మెకట్రానిక్స్

మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఈ రెండింటి మేళవింపే మెకట్రానిక్స్. ఇందులో కంప్యూటర్ ఇంజినీరింగ్, టెలీకమ్యూనికేషన్స్, సిస్టమ్ ఇంజినీరింగ్, కంట్రోల్ ఇంజినీరింగ్ కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్లు, మోటార్ కార్లు, ఇండస్ట్రియల్ రోబోట్లు రూపొందించడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాల్లో ప్రావీణ్యం అవసరం. దీంతో తయారీరంగం చాలా వరకూ మెకట్రానిక్స్పై ఆధారపడుతోంది. అలాగే ఆటోమేషన్కూ ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా మెకట్రానిక్స్ చదివినవారికి అవకాశాలు విస్తరించాయి. ఫాక్స్కాన్, మారుతి లాంటి తయారీ సంస్థల్లో వీరికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మెకట్రానిక్స్లో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ సైతం ఉంటాయి. ఆటోమోటివ్లు, డిఫెన్స్, స్మార్ట్సిటీస్, ఈ-కామర్స్ల్లో రోబోటిక్స్ వినియోగం పెరిగింది. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రసిద్ధ సంస్థలు: నిట్ – వరంగల్, రవుర్కెలా; ఐఐటీ- పట్నా, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వంటివి ఈ కోర్సు అందిస్తున్నాయి.


నియామకాలు: హనీవెల్ ఆటోమేషన్, శాంసంగ్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ ఉత్పత్తులు తయారుచేసే సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి.

%d bloggers like this: