డబుల్‌ డైమండ్‌ గొర్రె

Double Diamond Most Expensive Sheep In The World - Sakshi

ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును డైమండ్‌ బ్రేక్‌ చేసింది. డైమండ్‌ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ పౌండ్‌లతో హెక్సెల్‌ డ్జాంగో అనే గొర్రె నిలిచింది.

చెషైర్‌, స్టాక్‌పోర్టుకు చెందిన  ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి. టెక్సెల్‌ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్‌ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్‌ పౌండుల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్‌ కోసం ఉపయోగిస్తుంటారు.

%d bloggers like this: