హైడ్రోపోనిక్ వ్యవసాయం

హైడ్రోపోనిక్ వ్యవసాయం అంటే నీటిని ఉపయోగించి మట్టి లేకుండా వ్యవసాయం చేయడం. మట్టి ద్వారా అందే పోషకాలను నీటిలో కలిపి మొక్కలకు అందిస్తారు.

తక్కువ స్థలంలో ఎక్కువ పంటను పండించవచ్చు.పాలిహౌజ్ ల కన్నా అధునాతన పద్దతిలో ఈ విధానంలో కొన్ని రకాల పూలు,పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఆహారోత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. చౌడు నేలలు, వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో ఈ విధానం అవలంబించవచ్చు.తక్కువ నీరు, పోషకాలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చు.

మొక్క స్థిరంగా ఉండడానికి మట్టికి బదులు జడపదార్థం ఉపయోగిస్తారు. పంట రకాన్ని బట్టి రాక్ పూల్, పెర్లైట్, వెర్మికులైట్, ఇసుకలను జడపదార్థంగా ఉపయోగిస్తారు. గాలి , వెలుతురు పంట రకాన్ని బట్టి తగిన మోతాదులో కృత్రిమంగా అందిస్తారు.

లాభాలు:

1.నీటి వినియోగం తక్కువ.

2.తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ పంట దిగుబడి.

3.నీటి ఎద్దడి గల ఎడారి ప్రాంతాల్లో కూడా పంటలు పండించవచ్చు.

4.ఆకుకూరలు, టమాటాల వంటి మొక్కలు వేగంగా పెరుగుతాయి.

5.చీడపీడలు, కలుపు మొక్కల వంటి బాధలుండవు

6.నేలకోత,వరదలు వంటి బాధలుండవు.

7.పట్టణాల్లో మిద్దె వ్యవసాయానికి అనుకూలం.

నష్టాలు:

1.హైడ్రోపోనిక్ పరికరాలు ఖరీదైనవి.

2.నిరంతర పర్యవేక్షణ అవసరం.

3.సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది.

4.కొన్ని రకాల పంటలకు మాత్రమే అనుకూలం.

5.విద్యుత్ వినియోగం ఎక్కువ.

6.నీటిలో ఉండే సూక్ష్మజీవులు మొక్కల పైకి పాకే అవకాశం ఉంటుంది.

Google photos