Posted in సుగంధ ద్రవ్యాలు

Salt / ఉప్పు

ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే.
భారతీయులు ఉపయోగించినంత ఎక్కువగా ఉప్పు ప్రపంచంలో ఎవరూ ఉపయోగించరు. ఇదివరకటి కాలంలో ప్రజలు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడేవారు. వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. వారు చేసే శ్రమవల్ల ఒంట్లోని ఉప్పు చెమట ద్వారా వెళ్లిపోయేది. కనుక వారికి ఉప్పు అవసరమయ్యేది.అందుకే వీరు మజ్జిగలో, పెరుగులో ఉప్పు కలుపుకుంటారు.
నేడు జీవన విధానం మారి శ్రమ తగ్గటం వలన ఉప్పును తప్పనిసరిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
భారతీయులు రోజువారీ వాటకంలో పరిమితికి పదిరెట్లు అధికంగా ఉప్పు వాడుతున్నారని పరిశోధనలలో తెలిసింది. బి.పి రావాటానికి కారణం ఉప్పు అధికంగా తీసుకోవటం వలననే సూత్రీకరించారు. ఉప్పును పూర్తిగా మానివేయమని వైద్యులు చెబితేనే మానివేయాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. డాక్టర్లు కూడా ఉప్పు వాడకూడదని నిర్ణయించినపుడు దానికి ప్రత్యామ్నాయంగా సైంధవలవణం వాడమంటారే కానీ పూర్తిగా మానివేయమనరు.
ఉప్పును తగిన మోతాదులో వాడితే
…… ఉప్పు శరీరాని అవసరం అది రుచిని మాత్రమే కాదు ఇతర లాభాలనూ అందిస్తుంది. శరీరంలో ద్రవపదార్ధాల స్థిరీకరణలో ఉప్పు పాత్ర ఉంది. జీర్ణ క్రియలో సహాయపడుతుంది. ఆకలిని కలిగిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించటంలో, విషపూరితమైన పదార్ధాల ప్రభావం తగ్గించటంలో ఉప్పు ఎంతగానో సహాపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరులో పాత్ర వహిస్తుంది. హార్మోన్ లు సమస్థితిలో ఉంచటంలో ఉప్పుకు పాత్ర ఉంది.
ఉప్పను అతిగా వాడటం కూడా ప్రమాదమే. ఉప్పు అధికమైనపుడు వచ్చే అనారోగ్యాలలో అధిక రక్తపోటు, దాని నుండి పక్షవాతం, హార్ట్ ఎన్లార్జ్ మెంట్ ఉదర క్యాన్సర్ లాంటివి. ఉప్పను అధికంగా తీసుకుంటూ తగినంత నీరు శరీరానికి అందించనపుడు శరీరంలో లవణ సమతుల్యం దెబ్బతింటుంది. మూత్రపిండ సమస్యలకు దారితీయవచ్చు. అలాగని ఉప్పను మరీ తక్కువగా తీసుకోకూడదు. తగినంత సోడియం శరీరాని అందించకపోతే లోపల రక్త ఘనపరిమాణం తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు పడిపోతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే తలనొప్పి అనేలక్షణం కనిపిస్తుంది.
అయోడిన్ ఉప్పును ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. కానీ సహజమైన ఆహార పదార్ధాల వలన శరీరానికి తగిన అయోడిన్ అందుతుంది. అయోడిన్ అధికమైతే థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావం పడి హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది. నేడు భారీ సంస్థలు ఉప్పు తయారీలో ప్రవేశించి ఉప్పును మొత్తగా, తెల్లగా వుంటే తప్పించి తినలేని విధంగా ప్రజలను ఒప్పించారు వ్యాపార ప్రకటనల ద్వారా. అయోడిన్ కలిపిన ఉప్పే ఆరోగ్యం అని నమ్మించారు. వాస్తవానికి అయోడిన్ లభించని ప్రదేశాలలో మాత్రమే అయోడైజ్డ్ ఉప్పు అవసం. కానీ అందరి చేతా దానిని తినిపించి థైరాయిండ్ ను ఇబ్బంది పెడుతున్నారు. భారతీయ ఆయుర్వేద వైద్యం సైంధవలవణం (రాక్ సాల్ట్) ఉత్తమం అంటుంది. సహజంగా తయారైన ఉప్పును తినవచ్చ. నేడు మనం తినే ఉప్పు పిత్త దోషాన్ని పెంచుతున్నదనీ, సైంధవలవణం త్రిదోషాలను సమతుల్యంలో ఉంచుతుందని, రిఫైన్డ్ ఉప్పుకన్నా సాధారణ ఉప్పే మేలన్నది వారి సలహా
నిపుణుల సలహాలు…
వంటకాలలో ఉప్పును తగ్గించి వాటి బదులు ఉల్లి, వెల్లుల్లి, నిమ్మ, ఆకుకూరలు, మసాలదినుసులు వేస్తే వాటిద్వారా శరీరానికి తగిన ఉప్పు అందుతుంది.
ఆకుకూరలు లేదా నిలవవుంచిన ఆహార పదార్ధాలు తినేప్పుడు ముందుగా వాటిని బాగా నీటిలో కడిగితే వాటికి అంటివున్న అదనపు లవణాలు, మలినాలు తొలగిపోతాయి.
ఆహారంలో భాగంగా పొటాషియం అధికంగా గల బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, టమాటోలు, ఆకు కూరలు తినవచ్చు. వీటిలో ఉప్పు సహజంగా ఉంటుంది. పోటాషియం శరీరంలోకి వచ్చే సోడియం ప్రభావానికి విరుగుడుగా పనిచేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
పదార్ధాలను వండే తీరును మార్చుకుని వాటిలో రుచికోసం నిమ్మరసం, కొత్తిమీర వాడుకుని ఉప్పును తగ్గించవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s