న్యూజిలండ్ వీసా పొందటం ఎలా

నిధుల బదిలీ పథకం (ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) వంటి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వచ్చాక న్యూజిలాండ్‌ వీసా ప్రక్రియ ఎంతో సరళంగా మారింది. కానీ విద్యార్థులు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా హాజరవ్యాల్సి వుంటుంది. పూర్తి దరఖాస్తులను సమర్పించాక వీసా ప్రక్రియ 3-8 వారాలపాటు నడుస్తుంది. సమాచారం, పత్రాల కోసం చూడాల్సిన లింకు:
http://www/immegration.gov.nz/migrant/general/formsandfees/formsandguides/study/htm
వీసా దరఖాస్తు ఫీజు : రూ.9000 (2017)

నిధులు ఇలా చూపవచ్చు : మొత్తం ట్యూషన్‌ ఫీజు + జీవనవ్యయం (10,000 డాలర్లు సంవత్సరానికి)
వీసాకు అవసరమైన డాక్యుమెంట్లు : దరఖాస్తు ఫారం (INZ 1012) అనుబంధ దరఖాస్తు ఫారం. హామీదరఖాస్తు ఫారం. హామీదారు సంతకం చేసిన ఫైనాన్సియల్‌ అండర్‌ టేకింగు (1014). పాస్‌పోర్ట్‌ కాపీ అన్ని పేజీలు+ఒరినల్‌ పాస్‌పోర్టు.
దరఖాస్తు ఫీజు రూ.9000 (న్యూ ఢిల్లీలో చెల్లెలా ì(Immigration New Zealand పేరిట డ్రాఫ్ట్‌). విద్యార్థి నేపధ్యం వివరాలు తెలిపే స్టేట్ మెంట్ ఆఫ్‌ పర్పస్‌ (విద్యార్థి ఈ కోర్సు ఎందుకు చదవాలనుకుంటున్నాడు. అతడి కెరియర్‌ లక్ష్యాలు, కోర్సు ఫీజు ఎలా చెల్లించగలుగుతాడు).
విద్యా సంస్థనుంచి ఆఫర్‌ లెటర్‌. ఫైనాన్సియల్‌ డాక్యుమెంట్లు : ఆరునెలల బ్యాంకు స్టేట్ మెంట్లు 6 మాసాల నాటి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. విద్యారుణాలు పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌. తపాలా కార్యాలయ అకౌంట్స్. నేషనల్‌ సేవింగ్సు సర్టిఫికెట్స్.
విద్యాపరపైన సర్టిఫికెట్లు :IELTS స్కోర్‌ రిపోర్టు. వార్షిక ఆదాయ రుజువు (ఐటి రిటర్న్స్‌) ఎంఆర్‌ఓ ద్రువపత్రం. వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్ (అవసరమైతే). పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్, మెడికల్స్‌ ఎక్స్‌రే (ఫామ్‌). ఐదు పాస్‌ పోర్టు ఫోటోలు. స్పాన్సర్‌ది, విద్యార్ధిదీ అఫిడవిట్లు. మరో విధానంలో కూడా ఫైలింగు చేయవచ్చు. ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌ కింద వీసా కోసం ఎలాంటి నిధులూ చూపించనక్కరలేదు. విద్యార్థి తన లేదా తల్లిదండ్రుల అకౌంట్ లో నేరుగా డిపాజిట్ చేయవచ్చు (తాజా డిపాజిట్లను అనుమతిస్తారు. ఒరిజనల్‌ డాక్యుమెంట్లు లేకపోతే వాటిని తప్పనిసరిగా నోటరైజ్‌ చేయాల్సి ఉంటుంది.

%d bloggers like this: