Posted in సుగంధ ద్రవ్యాలు

లవంగాలు (Cloves),Lavangaalu

లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన దినుసులు . వీటిలో వాసనేకాదు .. విలువైన పోషకాలు ఉన్నాయి . కార్బోహైడ్రేట్లు , కాల్సియం , ఫాస్ఫరాస్ , పొటాషియం , సోడియం , హైడ్రోక్లోరిక్ ఆసిడ్ , మాంగనీస్, విటమిన్ … ఎ,సి , ఉంటాయి
వైద్య పరం గా
దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీ లో లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది .
జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని వేయించి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణము అవుతుంది .
మూడు లీటర్ల నీళ్ళలో నాలుగు గ్రాముల లవంగాలు వేసి నీళ్లు సగమయ్యే వరకూ మరిగించి తాగితే కలరా విరేచనాలుతగ్గుతాయి .
ఆరు లవంగాలు కప్పు నీళ్లు కలిపి డికాక్షన్ తయారుచేసి ..చెంచా కు కొంచం తేనే కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ” ఉబ్బసము ” తగ్గుతుంది .
పాలలో లవంగం పొడి , ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది , వంటకాలలో దీనిని ఉపయోగించడం వల్ల చర్మ కాన్సర్ ను తగ్గించవచ్చును ,
దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరము లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది .
ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మషాలాప్రియులు.. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే.
మొటిమలు, రాష్‌లు, దద్దుర్లు… వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె ఉపయోగపడుతుంది.
అద్భుత ఔషధం
లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.
పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.
లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.
లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.
పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని ‘యుజెనాల్‌’ నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు.
రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.
జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది.
ఏడుమొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించాలి. తరువాత దాన్నించి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరువాత ఆ నీళ్లను తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి కాస్తంత హాయి.
లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోబాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్‌, ఆర్త్థ్రెటిస్‌, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట. మొత్తమ్మీద ఆహారంలో భాగంగా లవంగాలను తీసుకోవడంవల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరిగి హానికరమైన ఆక్సీకరణ ప్రక్రియతగ్గి రోగాలు రాకుండా ఉంటాయి.
అయితే గర్భిణులు, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, బౌల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మరీ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
మందుగా
లవంగాల పొడి తేనెతో కలిసి తాగితే దగ్గు, కఫం తగ్గుతాయి. లవంగాలను చల్లని నీళ్లతో నూరి, వడగట్టి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది. గర్భిణీలకు వాంతులు తగ్గుతాయి. లవంగతైలాన్ని పైపూతగా రాస్తే పిప్పిపన్ను నొప్పి తగ్గుతుంది. నీటితో ముద్దగా చేసి పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s