
ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త బీఎస్6 కేటీఎం డ్యూక్ 250 బైక్ ధర వచ్చేసి రూ.2.09 లక్షలుగా సంస్థ నిర్దేశించింది
డిజైన్..
ఈ సరికొత్త కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లతో అందుబాటులోకి వచ్చింది. చూసేందుకు అచ్చం కేటీఎం డ్యూక్ 390 మోడల్ మాదిరే ఉన్న ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా సూపర్ మోటో మోడ్ ఆప్షన్ ఇందులో ఉంది. దీని వల్ల ఏబీఎస్ ను పూర్తి స్విచ్ ఆఫ్ అయి రేర్ వీల్స్ ను ప్రెస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ రెండు కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. డార్క్ గాల్వానో, సిల్వర్ మెటాలిక్ కలర్స్ లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అప్టేటెడ్ గ్రాఫిక్స్ వల్ల స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ తో ఇది ఆకట్టుకుంటోంది.

ఇంజిన్..
బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్టేట్ చేసిన ఈ 2020 కేటీఎం డ్యూక్ 250 మోటార్ సైకిల్.. 248 సీసీ సింగిల్ సిలీండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 29.6 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 24 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఇంజిన్ మార్పు కాకుండా ఇందులో చెప్పుకోదగ్గ మార్పులేమి లేవు. పాత మోడల్ మాదిరే రెండు డబ్ల్యూపీ సస్పెన్షన్, 43 ఎంఎం ఫ్రంట్ యూఎస్డీ ఫోర్కులు, వెనక భాగంలో 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జార్బర్లు ఇందులో ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే 320 ఎంఎం, 240 ఎంఎం ముందు, వెనక డిస్క్ బ్రేకింగ్ సెటప్ ఇందులో ఉంది. 13.5 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగిన ఈ బైక్ 169 కేజీలు బరువుంది.
You must log in to post a comment.