Posted in 2020

2nd Highest ( Since 1986 August 16) Yanam Godavari floods 18-08-2020

Highest flood since 1986. In 1986, 30 lakhs of Cusecs of flood water released into sea. Now on 18-08-2020, 22 lakhs of Cusecs of flood water released into sea.

గోదావరి వరదలు

మన గోదావరి కి ఇప్పటి వరకు సుమారు 35 సార్లు #వరదలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటే మరికొన్ని సాధారణ వరదలు ఉన్నాయి. కాని ప్రతిసారి నష్టం అయితే మాములే (పరిస్థితి బట్టి) ఇందులో అధికశాతం ఆగష్టు నెలలోనే వరదలు వచ్చాయి. 35 సార్లు వరదలు సంభవిస్తే సుమారు 25 సార్లు ఒక్క ఆగష్టు నెలలోనే వచ్చాయి.ఇందులో మొదట పెద్దగా వచ్చిన వరదలు అయితే 1839 లో వరదలు అప్పట్లో గోదావరి పెను ఉప్పెనకు సుమారు 2 లక్షల మంది వరకు మరణించారు. ఆ తర్వాత మళ్ళీ పెద్ద స్థాయిలో 1953 సంవత్సరంలో అప్పట్లో ధవళేశ్వరం ఆనకట్ట స్థాయిని మించి వరదలు రావడంతో 30 లక్షల క్యూసెక్కుల పైన నీటి ని సముద్రంలోకి వదిలారు. దానివలన ఎన్నో గ్రామాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం చాలా ఎక్కువ జరిగింది… ఆ తర్వాత చిన్న చిదకా వరదలు వచ్చినప్పటికీ మళ్ళీ అప్పటి నుండి ఇప్పటికి మర్చిపోని వరదలు వచ్చింది 1986 లో 1986 లో వచ్చిన గోదావరి వరదలు ఇప్పటకి ఒక చేదు జ్ఞాపకమే …

ఆ స్థాయి వరద మళ్ళీ రాలేదు ( ఎప్పటికి రాకూడదు కూడా ) … ఎందరినో నిరాశ్రయుల్ని చేసాయి ఆనాటి వరదలు ఆగష్టు 15 అర్ధరాత్రి – అటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలని వరదలు ముంచెత్తడంతో ఒక్కసారిగా గోదావరికి వరద బీభత్సం తలెత్తింది. అప్పట్లో ధవళేశ్వరం బ్యారేజి వద్ద 22 అడుగుల నీటి మట్టంలో వరద ప్రవాహం కొనసాగింది (ఇది రికార్డు స్థాయి) … ధవళేశ్వరం బ్యారేజి 32 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయబడింది. మాములుగా 32 లక్షల 20 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహ ఉద్ధృతి వుంటుంది. గోదావరి నదికి 11.75 అడుగుల ప్రవాహం వస్తే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు… 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక … 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారిచేస్తారు. మూడో హెచ్చరిక అంటే డేంజర్ స్థాయి అని… అలాంటిది 1986 వచ్చిన వరదలు సమయంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసారు. అంటే వరద స్థాయి ఎలాంటిదో అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. ఆ సమయంలో ధవళేశ్వరం బ్యారేజి నుంచి 35 లక్షల 6388 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి ప్రవహించాయి. అప్పటికే ప్రభుత్వం నుండి రెండురోజులుగా వరద హెచ్చరికలు జారిచేస్తూనే ఉన్నారు. కాని ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలూ అలవాటైపోయిన ప్రజలు ఆ హెచ్చరికలని పెద్దగా పట్టించుకోలేదు … దానికితోడు ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ అప్పుడులేదు. అప్పట్లో రేడియోనే ఆధారం … ఎలాంటి సమాచారమైన రేడియో ద్వారా ప్రజలకు చేరవేసేవారు. అదికూడా చాలా తక్కువమందికే ఉండేది. ఆ వరద తీవ్రత సమాచారం ప్రజలకి చేరేలోపు వరద నీరు చేరిపోయింది. మొదట లంక గ్రామాలన్నీ ముంచేసింది. అక్కడ నుండి అంతకంతకూ పెరిగిపోయింది. ఆగష్టు 16 తేదీ న $ధవళేశ్వరం బ్యారేజికి పెను ప్రమాదంలో వరద నీరు చేరడంతో సముద్రంలోకి వదిలిన వరద నీరు వలన రెండు గోదావరి జిల్లాల్లో అనేక గ్రామాలు నీట మునిగాయి. ఆ సమయంలో ప్రవాహం ఏ స్థాయిలో సాగిందనే లెక్కవేసే అంచనా కూడా లేకపోయింది. వరద ముంపు ప్రాంతాల్లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ గారు, అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు విస్తృతంగా ఇక్కడ ప్రాంతాలలో పర్యటించారు.గేదెలు,గొర్రెలు,ఆవులు, కోళ్లు, ఇళ్ళు, మంచాలు, చివరికి శవాలు ఇలా సమస్త రకాలు ఈ వరదలో కొట్టుకొచ్చాయి. అంతకు ముందు గోదావరి ఉప్పొంగినప్పుడల్లా ఏటిగట్టు వద్దకు వెళ్లి గోదావరి ఉధృతిని చ్చూసేవారు. ఎన్నడూ లేని విధంగా 36 క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ఎక్కడకక్కడ కరకట్లు తెగిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆగష్టు 16 నుండి ముంచెత్తిన వరద ఆగస్టు 22న గోదారమ్మ శాంతించడంతో తగ్గుముఖం పట్టింది. సినిమాహాళ్లు, సత్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పునరావాస కేంద్రాలుగా మార్చింది. వారం రోజులు పైనే ఇక్కడి వారంతా చీకటిలోనే గడిపారు. 4500 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఆగష్టు 16 న వరద మొదటి రోజు రెస్క్యూ బోట్ ల ద్వారా సుమారు 20000 వేల మందిని కాపాడగలిగారు … సుమారు 300 మంది వరకు ఆనాటి వరదల్లో మరణించారు… లక్షల ఎకరాల పంట నష్టం కలిగింది… లక్షల్లో జనం నిరాశ్రయులయ్యారు … మంచినీటి సరఫరా గాని, తినడానికి తిండి లేని పరిస్థితి చుట్టూ ఎటు చూసినా వరద నీరు … ఆ దాటికి కొన్ని గ్రామాలు సైతం వరదతో పాటు కొట్టుకుపోయాయి. ఉన్న ఆస్తుల్ని వదిలిరావడానికి కొంతమంది మొండికేసారు … వాళ్ళని రెస్క్యూ టీం వాళ్ళు బ్రతిమాలి ఇంకా మొండికేస్తే బెదిరించి సురక్షిత ప్రదేశాలకు తీసుకొచ్చారు …ఎలాంటి రహదారులు లేవు అన్ని తెగిపోయి రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ కుప్పకూలాయి … గట్లు తెగిపోకుండా యువకులు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది అంతా ఒక్కటై కలిసికట్టుగా ఉండి కాపలాకాసి కొన్ని గ్రామాలను కాపాడారు. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసాయి… ఆనాటి వరదలు సమయంలో వారం రోజుల పాటు హెలికాఫ్టర్ల మీద కిందకు ఇచ్చిన ఆహారమే దిక్కు… ఆ వరదలని గుణపాఠంగా తీసుకొని వెంటనే ఏటి గట్లును ఎత్తు చేశారు… ప్రభుత్వం తరపున సహాయం చేసినప్పటికీ , ఎంతో మంది దాతలు, సినిమా యాక్టర్లు, వివిధ రంగాల వారు ఇలా అనేక మంది ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు.

ఇక్కడ ఒకరి గురించి ప్రస్తావించాలి. ఆయనే అప్పటి అమలాపురం ఆర్డీవో గారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు (అప్పట్లో ఆయన యువకులు) … ఆ సమయంలో చాలా ఉధృతంగా గోదారమ్మ ఊర్లలో ప్రవహిస్తుంది. అంతటి పరిస్థితిలో కూడా సుబ్రహ్మణ్యం గారు అందుబాటులో ఉన్న సాధారణ నాటు పడవలో వెళ్లి మునిగిపోతున్న ఊర్లలో ప్రజలను ఎందరినో కాపాడారు ( ఇతర రంగాల వారు సహాయం చేస్తున్నారు ) ఆ సమయంలో ఆయన స్పూర్తితో మరెందరో ముందుకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచార వ్యవస్థ లేనప్పటికీ నోటిమాట ( మౌత్ టాక్ ) తో ఎక్కడైనా సమస్య అని తెలియగానే ప్రభుత్వ , ఆ సంస్థ , ఈ సంస్థ అని ఎలాంటి తేడా లేకుండా అంతా ఒక్కటై ఎందరినో కాపాడారు. ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ( ఇప్పుడెక్కడున్నారో ) అలాంటి వారు ఇంకా ఎంతో మంది ఆ సమయంలో ఇక్కడ వారికి అండగా నిలిచారు.మీకు గుర్తుందా మొన్నామధ్య భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి పూజ చేస్తూ పైకి లేచి నిలబడి మళ్ళీ శివ లింగము మీద పడిపోయారు. వెంటనే గుండెపోటుతో అక్కడే మరణించారు. ఆయన 1986 లో వచ్చిన వరదలు సమయంలో గోదావరి గట్టున ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నారు. ఆ వరద నీటికి అందరూ ఇంకోచోటకు వెళ్లినా ఈయన మాత్రం అమ్మవారికి హారతి నైవేద్యం పెట్టి వస్తాను అని అక్కడే ఉండిపోయారు. అంతలోనే వరద ప్రవాహం పెరిగి అమ్మవారి గుడి కొట్టుకుపోయింది. కాని అమ్మవారి విగ్రహము గోదావరి గట్టు మీద ఉన్న చెట్టు కొమ్మల మధ్య ఆగిపోయింది… ఆయన కుడా అక్కడే కొమ్మల మధ్య 2 రోజులు అలానే ఉండిపోయారు అప్పట్లో అనేక పేపర్ లలో ” అమ్మ ఒడిలో పూజారి ” అని సంచలనాత్మక వార్తగా వచ్చింది.ఆనాటి అనుభవాలను చూసి ఇప్పుడు పోలవరం నిర్మాణం అధిక క్యూసెక్కుల నీటి సామర్ధ్యం కలిగేలా కడుతున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s