అంతర్జాతీయ స్పేస్ స్టేషన్

  • 1980లో పూర్తిగా అమెరికా ప్రయత్నంగా “ఫ్రీడం” అనే పేరు మీద ఈ కట్టడం మొదలైనా వ్యయం తగ్గించుకునేందుకు, అంతర్జాతీయంగా వివిధ అంతరిక్ష ఏజెన్సీల ప్రమేయం కల్పించుకునేందుకు “ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్” పేరుతో ఈ విశ్వంలోనే అత్యంత ఖరీదైన మానవ కట్టడం (2010 లెక్కల ప్రకారం సుమారు 150 బిలియన్ డాలర్లు పై చిలుకు)కు నాంది పలికింది.

అంతరిక్షం లో ఈ “స్పేస్ స్టేషన్” సెకనుకు ఐదు మైళ్ళ వేగంతో భూమి చుట్టూ తొంభై నిమషాల కు ఒక మారు చొప్పున మొత్తం ఒక రోజులో పదహారు సార్లు ప్రదక్షిన చేస్తుంది. వ్యోమగాములకు, ప్రయోగశాలలోని జంతువులకు కలిపి మొత్తం స్టేషనుకు గానూ రెండే బాత్రూములు ఉన్నాయి. వారు విసర్జించిన మూత్రాన్నే త్రాగునీరుగా శుద్ధి చేసే ప్రక్రియ కూడా ఉంది. (ఆ రకంగానైనా త్రాగునీరు వాడకం తగ్గుతుందని కాబోలు )

అంతరిక్షంలో ఏకబిగిన ఎక్కువ సమయం గడపడం ద్వారా కండరాల మరియూ ఎముకుల ద్రవ్యశక్తి తగ్గి అవి క్షీణించే అవకాశాలు ఉన్నందుకు రోజూ రెండూ గంటల పాటు వ్యోమగాములు వ్యాయామం చేయుటకు అనుగుణంగా ‘జిం’ ని కూడా కల్పించారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ మొత్తం ఒక అమెరికన్ ఫుట్బాల్ స్టేడియం విస్తీర్ణం కలిగి ఉంటుంది. దాని సోలార్ పేనల్ల ఒక్కో రెక్క పొడవు ఇంచుమించుగా ఒక ఏ380 విమానపు పొడవు కలిగి ఉంటుంది.

మీరు ఉండే ప్రాంతాన్ని బట్టీ నిర్ధిష్ట సమయాల్లో (ముఖ్యంగా తెల్లవారు ఝాముల్లో, మునిమాపు వేళల్లో) ప్రపంచంలో ఎక్కడ నుండైనా మానవ నేత్రంతో దానిని వీక్షించవచ్చును. మీరుండే ప్రాంతం గుండా ఏ ఏ కాలంలో అది ప్రయాణిస్తుందో దాని గమనాన్ని ఏ ఏ సమయాల్లో చూడవచ్చునొ తెలుపుటకు నాసా సంస్థ ఒక వెబ్సైటును నిర్వహిస్తుంది. http://spotthestation.nasa.gov ద్వారా మీరు వివరాలను తెలుసుకోవచ్చు. ఒకే సారి ఆరు అంతరిక్ష నౌకలను ఈ స్పేస్ స్టేషన్‌కు అనుసంధానం చేయవచ్చును.

Related posts

%d bloggers like this: