About Heart

గుండె గురించి తెలుసుకోండి గుండెను కాపాడుకోండి. శరీరంలోని గుండె కాకుండా మిగతా అవయవాలు పనిచేయక పోయినా మనిషి కొంతకాలం జీవించవచ్చు. కాని గుండె పనిచేయకపోతే ……? అందుకే గుండె గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొనాలి.
మానవశరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినపుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ అవయవాలు సక్రమమంగా పనిచేయానికి అవసరమైన శక్తిని అందించేదే గుండె. భారతదేశంలో గుండెజబ్బుతో బాధపడేవారి సంఖ్య కోట్లలలో ఉంటుది. దీనికి కారణాలు పుట్టుకతో వచ్చే సమస్యలు. రెండవది మన స్వయంకృతాపరాధం. పోషకపదార్థాల లోపం, జీవనవిధానంలో వచ్చే మార్పులు, పొగత్రాగటం, మద్యపానం, వాయుకాలుష్యం మొదలగునవి.
గుండె పరిమాణం మనిషి పిడికిటంత. బరువు షుమారు 12 ఔన్సులు. శరీర భాగాలలోని మలినపడిన రక్తాన్ని రక్తనాళాలు గుండెకు చేరుస్తాయి. ఆ రక్తాన్ని శుద్ధిచేయానికి ఊపిరితిత్తులకు పంపింగ్‌ చేస్తుంది గుండె. ఊపిరితిత్తులలో శుబ్రపడిన రక్తం తిరిగి గుండెకు చేరి అక్కడనుండి శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది గుండె. రక్తం మలినపడటం అంటే కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించడం. ఊపిరితిత్తులలోని మనం పీల్చిన ఆక్సిజన్‌ ఈ రక్తాన్ని గ్రహించి, కార్బన్‌డైఆక్సైడును బయటకు పంపుతుంది.
ఆక్సిజన్‌తో కూడిన రక్తం గులాబీరంగులో వుంటుంది. మానవశరీరంలోని రక్తం రక్తనాళాలగుండా మాత్రమే ప్రవహిస్తుంది. శరీరంలోని రక్తనాళాలను కొలిస్తే ఒక లక్షా అరవైవేల కిలో మీటర్లుగా వుంటుంది. ఆరోగ్యకరమైన మనిషి గుండె ప్రతిరోజూ 7000 లీటర్ల రక్త శరీరభాగాలకు అందించడాని నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. గుండె అధికంగా కొట్టుకున్నా ఇబ్బందే. తక్కువగా కొట్టుకున్నా ఇబ్బందే.
గుండెకు కీడుచేసేవి : వైద్యశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం గుండెకు 80 సంవత్సరాలపాటు ఏ ఇబ్బంది లేకుండా పనిచేసే సామర్ధ్యం వుంది. ఈలోపు గుండె జబ్బులు వస్తే అది మన స్వయంకృతాపరాధం మాత్రమే. ప్రొగ త్రాగడం, పొగాకు ఉత్పత్తులను వాడటం పొగతాగిన ప్రతిసారి గుండె కొట్టుకునే విధానం మారి రక్తపోటు సమస్య మొదలవుతుంది. ఎక్కువ పొగతాగేవారిలో రక్తనాళాలు మూసుకుపోయి, రక్తం గడ్డకట్టి గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా కాదు. మరో శత్రువు మత్తుపానీయాలు. అతిగా తాగడంవలన గుండె కండరాలు బలహీనపడతాయి. గుండె సక్రమంగా కొట్టుకోదు. కార్డియో మయోపతి అనే వ్యాధి వస్తుంది. మరొక ప్రధాన శత్రువు కాలుష్యం. రవాణా వాహనాలు – డీజిల్‌ ఆయిల్‌ వాడే వాహనాలనుండి వెలువడే పొగలోని సల్ఫర్‌డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మొనాక్సైడ్‌ ప్రమాదకారకాలు.
మానసికవత్తిడి : నిరంతరం మానసిక వత్తిడితో బాధపడేవారికి రక్తపోటు పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.ప్రతి చిన్న అంశానికి కోపం, కసి ద్వేషం వంటి గుణాలు కలవారి రక్తనాళాల గోడలు మందంగా తయారవుతాయి. కనుక ఈ లక్షణాలు మంచివికావు.
ఆహారం : అతిగా మాంసాహారం తినటం, నూనెలో బాగా వేయించిన వేపుళ్ళు తినటంవల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. నూనెలు, జంతుకొవ్వుల్లో కొలెస్ట్రాల్‌ అధికంగా వుంటుంది.వీటి వల్ల చెడ్డ కొలస్ట్రాల్‌ అధికమగుట వలన రక్తసరఫరాకు ఆటంకం కలుగుతుంది. వీటితో తయారైన పదార్థాలు మితంగా తీసుకోవాలి లేదా మానివేయాలి.
ఉప్పు వాడకం తగ్గించాలి. జంక్‌ఫుడ్‌లలో ఉప్పు, రసాయనాలు అధికంగా కలుపుతారు. వీటి వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. కనుక వీటిని తినేముందు ఆలోచించాలి. మధుమేహ రోగులకు, బి.పి. ఉన్నవారికి గుండెజబ్బుల ప్రమాదం అధికం కాబట్టి వీటికి పూర్తిగా దూరంగా వుండటమే మంచిది.
గుండె ఆరోగ్యానికి :ఆవనూనెతో చేసిన వంటకాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా గల కూరగాయలు, బీర, సొర, పొట్ల కాయల వంటివి తప్పక తినాలి. వ్యాయామం, నడక, ఏరోబిక్స్‌ వీటి వల్ల చాలావరకు గుండెను కాపాడుకోవచ్చును. ప్రాణాయామం వలన మూత్రపిండాల సమర్ధత పెరుగుతుంది. రకాన్ని శుద్ధిచేసే మాత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తే ఆరోగ్యం అంతా బాగా పనిచేస్తుంది.
నీరు, నిద్ర : ఈ రెండూ గుండెకు అవసరం. సరిగా నిద్రపోకపోతే గుండె దెబ్బతింటుంది. అతినిద్ర మంచిది కాదు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగటం మంచి అలవాటు. గుండెకు అద్భుతమైన మిత్రులు వెల్లుల్లి, ఉసిరి . వెల్లులోని రసాయనాలు రక్తనాళాలో గారపట్టనివ్వదు. గారను కరిగిస్తూ గుండెజబ్బులను కొంతమేర నిరోధిస్తుంది. ఉసిరిలోని సి విటమిన్‌ రోగనిరోధక శక్తి పెంచుతుంది. రోగనిరోధక శక్తి ఎంత ఉంటే గుండె అంతే బాగుంటుంది. మెంతులు, మొంతికూర, మొంతిపొడి కొలస్ట్రాల్‌ మీద ప్రభావం చూపుతాయి. వీటిని విరివిగా వాడటం మంచిది. (మితంగా మాత్రమే తరుచుగా వాడాలి)
శనగలు : ఇవి చెడుకొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.రక్తంలోని ట్రైగ్లిజరైడ్‌ల స్ధాయిని తగ్గిస్తాయి. సోయా రక్తంలోని చెడుకొలస్ట్రాల్‌ లిపిడ్స్‌ను తగ్గిస్తాయి. సోయా వాడకం గుండెకు మంచిది.
గుండెజబ్బుకు కారకాలైన కొలస్ట్రాల్‌, బి.పి. మొదలగునవి రక్తంలో ఉండవలసిన స్ధాయి :
చెడ్డ కొలస్ట్రాల్‌ 100 ఎం.జి. కన్నా తక్కువ (మధుమేహంలో 80 ఎం.జి. కన్నా తక్కువ వుండాలి)
ట్రైగ్లిజరైడ్లు 130 ఎం.జి కన్నా తక్కువ
మంచి కొలస్ట్రాల్‌ 50 ఎం.జి./ డి.ఎల్‌ కన్నా తక్కువ
లైపోప్రోటీన్‌ ఎ 20 ఎం.జి./ డి.ఎల్‌ కన్నా తక్కువ
నడుం చుట్టుకొలత (మగవారికి) 35 అంగుళాల కన్నా తక్కువ
నడుం చుట్టుకొలత (ఆడవారికి) 31 అంగుళాల కన్నా తక్కువ
రక్తపోటు 120 / 80 ఎం ఎం / హెచ్‌ జి కన్నా తక్కువ
రక్తంలో గ్లూకోజు (పరగడుపున) 100 ఎం.జి / డి.ఎల్‌ కన్నా తక్కువ

%d bloggers like this:
Available for Amazon Prime