్న ఎత్తైన ప్రదేశం మీదికి తీసుకువెళతారు. అలా తీసుకెళ్లడం ద్వారా ఆ రైలు బండి లో మనం స్థితి శక్తి నీ నింపుతాము. అలా రైలు బండి ని మనం మీదికి తీసుకెళ్లే కొద్దీ దానిలో స్థితి శక్తి అనేది వస్తూ ఉంటుంది. అలా ఒకసారి ఆ పట్టాలు ఉన్న ఎత్తైన ప్రదేశం లోకి వెళ్ళిన తరువాత అది కిందకి రావడం మొదలవుతుంది. ఇప్పుడు దాని మీద ఎలాంటి శక్తి ఉండదు. కేవలం గురుత్వాక్షణ ద్వారా వస్తుంది. అది అలా వచ్చేప్పుడు ఆ రైలు బండి స్థితి శక్తి క్రమంగా వదిలేసి, గతి శక్తి ని తెచ్చుకుంటుంది. ఇది ఆ కిందికి వచ్చే పట్టాలు చివర లో ఈ గతి శక్తి అనేది…

Read More

లీనియర్ వెలాసిటీ, ఆంగ్యులర్ వెలాసిటీ మధ్య సంబంధం ఏమిటి?

వెలాసిటీ ని వేగం అందాం. “లీనియర్ వెలాసిటీ” అనేదానిని సరళ వేగం అందాం. అనగా, ఒక సరళ రేఖ వెంబడి వేగం. అనగా ఒక సరళ రేఖ వెంబడి ఒక క్షణంలో ఎంత దూరం కదిలేమో చెబుతుంది. అనగా, వేగం = కదలిన దూరం/జరిగిన కాలం. (ఇక్కడ “/” అంటే “భాగించు” అని అర్థం.) కారు సెకండుకి 10 మీటర్లు కదిలితే దాని సరళ వేగం 10 మీటర్లు/సెకండు (ఇక్కడ “/” అంటే “సెంకడుకి ఇన్ని మీటర్లు” అని అర్థం ). ఇలాంటి సరళ రేఖ వెంబడి వేగాన్ని v అనే అక్షరంతో సూచించి, ఇంగ్లీషులో linear velocity అంటారు. కారు ముందుకి కదిలినప్పుడు దాని చక్రం గిర్రున గుండ్రంగా తిరుగుతుంది కదా. చక్రం ఎక్కువ జోరుగా తిరిగితే కారు ఎక్కువ జోరుగా ముందుకి కదులుతుంది. కనుక…

Read More

రామ్ మాధవ్

రామ్ మాధవ్(1964) రామ్ మాధవ్ గారు ఆగస్టు 22,1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో సూర్యనారాయణ , జానకీ దేవి దంపతులకు జన్మించారు. అమలాపురం పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసారు, మైసూర్ దూర విశ్వవిద్యాలయం ద్వారా రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ లో చేరి సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1981 నుండి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. ఆర్ ఎస్ ఎస్ లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకులు అధిక సంఖ్యలో చేరడంలో కీలకంగా వ్యవహరించారు. ఆర్ ఎస్ ఎస్ లో వివిధ స్థాయిల్లో పనిచేసిన మాధవ్ గారు పాత్రికేయులు కూడా, జాగృతి అనే వార పత్రిక సంపాదకులు కూడా పనిచేసారు, అలాగే ఆర్ ఎస్ ఎస్…

Read More

ఫ్లైట్ పాత్స్ (flight paths)

ప్రపంచ వ్యాప్తంగా విమానాలు కొన్ని స్టాండర్డ్ (standard) మార్గాలలోనే దాదాపుగా ప్రయాణించ వలసి వస్తుంది. ఈ స్టాండర్డ్ మార్గాలను మనం ఫ్లైట్ పాత్స్ (flight paths) అని అనవచ్చు. ఎక్కువ శాతం ఈ మార్గాలలోనే విమానాలు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇందుకు కొన్ని కారణాలు: 1. ప్రపంచ దేశాల పైనుండి విమానాలు వెళ్ళవలసి ఉన్నందున, వేరు వేరు దేశాల మిలిటరీ స్థావరాలమీద విమానాలను వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు. 2. కొన్ని ముఖ్యమయిన మరియు రహస్య స్థావరాల మీద నుండి విమానాలను వెళ్లనివ్వరు. 3. జెట్ స్ట్రీమ్స్, అంటే ఆకాశం పైన ఎత్తులో కొన్ని వేగంగా వీచే గాలి దిశలను బట్టి ఫ్లైట్ పాత్స్ నిర్ణయిస్తారు. 4. విమానపు రాడార్ కింద నెల మీద ఉండే కొన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ రాడార్ పరిధిలోనే ఉండవలసిన కారణంగా, కొన్ని…

Read More

దేశీ వరి రకాలు వాటి ప్రాముఖ్యత

1. రక్త శాలి:ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్. 2. కర్పూకవుని:ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు. 3. కుళ్లాకార్: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ…

Read More

దేశీ వరి విత్తనాలు రకాలు.

1)రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు.3) పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.4) కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.5) మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.6) చింతలూరు సన్నాలు > తెలుపు> సన్నరకం > పంటకాలం>110 నుండి 120 రోజులు.7) కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.8) ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.9) నవార >ఎరుపు>మధ్యరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.10) రామ్ జీరా > తెలుపు> పొట్టిరకము> పంటకాలం 120 నుండి130 రోజులు.11) ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.12) సిద్ధ సన్నాలు >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి 135రోజులు.13) గురుమట్టియా > తెలుపు> లావురకం> పంటకాలం130 నుండి135రోజులు.14) రత్నచోడి > తెలుపు>సన్నరకం>…

Read More

హర్షద్ మెహతా

1954లో గుజరాత్‌లో పుట్టి, జేబులో నలభై రుపాయలతో, కళ్ళలో కోటి కలల్తో బొంబాయికి వచ్చాడు. బీకాం చదివాక ఎనిమిదేళ్ళు ఏవేవో ఉద్యోగాలు చేస్తూ 1980లో ఒక స్టాక్ బ్రోకర్ వద్ద చిన్న ఉద్యోగంలో చేరాడు. అలా స్టాక్ మార్కెట్లపై ఇష్టం, జ్ఞానం పెంచుకుని 1984లో గ్రోమోర్ పేరుతో బ్రోకెరేజ్ సంస్థను స్థాపించాడు. 1990కి పదిహేను వేల చదరపు అడుగుల ఇల్లు, విదేశీ కార్లతో బొంబాయి సంపన్న వర్గాల్లో సూపర్‌స్టార్ అయ్యాడు. పలు ప్రముఖులు అతని సంస్థలో పెట్టుబడులు పెట్టారు. 1992లో సుచేతా దలాల్ వెలికితీసిన నిజాలతో పేకమేడలా అతని సామ్రాజ్యం కూలిపోయింది. ఇంతకూ అతను చేసిన స్కామ్ ఏంటి? ముందు కాస్త నేపథ్యం. 1991లో వ్యవస్థలో పెనుమార్పులకు తెరతీశారు అప్పటి ప్రధాని నరసింహారావు గారు. అయితే దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ రంగం నుంచి ఎదురైన…

Read More

ముప్పవరపు వెంకయ్యనాయుడు

యం.వెంకయ్య నాయుడు (1949) వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, చవటపాలెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి దేశటానకు వెళ్లడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణ లో పెరిగారు. నెల్లూరు లో ఉన్న ప్రముఖ వి.ఆర్.కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆర్.ఎస్.ఎస్ నెల్లూరు జిల్లా ఇంఛార్జిగా ఉన్న సోమేపల్లి సోమయ్య, ముఖ్య శిక్షక్ గా ఉన్న భోగాది దుర్గాప్రసాద్ గార్ల ప్రోత్సాహంతో ఆర్.ఎస్.ఎస్ లో చేరి, అనంతరం ఆర్.ఎస్.ఎస్ అనుబంధ విద్యార్థుల సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ లో ప్రవేశించి అనతి కాలంలోనే నెల్లూరు పట్టణ ఎబివిపి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎబివిపి తరుపున విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు. విద్యార్థులు నాయకుడిగా ఉన్న సమయంలో జై…

Read More