గోళీ సోడా

1872 లో మన దేశంలో బ్రిటీష్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా రోజులలో, హిరామ్ కాడ్ (Hiram Codd) అనే ఒక ఇంగ్లాండ్ వాసికి తొలుత కార్బొనేటడ్ డ్రింక్స్‌ను అతి తక్కువ ధరకు జనాలకు అందివ్వాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో నుండి పుట్టిందే గోలీ సోడా. ఈ సోడా బాటిల్‌ను చాలా ప్రత్యేకమైన రీతిలో డిజైన్ చేశారు. ఈ బాటిల్ పై భాగం లోపల రబ్బర్ వాషరును తొడిగి ఉంచుతారు. గ్యాస్ సిలిండర్ నుండి సోడా గ్యాస్‌ను కొంత నీటితో నిండిన సోడా బాటిల్‌లోకి మెషీన్ ద్వారా పట్టిస్తున్నప్పుడు, ఆ వాయువు ఒత్తిడికి లోపల ఉండే గోలీ.. వాషర్‌ లోపలికి వెళ్లి ఇరుక్కుంటుంది. కొంత గ్యాస్ బాటిల్లోని నీటితో కలిసిపోతుంది. ఈ బాటిల్స్‌ను ప్రైవేటు వర్తకులు కిళ్లీ కొట్లకి, పచారీ కొట్లకీ సప్లై చేస్తుంటారు. గోలీని మూతగా వాడుతూ సోడాలను తయారుచేస్తారు కాబట్టి, వీటికి గోలీసోడాలనే పేరు వచ్చింది.[

కస్టమర్‌కి సోడాను అందివ్వాలంటే, సోడాపై భాగాన ఉన్న గోలీని గట్టిగా నొక్కాలి. అది అప్పుడు కింద భాగానికి వెళ్తుంది. ఆ రోజులలో గోలీ సోడా అనేది ఒక ట్రెండ్ సెట్టర్. గ్యాస్‌ను రుచి చూడడమేమిటా? అని జనాలు ఆశ్చర్యపోయేవారు. కానీ తర్వాత దానికే addict అయిపోయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. గోలీసోడా తయారీదారులు తొలుత కేవలం మంచి నీళ్ల సోడానే అమ్మేవారు.

తర్వాత షర్బత్‌ను పోలే కలర్ సోడా, నిమ్మసోడా కూడా వాడుకలోకి వచ్చాయి. ఒకప్పుడు గోలీసోడా వ్యాపారం అనేది అత్యంత లాభసాటి వ్యాపారంగా కొనియాడబడేది. కానీ ఎప్పుడైతే కోలా, పెప్సీ లాంటి సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు జనాలలోకి వచ్చాయో, వీటి అమ్మకాలు కాస్త మందగించాయి.

చాలా సార్లు గోళీని కొట్టడానికి ప్రయతించాను కానీ నావి చిన్న చేతులు కదా, ఎంత గెట్టిగా గోళీని కొట్టినా కూడా అది కిందకి దిగేది కాదు. చివరకు ఆ కొట్టు అతనే గోళీ కొట్టి ఇచ్చేవాడు.

“నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడా ఇలాంటి పానీయం దొరకదు, రాదు”.

%d bloggers like this: