Posted in కాలేయం

Hepatitis……కాలేయవాపు / హెపటైటిస్‌

మన శరీరంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే అతి పెద్ద అవయవం కాలేయం. కాలేయం దాదాపు 1.5 కిలోల బరువుతో, అత్యంత సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. ఈ కాలేయానికి వచ్చే వాపు, ఇన్‌ఫ్లమేషన్‌ను హెపటైటిస్‌ అంటారు. దీనికి ఆల్కహాల్‌తో పాటు హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌ -బి, హెపటైటిస్‌ -సి లేదా హెపటైటిస్‌- ఇ వంటి వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణాలు కావచ్చు.
హెపటైటిస్‌ ఏ, బి, సి, ఈ లతో పాటు మలేరియా వంటి అనేక కారణాలు ఉంటాయి. ఆల్కహాల్‌ కూడా ఒక కారణం. ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది హెపటైటిస్‌ బి లేదా హెపటెటిస్‌ సి వ్యాధుల బారిన పడుతున్నారు. పై సమస్యలకు చికిత్స చేయించుకోకపోవడం వల్ల క్రమంగా అవి లివర్‌ సిర్రోసిస్‌ లేదా లివర్‌ క్యాన్సర్‌. లివర్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ప్రతి పన్నెండు మందిలో ఒకరు హెపటైటిస్ సంబంధ సమస్యలకు గురవుతున్నారు.
హెపటైటిస్‌ వచ్చేందుకు కారణాలు
హెపటైటిస్‌ – ఏ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి, హెపటైటిస్‌-ఇ, వైరల్‌ కారణంగా లేదా బాక్టీరియా. ఇతర పరాన్నజీవుల ఇన్ఫెక్షన్‌ వల్ల హెపటైటిస్‌ (కాలేయ వాపు) రావచ్చు.
ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం, కొన్నిరకాల మందులు వాడటం, రసాయనాలు, విషపదార్థాలు. ఫ్యాటీలివర్‌ అనే సమస్య క్రమంగా కాలేయవాపు (హెపటైటిస్‌) కు దారితీయవచ్చు.
మనలో వ్యాధి నిరోధకశక్తిని కలిగించే కణాలు సొంత కాలేయంపై దెబ్బతీసే ఆలో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల కొన్ని రకాల జన్యు పరమైన వ్యాధుల వల్ల కాలేయంలో రాగి, ఇనుము పేరుకుపోవడం వల్ల
అసోమినోఫెన్‌ వంటి మందులను మితిమీరిన మోతాదులో తీసుకోవడం కొన్నిరకాల చెట్లు, బెరళ్లు, మందులు, విషపూరితమైన పుట్టగొడుగుల వంటి వాటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల.
సాధారణ లక్షణాలు
స్వల్పకాలిక హెపటైటిస్ లో : కళ్లు పచ్చగా మారడం, మూత్రం పసుపు పచ్చగా రావడం, బలహీనత, ఆకలి మందగించడం, వాంతులు, వికారం, జ్వరం, పొట్ట పైభాగంలో నొప్పి, శరీరంపై దురదలు రావడం వంటివి జరగవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరిలో అయోమయం (కన్‌ఫ్యూజన్‌), నిద్రమత్తుగా ఉండటం, కోమాలోకి వెళ్లడం కూడా జరగవచ్చు.
దీర్ఘకాలిక హెపటైటిస్ లో : పై లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. అయితే సమస్య అకస్మాత్తుగా మొదలైనట్లు అనిపించవచ్చు. రక్తహీనత, కామెర్లు, పొట్ట పెరగడం, కాళ్ల వాపులు, అయోమయం, రక్తపు వాంతులు, మలం నల్లగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
పరీక్షలు
కళ్లు పసుపు పచ్చగా మారడం, జ్వరం, కాలేయం – స్ల్పీన్‌ పెరగడం, వణుకు, అయోమయం, పొట్టపెరిగినట్లుగా ఉండటం, కాళ్ల వాపులు అనేవి బాహ్యంగా రోగుల్లో గమనించాల్సిన అంశాలు.
హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి ఇన్ఫెక్షన్స్‌లో వ్యాధి వచ్చాక కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ రెండు రకాల వ్యాధులలోనూ అవి 15 నుంచి 20 ఏళ్ల తర్వాత తిరగబెట్టే అవకాశం ఉంది.
లివర్‌ ఫంక్షన్‌ పరీక్షలు చేయించడం వల్ల లివర్‌ నుంచి స్రవించే ఎంజైముల (ఎఎస్‌టి, ఎఎల్‌టి వంటివి) పాళ్లు పెరిగి కనిపిస్తాయి. రోగులలో బాహ్య లక్షణాలు ఏవీ కనిపించకపోయినా, ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష ద్వారా ఎంజైములు పెరగడం తెలుస్తుంది. అప్పుడు ఈ + పేషెంట్లలో హెపటైటిస్‌-బి లేదా హెపటైటిస్‌-సి పరీక్షలు చేయించాలి.
హెపటైటిస్‌కు మలేరియాను ఒక కారణంగా గుర్తించి దానికి అవసరమైన పరీక్షలు చేయించి ఒకవేళ అదే కారణమైతే దానికి తగిన మందులు వాడాలి. ఒకవేళ హెపటైటిస్‌కు అది కారణం కాకపోతే ఇతర కారణాలను అన్వేషించాలి.
చికిత్స…. ఆల్కహాల్‌ మానేయడం, ఏవైనా మందులు తీసుకుంటుంటే అవి మానడమే ఒక చికిత్స. కళ్లు పచ్చబారి కనిపించే కామెర్లు రెండు నుంచి మూడు వారాల పాటు తీవ్రంగా ఉండటం, ఆ తర్వాత మరో రెండు నుంచి మూడు వారాల్లో తగ్గుముఖం పట్టడం జరుగుతుంది.
హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-ఈ వ్యాధుల్లో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అయితే తేలిగ్గా జీర్ణమయ్యే, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం.
వైరస్‌లతో వచ్చే హెపటైటిస్‌లు
హెపటైటిస్‌ ఏ : కలుషితమైన ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల ఈ రకం హెపటైస్‌ వస్తుంది. కామెర్లు, వాంతులు, జ్వరం, ఆకలి లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో దురదలు కూడా ఉండవచ్చు. కామెర్లు కనిపించడానికి ముందుగా జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఫ్లూ జ్వరంలలోని లక్షణాలు ఉండవచ్చు. రెండు మూడు వారాల్లో కామెర్లు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత కామెర్లు రెండు వారాల పాటు అలా కొనసాగి… క్రమంగా తగ్గుముఖం పట్టి మరో రెండు మూడు వారాల్లో పూర్తిగా తగ్గుతాయి.
హెపటైటిస్‌ ఈ : ఇది కూడా హెపటైటిస్‌ ఏ తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌లో కోలుకునేందుకు వ్యవధి దాదాపు మూడు నెలలు పట్టవచ్చు. దురదలు మరింత తీవ్రంగా ఉండవచ్చు.
‘హెపటైటిస్‌ బీ’ : రోగికి వాడిన సూది మళ్లీ ఆరోగ్యకరమైన వ్యక్తికి వాడటం వల్ల, రేజర్లు, టూత్‌బ్రష్‌లు షేర్‌ చేసుకోవడం వల్ల, రోగికి ఉపయోగించిన సూదులతో ఇంకొకరికి చెవులు కుట్టడం, పచ్చబొట్టు (టాటూ) వేయడం లేదా కలుషితమైన రక్తాన్ని ఎక్కించడం వంటి మార్గాల వల్ల రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తితో సెక్స్‌ వల్ల కూడా వస్తుంది. ఇది వచ్చిన వారిలో కామెర్లతో మిగతా ‘హెపటైటిస్‌ ఏ’కు సంబంధించిన లక్షణాలన్నీ అంటే… జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం, అన్నహితవు పోవడం వంటివి కనిపించవచ్చు. చాలామట్టుకు కేసుల్లో దీనికి యాంటీ వైరల్‌ మందులు వాడాల్సిన అవసరం లేదు. 90 శాతం రోగుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోయి పరీక్షలు చేస్తే నెగిటివ్‌ అని రిజల్ట్‌ వస్తుంది. హెచ్‌బీఎస్‌ ఏజీ అనే పరీక్ష వల్ల హెపటైటిస్‌-బి బయటపడుతుంది.
ఒకసారి వైద్యపరీక్షల్లో హెచ్‌బీ ఎస్‌ ఏజీ అనే రిపోర్టు పాజివ్‌ వస్తే వాళ్లకు పూర్తిస్థాయి లివర్‌ పరీక్షలు చేయించాలి. దీర్ఘకాలిక లివర్‌ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించాలి. లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌ టి) పరీక్షలు ప్రతి ఆర్నెల్లకో మారు చేయించాలి. ఆ పరీక్షల్లో మళ్లీ ఏదైనా అబ్‌నార్మాలిటి ఉంటే అంటే ఎస్‌జీపీ (ఏఎల్‌టి) ఎక్కువగా ఉంటే వాళ్లు మరికొన్ని రక్తపరీక్షలు చేయించుకోవాలి. వైరస్‌ చురుగ్గా ఉండి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ‘యాంటీ వైరల్‌’ డ్రగ్స్‌ వాడాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా హెచ్‌బీఎస్‌ఏజీ పాజివ్‌ రిపోర్టులు ఉండి ఎల్‌ఎఫ్‌టీ అల్ట్రాసౌండ్‌ రిపోర్టులు నార్మల్‌గా వచ్చిన సందర్బాల్లో ప్రతి ఆర్నెల్లకోమారు లివర్‌ ఫంక్షన్‌లు టెస్ట్‌లు చేస్తుంటారు. అవి నార్మల్‌గా ఉన్నవాళ్లకు ఎలాంటి మందులు వాడరు. కాని, దీర్ఘకాలిక హెపటైటిస్‌ సిర్రోసిస్‌ ప్రారంభ దశలో ఉన్నవాళ్లలో యాంటీ వైరల్‌ మందులు వాడతారు. హెపటైటిస్ బీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే… దాన్ని నివారించుకోవడమే ముఖ్యం. హెపటైటిస్‌-బీ వ్యాక్సిన్‌ తీసుకోవడం నివారణకు తోడ్పడుతుంది. హెపటైటిస్‌-బీ వచ్చిన వారి భార్య/భర్తకు. కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు జరిపి వాళ్లకు ఆ వ్యాధి లేని సందర్భాల్లో వ్యాక్సిన్‌ తీసుకోవడం సత్ఫలితాలనిస్తుంది.
‘హెపటైటిస్‌ సి’ : ఇటీవల ఈ వైరస్‌ దీర్ఘకాలిక లివర్‌ సమస్యలకు దారితీసేందుకు కారణమవుతోంది. దురదృష్టవశాత్తు హెపటైటిస్‌ -సి వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్‌ రూపొందలేదు. హెపటైటిస్‌-బీ లా కాకుండా ఇది చాలా నెమ్మదిగా లివర్‌ క్యాన్సర్‌గా మారుతుంది. కేవలం లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌టి) మాత్రమే హెపటైటిస్‌-సీ ని నిర్థారణ చేయలేకపోవచ్చు. అందుకే హెపటైటిస్‌-సి యాంటీ బాడీస్‌ పరీక్షలో పాజిటివ్‌ ఉన్నవాళ్లు అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌, హెచ్‌సీవీ-ఆర్‌ఎన్‌ఏ క్వాంటిటేటివ్‌ ఎస్సే, జీనోటైపింగ్‌ పరీక్షలు చేయించాలి. దీనికి చికిత్స విధానాలు హెపటైటిస్‌-బీతో పోల్చినప్పుడు చాలా పరిమితంగా ఉన్నాయి. అంతగా ప్రభావపూర్వకమైనవి కావు. వైరల్‌ జీనోటైప్‌ను కాబట్టి దీనికి రిబావెరిన్‌తో పాటు పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ వంటి మందులను 24 నుంచి 48 వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఇది కూడా హెపటైటిస్‌-బీ లాగానే వ్యాప్తిచెందుతుంది కాబట్టి ఇంజెక్షన్లు వాడటంలో సురక్షిత మార్గాలను అనుసరించడంతోబాటు, సెక్స్‌ సమయంలో కండోమ్‌ వాడటం వంటి సురక్షిత చర్యలు అవసరం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s