దీన్ని “రొజెర్ హాల్” వైల్డ్ ఆర్ట్ అని తయారు చేసిన అంతర్జాల చిత్రం.
ఇందులో చూపిన స్పిట్టింగ్ కోబ్రా అంటే విషాన్ని చిమ్మే పాము. అది ఇలా చిమ్ముతుంది.
ఇది ఆఫ్రికన్ స్నేక్ బైట్ సొసైటీ చిత్రం
ఇంకా వారివే కొన్ని చిత్రాలు
ఇవన్నీ మనదేశం లోవి కావు.
ఇక మనదేశం లో ఉండే నాగు పాములలో ప్రధానం గా రెండు కళ్ళద్దాలు ,లేదా ఒక కళ్ళద్దము ఉండే రకాలు.(mono Spectacle Bi spectacle) ఇవి ఇలా ఉంటాయి.
ఇకా తెల్లవి, నల్లవి ,అదేనండి శ్వేతా నాగు, అలాంటివి జన్యు పరివర్తన వల్లనే కానీ ప్రత్యెక తరగతి కాదు. రెండు కళ్ళద్దాలు పడగ పై ఉండే పాము ని నజ నజ ( naja naja) అనే శాస్త్రీయ నామం తో పిలుస్తారు.ఇది ఎలాపిడే (ELAPIDAE) అనే కుటుంబం నకు చెందింది .ప్రజాతి నామం నాజ .
అలాగే ఒక అద్దం(monocle) పడగ పై ఉండే పాము ని నాజా కౌతియ(Naja kaouthia) అని పిలుస్తారు.ఇది ఎక్కువగా తూర్పు భారత దేశం మరియు బంగ్లా, చైనా, వియత్నాం కంబోడియా ల లో ఉంటుంది.
ఇక చివరది నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా (Ophiophagus hannah – జాతి/ప్రజాతి నామము).ఇది “నాజ” ప్రజాతికి చెందదు.దీని జాతి పేరు “ఓఫియోఫేగస్ .అంటే పాముల్ని తినేది అనే అర్ధం.ఇది ఇతర పాములను తినగలదు. చాల పొడవు పెరుగుతుంది.దీని విషం అత్యంత ప్రమాద కరం. దీని పడగ మీద ^ గుర్తు ఉంటుంది.
బొమ్మ లో అతని పేరు ” వా వా సురేష్ ” కేరళ వాసి.50,౦౦౦ పాములు పట్టిన నేర్పు ఈయన కు ఉంది.ఈయనను ముద్దు గా “స్నేక్ మాన్ ఆఫ్ కేరళ” అంటారు. దీనికి నాగు పాముకు తేడా లున్నాయి. ఇది గుడ్లు పెట్టడానికి గూడు కడుతుంది.మామూలు నాగు 5.5 అడుగులు పెరిగితే ఇది15 అడుగుల వరకు పెరుగుతుంది. దీని పడగ వెడల్పు గా ఉండదు.
You must log in to post a comment.