బ్లాగింగ్ ద్వారా ఆదాయ మార్గాలు

బ్లాగింగ్ ద్వారా నెలకు పదివేల డాలర్లు(అంటే సుమారు ఏడెనిమిది లక్షలు) కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇందులో సగటు చెప్పడం కష్టం, మీ బ్లాగ్ని ఎంత మంది చూస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది, లేదా మీరు ఎంచుకున్న ఆదాయ మార్గం బట్టి ఉంటుంది. మొదట ఆదాయ మార్గాలు చూద్దాం. ప్రకటనలు : ఇది అత్యంత సాధారణంగా ఉపోయోగ పడే ఆదాయ మార్గం. ఇక్కడ మీ బ్లాగ్ కు ఎన్ని వీక్షణలు వస్తున్నాయి, ఎంతమంది ప్రకటనలు మీద ఆసక్తి చూపుతున్నారు, మీ ప్రేక్షకులు ఏ దేశానికి చెందిన వారు మొదలైనవి కారకాలుగా ఉంటాయి. గూగుల్ యాడ్సెన్స్, ఇంకా మరికొన్ని సంస్థలు ద్వారా ఈ ప్రకటనలు మీ బ్లాగులో కనబడేలా చేయవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ : అధిక ఆదాయం వచ్చేది ఇక్కడ నుండే. ఇక్కడ మీకు తక్కువ వీక్షకులు ఉన్నా…

Read More

చంద్రశేఖర్

చంద్రశేఖర్ (1927–2007) చంద్రశేఖర్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ సింగ్ , ఇబ్రహీంపట్టి గ్రామం బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థి కావడంతో ప్రభుత్వం నుంచి ఉపకరవేతనాలతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసి కొంత కాలం సోషలిస్టు పత్రికలో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేశారు. వీరి రాజకీయ గురువు సోషలిస్టు దిగ్గజం ఆచార్య నరేంద్ర దేవ్ గారు విశ్వవిద్యాలయం లో కూడా వీరికి ఆచార్యులు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న సమయంలో పెద్దల ఒత్తిడి వల్ల వివాహం చేసుకున్నారు. ప్రజా సోషలిస్టు పార్టీ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గా , రాజ్యసభ కు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను…

Read More

Personality Vs Character

ఒకటేమో కనపడేది ఇంకోటి మీదకి కనిపించనిది కానీ అంతర్గతంగా పనిచేసేది అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాట కన్నా పర్సనల్ డెవలప్మెంట్ అన్న మాట మెరుగు అది రెంటినీ సూచిస్తుంది. కానీ అంతర్గత విషయాల పై శ్రద్ధ పెట్టి ఫలితం కనపడేలా చేసే ప్రక్రియ సమయం పట్టే ప్రక్రియ ఈ విషయంలో షార్ట్ కట్ లు తీసుకున్నా దాని వలన దీర్ఘకాలంలో నష్టమే కానీ లాభం తక్కువ ఒకటి వదిలి ఇంకోటి చేయమని కాదు రెంటిమీద తగిన దృష్టి పెట్టాలి అని

Read More

అరటిపండు పునుగులు

కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)గోధుమ పిండి – పావు కప్పుబియ్యప్పిండి – పావు కప్పుమైదా పిండి – పావు కప్పుమొక్కజొన్న పిండి – ముప్పావు కప్పుఉప్పు – తగినంతబేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్‌పంచదార – 2 టేబుల్‌ స్పూన్లునూనె – డీప్‌ ఫ్రై కి సరిపడా. తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్‌ చేసుకోవాలి.

Read More

ఆపిల్‌ కోవా హల్వా

కావలసినవి: ఆపిల్స్‌ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి)బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లుకోవా – అర కప్పుదాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ పంచదార – అర కప్పునెయ్యి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు. తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్‌ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్‌ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

Read More

ఎగ్‌ బన్స్

కావలసినవి: గుడ్లు – 6బన్స్ – 6, ఉల్లిపాయలు – 3పచ్చిమిర్చి – 2చీజ్‌ తురుము – 2 టీ స్పూన్లుకొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ కారం – 1 టీ స్పూన్‌మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లుఉప్పు – తగినంత తయారీ: ముందుగా బన్స్‌ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్‌ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్‌ బౌల్స్‌లో వేసుకుని.. ప్రతి బన్‌లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్‌లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి.

Read More

వాట్సాప్ చాట్స్ టెలిగ్రాంలోకి

తాజాగా టెలిగ్రామ్ కొత్తగా తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకోని వచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ చాట్లను కూడా టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాట్ హిస్టరీతో పాటు వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఇతర మీడియా కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం వాట్సాప్ నుంచే కాకుండా లైన్, కకావో టాక్ వంటి ఇతర యాప్‌ల చాటింగ్‌ను కూడా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. ఇది వ్యక్తిగతమైన చాటింగ్‌తో పాటు గ్రూప్ చాటింగ్‌కు కూడా వర్తించనుంది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసాక మీకు అక్కడ ఎక్స్‌పోర్ట్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు విత్ మీడియా, విత్ అవుట్ మీడియా అనే ఆప్షన్ లు కనిపిస్తాయి. మీరు విత్ మీడియా ఎంచుకుంటే మీకు అదనంగా స్టోరేజ్ స్పేస్ ఖర్చవుతుంది. ఇలా…

Read More

నితీశ్ కుమార్

నితీశ్ కుమార్(1951) నితీశ్ కుమార్ గురించి మన తెలుసుకొనే ముందు వారి కుటుంబ నేపథ్యంలోకి వెళితే బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఉన్నా హర్నట్ తాలూకాలోని కళ్యాణ్ భిగా వారి స్వగ్రామం, నితీశ్ తాతగారు కిశోరి శరణ్ సింగ్ గ్రామంలో పేరొందిన రైతు మాత్రమే కాకుండా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కూడా ,గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కూడా పేరుపొందరు. నితీశ్ కుమార్ గారి తండ్రి కవిరాజ్ గారు కూడా వారి తండ్రి నుండి ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకోని ఆయుర్వేద వైద్యులు అయ్యారు ,స్వాతంత్ర్య సమరయోధులు మరియు బీహార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు,పాట్నాలో చదువుకొనే రోజుల్లో ఆర్య సామాజ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు,కవిరాజ్ గారు తన రాజకీయ కార్యకలపాల కోసం కళ్యాణ్ భిగా దగ్గరలోని బర్హా తాలూకాలోని భక్తియార్ పూర్ గ్రామంలో స్థిరపడ్డారు.ఇది నితీశ్ కుమార్…

Read More

భారత దేశం లో వివిధ హల్వా రకాలు

కేంద్ర బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక ఒకటి ఉంది. అది ఏమిటంటే బడ్జెట్ తయారీ లో అందులోని అంశాల గోప్యత కోసం ఆర్ధిక శాఖ లో బడ్జెట్ రూపకల్పన లో పాల్గొనే ఉద్యోగులు పది రోజుల పాటు ఆర్ధిక శాఖ బేస్మెంట్ లోనే ఉండిపోతారు. ముద్రణ ప్రారంభించిన రోజు ఆర్ధిక మంత్రి సమక్షం లో హల్వా అందరికి పంచి వేడుక చేసుకోవడం ఒక సంప్రదాయం. బందర్ హల్వా మచిలీ పట్నం లో దొరికే హల్వా వెరైటీ .ఇలాగే విశాఖ కు దగ్గరలో ఉన్న మాడుగుల లో కూడా మాడుగుల హల్వా ఫేమస్ అండీ. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న దగ్గేటి ధర్మా రావు షాప్ బాగా స్పెషల్. ఈ హల్వా లో రకరకాల పప్పులు కూడా వేసి చేస్తారు. ఇక దేశం లో అయితే చేసే…

Read More

మిషన్ ఇంద్రధనస్సు ( శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం)

2014 డిసెంబర్ 25 న శిశువు కు ఏడు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది. 1. B.C. G : అనగా బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ శిశువు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇస్తారు. ఒకసారి మాత్రమే ఇస్తారు ఈ టీకా క్షయవ్యాధి అనగా టీబీ వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది. 2. O. P. V, I. P. V: ఓ పి వి అనగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది పోలియో వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది.అలాగే ipv కూడా ఇస్తారు ఇది కూడా పోలియో రాకుండా కాపాడుతుంది. 3. హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ను కామెర్ల వ్యాధి రాకుండా శిశువుకు ఇస్తారు. ఇది కూడా శిశువు పుట్టినప్పుడు మొదటిసారిగా ఇస్తారు ఈ వ్యాక్సిన్ను తయారుచేసిన దేశాలలో నాలుగో దేశంగా…

Read More

ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్(1939) ములాయం సింగ్ యాదవ్ సఫాయి గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆటలు మీద ఆసక్తి చూపారు, ముఖ్యంగా శరీరాన్ని దృడంగా ఉంచే వ్యాయామాలు చేసేవారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేవారు. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ లలో, వ్యాయామ విద్యలో డిప్లొమా పూర్తి చేసి కొంతకాలం స్వగ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా, కుస్తీ పోటీల శిక్షకులుగా , రైతుగా పనిచేశారు. సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా ప్రబోధించిన సిద్ధాంతాలకు ఆకర్షితుడై లోహియా అనుచరుడిగా రాజకీయాల్లో ప్రవేశించి 1967 నుంచి 2007 వరకు 8 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి, 1996 నుంచి ప్రస్తుతం వరుకు 6 సార్లు లోక్ సభకు,1980 నుంచి 1985 వరకు రాష్ట్ర మండలి సభ్యులు గా ఎన్నికయ్యారు. 1977లో…

Read More

శశి థరూర్

శశి థరూర్(1956) శశి థరూర్ గారు లండన్ లో జన్మించారు, ఆయన తండ్రి భారత విదేశాంగ శాఖ లో ఉన్నతాధికారి, అలాగే థరూర్ కుటుంబ నేపథ్యం చాలా బలమైనది, సంపన్న మైనది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో, విదేశాల్లో ఉన్న ఉన్నతమైన విద్య సంస్థల్లో తన విద్యను పూర్తి చేసి ఐక్యరాజ్య సమితి లో 1978 నుంచి 2009 వరకు వివిధ స్థాయిల్లో పనిచేశారు. 2006లో ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో దక్షిణ కొరియా కు చెందిన బాకీ మూన్ చేతిలో ఓటమి పాలయ్యారు, లేకుంటే సమితి కార్యదర్శిగా ఎన్నికైన మొదటి భారత దేశానికి వ్యక్తిగా థరూర్ ప్రపంచ చరిత్రలో నిలిపోయేవారు. 2009 నుంచి ప్రస్తుతం వరకు కమ్యూనిస్టు పార్టీల కంచుకోట తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి వరుసగా కాంగ్రెస్…

Read More

జయలలిత

జయలలిత (1948–2016) జయలలిత గారు ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలోని పాండవపుర తాలూక మేల్కొటే గ్రామంలో జన్మించారు. జయలలిత గారి అసలు పేరు” కోమలవల్లి”. ఆమె తల్లి ప్రముఖ నటీమణి సంధ్య గారు. జయలలిత తాతగారు మైసూర్ రాజ్య దివాన్ రంగా చారి గారికి వ్యక్తిగత వైద్యులు. జయలలిత గారు చదువుల్లో బాగా రణించేవారు ,మద్రాస్ ఎస్.ఎల్.సి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. 16 యేటనే చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్ర నటిమణిగా రాణించి 32 యేటా సినిమా రంగం నుంచి తప్పుకున్నారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి విరమించుకున్న తరువాత కొంత కాలం ఇంటికే పరిమితమయ్యారు. తన ఆరాధ్య నటుడు ఎంజీర్ ఆహ్వానం మేరకు ఆయన స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో చేరి పార్టీ గెలుపునకు కృషి చేశారు. పార్టీ…

Read More

Thought of the day

మన ప్రవర్తన పట్ల శ్రద్ధ వహించడం అంటే వాస్తవానికి మనం ప్రకృతి సారూప్యతతో ఉండే విధంగా, సమతుల్య స్థితిని సిద్ధింపచేసుకోవడమే. 

Read More

టమాటా కర్రీ

తయారీ విధానం:- కావాల్సిన పదార్ధాలు టమాటాలు 250 గ్రా.లు. ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 2, పసుపు 1/4 టీస్పూన్, కారంపొడి 1 టీస్పూన్, అల్లంవెల్లుల్లి ముద్ద 1/4 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, గరం మసాలా 1/4 టీస్పూన్, కరివేపాకు 1 రెబ్బ, ఉప్పు తగినంత, నూనె 3 టీస్పూన్లు. కడాయిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి, కారంపొడి వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన టమాటా ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక ధనియాలపొడి, గరంమసాలా పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకు దింపేయాలి.

Read More

నా ఊహలో ఇలాంటి ఒక ఇల్లు

కాంతి, ధ్వని, గాలి, నీరు, మనుషుల కాలుష్యానికి దూరంగా, కొండల ఒడిలో ప్రకృతికి దగ్గరగా, పగటిపూట లైట్లు, రాత్రి పూట ఫ్యానుల అవసరం లేకుండా, ఇంటి నిండా పుస్తకాలతో… చేతిలో పుస్తకంతో, వర్షాన్ని చూస్తూ ఇలా…

Read More

ఎర్రకోట

ఏటా ఈ కోట మీద భారత ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. 1649లో మొఘల్‌ చక్రవర్తి షాజ‌హాన్‌ ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోట కేంద్రంగా దిల్లీ నగరం ఏడుసార్లు నిర్మితమైంది. మొఘ‌ల్‌ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది. ప్రేమ, అనురాగం, ద్వేషం, ద్రోహం, రాజకీయ కుట్రలు, అంతర్గత కుమ్ములాటలకు ఎర్రకోట వేదిక. చక్రవర్తుల వైభవాన్నే కాదు, పతనాన్నీ ఇది చూసింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటుకు కూడా ఎర్రకోటే కేంద్రం. 1628వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక రోజున ఆగ్రాలోని తన సింహాసనం మీద ఆలోచిస్తూ కూర్చున్నషాజ‌హాన్‌.. ఆగ్రా కోట చాలా చిన్నగా ఉందని భావించారు. ఆగ్రా, లాహోర్ కోటలకన్నా పెద్ద కోటను దిల్లీలోని యమునా తీరంలో నిర్మించాలని ఆయన నిర్ణయించారు’’ అని తన పుస్తకం ‘సిటీ…

Read More

రక్తహీనత

జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి.  రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్‌ చేసుకుని తాగాలి. బీట్‌రూట్‌, క్యారట్‌, ఉసిరి కలిపి జ్యూస్‌ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్‌ పుష్కలంగా వస్తుంది. ఐరన్‌ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి.  గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది.  మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి. 

Read More

Thought of the day

మనం దీపాన్ని దీపం కొరకు వెలిగించం; దాని కాంతిలో ఏదో ఒక పనిచేయడానికే వెలిగిస్తాం. అదే దాని ప్రయోజనం లేదా లక్ష్యం.

Read More

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ (1948) లాలూ ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో ప్రస్తుత గోపాల్ గంజ్ జిల్లాలో ఫుల్వారియా గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. గోపాల్ గంజ్, శరన్, పాట్నా ప్రాంతాల్లో ఎస్.ఎల్.సి, పియూసీ , డిగ్రీ(లా) ,పాట్నా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్, పిహెచ్ డి పూర్తి చేసి కొంత కాలం పశువైద్య కళాశాలలో బంట్రోతు గా పనిచేశారు. పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో రబ్రీ దేవి గారితో వివాహం వీరికి 9 మంది సంతానం. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్ గారు విద్యార్థి సమయంలో మంచి స్నేహితులు, విశ్వవిద్యాలయం వసతి గృహంలో వీరిద్దరూ ఒకే గదిలో ఉండేవారు, అలాగే లాలూ రాజకీయ జీవితంలో అనేక విజయాల్లో నీతిశ్ కుమార్ గారి పాత్ర కీలమైనది. లోక్ నాయక్ జై…

Read More

మెడ పట్టడం ( రై నెక్‌ )

ఒక మెత్తటి టర్కీ టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా రోల్‌ చేసుకుని మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా వాడాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి.  తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా… భుజాలకు కూడా సపోర్ట్‌ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది.  వ్యాయామాలు చేస్తుండేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్‌సైజ్‌ చేయకూడదు. పైగా మెడ పట్టేయడం సర్దుకునేందుకు అంటూ ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు.  కొందరు సెలూన్‌ షాప్‌లో మెడను రెండువైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇది మొరటు పద్ధతి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ…

Read More