
Country : Argentina
Capital Buenos Aires ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 54 ………. Religion Catholicisim
అర్జెంటీనా
దక్షిణ అమెరికాలో దక్షిణ భాగాన ఉన్న స్వతంత్ర రాజ్యం అర్జెంటీనా. వెండి ఖనిజం ఎక్కవగా లభ్యత ఉండడంతో ఈ దేశానికి అర్జెంటీనా అనే పేరు వచ్చింది. ఈ దేశ విస్తీర్ణం 27,66,890 చ.కి.మీ.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్. ఈ దేశంలో అధికార భాష స్పానిష్. ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతస్తులు. యూరోపియన్ జాతుల వారు 85 శాతం మంది, మెస్టిజోలు 15 శాతం మంది ఉన్నారు.
ఈ దేశంలో వెండి పుష్కలంగా లభిస్తుంది. బంగారం, యూరేనియం, అంటిమనీ, జింకు అర్జెంటీనాలో లభించే ఇతర ఖనిజాలు ఈ దేశంలో ఉన్న పంపా మైదానాలు ఎక్కువ సారవంతం కావటం వలన రైతాంగం రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండిస్తారు.
నిమ్మ, నారింజ, మొక్కజొన్న, చెరకు, సోయా, పొద్దు తిరుగుడు, ద్రాక్ష, జొన్న, బంగాళాదుంపలు, రైధాన్యం, గోధుమలను పండిస్తారు. గొర్రెల పెంపకం ఉంది.
ఇక పరిశ్రమలలో జవుళీ పరిశ్రమ, మాంసం, తోలు, ఉన్ని, కలపసామాగ్రి, గాజు, ఇనుము, బొగ్గు, పెట్రోలు, వెండి, బంగారుం, యురేనియం, సీసం మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.

Country : Bolivia
Capital Sucre, La Paz ………. Language 37 languages ………. Currency Boliviano ………. Calling Code + 591 ………. Religion Roman Catholic
బొలీవియా
బొలీవియా దేశం దక్షిణ అమెరికా ఖండపు మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఎరుపు రంగు సైనికుల ధైర్యానికి సూచిక, ఆకుపచ్చరంగు సారవంతమైన లక్షణానికి, పసుపు ఖనిజ సంపదకు గుర్తు. బొలీవియా రాజధాని సుక్రె, జనాభా 1,14,10,651, విస్తీర్ణం 10,98,581 చదరపు కిలోమీటర్లు, భాషలు స్పానిష్, క్వెచువా, అయిమారా, కరెన్సీ బొలీవియానొ ఈ దేశంలో 30 అధికారిక భాషలున్నాయి. ఆగస్ట్ 6, 1825 సంవత్సరంలో స్పెయిన్ దేశం నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ప్రజలలో 95 శాతం మంది రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రెండు నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ఒకటి పోటోస్, రెండోది లా పాజ్‌నగరం. లాపాజ్‌కు దగ్గర్లో ఉండే ‘కమినో డె లాస్‌యుంగస్‌రోడ్డు’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఈ రహదారిపై ఏటా వందలాది ప్రమాదాలు జరుగుతాయి.
ప్రపంచంలోనే ఎత్తయిన ‘టిటికాకా’ సరస్సు ఈ దేశంలోనే ఉన్నది. సముద్ర మట్టానికి 3,810 మీటర్ల ఎత్తున్న ఈ సరస్సును దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అత్యంత లోతైన సరస్సుల్లో ఇదీ ఒకటి. .
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇనుప ఖనిజాల నిల్వలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యక్షుడు సైమన్‌బొలీవర్‌పేరు మీదుగా ఈ దేశానికి బొలీవియా అని పెట్టారు.ప్రపంచంలోనే అతి పెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. అత్యంత తడిగా ఉండే ప్రాంతమిది. ఎందుకంటే ఏడాదిలో భారీగా ఎనిమిది మీటర్లకుపైగా వర్షపాతం కురుస్తుంది. .
‘సలార్‌డి ఉయుని’ పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు క్షేత్రం ఉంది. ఉప్పు ఎడారిగా పిలిచే ఈ ప్రదేశం 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 64 మిలియన్‌టన్నుల ఉప్పు ఉంటుంది. పాలాసియోడి సాల్‌పేరిట ఇక్కడ అచ్చంగా ఉప్పుతో కట్టిన హోటల్‌ఉంటుంది. ఈ వింతప్రాంతాన్ని చూడ్డానికి ఏటా లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. .
సోయాబీన్స్, కాఫీ, కోకో, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు, వరి, బంగాళాదుంపలు పండిస్తారు.కలప లభ్యత కలదు.
సహజవాయివు, పెట్రోలియం, జింక్, టంగ్ స్టన్, వెండి, ఇనుము, సీసం, బంగారం, కలప, హైడ్రోపవర్ సహజ సంపదలు.

Country : Brazil
Capital Brasília ………. Language Portuguese ………. Currency Real ………. Calling Code + 55 ………. Religion Roman Catholism
బ్రెజిల్..
బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖంఢంలోని ఒక స్వతంత్ర గణ రాజ్యం. లాటిన్ అమెరికా దేశాలలో పెద్దది. పోర్చుగల్ వలసరాజ్యంగా ఉండి 1889 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 85,11,965 చ.కి.మీ. రాజధాని బ్రసీలియా నగరం. వీరి అధికార భాష పోర్చుగీసు. ప్రజలు మెస్టిజో, రెడ్ ఇండియన్ తెగలవారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. పూర్వ రియోడిజ నీరోలో ఉండే రాజధానిని కొత్తగా నిర్మించిన బ్రసీలియాకు 1960 సంవత్సరంలో మార్చారు.
ఈ దేశంలో అమెజాన్ నది పెద్దది. దీని పరివాహక ప్రాంతం ఎక్కువ. బ్రూనో నది, గ్రాండ్ నది, మదీరా నది, నీగ్రో నది, పారణ నది, ఫ్రాన్సిస్కో నది, టాపోజీస్ నది, టోకాన్టిన్స్ నది, ఉరుగ్వే నది, జింగూనది ఇతర జలవనరులు.
దేశంలో ఎక్కువభాగం కీకారణ్యాలతో కూడి ఉంది. సాగునేల ఎక్కువ. ఇంత ఎక్కువగా సహజసంపద ఉన్నప్పటికీ ప్రజలు ఐదింట ఒక భాగాన్నే ఉపయోగించుకుంటారు. అయినప్పటికీ బ్రెజిల్ ఆహారోత్పత్తిలో ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో ఉంది.
వరి, చెరకు, పొగాకు, సోయా చిక్కడు, రబ్బరు, అనాస పండ్లు, నారింజ పండ్లు, కోకో, కాఫీ, ప్రత్తి, మొక్కజొన్న, కర్రపెండలం, చిక్కుడు, అరటి పండ్లు వ్వవసాయ ఉత్పత్తులు. ఆహార ఉత్పత్తులలో బ్రెజిల్ స్వయం సమృద్దిన సాధించింది. పశువుల పెంపకం ప్రజలకు ప్రధాన జీవనోపాధి.
బంగారం, పారిశ్రామిక వజ్రాలు, ఇనుపరాయు, మాంగనీస్, కాగితం, రబ్బరు, ఉక్కు, జవుళీ, టైర్లు, రైలు ఇంజనులు, గృహ పరికరాలు, తోలు సామాగ్రి, రసాయనిక ద్రవ్వాలు, మోటారు కార్లు, సిమెంట్ మొదలగునవి పరిశ్రమలు.
జలవిద్యుత్ ఎక్కువ. సామీక్పాలో, బెలోహారి జంటో నగరాలు పారిశ్రామిక కేంద్రాలు.

Country : Chile
Capital Santiagoa ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 56 ………. Religion Roman Catholic
చిలీ
దక్షిణ అమెరికాలోని చిలి ఒక స్వతంత్ర దేశం. ఈ ఖండంలోని పశ్చిమ భాగాన పసిఫిక్ మహా సముద్రాన్ని ఆనుకుని ఉన్న పొడుగాటి చీలికగా ఆండీస్ పర్వతశ్రేణిని ఆనుకుని ఈ దేశం వ్యాపించి ఉన్నది. లాటిన్ అమెరికా దేశాలు అన్నిటిలోనూ అత్యంతం పారిశ్రామిక ప్రగతి సాధించిన దేశం చిలి. చిలీ దేశ విస్తీర్ణం 7,56,945 చ.కి.మీ. వీరి భాష స్పానిష్. చిలీ రాజధాని సాంటియాగో. వీరి కరెన్సీ చీలీ పెస్కోలు. 86 శాతం మంది జనాభా క్రైస్తవులే. వీరు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు
15వ శతాబ్దంలో స్పానిష్ వారు ఈ దేశానికి రాకపోకలు ప్రారంభించి మెల్లగా ఇక్కడ ఉన్న ఇన్కా జాతివారి మీద ఆధిపత్యం సాధించి దేశాన్ని ఆక్రమించుకున్నారు. సుమారుగా 300 సం.లు స్పానిష్ పాలనలో ఈ దేశం ఉంది. ఓహిగిన్స్ నాయకత్వంలో ఫ్రెంచ్ వారిని ఎదిరించి 1818 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు.
ఇనుప రాయి, రాగి, నైట్రేట్ ఖనిజ సంపదలు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నాయి. చిలీ రాగి ఖనిజం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. సోడియం నైట్రేట్ ను ప్రపంచానికంతటికి ఎగుమతి చేస్తుంది చిలీ.
బంగారం, సీసం, వెండి, జింకు, పెట్రోలియం లభిస్తాయి. చిలీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం.
పచ్చిక బయళ్లు పుష్కలంగా ఉండటం చేత పందుల పెంపకం, గొర్రెల పెంపకం ఎక్కువ. బార్లీ, వరి, రై ధాన్యం, పొద్దు తిరుగుడు, గోధుమ, పుగాకు, బఠానీలు, చిక్కుడు, బంగాళా దుంపలు, ఓట్ ధాన్యం, బాగా పండుతాయి.

Country : Colombia
Capital Bogotá ………. Language Spanish ………. Currency Pesco ………. Calling Code + 57 ………. Religion Roman Catholic
కొలంబియా
కొలంబియా… దక్షిణ అమెరికాలోని వాయువ్యభాగంలో ఉన్నదీ దేశం. తూర్పున వెనుజులా, బ్రెజిల్, దక్షిణాన ఈక్వెడార్, పెరూ, ఉత్తరాన కరీబియన్ సముద్రం, వాయువ్యంలో పనామా, పశ్చిమాన పసిఫిక్ మహా సముద్రం ఉంటాయి. మొత్తం ఐదు దేశాల సరిహద్దుల్ని పంచుకుంటుంది. కొలంబియా రాజధాని బొగట్టా. రాజధాని బొగొటా ప్రపంచంలోని ఎత్తయిన రాజధాని నగరాల్లో ఒకటి. సముద్రమట్టానికి 8,360 అడుగుల ఎత్తులో ఉంటుందిది. వీరి భాష స్పానిష్. ఇక్కడ చాలా స్థానిక భాషలున్నాయి. కానీ 99 శాతం మంది జనాభా స్పానిష్లోనే మాట్లాడతారు. ఈ దేశ వైశాల్యం 11,38,910 చ.కి.మీ. వీరి కరెన్సీ కొలంబియన్ పెస్కో. వీరు రోమన్ కేథలిక్ క్రైస్తవాన్ని పాటిస్తారు. స్పెయిన్ నుంచి ఈ దేశం 1813లో పూర్తి స్వాతంత్య్రంసంపాదించుకుంది.
మన దగ్గర ఎదిగే పిల్లలంతా పాలు తాగినట్టు ఇక్కడి చిన్నారులు కాఫీ తాగుతారు. రోజూ భోజనం తర్వాత పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన ‘కాఫీ కాన్ లేచే’ ఇస్తారు.
ఆభరణాల్లో వాడే పచ్చరాళ్ల గనులు ఇక్కడ చాలా ఎక్కువ. అందుకే ఈ దేశం పచ్చరాళ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. అంతేకాదు… ప్రపంచదేశాలు వాడే కాఫీ పొడిలో 12 శాతం ఇక్కడి నుంచే వస్తుంది.
ఇక్కడి వీధుల్లో కొంతమంది ‘బయ్యింగ్ మినిట్స్’ అంటూ బోర్డులు పెట్టుకుంటారు. కాలాన్ని ఎలా అమ్ముతారబ్బా అనుకోకండి. అంటే వాళ్ల సెల్ఫోన్ల ద్వారా మనకు నచ్చిన చోటుకి మాట్లాడుకుని డబ్బులు చెల్లించాలన్నమాట.
ఈ దేశంలో 70 శాతం మంది జనాభా పట్టణాలు, నగరాల్లో నివసిస్తారు. ఈ దేశంలో మొత్తం 300 బీచ్ లుంటాయి. మంచి సందర్శక ప్రాంతాలివి.
మూడింట ఒకవంతు అమెజాన్ అడవి విస్తరించి ఉందిక్కడ. ఈ దేశంలో 1,800 జాతుల పక్షులు కనిపిస్తాయి.
కొలంబియా చట్టం ప్రకారం టీవీల్లో, రేడియోల్లో రోజూ ఉదయం, సాయంత్రం ఆరుగంటలకు జాతీయ గీతం ప్రసారం చేయాలి.
సాధారణంగా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్లా ఉంటుంది’ ప్రపంచంలోని అందమైన నదుల్లో ఒకటిది. నది పేరు కేనో క్రిస్టేల్స్. ఇక్కడి సెరెనియా డి లా మెకెరెనా పర్వత శ్రేణిలో ఉంటుందిది. ప్రకృతి అందాలన్నీ కనిపించే ఈ నదిలో రంగులు ఎలా వచ్చాయి అంటే… ఈ నది అడుగు భాగం వేల సంవత్సరాల క్రితం క్వార్ట్జ్ అనే రాయితో ఏర్పడిందట. ఈ రాయిపై జులై నుంచి నవంబరు మధ్య కాలంలో రంగు రంగుల మెకెరెనియా క్లెవెజెరా అనే నాచు పెరుగుతుంది. ఈ నాచే నదికి వర్ణాల్ని తెచ్చిపెడుతుంది. ఈ వర్ణాల అందాల వల్ల ఈ నదినే ‘లిక్విడ్ రెయిన్బో’ అనే పేరుతోనూ పిలుస్తారు.
కాఫీ, వరి, అరటి, పొగాకు, మొక్కజొన్న, చెరకు, నూనె గింజలు, కోకోవా బీన్స్, కూరగాయలు పండిస్తారు.
పెట్రోలియం, సహజవాయు, బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, ఎమరాల్డ్స్, హైడ్రోపవర్ సహజ సంపదలు

Country : Ecuador
Capital Quito ………. Language Spanish ………. Currency US Dollar ………. Calling Code + 593 ………. Religion Roman Catholic
ఈక్వడర్…
1822 సంవత్సరంలో ఈ దేశం స్పెయిన్ దేశం నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 1830 వ సంవత్సరంలో ఈ దేశం గ్రాన్ కొలంబియా గ్రూప్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1970 లలో ఈ దేశం మిలటరీ పాలనలో ఉన్నపుడు దేశంలో అశాంతి నెలకొంది. ఈక్వడార్ రాజధాని క్విటో. ఈ దేశ వైశాల్యం. 2,83,560 చ.కి.మీ. వీరి భాష స్పానిష్ (అధికార). వీరి కరెన్సీ అమెరికన్ డాలర్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. 95 శాతం మంది రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు.
అ దేశం మధ్య ఆండీస్ పర్వత శ్రేణులున్నాయి. దానికి అటు, ఇటూ అమెజాన్ నదీలోయలు, మైదానాలున్నాయు. ప్రసిద్ద జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పరిణామ సిద్దాంతాన్ని ప్రవచించి, పరిశోధనలు జరిపిన గాలపగోస్ దీవులు ఈక్వడార్ కు చెందినవే.
వరి, గోధుమ, కాఫీ, బార్లీ, అరటి, కోకో, చెరకు, ప్రత్తి ముఖ్యమైన పంటలు.
రాగి, బంగారం, పెట్రోల్, గంథకం,ఖనిజాలు సహజ సంపదలు.
సిమెంట్, నూలు వస్త్రాలు ఔషధాలు,టాగ్వా గింజలు ఎగుమతి చేస్తారు. కలప, చేపలు లభిస్తాయి.

Country : Guyana
Capital Georgetown ………. Language English ………. Currency Guyanese dollar ………. Calling Code + ………. Religion Christian(57.4)
గుయానా…
1500 సంవత్సరంలో మొట్టమొదటిగా డచ్ వారు ఈ దేశంలో అడుగు పెట్టారు. తరువాత 1796వ సంవత్సరలో బ్రిటీష్ వారు ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. 1966 సంవత్సరంలో ఈ దేశం బ్రిటన్ నుండి స్వాతంత్రం సంపాదించుకుని 1970 సంవత్సరంలో రిపబ్లికన్ దేశంగా అవతరించింది.
ఈ దేశ వైశాల్యం 2,14,970 చ.కి.మీ. ఈ దేశ రాజధాని జార్జ్ టౌన్. వీరి భాషలు . English, Amerindian dialects, Creole, Hindi, Urdu. ఈ దేశ కరెన్సీ. ఈ దేశ ప్రజలలో క్రిస్టియన్స్ 50 శాతం మంది, హిందువులు 35 శాతం మంది, ముస్లింలు 10 శాతం మంది, 5 శాతం మంది ఇతర మతస్తులు ఉన్నారు.
చెరకు, వరి, గోధుమలు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోళ్లపరిశ్రమ, పాలపరిశ్రమలు కలవు.
బాక్సైట్, బంగారం, వజ్రాలు, కలప, రొయ్యలు, చేపలు సహజ సంపదలు.

Country : Paraguay
Capital Asunción ………. Language Spanish/Guarani ………. Currency Guarani ………. Calling Code + 595 ………. Religion Christian
పరాగ్వే..
పరాగ్వే దక్షిణ అమెరికాలోని స్వతంత్ర దేశం. ఈ దేశానికి ఉత్తరాన బొలీవియా,బ్రెజిల్, తూర్పున అర్జెంటీనా దేశాలు ఉన్నాయి. 1537 సంలో స్పానిష్ వారు ఈ దేశానికి వచ్చి అసన్ సియాన్ నగరాన్ని ఏర్పరచారు. అప్పటినుండి అసన్ సియాన్ స్పానిష్ వారి కాలనీగా మారింది. 1811 సం.లో స్పానిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 4,06,752 చ.కి.మీ. రాజధాని నగరం అసన్ సియాన్. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ Guarani. ప్రజలు క్రైస్తవ మతస్తులు. మెస్టిజో, అమెరికన్ ఇండియన్ జాతులకు చెందినవారు.
పరాగ్వే నది, పరవా నది ప్రధానమైన జలవనరులు. ప్రత్తి ప్రధానమైన పంట. వ్యవసాయపరంగా అభివృద్ది చెందుచున్న దేశం. కర్రపెండలం, చిలగడ దుంపలు, సోయా చిక్కుడు, చెరకు, పొగాకు, వరి, నారింజ అరటి వ్యవసాయ ఉత్పత్తులు. పశువుల పెంపకం ప్రజల జీవనోపాధి.
రాజధాని అసన్ సియాన్ పర్యాటక ప్రదేశం. ఇసుకరాయి సరస్సు విహార స్థలం మరియు ఎన్కార్నేషన్ ప్రాచీన శిధిలాలు ఉన్న గుట్ట.

Country : Peru
Capital Lima ………. Language Spanish/ ………. Currency Sol ………. Calling Code + 51 ………. Religion Catholic
పెరూ….
పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణిలోని స్వతంత్రదేశం పెరూ. ఒకప్పుడు పెరూ దేశం ఇన్కా అనబడే రెడ్ ఇండియన్ల స్థానం. 16వ శతాబ్ధంలో స్పేనిష్ వారిచే ఆక్రమించబడి 1821 సంవత్సరంలో స్వతంత్ర గణరాజ్యంగా రూపొందింది.
ఈ దేశ విస్తీర్ణం 12,81,215 చ.కి.మీ. పెరూ రాజధాని లీయా. వీరి అధికార భాష స్పేనిష్, క్వెచువా. వీరి కరెన్సీ సాల్. ప్రజలు కేథలిక్ క్రైస్తవమతాన్ని పాటిస్తారు. .
ఆల్పాకా, నీకూనా, లామా వంటి అపూర్వమైన జంతుజాలం ఈ దేశంలో కనిపిస్తాయి. అభయారణ్యాలలో ఈ జంతువులు రక్షించబడుచున్నవి. .
అమెజాన్ నదికి ప్రారంభలో ఉన్న మారణన్ నది, నాపోనది, ఉకాయాలీ నది ఈ దేశ తూర్పు మైదానాలలో ప్రవహిస్తున్నాయి. ఆండీస్ కొండల నుంచి ప్రవహించే వాగులు వలన సముద్రతీరంలో సేద్యం చేస్తున్నారు. ప్రత్తి, చెరకు, కాఫీ, వరి, బంగాళా దుంపలు మొక్కజొన్న, అరటి, కర్రపెడలం వ్యవసాయ పంటలు.
మొక్కజొన్నకు ఆదిమ స్థానం పెరూ దేశమే. రెడ్ ఇండియన్ జాతులకు మొక్కజొన్న ముఖ్య ఆహారం .
మత్సపరిశ్రమ ఎక్కువగా ఉన్నది. వెండి, రాగి, బంగారం, ఇనుపరాయి, సీసం, గంధకం. ఫాస్పేట్ ఖనిజాలు ఈ దేశంలో లభిస్తాయి
. చించాదీవులలో పిట్టల రెట్ట భారీ రాసులలో లభిస్తుంది. దీనిని పొలాలకు ఎరువుగా వేస్తారు. పెరూ రైతాంగం రసాయనిక ఎరువులు పెద్దగా వాడరు.

Country : Suriname
Capital Paramaribo ………. Language Dutch ………. Currency Surinamese dollar ………. Calling Code + 597 ………. Religion Christian/Hindu
సురినేమ
సురినేమ్ ఒకప్పుడు ‘డచ్ గియాన’గా పిలవబడేది. సురినేమ్కు తూర్పులో ఫ్రెంచ్ గుయానా, పశ్చిమంలో గుయానా, దక్షిణంలో బ్రెజిల్ ఉన్నాయి. ‘కింగ్డమ్ ఆఫ్ ది నెదర్ల్యాండ్స్’లో 1954లో భాగమైంది సురినేమ్.పారమరిబో దేశరాజధాని. పారమరిబో… దేశంలోని పెద్ద పట్టణం మరియు దేశరాజధాని. దేశంలో అధికార భాష డచ్తో పాటు… స్రనన్ టోంగో, హిందీ, భోజ్పూరి, ఇంగ్లిష్, సర్నమి, హక్కా… మొదలైన భాషలు కూడా మాట్లాడతారు. వీరి కరెన్సీ సురినామ్ డాలర్. ఈ దేశ ప్రజలలో హిందువులు 27 శాతం, ప్రొటెస్టంట్లు 25 శాతం, రోమన్ కేథలిక్స్ 22, ముస్లింలు 20 శాతం మంది కలదు
దక్షిణ అమెరికాలోని చిన్నదేశాలలో సురినేమ్ ఒకటి. 1975లో నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశానికి సహజ వనరులే ఆయువు పట్టు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో… స్వాతంత్య్రం పట్ల నమ్మకం కంటే అపనమ్మకమే ప్రజల్లో ఎక్కువగా ఉండేది. దీంతో వేలాది మంది ప్రజలు దేశాన్ని విడిచి నెదర్లాండ్స్కు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వ అసమర్థత, అక్రమాల మీద ప్రజలకు విముఖత వచ్చింది. దీనివల్లే 1980లో తలెత్తిన సైనిక తిరుగుబాటును ప్రజలు స్వాగతించారు.
1980-1987 వరకు దేశంలో మిలటరీ పాలన కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులను మిలటరీ ప్రభుత్వం చంపేయడంతో నెదర్లాండ్స్ తన సహకారాన్ని ఆపింది. ఈ ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరగడం, కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటివి జరిగినప్పటికీ 1990లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. అయితే అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఇదే సంవత్సరం మే నెలలో ఎన్నికలు జరిగాయి. ‘న్యూ ఫ్రంట్ ఫర్ డెమొక్రసీ అండ్ డెవలప్మెంట్’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’లు మెజార్టీ స్థానాలను గెలుచుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
పరిపాలన పరంగా సురినేమ్ పది జిల్లాలుగా విభజించబడింది. జీవవైవిధ్యంలో సురినేమ్ మంచి స్థాయిలో ఉంది. దేశంలో 150 రకాల క్షీరదాలు, 650 రకాల పక్షిజాతులు, 350 రకాల చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యంలో ‘సెంట్రల్ సురినేమ్ నేచర్ రిజర్వ్’ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించింది. సురినేమ్లో ఎన్నో నేషనల్ పార్క్లు ఉన్నాయి. 16 శాతం భూభాగంలో నేషనల్ పార్క్లు, సరస్సులు ఉన్నాయి.
సురినేమ్ సంస్కృతిలో వైవిధ్యం ఉంది. దీనిపై ఆసియా, ఆఫ్రికాల ప్రభావం బలంగా ఉంది. దేశంలో ప్రసిద్ధిగాంచిన సంగీతం ‘కసెకో’. దీనిపై ఆఫ్రికన్, యురోపియన్, అమెరికాల సంగీత శైలుల ప్రభావం కనిపిస్తుంది. దేశంలో 60 శాతం మందికి డచ్ అధికార భాష. ‘డచ్ లాంగ్వేజ్ యూనియన్’లో సురినేమ్కు సభ్యత్వం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో డచ్ మాట్లాడే ఏకైక దేశం సురినేమ్.
హోటల్ ఇండస్ట్రీ సురినేమ్ ఆర్థికవ్యవస్థకు కీలకంగా మారింది. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రావడానికి కారణం… జీవవైవిధ్యం. కోమెన్విజిన్ జిల్లాలో జులెస్ బ్రిడ్జీకీ పర్యాటక పరంగా గుర్తింపు ఉంది.
సురినేమ్లో బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. సంకీర్ణప్రభుత్వాలే ఎక్కువ. ‘నేషనల్ పార్టీ ఆఫ్ సురినేమ్’, ‘ప్రోగ్రెసివ్ రిఫామ్ పార్టీ’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’, ‘నేషనల్ డెమొక్రటిక్ పార్టీ’, ‘డెమొక్రటిక్ నేషనల్ ప్లాట్ఫాం’… మొదలైనవి దేశంలో ప్రధానమైన పార్టీలు.
ఒకవైపు ఉన్నత జీవనప్రమాణాలు, మరోవైపు రాజకీయ, ఆర్థిక సవాళ్లతో సురినేమ్ సంస్కృతిపరంగానే కాదు జీవవైవిధ్యం దృష్ట్యా కూడా చెప్పుకోదగిన దేశంగా ప్రపంచ పటంలో నిలిచింది.
బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో సురినేమ్ ఒకటి. దేశంలో ప్రాచుర్యం పొందిన ఆట… ఫుట్బాల్. దేశ తొలి అధ్యక్షుడు జోహన్ ఫెరియర్.
రాజధానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రౌన్స్బెర్గ్ పక్షులధామంగా పేరుగాంచింది. రెయిన్ఫారెస్ట్ సంరక్షణలో ముందున్న దేశాలలో సురినేమ్ ఒకటి.
రైస్, అరటి, పామ్ కెర్నెల్ అనే ఒక రకమైన నూనె గింజలు, కొబ్బరి, అరటి, వేరుశెనగ వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోడి మాంసం, రొయ్యలు, అటవీ ఉత్పత్తులు లభిస్తాయి.
కలప, హైడ్రోపవర్, చేపలు, రొయ్యలు, బాక్సైట్, బంగారం, కాపర్, ప్లాటినమ్, ఇనుప ఖనిజం సహజ సంపదలు.

Country : Uruguay
Capital Montevideo ………. Language Spanish ………. Currency Uruguayan peso ………. Calling Code + 598 ………. Religion Christian
ఉరుగ్వే
ఉరుగ్వే దక్షిణ అమెరికా ఖంఢంలోని చిన్న స్వతంత్ర రాజ్యం. 1680 సం.లో పోరుచగల్, స్పెయిన్ దేశాల వలసరాజ్యంగా ఉండేది. 1828 సం.లో బ్రెజిల్ దేశం నుండి స్వాతంత్ర్యం పొందింది. ఉరుగ్వే విస్తీర్ణం 1,76,215 చం.కి.మీ. ఉరగ్వే రాజధాని మాంటి వీడియో. అధికార భాష స్పానిష్. స్పానిష్ ఇటాలియన్ (క్రైస్తవం) సంకరజాతి ప్రజలు 86 శాతం మంది, మెస్టిజోలు 14 శాతం మంది ఉన్నారు. వీరి కరెన్సీ ఉరుగ్వేయన్ పెస్కోలు.
పచ్చికబయళ్లు పుష్కలంగా ఉండటం వలన పశువుల పెంపకం, గొర్రెల పెంపకం ఎక్కువ.
ఈ దేశ దక్షిణ ప్రాంతంలో గోధుమ పండిస్తారు. ఇంకా వరి, చెరకు, మొక్కజొన్న, జొన్న, బార్లీ, నారింజ, ఓట్ ధాన్యం కూడా పండిస్తారు.
ఈ దేశంలో లభించే ముఖ్యమైన ఖనిజ సంపదలో గ్రానైట్, సున్నపురాయి ముఖ్యమైనవి.

Country : Venezuela
Capital Caracas ………. Language Spanish ………. Currency Bolívar fuerte[ ………. Calling Code + 58 ………. Religion Christian
వెనిజులా
పూర్వం ఈ దేశం స్పెయిన్‌పాలనలో ఉండేది. 15 ఏళ్ల పోరాటాల అనంతరం 1821లో పూర్తి స్వతంత్రం పొందింది. వెనిజులా రాజధాని కరాకస్ జనాభా 3.1 కోట్లు ఈ దేశ విస్తీర్ణం : 9,16,445 చ.కి.మీ. వీరి కరెన్సీ వెనిజులన్‌బొలివర్. భాష స్పానిష్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి రెందినది. ప్రజలలో 96 శాతం మంది రోమన్ కేథలిక సంప్రదాయాన్ని పాటిస్తారు.
జెండాలోని ఎరుపు, పసుపు రంగులు ధైర్యానికి, నీలం స్వతంత్ర వెనిజులాకి గుర్తులు. మధ్యలో ఎనిమిది తెల్లటి నక్షత్రాలు విప్లవానికి ప్రతీక. వెనిజులాలో నీటికంటే చమురే చవక. సౌదీ అరేబియా తరువాత చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశం ఇది. మొన్న మొన్నటి వరకు ఇక్కడ లీటరు సబ్సిడీ పెట్రోల్‌ధర ఒక రూపాయిలోపే! దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్న అతిపెద్ద అడవి అమెజాన్‌లో కొంత భాగం ఈ దేశంలోనూ ఉంది. ప్రపంచంలో ఎక్కువ జీవజాతులు ఉన్న దేశాల్లో వెనిజులా ఏడోది. అ దేశంలో వాతావరణం స్థిరంగా ఉండదు. ఏడాదిలో 160 రాత్రులపాటు మెరుపులు, పిడుగులు వస్తూనే ఉంటాయి. తుపానులూ కూడా ఎక్కువగా వస్తాయి. .
వెనిజులా అనే పదం… వెనిజోలియా (బుల్లి వెనిస్) అనే ఇటాలియన్‌పదం నుంచి వచ్చింది. అక్కడి మారాకైబోలో ఉన్న సరస్సులో ప్రాచీనులు కర్రలుపాతి దానిపైనే ఇళ్లు కట్టుకున్నారు. అది వెన్నిస్‌ను పోలినట్టు ఉండటంతో దీనికి వెనిజులా అని పేరొచ్చింది. .
ప్రపంచంలోనే ఎత్తయిన ఏంజెల్‌జలపాతం ఇక్కడిదే. దీని పొడవు 3,212 అడుగులు. ఇది నయాగరా జలపాతం కంటే పదిహేడు రెట్లు ఎత్తయినది. ప్రపంచంలో ఎక్కువసార్లు అందాలపోటీల్లో గెలిచిన అమ్మాయిలు ఈ దేశానికి చెందినవారే. .
ఇక్కడున్న ‘శాన్‌ఆంటోనియా జైలు’ చిత్రంగా ఉంటుంది. ఈ జైలుని, దానికి ఆనుకుని ఉన్న బీచ్‌ని చూసేందుకు ఇక్కడికి ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు. వారందరికీ ఇక్కడి ఖైదీలు నోరూరించే వంటకాలు చేసి పెడతారు. వివిధ స్టాళ్లను నడుపుతారు. ఇక్కడ ఖైదీలు కుటుంబంతో సహా ఉండే వీలుంది. వారికిక్కడ టీవీలు, ఏసీలు, ఈత కొలను, క్రీడా మైదానాలు, నైట్‌క్లబ్‌లాంటి సకల సౌకర్యాలు ఉంటాయి. మరణశిక్షను రద్దు చేసిన ఆధునిక దేశమిది. 1863లోనే ఈ నిర్ణయం తీసుకుంది. .
రాజధాని కరాకస్‌లో ఓ అమెరికన్‌టీవీ షోకోసం కట్టి, అసంపూర్తిగా వదిలేసిన 45 అంతస్తుల ఆకాశ హర్మ్యం ఒకటుంది. దాన్ని 2007లో మురికివాడల్లోని ప్రజలుండేందుకు కేటాయించారు. దీంతో ఎత్తయిన మురికివాడగా ఈ భవనం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దానిలో 3000 మంది జనం నివసిస్తున్నారు. ఇందులోనే చిన్నచిన్న దుకాణాలూ ఉన్నాయి. .
ఈ దేశంలో ఏకంగా 25000 ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ఈ దేశ జాతీయ పుష్పం పేరు ‘ఫ్లోర్‌దే మయో ఆర్కిడ్’. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక విగ్రహం ఇక్కడే ఉంది. దీని పేరు విర్జెన్‌డిలాపాజెన్‌ట్రుజిల్లో.
You must log in to post a comment.