ఆశా భోస్లే

asha bhosleyi

ఆశా భోస్లే ప్రముఖ బాలీవుడ్ గాయని. ఈమె సెప్టెంబర్ 8, 1933లో మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే గ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. తండ్రి దీనానాధ్ మంగేష్కర్ తల్లి సుధామతి. ఈమె తండ్రి నటుడు మరయు గాయకుడు. ఆశాకు ముగ్గురు చెల్లుళ్లు, ఒకసోదరుడు ఉన్నారు. తొమ్మిది సంవత్సరల వయసులో తండ్రి మరణిస్తాడు. అప్పటికి వీరి కుటుంబం బీదరికంతో బాధపడుతుంది.

వీరు బొంబాయి చేరుకొని అక్కడ సినిమాలలో పాడటం మొదలు పెడతారు. ఈమె మొదట బెంగాలీ సినిమాలో ‘చాలా చాలా నవ్ బాలా’ అనే పాట పాడింది. ఇలా 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. అప్పటినుండి జనం దృష్టి ఈమెమీద పడింది. ఆషా భోంస్లే తన పదహార ఏట గణపతి రావు భోంస్లే ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుంటుంది. కానీ కొద్దికాలం తరువాత తన ఇద్దరి పిల్లలతో మరియు గర్భిణీగా తన తల్లి ఇంటికి తిరిగి వస్తుంది. జరిగిన విషయాలు చాలా గోప్యంగా ఉంచుతుంది.

తరువాత 1956లో ఓ పి నయ్యర్ సినిమా సి ఐ డి సినిమాతో ఈమె దశ తిరుగుతుంది. చాలా పేరుపొందిన సినిమాలలో పాటలు పాడుతుంది. హరేరామ హరే కృష్ణలోని ధమ్మారే ధమ్. తరువాత ఆర్ డి బర్మన్ సినిమాలలో పాడుతూ అతనితో ఏర్పడిన సాన్నిహిత్యం వలన ఆర్ డి బర్మన్ ను 1980 సంవత్సరంలో వివాహం చేసుకుంటుంది. ఆర్ డి బర్మన్ 1994లో మరణిస్తాడు.

మరో ప్రముఖ గాయనియైన లతా మంగేష్కర్ ఈమె సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

%d bloggers like this: