- దేశీయ మందారం ( నాటు మందార)
ఇది రేఖ మందారం… ఇందులో ముద్ద మందారం ఉంటుంది.
ప్రత్తి మందారం
పొద్దున్న తెల్లగా… సాయంత్రానికి గులాబీ రంగులోకి మారిపోతుంది.
సముద్ర మందార ( sea hibiscus)
ఇది కూడా ఇంతే …పొద్దున్న పసుపు రంగులో.. సాయంత్రానికి కుంకుమ రంగులో కి మారుతుంది.
పైన చెప్పిన మందార రకాలు చాలా సులభంగా పెంచవచ్చు… ఒకసారి మనం వేస్తే, ఇంకో పాతిక, ముప్పై సంవత్సరాలు చూసుకోవలసిన అవసరం రాదు.
వీటికి వచ్చే చీడ పీడలు గురించి సమాధానం చివరలో వివరిస్తాను.
గమనిక:
కొత్తగా అన్ని రకాల రంగులలోను మందారాలు దొరుకుతున్నాయి…ఇవన్నీ కూడా చైనా దేశం నుంచి వచ్చినవి. వాటిని చైనా రోజ్ అని పిలుస్తారు. వాటికి రోగ నిరోధకశక్తి తక్కువ గా ఉండటం వల్ల 2 లేదా 3 సంవత్సరాలకే రోగాల బారిన పడి చనిపోతున్నాయి. కాబట్టి వాటిని గుర్చి ఇక్కడ ప్రస్తావించడం లేదు.
- నంది వర్ధనం / గరుడ వర్ధనం
ఈ మొక్కను చాలా చోట్ల చూసే ఉంటారు…
- చుక్క మల్లి
- కరివేరు
ఇవి 5 లేదా 6 రకాల రంగులలో దొరుకుతాయి
- బిళ్ళ గన్నేరు
ఇవి కూడా చాలా రంగులలో దొరుకుతాయి… వీటికి ఎరువులు ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంది… వీటిని ఆయుర్వేదం లో కూడా ఉపయోగిస్తారు.
- చామంతి
ఇవి కేవలం చలికాలం లోనే పూస్తాయి… కానీ పెంచడం చాలా తేలిక…NASA వాళ్ళు చేసిన CLEAN AIR STUDY లో మొత్తం 10 మొక్కలను ప్రస్తావించారు… అందులో చామంతి ఒకటి…
ఇది వాతావరణం లో ఉండే అన్ని రకాల రసాయనాలను, విష గాలులను (బెంజీన్ ,ఫార్మాల్డిహైడ్ , ట్రైక్లోరెథైలీన్ , జిలీన్, టోలున్ , అమ్మోనియం) వడపోసి చక్కని గాలిని వదులుతుంది.
- పీస్ లిల్లీ
ఇది కూడా సులభం గా పెరుగుతుంది NASA CLEAN AIR STUDY లో ఈ మొక్క కూడా ఉన్నది.
- శంకు పుష్పం
ఇందులో కూడా 3 లేదా 4 రకాల రంగులు ఉంటాయి…
ఈ పూలను ఎండపెట్టి , టీ చేసుకొంటారు. అలాగే చామంతి పూలను కూడా ఎండపెట్టీ టీ చేసుకొంటారు…
విదేశాల్లో ఈ టీ లకు చాలా గిరాకీ ఉంది,
ఇప్పుడు ఇప్పుడే ఈ టీ లకు మన దేశం లో గిరాకీ పెరుగుతుంది.
- బౌగైన్విల్లే (Bougainville)
మనం కాగితం పూలు అంటాం కదా… అవి
ఇందులో చాలా రంగులు ఉంటాయి…
- గుత్తి పువ్వుల చెట్టు
ఇందులో చాలా రంగులు , మరగుజ్జు రకాలు కూడా ఉన్నాయి.
- పారిజాతం
పురాణాల ప్రకారం క్షీర సాగర మధనం లో, పాల కడలి నుంచి ఉద్భవించినది.
సాక్షాత్తు లక్ష్మి స్వరూపం గా ఈ చెట్టు నీ బావిస్తారు. ఈ చెట్టు పువ్వులు కోయరు, కింద పడినవి మాత్రమే తీసి దేవుడికి అలంకరిస్తారు.
పెంచడం చాలా సులభం…
ఇకపోతే పై మొక్కలను ఆశించే చీడ పీడల గురించి
ఈ పై మొక్కలను ఎక్కువ గా ఆశించే కీటకాలు రెండు ఉన్నాయి
- గొంగళి పురుగు
- పిండి నల్లి
గొంగళి పురుగు తీసి దూరంగా పారవేయవచ్చు. అలా చేయలేక పోతే, ఈ రెంటికీ వాడే రసాయన మందు ఒకటి తేపుతాను propinophos ఇది అన్ని పురుగు మందుల కొట్టులలో దొరుకును. 5ml మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. వీటికి పట్టే అన్ని రకాల పురుగులకు చాలా సమర్థవంతంగా పనిచేయును.
వేప నూనె లాంటి సేంద్రియ పురుగు మందులు పని చేస్తాయి గానీ, సమయం ఎక్కువ తీసుకొంటాయి.
You must log in to post a comment.