How to find best fruits

తర్పూజా తొడిమ భాగంలో కొద్దిగా నొక్కితే అది మొత్తగా ఉంటే తర్బూజా బాగా పండినట్లు. లేదంటే వాసన చూడండి, తీపివాసన వస్తుంది. వాసన పెరిగే కొద్ది బాగా పండినట్లు.

పుచ్చకాయ
పుచ్చకాయ పైభాగాన తట్టితే డొల్ల శబ్దం రావాలి. గట్టి శబ్దం రాకూడదు. నిమ్మ, కమాలా, యాపిల్ వంటి వాసన తాజాగా ఉండాలి.ఎలాంటి మచ్చలు, గీతలు ఉండరాదు. యాపిల్స్ చర్మం చాలా మృదువుగా, మచ్చలు లేకుండా ఉండాలి.


ద్రాక్షా :
ద్రాక్షా కవర్లలో ఉన్నవి కొనేటపుడు కవర్ అడుగుభాగాన చూస్తే రాలినవి ఎక్కువగా ఉండకూడదు. కుళ్ళిన దశలో ఎక్కువగా రాలిపోతాయి. ద్రాక్షాలకు ఎక్కువగా పురుగు మందులు వాడతారు కనుక కొన్న తరువాత నేరుగా తినకూడదు. ఉప్పునీటిలో ఓ ఐదు నిమిషాలు ఉంచి ధారగా నీరు పడుతున్న పంపు కింద శుభ్రపరిస్తే చాలావరకు మందులు తొలగిపోతాయి.

%d bloggers like this: