సుందర్‌బన్స్ ( SUNDARBANS)

ఈ చిత్రం వికీపీడియాలోనిది.

అక్కడ ఆశ్చర్యకర విషయాలు కోకొల్లలు.

  • పల్లెల్లో ఇంచుమించు ప్రతి ఇంటి ముందు నీటి గుంట ఉంది – వారి అన్ని నీటి అవసరాలకు ఇదే ఆధారం.
  • గోదారి లంకల్లోలా అక్కడా జనాలు రవాణాకు లాంచీలు వాడతారు. అలల పోటు తగ్గినప్పుడు ఆ లాంచీలు ఇలా కనిపించాయి (కొన్ని గంటలకు మళ్ళీ నీరు వీటిని చుట్టుముట్టేసింది):
  • అక్కడ పల్లెల్లో తిరగటానికి ఈ రిక్షాలే:
  • ఆ మడ అడవుల్లో చెట్ల వేళ్ళు ఊడల్లో ఒక రకమైన Aerial Roots – అంటే భూమిలోంచి పైకి పెరుగుతాయి. నేలపై పరుచుకున్నవన్నీ చుట్టుపక్క చెట్ల వేళ్ళు:
  • పై చిత్రంలోని ప్రదేశమే హై టైడ్‌లో ఇలా:
  • ముంగీసలు, ఉడుములు ఇలా తిరిగేస్తూ కనిపించాయి:
  • చిత్తడి నేలలో రంగురంగుల ఎండ్రకాయలు కనిపించాయి:
  • పదే నిముషాల్లో వాతావరణం మారిపోయేది – నిర్మలాకాశం నుంచి హోరువానకు. ఇలా ఒక్క రోజులో రెండు సార్లు జరిగింది.
  • అక్కడ పల్లెల్లో కరెంటు లేదు – అందరూ చిన్న డీజిల్ జెనరేటర్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద వారికి డీజిల్ సరఫరా చేసేది.
  • పల్లెల్లో చాలా మందికి నదిలో చేపలు, అడవిలోంచి సేకరించుకొచ్చే తేనె వంటివే జీవనాధారం. ఆ క్రమంలో పులుల దాడులు అక్కడ సాధారణం, జనులూ అలవాటు పడిపోయారు. కొన్ని పులులు నదిలో ఈదుకుంటూ పల్లెల్లోకి వస్తుండటంతో చాలా చోట్ల నదిపై వలలతో కంచెలు ఏర్పాటు చేశారు.

నీటిలో పులి నేల మీద మొసలి
అడవి అంటే… పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే… సుందర్‌బన్‌లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు… మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్‌ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్‌ రాయల్‌ టైగర్‌లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అనుమతి తీసుకోవాలి.

అడవిలో ఊళ్లు
మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు. 

సరిహద్దు దీవి
మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్‌ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు. 

సాహిత్యవనం
సుందర్‌బన్‌ అటవీప్రదేశం కోల్‌కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ నేచర్‌’ కేటగిరీలో లిస్ట్‌ అయింది. బెంగాలీ రచయితలు సుందర్‌బన్‌ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు.

సుందరబన్‌కు ప్రత్యేక హోదాలు
► 1973 టైగర్‌ రిజర్వ్‌ 
► 1987 వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌
► 1989 నేషనల్‌ పార్క్‌

%d bloggers like this:
Available for Amazon Prime