బయో మెడికల్ ఇంజినీరింగ్

సీటీ స్కాన్, ఎంఆర్ఐ తదితరాలతోపాటు రోగ నిర్ధారణ, వైద్యంలో ఉపయోగించే పలు పరికరాలను బయో మెడికల్ ఇంజినీర్లు తయారు చేస్తారు. వీటిని రూపొందిచడానికి ఒక్క ఇంజినీరింగ్ ప్రావీణ్యం సరిపోదు. మెడిసిన్, బయాలజీ కూడా తెలియాలి. అందుకే బయాలజీ, ఇంజినీరింగ్లను కలిపి బయో మెడికల్ ఇంజినీరింగ్ సృష్టించారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెటీరియల్ సైన్స్, బయాలజీ, మెడిసిన్ విభాగాలు ఉంటాయి.


ఇంజినీరింగ్ సూత్రాలను బయాలజీ, మెడిసిన్కు అన్వయించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పరికరాలను సృష్టించడమే బయోమెడికల్ ఇంజినీరింగ్. తక్కువ ఖరీదుతో, నాణ్యమైన, మరింత మెరుగైన పరికరాలను తయారుచేయడం బయోమెడికల్ ఇంజినీర్ల విధి. భారత ఆరోగ్య పరిశ్రమ 2020 నాటికి 280 బిలియన్ డాలర్లు చేరుతుందని అంచనా. ఇందులో వైద్యులు, ఆసుపత్రులతోపాటు బయో మెడికల్ ఇంజినీర్ల పాత్ర కూడా కీలకమే.


ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ – బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, వారణాసి (బీహెచ్యూ); ఎంఎన్ఎన్ఐటీ – అలహాబాద్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బీవీఆర్ఐటీ-హైదరాబాద్.


నియామకాలు: సీమెన్స్ హెల్దీనీర్స్, ఎల్అండ్టీ, ఫిలిప్ హెల్త్ కేర్, వైద్య పరికరాల తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

%d bloggers like this: