ఇన్‌స్ట్రుమెంటేషన్‌

వివిధ కొలతకు ఉపయోగించే పరికరాల నిర్వహణలో స్పెషలైజేషన్‌గా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ను పేర్కొనవచ్చు. ట్రబుల్‌ షూటింగ్‌, మరమత్తు పనులను ఈ కోర్సు చేసిన ఇంజనీర్లు చేపడతారు. సంపూర్ణ రక్షణ, స్థిరత్వం, విశ్వసనీయత, గరిష్ట ప్రయోజనాల సాధన యావత్తు ప్రక్రియలో అంతిమ లక్ష్యంగా చెప్పవచ్చు.
మాన్యుఫాక్చరింగ్‌ లేదా కెమికల్‌ ప్లాంట్లలో ఈ ఇంజనీర్ల సేవలు అవసరమవుతాయి. పవర్‌ ఇంజనీర్లు, ఎలక్ట్రీషియన్‌, పైప్‌ ఫిట్టర్లు తదితరులు ఈ ఫీల్డ్‌లో ఉంటారు. ఇంజనీరింగ్‌ కంపెనీల లేదంటే విభిన్న వర్కింగ్‌ పరిస్థితులో వీరి సేవలు అవసరమవుతూ ఉంటాయి.
ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజిలు ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి. మొత్తం ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సిస్టమ్‌ డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, మెయింటెనెన్స్‌ కార్యకలాపాలో ఈ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. ఒక ఉత్పత్తిని బైటకు తీసుకురావడంలో మంచి క్వాలిటీకి తోడు సామర్థ్యం విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. అందువల్లే ఇండస్ట్రియల్‌ మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్లో వీరి సేవలను కీలకంగా భావిస్తారు.
పబ్లిక్‌, ప్రైవేట్‌ కంపెనీలోని ఆర్‌ అండ్‌ డి యూనిట్లలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్లకు అవకాశాలు బాగా ఉన్నాయి. హెవీ ఇండస్ట్రీస్‌ అంటే పవర్‌ స్టేషన్స్‌, స్టీల్‌ ప్లాంట్లు, రిఫైనరీలు, సిమెంట్‌, ఎరువు కర్మాగారాల్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంట్లు రూపొందించే కంపెనీలు తదితరాల్లోనూ వీరికి అవకాశాలు ఉంటాయి.

%d bloggers like this: