2021 – ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయి, భారత దేశంలో చూడవలసినవి ఏవి ఉన్నాయి

ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి. 

ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌(అహమ్మదాబాద్‌) 

జనవరి
14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్‌ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. 
ఇవి చూడొచ్చు  :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌; బికనీర్, రాజస్థాన్‌లలో బికనీర్‌ కామెల్‌ ఫెయిర్‌ (జనవరి 12–13); శ్రీనగర్, జమ్ము–కశ్మీర్‌; ఉత్తరాఖండ్‌లోని ఆలీకి స్కీయింగ్‌ ట్రిప్, కచ్‌ గుజరాత్‌లో వైట్‌ డెజర్ట్‌. ఆ ఉప్పు ఎడారిని సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. కళ్లు జిగేల్మంటాయి. 


జిరంగ నేషనల్‌ పార్క్‌ (అస్సాం)

ఫిబ్రవరి
13, 14 శని, ఆదివారాలు. 15 సెలవు పెడితే 16 వసంత పంచమి.
ఇవి చూడొచ్చు : ఎప్పుడూ పార్టీలు జరుగుతుండే గోవా, తాజ్‌మహల్‌ (ఆగ్రా), కజిరంగా నేషనల్‌ పార్క్‌ (అస్సాం), ఉదయ్‌పూర్, జైసల్మేర్, జో«ద్‌పూర్‌ (రాజస్థాన్‌), పురాతన నగరం వారణాసి; ఖజురహో–హెరిటేజ్‌ టూర్‌ (మధ్యప్రదేశ్‌).


బృందావనంలో హోలీ

మార్చి
11 మహా శివరాత్రి. 12 శుక్రవారం సెలవు పెడితే 13, 14 శని, ఆదివారాలు. 26 శుక్రవారం సెలవు పెడితే 27, 28 శని, ఆదివారాలు. 29 హోలీ. 
ఇవి చూడొచ్చు : హోలీకి బృందావనం (మధుర), ప్రకృతి దృశ్యాల కోసం ఊటీ, వన్యప్రాణుల కోసం రాజస్థాన్‌లోని రంథంబోర్, మానసిక సాంత్వన కోసం సిక్కిం, యాత్రా స్థలంగానైతే మౌంట్‌ అబూ. చారిత్రక శిథిల కట్టడాలకు హంపీ.


గుల్‌మార్గ్‌ స్కీయింగ్‌ (కశ్మీర్‌)

ఏప్రిల్‌
2 గుడ్‌ ఫ్రైడే. 3, 4 శని, ఆదివారాలు. ఈ నెలలో ఇంతే. శని ఆదివారాలకు కలిసొచ్చేవి లేవు. 
ఇవి చూడొచ్చు : చల్లదనం కోసం జమ్ము–కశ్మీర్‌. పెంచ్‌ నేషనల్‌ పార్క్‌ (మధ్యప్రదేశ్‌), ఉదయ్‌పూర్, ట్రెక్కింగ్‌ కోసం కొడైకెనాల్, స్కీయింగ్‌కి గుల్‌మార్గ్, వైన్‌ యార్డ్‌ చూడాలంటే నాసిక్‌. నీలాకాశ వీక్షణకు, బీచ్‌లకు లక్షద్వీపాలు, స్వచ్ఛమైన గాలి కోసం కూర్గ్‌. 


ధర్మశాలలో క్రికెట్‌ స్టేడియం
 

మే
13 ఈదుల్‌ ఫిత్ర్‌. 14 సెలవు పెడితే 15, 16 శని, ఆదివారాలు. 
ఇవి చూడొచ్చు :రిషికేశ్, ముస్సోరి (ఉత్తరాఖండ్‌), కొడైకెనాల్‌ (తమిళనాడు), స్పితీ వ్యాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌), కాలింపాంగ్‌ (పశ్చిమ బెంగాల్‌), వేయనాడ్‌ (కేరళ), ధర్మశాల (హిమాచల్‌ ప్రదేశ్‌)


అల్మోరా, ఉత్తరాఖండ్‌

జూన్‌
జూన్‌లో శని, ఆది వారాలకు కలిసొచ్చే సెలవు రోజులు లేవు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవమైన జూన్‌ 2 ఈ ఏడాది బుధవారం వచ్చింది. ఇక వేళ రెండు మూడు రోజులు సెలవు దొరికితే..
ఇవి చూడొచ్చు : చిక్‌మగళూర్‌ (కర్ణాటక), లడఖ్, అండమాన్‌; గాంగ్‌టక్‌ (సిక్కిం), అల్మోరా (ఉత్తరాఖండ్‌). ఈ నెలలో ఈ ప్రదేశాలలోని వాతావరణం సమ శీతల ఉష్ణస్థితిలో ఆహ్లాదంగా ఉంటుంది. 


వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ (ఉత్తరాఖండ్‌)

జూలై
10, 11 శని, ఆదివారాలయ్యాయి. 12 రథయాత్ర. 17, 18 శని, ఆదివారాలు. 19 సెలవు పెడితే 20 బక్రీద్‌. 
ఇవి చూడొచ్చు : పూరి రథయాత్ర (ఒడిశా), వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ (ఉత్తరాఖండ్‌), శివస్థలి అమర్‌నాథ్‌. 


 మౌంట్‌ అబు (రాజస్థాన్‌)

ఆగస్ట్‌ 
28, 29 శని, ఆదివారాలు. 30 జన్మాష్టమి. 
ఇవి చూడొచ్చు :  జన్మాష్టమి ఉత్సవాల కోసం బృందావనం, కూనూరు (తమిళనాడు), చిరపుంజీ (మేఘాలయ), జిమ్‌ కార్బెట్‌ (ఉత్తరాఖండ్‌), మౌంట్‌ అబూ (రాజస్థాన్‌)


హర్మందిర్‌ సాహిబ్‌ (అమృత్‌సర్‌)

సెప్టెంబర్‌
10 వినాయక చవితి. 11, 12 శని, ఆదివారాలు. 
ఇవి చూడొచ్చు: అమృత్‌సర్, కేరళ, శ్రీనగర్, కూర్గ్, పాండిచ్చేరి, ముంబై, మహాబలేశ్వర్, గుజరాత్‌లోని విల్సన్‌ హిల్స్‌. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖంలో ఉండి, వాతావరణం తడిపొడి సమ్మేళనంగా ఉల్లాసభరితంగా ఉంటుంది కనుక పర్యాటనకు అనువైన ప్రదేశాలలో ఇవి కొన్ని. 


కులు దసరా సంబరాలు
 

అక్టోబర్‌
15 దసరా. 16, 17 శని, ఆదివారాలు.  
ఇవి చూడొచ్చు :దసరా సంబరాలకు కులు (హిమాచల్‌ ప్రదేశ్‌), రివర్‌ రాఫ్టింగ్‌కి రిషికేశ్, దుర్గాపూజకు కోల్‌కతా, వన్యప్రాణి వైవిధ్య వీక్షణకు మానస్‌ నేషనల్‌ పార్క్‌ (అస్సాం), జాపపద సంస్కృతుల కోసం జో«ద్‌పూర్‌; మైసూరు.


భరత్‌పూర్‌ (రాజస్థాన్‌) పక్షుల ఆవాసం
 

నవంబర్‌
19 గురు నానక్‌ జయంతి. 20, 21 శని, ఆదివారాలు
ఇవి చూడొచ్చు : ఫుష్కరోత్సవాలు (రాజస్థాన్‌), నైట్‌ లైఫ్‌ కోసం గోవా, పక్షుల్ని చూడటానికి భరత్‌పూర్‌ (రాజస్థాన్‌); రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లను చూడ్డానికి సుందర్‌బాన్‌ (పశ్చిమ బెంగాల్‌), మంచుకొండల కోసం మనాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌)


కబిని అభయారణ్యం (కర్ణాటక)

డిసెంబర్
24 సెలవు పెడితే 25 క్రిస్మస్, 26 ఆదివారం.
ఇవి చూడొచ్చు  : కబిని వన్యప్రాణి అభయారణ్యం (కర్ణాటక), స్కీయింగ్‌కి ఆలీ (ఉత్తరాఖండ్‌), కచ్‌ (గుజరాత్‌).

Related posts

%d bloggers like this: