అమెరికాలో విద్యాభ్యాసం

ఇంజనీరింగ్‌…..పి.హెచ్‌.డి………ఐ టి అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌….ఎం.బి.ఎ………సోర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌ మెంట్ ………..ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌…………బయో టెక్నాలజీ………ఫిజియో థెరపీ………….హోటల్‌ మేనేజ్‌మెంజ్‌ అండ్‌………..హాస్పాలిటీ పరిశోధనలు, ఉత్తమశ్రేణి విద్యానైపుణ్యానికి అమెరికా వీలు కల్పిస్తుంది.
అమెరికా వెళ్ళాలనుకునే వారికి ఆ దేశ సమచారం లభించే లైబ్రరీ ఉస్మానియా యూనివర్శిటి సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌. జి.ఆర్‌.ఇ., టోఫెల్‌ పరీక్షల వివరాలు తెలుసుకోవచ్చు. ఓ.యూలో వున్న ఈ కేంద్రం నుండి ఆ దేశ సమాచారం, కోర్సుల వివరాలు, ఫీజులు, వసతుల సమాచారం గురించి ఎన్నో పుస్తకాలు అందుబాటులో వున్నాయి.రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే కళాశాలల సమాచారం తెప్పించి అందజేస్తారు.
వివరాలకు ఫోన్‌ : 040-27098609.
పరిశోధనలు, ఉత్తమశ్రేణి విద్యా నైపుణ్యానికి యు.ఎస్‌.ఎ వీలు కల్పిస్తుంది. ప్రపంచంలో పేరున్న విశ్వవిద్యాలయాలు ఇక్కడ చాలా వున్నాయి. చదువుకుంటునే చట్టబద్ధంగా పార్ట్‌టైమ్‌ పనిచేసే అవకాశం కల్పిస్తారు. వర్శిటీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ అనుమతితో పని చేసుకోవచ్చును.స్కాలర్‌షిప్‌ వస్తుంది. రీసెర్చ్‌ సహాయం క్రింద కొంత వస్తుంది, ఎఫ్‌-1 వీసా (స్టూడెంట్ వీసా) ఉన్నవారందరికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రధానంగా రెండేళ్ళ మాస్టర్‌ కోర్సుల కోసం అమెరికా వెళ్తుంటారు. ఎం.ఎస్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌, మెకానికల్‌, మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసించేందుకు చాలామంది అమెరికా వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండేళ్ళపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు హెచ్‌-1 వీసా క్రింద వర్క్‌ పర్మిట్ ఇస్తారు. ఈ కాలంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగం వెతుక్కోవటం చేసుకోవచ్చు.
ఈ దేశంలో ఇంజనీరింగ్‌, సైన్సులలో మాస్టర్స్‌ కోర్సులన్నింకీ GRE, Toffel, IELTS స్కోర్లు అవసరం. ఈ పరీక్షల స్కోర్లు లేకుండా ప్రవేశాలను అందించే విద్యాసంస్థలు లేకపోలేదు. కానీ ఈ పరీక్షలకు హాజరై మంచి స్కోరు సంపాదించటం మంచిది. మంచి GRE స్త్రష్ట్రజూ స్కోరు 1000-1200 మధ్య. మంచి Toffel స్కోరు80-95 మద్య. మేనేజ్‌మెంట్ కోర్సులలో చేరే విద్యార్థులకు GRE బదులు GMAT స్కోరు అవసరమవుతుంది. (మంచి స్కోరు (500-650 మద్య) చాలా విద్యాలయాలు పని అనుభవం కూడా అడుగుతున్నాయి. TOFFEL తప్పనిసరిగా ఉండాల్సిందే.

%d bloggers like this:
Available for Amazon Prime