పాలిటెక్నిక్ కోర్సులు

పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ అస్టిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ (సాండ్‌విచ్), ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(షుగర్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(పెట్రోకెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్(ప్లాస్టిక్స్ అండ్ పాలి మర్స్).

ప్రయోజనాలు ఎన్నో

  • తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్‌కు మార్గం సుగమం.
  • పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తయ్యాక ఈసెట్ రాసి.. నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరొచ్చు.
  • పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు కంపెనీల్లో చేరాక త్వరగా షైన్ అవుతారు.
  • పాలిటెక్నిక్‌లో చదివే సబ్జెక్టులే ఇంజనీరింగ్‌లో కూడా ఉంటాయి. కాబట్టి పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే చాలా సులువుగా సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది.
  • ఏఎంఐఈ, గ్రేడ్ ఐఈటీఈ, ఏఐఐసీఈఆర్‌ఏఎం, ఏఐఐఎం, ఐఐసీఈ వంటి బీఈ/బీటెక్‌తో సమానమైన కోర్సుల్లోకి రిజిస్టర్ చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే ఇంజనీరింగ్ పూర్తిచేసుకోవచ్చు.
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే కూడా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధ్యానం ఇస్తున్నాయి. ఎందుకంటే.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తరచూ కంపెనీలు మారుతుంటారు. అదే పాలిటెక్నిక్ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటే నిలకడగా పనిచేస్తారు.

గ్రామీణ విద్యార్థులపాలిట వరం:
పాలిటెక్నిక్ కోర్సులు.. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు మంచి అవకాశం. తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసేందుకు వీలుకల్పించే అద్భుత అవకాశం ఇది. రాష్టంలోని పాలిటెక్నిక్‌లను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రయివేట్ పాలిటెక్నిక్ కాలేజీలు, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు అని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడే కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఏ కోర్సుకు క్రేజ్:ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమాకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. ఈ బ్రాంచ్‌లో డిప్లొమా చేసి, అవసరమైన కంప్యూటర్ కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సులు ఎవర్ గ్రీన్‌గా పేరు సాధించాయి. వీటిని పూర్తి చేస్తే జాబ్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది.

స్వయం ఉపాధి:మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ వంటి విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా స్థిరపడొచ్చు. కంప్యూటర్స్ చేసిన వారు ఇంటర్నెట్ కేఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా హార్డ్‌వేర్ స్పేర్స్ సంబంధిత వ్యాపారం చేసుకోవచ్చు. మెకానికల్ డిప్లొమా పూర్తిచేసినవారు టూవీలర్, ఫోర్ వీలర్ మెకానిక్ రంగంలో కూడా దిగవచ్చు. ప్యాకేజింగ్, ప్రింటింగ్ యూనిట్లు స్థాపించుకోవచ్చు. ఇందుకు ఆర్థిక సంస్థల సహకారం కూడా పొందవచ్చు.

కోర్సులు.. కెరీర్ స్కోప్

డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, పబ్లిక్ హెల్త్ డిపా ర్ట్‌మెంట్,రహదారులు, భవనాలు,రైల్వేస్, సర్వే, డ్రాయిం గ్, వాటర్ సప్లైయ్, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ విభా గాలుకాంట్రాక్టర్‌గా, డ్రాఫ్ట్స్‌మెన్‌గా.. స్వయం ఉపాధి.
కంపెనీలు: డీఎల్‌ఎఫ్, యూనిటెక్, జైపీ అసోసియేట్స్, మైటాస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, ల్యాంక్ ఇన్ఫ్రా.
కెరీర్: సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల కెరీర్ సైట్ ఇంజనీర్‌గా మొదలై.. ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లుగా పనిచేసి కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ ఎదగొచ్చు.

డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఏయిర్, డీడీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రా నిక్స్ ఇండస్ట్రీస్,రేడియో, టీవీ సర్వీసింగ్‌లో స్వయం ఉపాది,సేల్స్, సర్వీస్‌లో సెల్ఫ్‌ఎంప్లాయిమెంట్.
కంపెనీలు: భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్, టాటా

కమ్యూనికేషన్స్, బీఎస్‌ఎన్‌ఎల్.కెరీర్:
 ట్రైనీ ఇంజనీర్‌గా మొదలై.. స్కిల్స్‌తో సర్వీస్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రొడక్ట్ డవలప్‌మెంట్ ఇంజనీర్, డిపార్ట్‌మెంట్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.

డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్‌లో స్వయం ఉపాధి.
కంపెనీలు: ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి టాప్ కంపెనీలతోపాటు ఇతర సాప్ట్‌వేర్ డవలప్‌మెంట్, ట్రైనింగ్ సంస్థల్లో జాబ్స్ లభిస్తాయి.
కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్‌తో మొదలై సాఫ్ట్‌వేర్ ప్రోగ్రా మర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు.

డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, డీసీఎల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, డిపార్ట్‌మెంట్స్, ఇండస్ట్రీస్‌లో మెయిన్‌టెనెన్స్ స్టాఫ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌లు, వైరింగ్ కన్సల్టెన్సీ వైండర్‌లుగా స్వయం ఉపాధి.
కంపెనీలు: సీమెన్స్, సుజ్లాన్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, టాటా పవర్, ఎన్‌హెచ్‌పీసీ, నెవైలీ లిగ్నైట్.
కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై.. అనుభవంతో సూపర్ వైజర్, ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.

డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ప్రభుత్వ రంగ సంస్థలుప్రభుత్వ, ప్రయి వేట్ విభాగాలు మెషినరీ, ట్రాన్స్‌పోర్టు, ప్రొడక్షన్, సేల్స్‌కు సంబంధించిన వర్క్‌షాపులు, గ్యారేజీలు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సేల్స్,మెకానికల్ ఇంజనీరింగ్ అనుబంధ విభాగాల్లో స్వయం ఉపాధి.
కంపెనీలు: ఓల్టాస్, ఏసీసీ లిమిటెడ్, బీఓఎస్ సీహెచ్, హిం దుస్థాన్ యూనిలెవెల్ లిమిటెడ్, మారుతి సుజుకి, ఇన్ఫోటెక్.
కెరీర్: పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందడంతో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ విభాగంలో డిప్లొమా అభ్యర్థి ట్రైనీగా చేరి… 7-8 ఏళ్లలో స్కిల్స్, ఉన్నత విద్యతో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.

డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఏపీఎస్‌ఆర్‌టీసీ,ఆటోమొబైల్ కంపెనీల షోరూంలకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు విభాగాలు, ఆటోమొబైల్స్ సర్వీసింగ్‌లో స్వయం ఉపాధి.
కంపెనీలు: సుజ్కీ, టయోటా, టాటా, ఫియాట్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, ఎల్‌ఎంఎల్, యమ హా వంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు..
కెరీర్: సర్వీస్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై స్కిల్స్, హార్డ్‌వర్క్, ఉన్నత విద్యతో సర్వీస్ ఇంజనీర్, డిప్యూటీ సర్వీస్ ఇంజనీర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.

డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: మైన్స్(ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్), ఎస్.సి.సి.ఎల్, ఎన్.ఎం.డి.సి
కంపెనీలు: సింగరేణి కాలరీస్, ఎన్‌ఎండీసీ, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.

డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాల వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: అన్ని సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్ యూనిట్లలో..
కంపెనీ: ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్‌గా చేరి స్కిల్స్‌తో ప్రోగ్రామర్, సీనియర్ ప్రోగ్రామర్ స్థాయికి ఎదగొచ్చు.

డిప్లొమా ఇన్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కాల వ్యవధి: మూడున్నరే ళ్లు
ఉద్యోగాలెక్కడ: టెక్స్‌టైల్ మిల్స్,క్లాత్ ఎక్స్‌పోర్టు ఇండస్ట్రీస్.
కంపెనీలు: విమల్, రేమండ్స్, అరవింద్ మిల్స్, బాంబే డయింగ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లక్ష్మీ మిల్స్.
కెరీర్: ప్రాసెస్ ఇంజనీర్, టెక్నికల్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, సూపర్ వైజర్, ప్రొడక్షన్ కంట్రోల్ విభాగాల్లో కెరీర్‌ను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగొచ్చు.

డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ కాల వ్యవధి: మూడున్నరేళ్లు
ఉద్యోగాలెక్కడ: రిఫ్రాక్టరీ, బ్రిక్ క్లిన్స్, సిమెంట్,గ్లాస్ అండ్ సిరామిక్ అండ్ శానిటరీవేర్ ఇండస్ట్రీస్.
కంపెనీలు: ఏసీసీ లిమిటెడ్, గుజరాత్ అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్.
కెరీర్: అభ్యర్థి సిరామిక్ టెక్నాలజీ, సిరామిక్ డిజైనర్స్ ఫీల్డ్‌లను ఎంచుకోవచ్చు. వీటిల్లో జూనియర్ ఇంజనీర్‌గా మొదలై.. ప్రాసెస్ ఇంజనీర్, సీనియర్ సిరామిక్ ప్రాసెస్ ఇంజనీర్ స్థాయికి ఎదగొచ్చు.

ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్
ఇది ఒకరకంగా సివిల్‌ ఇంజినీరింగ్‌కు కొనసాగింపే! ఈ కోర్సులో బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్‌, పర్యవేక్షణ మొదలైనవాటి గురించి అధ్యయనం చేస్తారు. స్థలాన్ని తక్కువ శ్రమ, మార్పులతో ఎక్కువ ప్రయోజనకరంగా మార్చడం తెలుసుకుంటారు. ప్రధానంగా బిల్డింగ్‌ నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మెటీరియల్‌ ప్రాథమిక సమాచారం, ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌కు అవసరమైన సామగ్రి గురించిన పరిజ్ఞానం లభిస్తుంది. ఈ కోర్సు ఎంచుకుని, పూర్తిచేసినవారికి.. డిజైన్‌- డ్రాయింగ్‌ డిపార్ట్‌మెంట్లలో, ఆర్కిటెక్చర్‌లో డ్రాఫ్ట్‌మెన్‌గా ఉపాధి అవకాశాలుంటాయి. మున్సిపల్‌ ఆఫీసుల్లో లైసెన్స్‌డ్‌ డిజైనర్‌గానూ చేరొచ్చు.

కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌
కామర్స్‌, కంప్యూటర్‌, బేసిక్‌ అకౌంటింగ్‌ల కలయికగా ఈ కోర్సు ఉంటుంది. ఆఫీస్‌ ప్రొసీజర్స్‌, అకౌంటింగ్‌ ప్రొసీజర్స్‌, ఆటోమేషన్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లను/ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించడం ద్వారా ఆఫీసు వర్క్‌లో ముఖ్య పాత్ర దీనికి ఉంటుంది. స్టెనోగ్రఫీ, డేటా ఎంట్రీ, అకౌంటింగ్‌, టైప్‌ రైటింగ్‌ కూడా కోర్సులో భాగంగా నేర్పుతారు. ఈ కోర్సును ఎంచుకుని, పూర్తిచేసినవారు.. ప్రభుత్వ శాఖల్లో స్టెనో, టైపిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌లుగా చేరొచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మంచి అవకాశాలుంటాయి. చిన్న బిజినెస్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌నూ ప్రారంభించుకోవచ్చు. పైచదువులను అభ్యసించాలనుకుంటే బీకాం ఐఐవైఆర్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్‌, ఎంబీఏ కోర్సుల్లో కొనసాగించొచ్చు. 

ప్యాకేజింగ్‌ టెక్నాలజీ
ప్యాకేజింగ్‌కు ఎన్నో సంవత్సరాలుగా గిరాకీ ఉంది. ఇది ఉత్పాదనకూ, సరఫరాకూ మధ్య వారధిగా ఉంటోంది. ప్యాకేజింగ్‌ లేకుండా వస్తువును చెడిపోకుండా రవాణా చేయడం కష్టమే. పైగా ఈరోజుల్లో మోడర్న్‌ ప్యాకేజింగ్‌ టెక్నిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరుగుతుండటంతో కొత్త రీతిలో టెక్నాలజీని ఉపయోగించి మరింత అందంగా, ఆకర్షణీయంగా కస్టమర్‌కు వస్తువును అందించడంపై సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. ఈ కోర్సులో స్టోరేజీ, వస్తువుపై అట్టపై ఉండాల్సిన ప్రింటింగ్‌లతోపాటు వస్తువును సరిగా, క్షేమంగా ప్యాక్‌ చేయడం వంటివాటిపై అధ్యయనం చేస్తారు. వీరికి ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్‌, ఫుడ్‌, బెవరేజ్‌, పేపర్‌, ప్లాస్టిక్‌ మొదలైనవాటికి సంబంధించిన అన్ని ప్యాకేజింగ్‌ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్‌- మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌, మెకట్రానిక్స్‌ కోర్సుల్లో ఉన్నత చదువులు చేయొచ్చు.

బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌
ఈ కోర్సులో ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలతో అనుసంధానంగా ఉండే ఎలక్ట్రానిక్‌ వస్తువుల గురించి తెలుసుకుంటారు. వైద్య పరిశ్రమలో వివిధ రోగ నిర్ధారణ, థెరపీలకు సంబంధించిన సంస్థల్లో వీరికి మంచి అవకాశాలుంటాయి. వైద్యరంగంలో ఎలక్ట్రానిక్స్‌కు కొనసాగింపు ఇది. మెడికల్‌, దాని సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి కోర్సు. అయితే వీరికి మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న టెక్నాలజీలపై ఆసక్తి ఉండాలి. వీరికి ఏడాది పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి మెడికల్‌ రిసెర్చ్‌ సంస్థలు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్‌-ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీమాటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ల్లో వీరు ఉన్నత చదువులు చదవొచ్చు. 

మైనింగ్‌ ఇంజినీరింగ్‌
ఇది సైన్స్‌, టెక్నాలజీల మేలు కలయిక. ఈ కోర్సును ఎంచుకున్నవారు కఠిన, ప్రతికూల వాతావరణంలో పనిచేయడానికి సుముఖంగా ఉండగలగాలి. కొంత పై స్థాయికి చేరుకున్నాక కంట్రోల్‌ రూంలో చేయొచ్చు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో భాగమైన సర్వేయింగ్‌, డ్రాయింగ్‌, జియాలజీ సైన్స్‌లో ఎర్త్‌ సైన్స్‌కు సంబంధించిన అంశాలను లోతుగా చదువుతారు. కెమిస్ట్రీ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఖనిజాలు దొరుకుతాయో కనిపెట్టడం, తరువాత ఆచరించాల్సిన ప్రాథమిక విధులు మొదలైనవి తెలుసుకుంటారు. ఖనిజాలు, వాటిని వెలికి తీసేప్పుడు, తీసిన తర్వాత, రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవి ఈ కోర్సులో భాగం. కోర్సు పూర్తిచేసిన వారికి ఓపెన్‌ కాస్ట్‌, అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లు, ఎస్‌సీసీఎల్‌, ఎన్‌ఎండీసీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కోర్సు అనంతరం కావాలనుకుంటే బీటెక్‌-మైనింగ్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ మెషినరీ ఇంజినీరింగ్‌ల్లో చదువు కొనసాగించొచ్చు.

గార్మెంట్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ
అప్పటికే అందుబాటులో ఉన్న వస్త్రాన్ని కాస్ట్యూమ్స్‌గా రూపొందించడం ఈకోర్సులో భాగంగా నేర్చుకుంటారు. డిజైనింగ్‌లో సైంటిఫిక్‌, ఇంజినీరింగ్‌ సూత్రాలను ఉపయోగించడం, ఫైబర్‌, టెక్స్‌టైల్‌, అపరెల్‌ ప్రాసెసెస్‌, ప్రొడక్ట్స్‌, మెషినరీపై పట్టు ఏర్పరచుకుంటారు. డిజైన్స్‌, ప్రింటింగ్‌లు, లేఅవుట్‌లు, కలర్‌ కాంబినేషన్ల పరిజ్ఞానం ఏర్పరచుకుంటారు. దీనిలో మూడు, మూడున్నర ఏళ్ల వ్యవధి గల కోర్సులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సు ఎంచుకున్నవారికి ఏడాదిపాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. వీరికి టెక్స్‌టైల్‌ మిల్లులు, వస్త్ర దిగుమతి పరిశ్రమలు, ఫిలిం, ఫ్యాషన్‌ టెక్నాలజీ, షోరూమ్‌ అవుట్‌లెట్లలో అవకాశాలుంటాయి. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే వీలూ ఉంటుంది. వీరికి ఎక్కువగా ప్రైవేటు రంగంలో అవకాశాలున్నాయి. కన్సల్టెంట్లుగా కూడా చేయవచ్చు. ఫ్యాషన్‌ సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌- టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోలియమ్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీల్లో ఉన్నత చదువులు అభ్యసించొచ్చు.

%d bloggers like this: