ఫుడ్ టెక్నాలజీ ఇంజినీరింగ్

సైన్స్, ఇంజినీరింగ్ రెండింటి కలయికే ఫుడ్ టెక్నాలజీ. ఆహారాన్ని శుద్ధిచేసి, భద్రంగా ప్యాకెట్లో ఉంచడానికి ఇటు సైన్స్ అటు ఇంజినీరింగ్ రెండు అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలి. ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్, ప్రిపరేషన్, ప్యాకేజింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ టెక్నాలజీలో కీలక దశలు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. పట్టణాలతోసహా గ్రామాల్లోనూ ప్యాకెట్ పుడ్ తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.


జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం నెలకు సగటున ఒక వ్యక్తి గ్రామాల్లో రూ.113, పట్టణాల్లో రూ.236 బెవరేజెస్, రిఫ్రెష్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం వెచ్చిస్తున్నారు. శీతల పానీయాలు, చాక్లెట్లు, పాల ప్యాకెట్లు, పాల ఉత్పత్తులు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు ఫుడ్ టెక్నాలజీ కిందకే వస్తాయి. ఆహార పదార్థాలను శుభ్రపరచి, రుచిగా తయారుచేసి సాంకేతికత జోడించి వాటిని ప్యాక్ల్లో భద్రపర్చడమే ఫుడ్ టెక్నాలజీ. భారత ఆహార మార్కెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ వాటా 30 శాతానికి చేరుకున్నట్లు ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) చెబుతోంది. దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమగా ఫుడ్ ప్రాసెసింగ్ ఆవిర్భవిస్తోంది. ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులు, వృద్ధి ఈ అన్ని విభాగాల్లో కలిపి చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ దేశంలో అయిదో స్థానంలో ఉంది. దీంతో ఈ పరిశ్రమకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్), నాణ్యత మదింపు (క్వాలిటీ కంట్రోల్), న్యూట్రిషన్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ కోర్సులతోనే ఈ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.


ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ- ఖరగ్పూర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ- ముంబయి, కాలేజ్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ- పర్భనీ, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – మైసూర్, ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ- హైదరాబాద్ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
నియామకాలు: ఐటీసీ, పార్లే, నెస్లే, అమూల్, బ్రిటానియా, ఇతర అగ్రోటెక్, ఫుడ్ కంపెనీలు నియమకాలు జరుపుతాయి.

%d bloggers like this:
Available for Amazon Prime