ఝాన్సీ లక్ష్మీబాయి

Jhansi Rani

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతరా. ఈమె జన్మించిన సంవత్సరం గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నవి.. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి ఝాన్సీ నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే మరణిస్తుంది. ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకుంటాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావుసాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా భావించి కలసిమెలసి ఉంటారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది. లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహం జరుగుతుంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారుతుంది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మిస్తాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకుతుంది. ఎవరినైనా బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇస్తారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ ఆ మరుసటి రోజునే అనగా 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణిస్తాడు.

సభలో ఝాన్సీ తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలిన యువతులు, ఎవరైతే జనానా ఆచారాలు పాటిస్తుంటారోవాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఝాన్సీ కలిగి వుండేది. లక్ష్మీబాయి కత్తియుద్ధం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాళ్లందరినీ చేర్చుకొని స్త్రీల దళాన్ని తయారుచేస్తుంది.

దామోదర్ రావు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు. దామోదర్ రావు వీరికి పుట్టిన బిడ్డకానందువలనే ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రుడు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేస్తుంది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా ప్రయోజన లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష కడతారు. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకుంటారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ చేస్తుంది.

రాణి ఝాన్సీ ని ఇంగ్లీషు వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సైన్యాన్ని తయారుచేస్తుంది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భుబక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.

ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసి కూడా, వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంపబడతారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొంటారు.

ఇంతలో, మే 1857,లో భారత దేశంలో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు వేరే ప్రాంతంలో వాళ్ళ దృష్టిని పెట్టవలసిందిగా ఆదేశాలు రావడంతో, ఝాన్సీ ని లక్ష్మిబాయిని గురించి పెద్దగా పట్టించుకోరు. ఝాన్సీః, ఝాన్సీ రాణి ఆధీనంలోనే ఉంటుంది. ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, తన చాతుర్యంతో ఝాన్సీరాణి యుద్ధానికి కావలిసిన సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ సమర్థత కారణం వలన ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండారాలను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.

ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. లక్ష్మిబాయికి సహాయం చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాంత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం వస్తుంది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కేవలం 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నారు కాని, ఏ శిక్షణ లేని తాంత్యా తోపే సైన్యం కంటే బ్రిటీష్ సైనికులు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వారు నగర గోడలను బద్దలుకొట్ట నగరాన్ని ఆక్రమించుకోగలుగుతారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున కట్టుకొని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.

రాణి మరియు తాంత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు సహాయంతో గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని గ్వాలియర్ ను స్వాధీనం చేసుకుంటారు.ఆ సంతోషంలో వీరుండాగా మరసుటి రోజే బ్రిటీష్ సేనలు గ్వాలియర్ ను ముట్టడిస్తాయి. లక్ష్మీబాయి గ్వాలియర్ కోట తలుపులు తెరపించి బ్రిటీష్ వారిని ఎదర్కొంటుంది. యుద్ధం భయంకరంగా సాగుతుంది. కాని,17 జూన్ 1858 యుద్ధములో రాణి మరణిస్తుంది .ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా భిన్నాభిప్రాయాలున్నవి.

తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను ఆక్రమించుకుంటారు. ఈ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని మెచ్చుకుంటారు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. తరువాత కొన్ని రోజులకే లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ ను బ్రిటీష్ వారు పాశవికంగా ఉరితీస్తారు

%d bloggers like this: