‘ఫ్రెండ్ షిప్ డే – జులై 30 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవo

గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవచ్చు. అన్నట్లు.. మీ ప్రాణ మిత్రుడికి మీరు ఏం గిఫ్టు ఇవ్వాలో నిర్ణయించుకున్నారా? 

MI 4K ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లేదా అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్: మీ ఫ్రెండ్‌‌కు గ్యాడ్జెట్లు బాగా ఇష్టమైతే ఇది ట్రై చేయండి. ఒక వేళ మీ స్నేహితుడి ఇంట్లో ‘స్మార్ట్ టీవీ’ లేనట్లయితే.. వీటిని కానుకగా ఇవ్వండి. ఎందుకంటే.. ఇవి సాధారణ టీవీని సైతం స్మార్ట్ టీవీగా మార్చేస్తాయి. దీనికి ఇన్‌స్టలేషన్ కూడా అవసరం ఉండదు. జస్ట్.. పెన్ డ్రైవ్ పెట్టినంత ఈజీ. దీని సాయంతో అన్నిరకాల ‘అమేజాన్ ప్రైమ్’, ‘నెట్ ఫ్లిక్స్’ తదితర ఓటీటీలను సైతం టీవీలో చూడవచ్చు. వీటి విలువ రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి.

ఓటీటీ గిఫ్ట్‌గా ఇవ్వండి: కరోనా నేపథ్యంలో సినిమాహాళ్లు మూసేశారు. దీంతో ఎక్కువ మంది ఓటీటీలను చూసి ఆనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏదైనా మంచి ఓటీటీని ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్ చేయించి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కానుకగా ఇవ్వండి. అంతేకాదు.. దీనికి అనుసంధానంగా ఏడాదిపాటు ఇంటర్నెట్‌ను కూడా కానుకగా ఇవ్వొచ్చు. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. అంటే, మీరిచ్చే ఆ ఇంటర్నెట్ ద్వారా మీ స్నేహితుడు ఓటీటీలో వెబ్‌సీరిస్‌లు సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు. నెట్ ఇవ్వకుండా ఓటీటీ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదు కదా.

వైర్‌లెస్ పవర్ బ్యాంక్: ఇటీవల వైర్‌లెస్ పవర్ బ్యాంకులకు బాగా క్రేజ్ పెరిగింది. అయితే, ఇది కొన్ని ఫోన్లకే సపోర్ట్ చేస్తుంది. మీ స్నేహితుడి ఫోన్‌కు కనుక ఇది సపోర్ట్ చేస్తే తప్పకుండా కొనివ్వండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న సామ్సంగ్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ప్రస్తుతం రూ.3700 వరకు ధర పలుకుతోంది. దీన్ని కూడా ఆన్‌లైన్లో కొనుగోలు చేయొచ్చు.

MI బ్యాండ్ 3: ఇటీవల ఫిట్‌నెస్ కోసం బ్యాండ్‌ల వినియోగం పెరిగింది. ఒక వేళ మీ స్నేహితుడి వద్ద అలాంటి బ్యాండ్ లేకపోతే.. గిఫ్టుగా ఇవ్వండి. ఇలా చేస్తే.. మీరు మీ స్నేహితుడి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపినవారు కూడా అవుతారు. మన ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే ఈ బ్యాండ్ అందుబాటు ధరల్లోనే లభిస్తోంది. అయితే, MI బ్యాండ్3కి మంచి డిమాండ్ ఉంది. దీని ధర ప్రస్తుతం రూ.1400 వరకు ఉంది. మరికొన్ని బ్రాండ్లు రూ.2000 వరకు ధర పలుకుతున్నాయి. ఇది ఆన్‌లైన్లో లభ్యమవుతోంది.

%d bloggers like this:
Available for Amazon Prime