చింతపండు-Tamarind

ఏడు రుచులలో పులుపుకు ఉన్న ప్రాముఖ్యత వేరుగా ఉంటుంది. చింతపండు మన వంట రుచిని అమోఘంగా మారుస్తుంది.
పానీ పూరి తయారీలో చింతపండు వాడకం ఎక్కువ. తెలుగువారింట జరిగే శుభ కార్యక్రమాలలో చింతపండుతో చేసిన పులిహోర తప్పనిసరి.
ప్రయోజనాలు
జలుబు ముక్కు దిబ్బెడ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. చింతపండు నానబెట్టిన నీరు, ఓ టీస్పూన్ నెయ్యి, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కాచి వేడి వేడిగా తాగితే ముక్కునుంచి, కంటినుంచి నీరు కారి ముక్కుల బ్లాక్ తగ్గుతుంది.
చింతపండు గుజ్జు జీర్ణకారి, కడుపుబ్బరం, తగ్గిస్తుంది. కూలింగ్, లాక్సేటివ్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది.
చింత గింజలలో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. చింతపండు గుజ్జులో విటమిన్ సి ఉంటుంది. స్కర్వీ వ్యాధి రాకుండా చేస్తుంది.
సాధారణంగా కూరగాయలను ఉడికించినపుడు వాటిలోని పోషకాలు కొంత వరకు నశిస్తాయి. కాని చింత పండుగుజ్జులో యాంటీస్కోర్బటిక్ గుణాలు నశించవు. ఒక కప్పు చింతపండు గుజ్జులో 285 క్యాలరీలు ఉంటాయి.

%d bloggers like this:
Available for Amazon Prime