కెమికల్‌ ఇంజనీరింగ్‌

ఉత్సాహవంతులకు మంచి ప్యాకేజ్‌ మరియు బహుళ ఆదరణ పొందిన కోర్సులో కెమికల్‌ ఇంజనీరింగ్‌ ఒకటి. ప్యూర్‌ అప్లయిడ్‌ సైన్స్‌ పరిధిలోకి కెమికల్‌ ఇంజనీరింగ్‌ వస్తుంది. దేశంలో మెజార్టీ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈ బ్రాంచీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ పీజి ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. సైన్స్‌ ఆధారంగా సాంకేతిక ముఖ్యంగా పరిశ్రము అభివృద్ధి చెందిన క్రమంలో కెమిస్ట్రీ తోడ్పాటు ఎక్కువే. సరిగ్గా ఇందువల్లే కెమికల్‌ ఇంజీరింగ్‌ ఒక వృత్తిగా బలపడింది. కెమికల్‌ ప్లాంట్ల డిజైనింగ్‌ నిర్వహణ, ముడి పదార్థాల నుంచి వృధా తొగింపునకు తోడు వాటి విలువ పెంచేందుకు కావల్సిన కెమికల్‌ ప్రాసెస్‌ అభివృద్ధి తద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తిలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పాత్ర చాలాఎక్కువ. కెమిస్ట్రీ, ఇంజనీరింగ్‌ కలగలసిన పరిజ్ఞానంతో వివిధ రసాయనాలు, సంబంధిత ఉప ఉత్పత్తులు సాధించవచ్చు.


ఇంజనీరింగ్‌లోనే ఇదో వైవిధ్యభరిత డిసిప్లిన్‌. బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, మినరల్‌ ప్రాసెసింగ్‌ వరకు అన్నీ ఇందులో కలుస్తాయి. ఖనిజ ఆధారిత పరిశ్రము, పెట్రో కెమికల్‌ ప్లాంట్లు, ఫార్మాస్యూటికల్స్‌, సింథటిక్‌ ఫైబర్స్‌, పెట్రోలియం రిఫైనింగ్‌ ప్లాంట్స్‌కు కెమికల్‌ టెక్నాలజీ సహకారం అవసరమవుతుంది. కెమికల్‌ ప్లాంట్ల డిజైన్‌, నిర్వహణకు తోడు సంబంధిత ఉత్పత్తుల మెరుగుదలకు కెమికల్‌ ఇంజనీర్లు కృషి చేస్తారు.


కెమికల్‌ ఇంజనీర్ల పని ఇతర సాంకేతిక నిపుణుల మాదిరిగానే ఉంటుంది. ప్రాసెస్‌, ఇండస్ట్రీలో ఇన్వెన్షన్‌ అభివృద్ధి, డిజైన్‌, ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌ పనులన్నీ వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కెమిస్టు, ఇండస్ట్రియల్‌ ఇంజనీర్లు, మెటీరియల్‌ ఇంజనీర్లకు తోడు ఎక్ట్రికల్‌ ఇంజనీర్ల పని కలిపి ఒక తాటిపైకి ఈ రంగంలో తీసుకు వస్తారు. పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉండటానికి అవసరమైన ఆధునిక, అత్యున్నత స్ధాయి మెటీరియల్‌ను అందుబాటులో ఉంచటం కెమికల్‌ ఇంజనీర్ల బాధ్యత.


కెమికల్‌ ఇంజనీరింగ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో బిఇ/బిటెక్‌ లేదా ఎం ఇ డిగ్రీతో కెమికల్‌ ఇంజనీర్‌ కావచ్చు. కెమికల్‌ ఇంజనీరింగ్‌లలో డిగ్రీ/డిప్లొమా కోర్సు ఉన్నాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మేథ్స్‌తో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైనవారు బిఇ/బి టెక్‌ చేసేందుకు అర్హులు ఈ కోర్సులో భాగంగా ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, పాలిమర్‌ టెక్నాలజీ, పాలిమర్‌ ప్రాసెసింగ్‌, పాలిమర్‌ సింథసిస్‌పై దృష్టి సారిస్తారు.ఇందులో భాగంగా ప్రత్యేక ఏరియాలో శిక్షణ, పరిశోధన ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారిత ప్లాంట్‌ డిజైన్‌, పెట్రోలియం, రిఫైనింగ్‌, ఫెర్టిలైజర్‌ టెక్నాలజీ, ఫుడ్‌ మరియు అగ్రికల్చరల్‌ ఉత్పత్తులు ప్రాసెసింగ్‌, సింధటిక్‌ ఫుడ్‌, పెట్రో కెమికల్స్‌ సింధటిక్‌ ఫైబర్స్‌, బొగ్గు అలాగే ఖనిజ ఆధారిత పరిశ్రమకు సంబంధించిన అంశాలు ఉంటాయి.


పరిశ్రమలో ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో కెమికల్‌ ఇంజనీర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌, ఆహారం, మెటీరియల్స్‌, ప్రత్యేక కెమికల్స్‌, ప్లాస్టిక్స్‌, పవర్‌ ప్రొడక్షన్‌, పర్యావరణ నియంత్రణ, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, బయో టెక్నాలజీ పరిశ్రమల్లో వీరిదే హవా, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ పరిశ్రమల్లో పలు అవకాశాలు వీరికోసం ఉన్నాయి.


మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమకు తోడు ఫార్మాసూటికల్స్‌లో కెమికల్‌ ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. పర్యావరణ పరిధిలో తలెత్తే సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ రంగానికి వీరు అవసరమవుతారు. వేస్ట్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌, రీసైకిలింగ్‌ ఇందులోకి వస్తాయి. ఎనర్జీ సెక్టార్‌లో ముఖ్యంగా ఇంధన పరిరక్షణ, ప్రత్యమ్నాయ ఇంధన వనరులకోసం పరిశోధన, ఆరోగ్య సంబంధ ప్రాజెక్టు, డిఫెన్స్‌ పరిశ్రము, అణు విద్యుత్తు ప్లాంట్లకు కెమికల్‌ ఇంజనీర్ల సేవలు కావాల్సి వస్తాయి.


శాస్త్రీయ పరిశోధన, డెవలప్‌మెంట్‌ సర్వీసు, ముఖ్యంగా ఇంధనం అలాగే బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ రంగాల్లో ఉపాధి పొందవచ్చు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కోల్‌ ప్రిపరేషన్‌, మినరల్‌ ప్రాసెసింగ్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ అదేవిధంగా కెమికల్‌ ప్రాసెస్‌ పరిశ్రము, ఫెర్టిలైజర్‌ ఇండస్ట్రీ, పెస్టిసైడ్స్‌, హెర్బిసైడ్స్‌, కాస్టిక్‌ సోడా, గ్లాస్‌ అండ్‌ స్పెషాలిటి కెమికల్స్‌, డైస్‌ అండ్‌ డైస్‌స్టఫ్‌, పెయంట్‌ లూబ్రికెంట్స్‌, స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తి సంబంధ పరిశ్రమల్లో మంచి అవకాశాలు కెమికల్‌ ఇంజనీర్లకు ఉంటాయి.

%d bloggers like this: