70 వేల లోపు బెస్ట్ స్కూటర్లు

samayam telugu

బీఎస్6 హోండా డియో..

samayam telugu

హోండా డియో దేశంలో అత్యధిక యూనిట్ల విక్రయాలు అందుకున్న స్కూటర్ గా గుర్తింపు పొందింది. 2002లో ఈ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు 33 లక్షల యూనిట్ల అమ్మకాలు అందుకుంది. ఈ సరికొత్త 2020 హ్యుండాయ్ డియో స్కూటర్లో సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లను పొందుపరిచారు. ఎల్ఈడీ పొజిషన్ ల్యాంపు, ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, స్ప్లిట్ రేర్ గ్రాబ్ రెయిల్, న్యూ టెయిల్ లైట్ డిజైన్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్ లాంటి అప్ డేట్లున్నాయి. బీఎస్6 హోండా డియో మోడల్లో వీల్ బేస్ కూడా 22 ఎంఎం అధికంగా ఉంది. ఈ బేస్ స్కూటర్ టాప్ వేరియంట్లో అనలాగ్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ ను అమర్చారు. ఇందులో స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డిస్టెన్స్ టూ ఎంప్టీ, సర్వీస్ రిమైండెర్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి. 110సీసీ ఇంజిన్ కలిగి ఉన్న 2020 హోండా డియో 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఎక్స్ షోరూంలో బీఎస్6 హోండా డియో ధర వచ్చేసి రూ.60,000 నుంచి రూ.63,340ల మధ్యలో ఉంది.

​బీఎస్6 టీవీఎస్ జూపిటర్..

samayam telugu

ఈ ఏడాది జనవరిలో విడుదలైన 2020 టీవీఎస్ జూపిటర్ స్కూటర్ తో బీఎస్6 పార్మాట్లో వాహనాలను లాంచ్ చేయడం మొదలు పెట్టింది టీవీఎస్ సంస్థ. అప్పటి నుంచి జూపిటర్ లైనప్ లో జూపిటర్ బేసిక్, గ్రాండే వేరియంట్లను ఈ నూతన ఫార్మాట్లో అప్ డేట్ చేసి విడుదల చేసింది. ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఈ సరికొత్త 2020 టీవీఎస్ జూపిటర్ స్కూటర్లో పొందుపరిచారు. అంతేకాకుండా ఈ స్కూటర్ 109.9 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 8 బీహెచ్ పీ పవర్, 8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఎక్స్ షోరూంలో బీఎస్6 జూపిటర్ ధర వచ్చేసి రూ.61,449 నుంచి రూ.67,911 మధ్య ఉంది.

​బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్..

samayam telugu

బీఎస్6 స్కూటర్లలో అత్యంత అందుబాటులో ధరలో దొరుతున్న స్కూటర్ హీరో ప్లెజర్ ప్లస్ మోడల్. బీఎస్4 మోడల్ తో పోలిస్తో ఈ నూతన ఫార్మాట్లో ప్లెజర్ ప్లస్ స్కూటర్లో పెద్ద మార్పులేమి లేవు. గతేడాదే బీఎసస్6 నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ స్కూటీ ఇంతకుముందు మోడల్ మాదిరే ఫ్రంట్ అప్రాన్ మందంగా ఉండి, క్రోమ్ చుట్టూ హెడ్ లైట్లు, కర్వీ సైడ్ ప్యానెల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. బేసిక్ సమాచారాన్ని తెలుసుకునేందుకు బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్ మోడల్లో అనలాగ్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్ కూడా ఉంది. 110 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ స్కూటర్ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఎక్స్ షోరూంలో బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ.54,800 నుంచి 56,800 వరకు ఉంది.

​బీఎస్6 హోండా యాక్టివా 6జీ..

samayam telugu

ఆరో తరానికి చెందిన హోండా యాక్టివా భారత్ లో అత్యంత విజయవంతమై మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ జనవరిలో ఈ సరికొత్త 2020 యాక్టివా 6జీ మోడల్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇందులో విభిన్న రకాల కాస్మటిక్ అప్ డేట్లు, ఫంక్షనల్ ఛేంజెస్ వచ్చాయి. రీడిజైన్డ్ ఫ్రంట్ ఆప్రాన్, క్రోమ్ ఇన్ సర్ట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు తదితర ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్6 హోండా యాక్టివా 6జీ స్కూటర్లో ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టం, ఇన్హీబీటర్ సేఫ్టీ ప్రొవిజన్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఫంక్షనల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 110 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న హోండా యాక్టివా 6జీ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బీఎస్6 హోండా యాక్టివా 6జీ ధర వచ్చేసి రూ.63,912 నుంచి రూ.65,412 మధ్య ఉంది.

​బీఎస్6 సుజుకీ యాసెస్ 125..

samayam telugu

ఈ సరికొత్త స్కూటర్ తో బీఎస్6 ఫార్మాట్లో వాహనాలను అప్ డేట్ చేయడం మొదలుపెట్టింది సుజుకీ సంస్థ. బీఎస్6 సుజుకీ యాసెస్ 125 మోడల్.. 124 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా క్లీనర్ ఇంజిన్, కాస్మటిక్ లేదా ఫంక్షనల్ మార్పులతో రానుంది. సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ప్యానెల్, స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ తదితర వివరాలను తెలియజేసే అనలాగ్ డిజిటల్ డిస్ ప్లే లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఈ కన్సోల్ ద్వారా ఫ్యూయల్ ఎఫిషియంట్ రైడింగ్ ప్యాటర్నులను తెలియజేసే ఎకో అసిస్ట్ ఇల్యూమినేషన్ ను కలిగి ఉంది. ఎక్స్ షోరూంలో బీఎస్6 సుజుకీ యాసెస్ 125 ధర వచ్చేసి రూ.64,800 నుంచి రూ.69,500 మధ్య నిర్దేశించింది.

%d bloggers like this:
Available for Amazon Prime