ఆవనూనె
ఆవనూనెను ఆరోగ్యవంతమైన వంటనూనెగా చెబుతారు. ఎందుకంటే ఇందులో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అత్యధికంగా ఉంటాయి. ఆవనూనె కొలస్ట్రాల్, గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గంచే గుణాలు కలిగి ఉంటుంది.
ఆవనూనెతో వండిన చేపలకూర ప్రత్యేకమైన రుచి కలిగిఉంటుంది.
ఆలివ్ నూనె
ఆవనూనెలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ 75 శాతం అత్యధికంగా ఉండటం వలన దీనిని ఉత్తమమైనది అని అంటారు. అనేక విలువైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వంట పూర్తవుతుండాగా చివరిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపితే రుచి పెరుగుతుందంటారు.
సోయాబీన్ ఆయిన్
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఈ నూనె ఎక్కువగా ఉపయోగంలో ఉండి. పాలి అన్ సాచురేటెడ్ కు ఆధారం ఈ నూనె. సోయాబీన్ నూనెను నిలవ ఉంచకుండా తాజాగా వాడుకోవటం మంచిదంటారు నిపుణులు.
సన్ ఫ్లవర్ ఆయిల్
పుఫా, విటమిన్ ఇ అత్యధికంగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ప్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ బలబడుతుంది. నాడీవ్యవస్ధ సక్రమ పనితీరుకు సహాయపడుతుంది. ఎక్కువగా వినియోగించే నూనెలలో ఇది ఒకటి.
రైస్ బ్రాన్ నూనె
హైస్మోక్ పాయింట్ గల నూనె. తెలికపాటి ఫ్లేవర్ కలది. ముఫా, పుఫా, ఎస్ ఎఫ్ ఏ తగుపాళ్లలో ఉండే లత్యంత సమతౌల్య పూరితమైన నూనె. లైట్, న్యూట్రల్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. తక్కువ సెగలో, అత్యధిక సెగలో వండటాని అనుకూలంగా ఉంటుంది.
కొబ్బరి నూనె
కొబ్బరినూనెలో తొంభై శాతానికి మించి సాచురేటెట్ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ ఉండదు. ఇంచు మించు వెన్నతో సమానమైనది. దీనిలోని సాచురేటెడ్ ఫ్యాట్స్ జంతు సంభందిత కొవ్వులకు భిన్నంగా ఉండి హెచ్ డి ఎల్ కొలస్ట్రాల్ ను పెంచటం ద్వారా బ్లడ్ కొలస్ట్రాల్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. విటమిన్ ఇ, కె, ఐరన్ వంటి ఖనిజాలు లభిస్తాయి. కేరళలో దీని వాడకం ఎక్కువ.
కెనోలా ఆయిల్
ఆవనూనెతో సారూప్యం కలిగి ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. మోన్ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఉపయోగకరమైన ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేలికపాటి ఫ్లేవర్, హైస్మోక్ పాయింట్, మృదువైన టెక్చర్ అన్నీ కలిపి ప్రత్యేకమైన వంటనూనెగా పేరు పొందింది.
You must log in to post a comment.