బయో టెక్నాలజి

బయో ఇంజనీరింగ్‌ కు కొనసాగింపుగా ఈ సబ్జెక్టును పేర్కొనవచ్చు. థియరీ, ల్యాబ్‌లో ప్రయోగాుగా బయోటెక్నాలజీ ఉంటుంది. సరిగ్గా అదే సమాచారం ఆధారంగా ఉత్పత్తులను రూపొందించడాన్ని బయో ఇంజనీరింగ్‌గా పేర్కొనవచ్చు. జన్యుపరంగా మానవ అవయవాన్ని రూపొందించానుకుంటే ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందన్నది ఇక్కడ తేలుస్తారు.


బయోకాన్‌, రాన్‌ బాక్సీ, శాంతా బయోటెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వంటివారు ఈ నిపుణులకోసం ఎదురు చూస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా మాలిక్యుర్‌ లైఫ్‌ సైన్సెస్‌, బయో ప్రాసెస్‌ టెక్నాజీ, సెల్‌ బయోలజీ, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ మెటబాలిక్‌ ఇంజనీరింగ్‌, టిష్యూ ఇంజనీరింగ్‌ తదితరాలను అధ్యయనం చేస్తారు. డి ఆర్‌ డి ఎ వంటి సంస్థలు కూడా బయో ఇంజనీర్లను తీసుకుంటాయి. బయో ప్రాసెస్‌, మాలిక్యుర్‌ బయోటెక్నాజీ ఆధారంగా ఇంజనీరింగ్‌, నేచురల్‌ సైన్స్ సమ్మిళితం బయోటెక్నాలజీ అందువల్ల ఇందులో అంశాలు మల్టీ డిసిప్లినరీ లైఫ్‌ సైన్సెస్‌, ఇంజనీరింగ్ అంశాలు కలగలిసి ఉంటాయి.


జెనెటిక్స్‌, మైక్రోబియల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ అగ్రికల్చరల్‌ బయో టెక్నాలజీ, ప్లాంట్‌ అగ్రిక్చరల్‌ బయోటెక్నాలజీ, సెల్‌ బయోలజీ తదితరాలకు సంబంధించి మంరింత లోతుగా అధ్యయనం, శిక్షణ ఉంటాయి. 1945 తరువాత రూపుదిద్దుకున్నది బయో ఇంజనీరింగ్‌. బయాలజీకి ఇంజనీరింగ్‌ సూత్రాలు అన్వయింపు ఇందులో ప్రధానం.


కృత్రిమ గుండె, ఇతర అవయవాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇక్కడ కూడా స్పెషలైజేషన్‌కు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌ సూత్రాలను అన్వయింపజేస్తే అది బయో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అవుతుంది. వైద్యపరమైన సమస్యకు మెకానిక్స్‌ జోడింపే బయో మోకానిక్స్‌, బయో మెటీరియల్స్‌, రీహాబిలిటేషన్‌ ఇంజనీరింగ్‌ వీటికి కొనసాగింపే.

%d bloggers like this: