ఎక్కువగా నీరు ఉన్న నదిలో వంతెన ఎలా కట్టుతారు?

మనం రోజూ రోడ్ల మీద ఉపయోగించే flyovers కట్టడం చాలా కష్టమైన పని. అలాంటి ఒక వంతెన నీటి లో కట్టడం అంటే ఇంకా చాలా కష్టమైన పని. నీళ్ళ లో వంతెన ఎలా కడతారు అంటే, దానిలో చాలా రకాలు, పద్దతులు ఉన్నాయి. నీటి లోతును, నీటి కింద ఉన్న మట్టి యొక్క సామర్ధ్యం, మనకు దొరికే resources నీ బట్టి మనకి ఏ పద్దతి సులువుగా, economical గా ఉంటే దాన్ని వాడతారు. అందులో భాగంగా మొదటికి.

పైల్స్ గ్రూప్ మీద వంతెన కట్టడం. ఈ పైల్ అంటే గుండ్రంగా పొడువుగా ఉండే ఒక పైపు లాంటిది. Pile అంటే కింద చూడచ్చు.

దీన్ని నీటి అడుగున ఉండే నీటి నేల (water bed) లో fix చేయడానికీ మనకు ఒక ప్రత్యేకమైన pile driver machine కావాలి. దీన్ని పడవ కు కట్టి నీటి మధ్యకు ఈడ్చుకొని వస్తారు. ఇప్పుడు ముందుగా ఒక pile ని నీటిలోకి దింపుతారు ఇలా

ఈ పైల్ ను నీటి లోకి దింపిన తరువాత, ఈ pile మీద pressure పెట్టీ దీన్ని నీటి అడుగున ఉండే నేల (river bed) లోకి గట్టిగా fix చేస్తారు. అంటే ఈ పైల్ పూర్తిగా నీళ్ళలో మునిగి పోదు, ఈ పైల్ నీటి మట్టం కంటే కూడా పొడువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక చివరను నీటి అడుగున fix చేసినా కూడా ఇంకో చివర నీటి మీద ఉంటుంది ఇలా.

ఇప్పుడు ఈ pile లొపలికి ఒక బోర్ drilling machine ని పంపి ఆ pile లోపల ఉండే నీటి మట్టి ని తీసేస్తారు.

ఆ తరవాత దీని లోకి reinforcement పంపిస్తారు. reinforcement అంటే కింద చూడచ్చు.

ఇలా పంపిన తరువాత దీన్ని concrete తో నింపుతారు. దీని కోసం SCC అనే ప్రత్యేకమైన Concrete ని వాడతారు. SCC అంటే SELF COMPACTING CONCRETE. దీన్ని మనం కంపాక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కొన్ని ప్రత్యేకమైన పద్దతులు, SUPER PLASTICIZER వాడడం వల్ల అది దానంతట అదే కాంపాక్ట్ అవ్తుంది.

ఇలా పూర్తి అయినా పైల్ లాగానే దాని పక్కనే ఇంకా చాలా పైల్స్ ను ఇలాగే గుచ్చి, దానిలోకి reinforcement పంపి, దాన్ని SCC తో నింపుతారు. అలా పైల్స్ అన్నీ ఒక దాని పక్కన ఒకటి పేర్చి ఒక base లాగా చేస్తారు. అప్పుడు అవి చూడడానికి ఇలా ఉంటాయి.

ఇలా పూర్తి అయిన వాటిని పైల్స్ గ్రూప్ అంటాము. ఇప్పుడు వీటి మీద ఒక PILE CAP ని కడతారు. ఇక ఆ పైల్ క్యాప్ మీద కాలమ్ కానీ pier కానీ కట్టి దాని మీద వంతెన వేస్తారు.

ఇక ఇంకో పద్దతి.. COFFERDAMS.

కాఫర్డాం అంటే కాలమ్/ pier ( pillar అనుకోవచ్చు) రావలసిన చోట ముందుగా రెండు GUIDE PILES ని దింపుతారు. వీటిని వాడుకుని చుట్టూ స్టీల్ షీట్స్ ( METAL SHEETS) ని కడతారు. మనం నాలుగు కర్ర లు పెట్టీ తడకలు కట్టినట్టు గా GUIDE PILES సహాయం తో నీటిలో స్టీల్ షీట్స్ తో తడకలు లాగా నీటిలోనే కడతారు. ఇది లోపల ఉన్న నీరు బయటికి, బయట ఉన్న నీరు లోపలికి వెళ్లనివ్వకుందా(WATER TIGHT )ఉంటుంది. ఇప్పుడు ఈ కాఫార్డాం లోపల ఉన్న నీటిని శక్తివంతమైన SUBMERSIBLE పంపులు వాడి నీటిని బయటికి పంపు చేస్తారు. ఇలా కొన్ని నెలలకు ఆ కాఫర్దాం ఎండిపోతుంది. ఆ తరువాత దీన్ని శుభ్రం చేసి అందులో పని చేయడం ప్రారంభిస్తారు. అయితే ఈ కాఫరుడ్డాం నీటి మట్టం కంటే కూడా ఎత్తుగా ఉంటుంది.

చేయాల్సిన పని, పనిచేసే మనుషులని, వాడే పరికరాలు మరియు ట్రక్కు, JCB లాంటి వాటాన్ని అందులో తిరిగేలా పెద్దగా ఉంటుంది. కాఫరు డాం కింద చూపించిన విధంగా ఉంటుంది.

ఇలా ఒకసారి మనం కాఫరుడాం కట్టి, అందులోని నీళ్ళు బయటికి పంపితే మనం అప్పుడు నేల మీద మామూలు గా పని చేసినట్టే చేసుకోవచ్చు. అయితే ఇవి నీటి ప్రవాహం నిలకడ గా ఉన్నప్పుడు మాత్రమే అందులో పని చేస్తారు.

నీటి లోతు ను బట్టి దీనిలో రకాలు వాడతారు.

4–6 మీటర్లకు SINGLE SHEET PILE

7–18 మీటర్లకు DOUBLE SHEET PILE

19–23 మీటర్ల కు CELLULAR COFFERDAM అనీ

ఒకసారి అందులో పని అయిపోయిన తరువాత వీటిని విప్పేసి, తీసేస్తారు.

ఇక ఇంకో పద్దతి CAISSON

ఇది ఇంచుమించు కాఫర్డామ్ లాగానే ఉంటుంది. కానీ ఇవి పని అయ్యాక తీయడానికి రావు. అలాగే ఆ వంతెన ఫౌండేషన్ లోనే ఉండేట్టు గా కడతారు.