గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆడ్మిషన్‌ టెస్టు(జీమ్యాట్‌) VS గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌(జీఆర్‌ఈ)

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్‌ పొందేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్‌ గురించి ఆందోళన చెందుతుంటారు. ఈ రెండిట్లో ఏ స్కోరు ఎలాంటి కోర్సులో చేరేందుకు ఉపయోగపడుతుంది?! విదేశీ వర్సిటీలు ఎక్కువగా దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి.. వంటి ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా జీమ్యాట్, జీఆర్‌ఈ ప్రత్యేకతలు–ప్రయోజనాలు, రెండింటి మధ్య వ్యత్యాసాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలపై ప్రత్యేక కథనం..

సారూప్యతలు!
విస్తృత కోణంలో చూస్తే రెండు పరీక్షలూ ఒకేలా కనిపిస్తాయి. రెండూ మాస్టర్స్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలే..! పరీక్ష ప్యాట్రన్‌లోనూ అనలిటికల్‌ రైటింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్‌ వంటి సారూప్యతలు ఉన్నాయి. జీమ్యాట్, జీఆర్‌ఈలు ప్రధానంగా అభ్యర్థుల్లోని క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ రైటింగ్, వెర్బల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తాయి. వీటిని ఏడాది పొడవునా నిర్వహిస్తారు. జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోరుకు ఐదేళ్ల గుర్తింపు ఉంటుంది. ఇన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ.. ప్రిపరేషన్, స్కిల్‌ టెస్టులు, ఇన్‌స్టిట్యూ ట్ల యాక్సప్టెన్సీ, వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పరంగా రెండింటి మ«ధ్య స్పష్టమైన వ్యత్యాసాలున్నాయి.

మేనేజ్‌మెంట్‌ కోర్సులు..
జీమ్యాట్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జీమ్యాట్‌ స్కోరుతో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఎంబీఏ), పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం), మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఫైనాన్స్, మాస్టర్స్‌ ఇన్‌ అకౌంటింగ్, ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

జీఆర్‌ఈతో మాస్టర్స్‌..
ప్రపంచవ్యాప్తంగా వేల ఇన్‌స్టిట్యూట్స్‌ జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్, లా, హ్యుమానిటీస్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఉన్నాయి. జీఆర్‌ఈ ప్రధానంగా అమెరికా, కెనడా వంటి దేశాల్లోని గ్రాడ్యుయేట్‌ స్కూల్స్‌లో మాస్టర్స్, డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు ఉద్దేశించింది. అదేవిధంగా జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా పలు ఇన్‌స్టిట్యూట్స్‌ ఫెలోషిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి. జీఆర్‌ఈ జనరల్‌ టెస్టుతోపాటు బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీల్లో సబ్జెక్టు వారీ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.

బీ–స్కూల్స్‌ ఓటు దేనికి!
బిజినెస్‌ స్కూల్స్‌లో ఎక్కువ శాతం జీమ్యాట్‌ స్కోర్‌తోనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పడిప్పుడే కొన్ని బిజినెస్‌ స్కూల్స్‌ జీమ్యాట్‌ స్థానంలో జీఆర్‌ఈ స్కోరును పరిగణలోకి తీసుకుంటున్నా… వాటి సంఖ్య కేవలం 15 శాతానికి మించదు. కాబట్టి బిజినెస్‌ ప్రోగ్రామ్‌ లక్ష్యంగా సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్థులు జీమ్యాట్‌కు హాజరవ్వడం లాభిస్తుంది. ఎంఎస్‌ వంటి మాస్టర్స్, డ్యూయల్‌ డిగ్రీ కోర్సులను లక్ష్యంగా పెట్టుకున్న వారు జీఆర్‌ఈకి ప్రిపేరవడం మంచిది. నిర్దిష్టంగా కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లు ఏ స్కోరును పరిగణలోకి తీసుకుంటున్నాయో తెలుసుకొని పరీక్షను ఎంచుకోవాలి.

ఏది సులభం..
జీమ్యాట్, జీఆర్‌ఈల్లో ఏది సులభం, ఏది క్లిష్టం అనే అంశం పూర్తిగా అభ్యర్థి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. జీఆర్‌ఈలో క్వాంటిటేటివ్‌ విభాగం సులభంగా ఉంటుంది. ఓ స్థాయి క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌తో జీఆర్‌ఈలో రాణించొచ్చు. జీమ్యాట్‌ క్వాంటిటేటివ్‌ విభాగం కఠినంగా ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్‌ స్కిల్స్‌ బలంగా ఉన్న వారు జీమ్యాట్‌ ఎంచుకోవడం లాభిస్తుంది. వొకాబ్యులరీలో బలహీనంగా ఉన్న అభ్యర్థులు జీఆర్‌ఈలో ఇబ్బంది పడతారు. ఎందుకంటే.. జీఆర్‌ఈలో టెక్ట్స్ కంప్లీషన్స్, సెంటెన్స్‌ ఈక్వివ్యాలెన్స్‌ క్వశ్చన్స్, వర్డ్‌ యూసేజ్‌ టెస్టింగ్‌ వంటివి ఉంటాయి. కొన్నేళ్లుగా హ్యుమానిటీస్‌ కోర్సులు చదివిన వారికి ఈ విషయంలో ప్రయోజనం ఉంటుంది.

సిలబస్‌..

  • జీమ్యాట్‌ వెర్బల్‌ విభాగంలో.. రీడింగ్‌ కాంప్ర హెన్షన్, ప్యాసేజ్‌ నుంచి కంక్లూజన్‌ డ్రా చేయడం, క్రిటికల్‌ రీడింగ్, సెంటెన్స్‌ కరెక్షన్‌ కీలక అంశాలుగా ఉంటాయి.
  • జీఆర్‌ఈ వెర్బల్‌లో.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, టెక్స్‌›్ట కంప్లీషన్, సెంటెన్స్‌ ఈక్వివ్యాలెన్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • జీమ్యాట్‌ క్వాంటిటేటివ్‌ విభాగంలో.. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డేటా సఫీషియెన్సీలపై ప్రశ్నలు అడుగుతారు.
  • జీఆర్‌ఈలో ఆల్‌జీబ్రా, అర్థమెటిక్, డేటా అనాలసిస్, జామెట్రి నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • జీమ్యాట్‌ రైటింగ్‌కు సంబంధించి వాదనలోని (ఆర్గ్యుమెంట్‌) ముఖ్యాంశాలను గుర్తించడం, విశ్లేషించడం చేయాలి. ఐడియాలను స్పష్టంగా, క్రమపద్ధతిలో వెల్లడించాలి. సందర్భ సహిత ఉదాహరణలు, కారణాలను పేర్కొనాలి.
  • జీఆర్‌ఈ రైటింగ్‌లో సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా, సమర్థంగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన ఉదాహరణలు, కారణాలను పేర్కొనాలి. ఆధారాలతో క్లెయిమ్స్‌ను పరిశీలించాలి చేయాలి.

ముఖ్యాంశాలు..

  • జీఆర్‌ఈతో పోల్చితే జీమ్యాట్‌ క్వాంటిటేటివ్‌ క్వశ్చన్స్‌ క్లిష్టంగా ఉంటాయి. ఈ అంశంలో జీమ్యాట్‌ కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
  • జీమ్యాట్‌తో పోల్చితే జీఆర్‌ఈ వెర్బల్‌ విభాగంలో క్లిష్టమైన పదాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ భాషపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న అభ్యర్థులే ఇందులో అధిక మార్కులు పొందగలరు.
  • బిజినెస్‌ స్కూల్‌్ లో చదువు పూర్తి చేసుకొని మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలోని కంపెనీలకు వెళ్లినప్పుడు కొన్ని సంస్థలు జీమ్యాట్‌ స్కోరు అడుగుతున్నాయి.

జీమ్యాట్‌–పరీక్ష విధానం

విభాగంప్రశ్నలుసమయం
అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌130 నిమిషాలు
ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌1230 నిమిషాలు
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌3162 నిమిషాలు
వెర్బల్‌ రీజనింగ్‌3665 నిమిషాలు


జీఆర్‌ఈ –పరీక్ష తీరు

విభాగంప్రశ్నలుసమయం
అనలిటికల్‌ రైటింగ్‌2 టాస్కులు60 నిమిషాలు
వెర్బల్‌ రీజనింగ్‌–12030 నిమిషాలు
వెర్బల్‌ రీజనింగ్‌–22030 నిమిషాలు
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌2035 నిమిషాలు

%d bloggers like this: