ఉత్తర అమెరికా దేశాలు

Antigua and Barbuda

Country : Antigua and Barbuda

Capital St. John’s ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -267 ………. Religion Christian
ఈ దేశం Antigua and Barbuda అనే రెండు మానవ నివాసాలు కలిగిన దేశం. ఇతర దీవులు ఉన్నాయి కానీ వాటిలో ఎవరూ నివసించరు. కరేబియన్ సముద్రంలో ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలకు మధ్యలో ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటిగా సిబోని అనే తెగల ప్రజలు నివసించారు. వీరిని స్టోన్ ప్రజలు అనికూడా అంటారు. తరువాత అమెరికాలోని వెనిజులాకు చెందిన అరావాక్స్ అనే తెగ వారు ఇక్కడికి వలస వచ్చారు.వీరు మొక్కజొన్న, పైనాపిల్, ప్రత్తి, పొగాకు పంటలను సాగుచేశారు.
ఈ దేశ రాజధాని సెయింట్ జాన్స్. ఈ దేశ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా ప్రాంతీయ భాషలు మాట్లాడుతారు. ఈ దేశం నవంబర్ 1వ తేదీ, 1981 సంవత్సరంలో అమెరికా నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. ప్రత్తి, పొగాకు, కూరగాయలు, అరటి, కొబ్బరి, మామిడి, చెరకు వ్యవసాయ పంటలు.
ఆహ్లాదకరమైన ఈ దేశ వాతావరణం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు.

bahamas

Country : Bahamas

Capital Nassau ………. Language English ………. Currency Bahamian dollar ………. Calling Code + -241 ………. Religion Christian

బహమాస్ దీవులు

ఉత్తర అమెరికాలో వెస్ట్ ఇండీస్ కు ఉత్తరంగా దీవులతో కూడిన స్వతంత్ర రాజ్యం బహమాస్. పూర్యం చుట్టుప్రక్కల దీవుల నుండి Lucayans అనే తెగ ప్రజలు వచ్చి బహమాస్ దీవులలో స్థిరపడ్డారు. 1492 సంవత్సరంలో క్రిస్టఫర్ కొలంబస్ బహమాస్ దీవులలో సాన్ సాల్వడార్ అనే దీవిలోకి వచ్చాడు. కానీ అతనితో పాటు స్మాల్ పాక్స్ అనే వ్యాధిని కూడా వ్యాపింపజేయటం వలన ఈ దీవులలోని సగం మంది ప్రజలు స్మాల్ పాక్స్ వలన మరణించారు. తరువాత స్పానిష్ బానిసవర్తకులు Lucayans తెగలవారిని తమ బంగారు గనులలో పనిచేయటానికి బానిసలుగా మార్చారు. తరువాత 25 సంవత్సరాలు ఈ తెగ ప్రజలు వలసపోవటం కానీ, చనిపోవటం కానీ జరగటం వలన ఈ తెగ పూర్తిగా అంతరించిపోయింది.
తరువాత 1647 కొంతమంది శరణార్ధులు (Religious Refugees) ఈ దీవులకు వచ్చి స్థిరపడడ్డారు. 1717 సంవత్సరంలో ఈ దీవులు బ్రిటీష్ వారి కాలనీగా మారినపుడు ఎక్కువ మంది శరణార్ధులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
రహస్య ప్రదేశాలు ఉండటం వలన మరియు ఓడలు ప్రయాణించే మార్గానికి దగ్గరలో ఉండటం వలన బహమాస్ దీవులు సముద్రపు దొంగలకు స్థావరంగా మారాయి.
1973 జూలై 10వ తేదీన బహమాస్ స్వాతంత్రం సంపాదించుకుంది. తరువాత ఈ దీవులు ఆర్ధికపరంగా సేవలందించే ప్రాంతంగాను, పర్యాటక పరంగానూ అభవృద్ధి చెందింది.
బహమాస్ లో 2000 చిన్న దీవులు, 700 ఒకమాదిరి దీవులు కలవు. కానీ వీటిలో 30 దీవులు మాత్రమే ప్రజలు నివసించటానికి యోగ్యమైనవి. ఆండ్రస్ దీవి అన్నిటికంటే పెద్ద దీవి. ప్రావిడెన్స్ దీవిలో జనసాంద్రత ఎక్కువ.
ఈ దేశ విస్తీర్ణం 13,939 చ.కి.మీ. రాజధానా నస్సావూ. అధికార భాష ఇంగ్లీష్. ప్రజలలో 84 శాతం మంది నీగ్రో జాతివారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. వీరి కరెన్సీ బహమాస్ డాలర్స్.
ఇక్కడ పండ్లు, కూరగాయలు ఎక్కువగా పండుతాయి. మత్య్స పరిశ్రమ అభివృద్ధి చెందింది.
బహమాస్ దీవులు ప్రకృతి సౌంర్యానికి పేరుపొందాయు. వీదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకం ద్వారా ఎక్కువ ఆదాయం ఈ దేశానికి వస్తుంది.

barbados

Country : Barbados

Capital Bridgetown ………. Language English ………. Currency Barbadian dollar ………. Calling Code + -245 ………. Religion Christian

బార్బడోస్…

దక్షిణ అమెరికాకు ఈశాన్యంగా 400 కి.మీ. దూరంలో కరేబియన్ దీవులకు తూర్పున ఉన్న స్వతంత్ర రాజ్యం. రాజవంశీయుల పాలనలో ఉన్న దేశం కూడా. రాజకీయంగా, ఆర్ధికంగా బలపడిన దేశం. ప్రజల జీవన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది.
1625 సంవత్సరంలో జనవాసాలు లేని ఈ ప్రాంతంలో బ్రిటీష్ నావికులు అడుగు పెట్టారు. తరువాత 1627 సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఈ దీవిని వ్యవసాయ యోగ్యంగా మార్చి చెరకు పండించటానికి ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసుకున్నారు. 1966 వ సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారినుండి పూర్తి స్వాతంత్రం సంపాదించుకుంది. తరువాత చెరకు ఎక్కువగా ఎగుమతి దేశంగానూ, పర్యాటకపరంగానూ అభివృద్ధి చెందింది. ఈ దేశ విస్తీర్ణం 430 చ.కి.మీ. ఈ దేశ రాజధాని బ్రిడ్జ్ టౌన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలలో 92 శాతం మంది నీగ్రోలు. వీరి కరెన్సీ బార్బేడియన్ డాలర్. ప్రజలు ఎక్కువ మంది క్రైస్తవ మతస్తులు. చెరకు ఎక్కువగా పండుతుంది. మొక్కజొన్న, నిమ్మ, నారింజ జాతుల పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. రొయ్యలు, పంచదార, రమ్ము, సారాయి ఎగుమతులు. పెట్రోలియం, సహజవాయువు, చేపలు ఈ దేశ సహజ వనరులు. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన బీచ్ లు ఉండటం వలన విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకం వలన అధిక ఆదాయం వస్తుంది.

beleze flag

Country : Belize

Capital Belmopan ………. Language English ………. Currency Belize dollar ………. Calling Code + 501 ………. Religion Roman Catholics

బెలిజి…

బెలీజి దేశం మయాన్ నాగరికతకు సంబంధించిన దేశం. 1500 బి.సి లోనే మయాన్లు ఈ దేశానికి వలస వచ్చారు. 1840 సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారి కాలనీగా మారింది. అందుకే ఈ దేశాన్ని అప్పట్లో బ్రిటీష్ హోండూరస్ గా పిలిచేవారు. 1973 లో తిరిగి బెలిజీగా పిలువబడింది. సెప్టెంబర్ 21, 1981 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 22,965 చ.కి.మీ. రాజధాని బెల్మోపాన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు క్రైస్తవ మతానికి చెందినవారు.
ఈ దేశం నిమ్మ, నారింజపండ్లను ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తుంది. చెరకు, ద్రాక్ష, కొబ్బరి ఇతర ఎగుమతులు. కలప కూడా లభిస్తుంది. ఆహార పదార్ధాలను దిగుమతి చేసుకుంటారు. కలప, చేపలు, హైడ్రోపవర్ సహజ వనరులు. వ్యవసాయ యోగ్యమైన భూములు కలవు.

canada flag

Country : Canada

Capital Ottawa ………. Language English/French ………. Currency Canadian dollar ………. Calling Code + 1 ………. Religion Christian

కెనడా

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వైశాల్యంగల దేశం కెనడా. కెనడా రాజధాని ఒట్టావా ఈ దేశ జనాభా 3,60,48,521 (2018) దేశ విస్తీర్ణం 99,84,670 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు ఆంగ్లం మరియు ఫ్రెంచ్‌, వీరీ కరెన్సీ కెనడియన్‌ డాలర్‌. కెనడా క్రిస్టియన్ దేశం. కెనడా జాతీయ పతాకం 1:2 పొడవు వెడల్పుతో ఉంటుంది. మధ్యలో తెలుపు రంగులో ఎర్రని మేపుల్‌ ఆకు, అటూ ఇటూ ఎర్రని రంగులు ఉంటాయి. తెలుపు రంగు శాంతి, నిజాయితీని, ఎరుపు రంగు ధైర్యం, శ్రమ, బలాన్ని సూచిస్తే మేపుల్‌ ఆకు కెనడా ప్రకృతికి చిహ్నం.
కెనడా అనేది ‘కెనట’ అనే పదం నుంచి వచ్చింది. స్థానిక భాషలో దీనర్థం ఆవాసం’, లేదా గ్రామం అని. ప్రపంచం మొత్తంగా ఉన్న అడవుల్లో 10 శాతం కెనడాలోనే ఉన్నాయి.
కెనడాలో 55 వేలకుపైగా కీటక జాతులు ఉన్నాయి. కెనాడాలో దాదాపు 30 వేల సరస్సులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సుల్లో ఇది అరవై శాతం. ఎక్కువ మంది విద్యావంతులున్న దేశంగా కూడాఈ దేశానికి పేరుంది. ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు యూఎస్‌, కెనడాల మధ్య ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన తీర రేఖగల దేశం. ఏకంగా 2,02,080 కిలోమీటర్ల పొడవుంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన వీధి ఇక్కడే ఉంది. పేరు యంగ్‌ స్ట్రీట్‌. సుమారు 2,000 కిలోమీటర్ల పొడవుంటుంది. టోరంటో స్థాపకుడు జాన్‌ గ్రేవ్స్‌ సిమ్‌కో తన స్నేహితుడూ, ప్రాచీన రోమన్‌ రహదారుల నిపుణుడైన జార్జ్‌ యంగ్‌ పేరు మీదుగా ఈ వీధికి పేరు పెట్టారు. యంగ్‌ సబ్‌ వే మార్గం కెనడాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి భూగర్భ మెట్రో సిస్టమ్‌. గోధుమలు, బార్లీ, నూనె గింజలు, పొగాకు, పండ్లు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు.
ఇనుప ఖనిజం, నికెల్, రాగి, జింక్, బంగారం, సీసం, వెండి, పోటాష్, వజ్రాలు ఈ దేశంలో లభించే సహజ వనరులు. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు కూడా లభిస్తుంది.

costarica flag

Country : Costa Rica

Capital Costa Rica ………. Language Spanish ………. Currency Costa Rican colón ………. Calling Code + 506 ………. Religion Christian

కోస్టారికా

కోస్టారికా మద్య ఉత్తర అమెరికాలోని ఒక చిన్న స్వతంత్ర రాజ్యం. ఈ దేశానికి ఉత్తరాన నికరగ్యా, దక్షిణాన పనామా దేశాలున్నాయి. మూడు వందల సంవత్సరాల పాటు స్పెయిన్ వలస రాజ్యంగా ఉండి 1821 సంవత్సరలో స్వతంత్ర దేశంగా అవతరించింది. కోస్టారికా వైశాల్యం 51, 100 చ.కి.మీ. . దీని రాజధాని శాన్ జోన్స్. వీరి అధికార భాష స్పానిష్, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ప్రజలు అధికశాతం క్రిస్టియన్స్,స్పెయిన్ నుండి వలస వచ్చినవారే.
రెడ్ ఇండియన్ లతో సంకరమైన యూరోపియన్ ప్రజలను మెస్టిజోలు అంటారు. రెవాన్టా, జోన్, శాన్ జోన్, శానాపిక్వీ నదులు ఈ దేశంలో కలవు. కగూనా డా అరెవల్, సరస్సులు ప్రధాన జలవనరులు.
కోకో, కాఫీ, అరటిపండ్లు ఎక్కువగా పండిస్తారు. అబాకా, హెంప్ నార, రబ్బరు, ప్రత్తి, చెరకు, వాణిజ్య పంటలు. వరి, మొక్కజొన్న దేశ అవసరాలకు సరిపడా పండిస్తారు.
బంగారం, ఉప్పు ఈ దేశంలో లభించే ఖనిజ సంపద. పశువుల పెంపకం కూడా ఎక్కువగా ఉంది.

cuba flag

Country : Cuba

Capital Havana ………. Language Spanish ………. Currency Pesco ………. Calling Code + 53 ………. Religion Christian

క్యూబా

క్యూబా ఉత్తర అమెరికాకు ఆగ్నేయ దిశలో ఉన్న వెస్ట్ ఇండీస్ దీవులలోని ఒక అందమైన ద్వీప సముదాయం. క్యూబా దీవి కాకుండా చిన్న, పెద్ద దీవులు కలిపి 1600 దాకా ఉన్నాయి. 400 సంవత్సరాలు స్పెయిన్ ఆధీనంలో ఉండి 1898 సం.లో అమెరికా సహాయంతో స్వాతంత్ర్య పోరాటం మొదలు పెట్టింది. 1902 సంవత్సరంలో అమెరికా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. 1930 ప్రాంతంలో మరలా బాటిస్టా అనే నియంత పాలనకు గురైంది. 1959 సం.లో ఫిడల్ కాస్ట్రో నాయకత్వంలో విప్లవం చెలరేగి సోషలిస్ట్ ప్రభుత్వ ఏర్పడింది. కాస్త్రో ప్రధాని అయ్యాడు.
ధేశంలో ఒకే ఒక రాజకీయ పక్షం క్యూబా కమ్యునిస్ట్ పార్టీ.
కాస్ట్రో అలీన దేశాల నాయకులలో ఒకరు. క్యూబా రాజధాని హవానా. దేశ వైశాల్యం 1,10,861 చ.కి.మీ. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ క్యూబన్ పెస్కోలు. క్యూబా క్రిస్టియన్ దేశం.
చెరకు, పొగాకు, సిట్రస్ జాతి పండ్లు, కాఫీ, వరి, బంగాళా దుంపలు, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశుపోషణ కలదు. కోబాల్ట్, నికెల్, ఇనుపఖనిజం,రాగి, క్రోమియం, కలప, పెట్రోల్, సిలికా సహజ సంపదలు. వ్యవసాయ యోగ్యమైన భూమి కలదు.

dominica flag

Country : Dominica

Capital Roseau ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -766 ………. Religion Christian

డొమినికా

ఇది చాలా చిన్న దేశం. భారతదేశంలోని హైదరాబాద్ కన్నా కొంచె పెద్దది. పర్వతాలతో కూడిన చిన్న ద్వీప దేశం. తూర్పున అట్లాంటిక్ సముద్రం, పశ్చిమాన కరేబియన్ సముద్రం, ఉత్తరాన ఫ్రెంచ్ ద్వీపాలు గ్వాడెలూప్, మదక్షిణాన మార్టనిక్యూ ఉన్నాయి. డొమినికా అంటే లాటిన్ భాషలో ఆదివారం అని అర్ధం.
నవంబర్ 3, 1978 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 1980 సంవత్సరంలో Mary Eugenia Charles తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైంది
డొమినికా రాజధాని రోసియా. ఇదే ఈ దేశంలో పెద్ద నగరం కూడా. ఎక్కువశాతం జనాభా ఇక్కడే నివసిస్తారు. వీరి భాష ఆంగ్లం. వీరి కరెన్సీ తూర్పు కరేబియన్ డాలర్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది
ఈ దేశ జాతీయ పక్షి సిసేరియో ప్యారెట్. ఈ పక్షి ఈ దేశంలోనే మాత్రం కనిపిస్తుంది.
కాఫీ, పంచదారలు ఎగుమతి చేయటం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.
ఇంత చిన్న దేశంలో 365 నదులు, చాలా జలపాతాలు, అందమైన ఇసుక తీరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన రెండో వేడినీటి సరస్సు ఈ దేశంలోనే ఉంది. దీని పేరు బాయిలింగ్ సరస్సు.క్రిస్టఫర్ కొలంబస్ ఈ ద్వీపదేశాన్ని 1493లో దర్శించాడు. అతి ఎత్తయిన పర్వతం మోరెన డియాబ్లటిన్. ఈ పర్వతం సుమారు 5 వేల అడుగుల ఎత్తు ఉంటుంది.
వీరి జీవన విధానం ప్రత్యేకమైనది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ.
అగ్నిపర్వతాలు కూడా ఇక్కడ ఎక్కువ. అవి ఎప్పుడూ చురుకుగా ఉంటాయి. చెట్లు, జంతుసంపద ఎక్కువ. అందువలనే ఈ దేశాన్ని కరేబియన్ సముద్రాపు సహజ సంపద ద్వీపం అని పిలుస్తారు.
అరటిపండ్లు, నిమ్మజాతి పండ్లు, మామిడి కాయలు, కొబ్బరి కాయలు, కొకోవా, భూమిలో పండే దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు
కలప. హైడ్రో పవర్, వ్యవసాయ భూములు కలవు.

domican republic

Country : Dominican Republic

Capital Santo Domingo ………. Language French ………. Currency Peso ………. Calling Code + -808 ………. Religion Christians

డొమినికన్ రిపబ్లిక్

వెస్ట్ ఇండీస్ దీవులలో ఒక స్వతంత్ర దీప దేశం ఇది. ఒకప్పుడు స్పెయిన్ దేశ అధీనంలో ఉండేది. 1844 స్వాతంత్రం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 48,443 చ.కి.మీ. వీరి భాష స్పానిష్. రాజధాని శాంతో డొమినింగో. ప్రజలు ములత్తో జాతికి చెందినవారు 74 శాతం మంది, తెల్లవారు 16 శాతం మంది, నీగ్రోలు 11 శాతం మంది ఉన్నారు. ప్రజలలో ఎక్కువమంది రోమన్ కేథలిక్ క్రైస్తవం పాటిస్తారు. వీరి కరెన్సీ డొమినికన్ పెక్సోలు.
చెరకు, కాఫీ ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తారు. ప్రత్తి, పొగాకు, కోకో, వరి, బీన్స్, టమాటో, మొక్కజొన్న ఇతర పంటలు. పశుమాంసం, పాలు, గ్రుడ్లు ఇతర ఉత్పత్తులు.
నికెల్, బాక్సైట్, బంగారం, వెండి ఖనిజ నిక్షపాలు దొరకుతాయి

el salvador

Country : El Salvador

Capital San Salvador ………. Language Spanish ………. Currency US Dollar ………. Calling Code + 503 ………. Religion Christian

ఎల్ సాల్వడర్…..

ఎల్ సాల్వడర్ మధ్య అమెరికాలోని ఒకస్వతంత్ర రాజ్యం. మొట్టమొదటగా ఎల్ సాల్వడర్ లో అమెరికన్ జాతివారైన పోకోమన్స్, లెంకాస్ మరియు పిపెల్స్ అనే తెగలవారు నివసించేవారు. తరువాత యూరోప్ నుండి స్పానిష్ వారు ఇక్కడకు వచ్చారు. 1821 సంవత్సరంలో ఈ దేశానికి స్పెయిన్ నుండి స్వాతంత్రం లభించింది. కానీ ఈ దేశంలో అంతర్యుద్ధం, అశాంతి వలన 1980లో చాలా మంది చనిపోయారు. 1992 సంవత్సరంలో తిరుగుబాటుదారులతో జరిగిన శాంతి ఒప్పందం వలన కొంతవరకు శాంతి నెలకొన్నది.
ఈ దేశ విస్తీర్ణం 21,041 చ.కి.మీ. రాజధాని సాన్ సాల్వడార్, వీరి భాష స్పానిష్. వీరి కరెన్సీ US Dollars. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. 83 శాతం మంది రోమన్ కేథలిక్ శాఖను అనుసరిస్తారు.
పర్వత పానువులలో కాఫీ పండిస్తారు. వరి, మొక్కజొన్న, చెరకు, చిక్కుడు, ప్రత్తి జొన్న, వరి, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు.
పశువుల పెంపకం కలదు. పాలు, రొయ్యలు ఇతర ఉత్పత్తులు. నేలబొగ్గు, రాగి, ఇనుము, సీసం, జింక్ మొదలగునవి ఖనిజ నిక్షేపాలు.
ఆల్కాహాల్, సిగరెట్లు, సిమెంట్, నూలు వస్త్రాలు, హెనెక్వినార, తోలు సామాగ్రి పరిశ్రమలు ఉన్నాయి.

grenada

Country : Grenada

Capital St. George’s ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -472 ………. Religion Christian

గ్రెనడా

దక్షిణ అమెరికాకు ఉత్తరంగా కరేబియన్ సముద్రంలో ఉన్న చిన్న ద్వీప దేశం గ్రెనడా. దీవులలో కారియాక్ దీవి అన్నిటికంటే పెద్దది. సెంట్ జార్జ్ దీనిలో జనాభా ఎక్కువ. 1974 సం.లో ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 345 చ.కి.మీ. రాజధాని సెంట్ జార్జీస్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు ఫ్రెంచ్, ఆఫ్రికన్ పేష్యో భాషలు కూడా మాట్లాడుతారు. . నీగ్రో జాతి ప్రజలు ఎక్కువ. కొద్ది మంది మిశ్రమ జాతుల వారున్నారు. ఎక్కువ భాగం ప్రజలు క్రైస్తవులు.
కొబ్బరి, నారింజ, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, చెరకు, అరటిపండ్లు, మామిడి, కందమూలాలు, అవకాడో పండ్లు, జాజికాయలు, జాపత్రి, కోకో, ప్లమ్ పండ్లు ఎక్కువగా పండించి ఎగుమతి కూడా చేస్తారు. వ్యవసాయ ప్రధానమైన దేశం ఇది.

gautemala flag

Country : Guatemala

Capital Guatemala City ………. Language Spanish ………. Currency Quetzal ………. Calling Code + 502 ………. Religion Christian

గౌతమాల…

గౌతమాల మధ్య అమెరికాలోని ఒక స్వతంత్ర రాజ్యం. గౌతమాల పురాతనమైన మాయా సంస్కృతికి చెందిన దేశం. మాయా సంస్కృతి శక్తివంతమైన మరియు ఆధునిక సంస్కృతికి చెందినది. 250 AD నుండి 900 AD వరకు ఈ సంస్కృతి ప్రాచుర్యం పొందింది. అప్పట్లో కట్టిన పిరమిడ్లను నేటికి కూడా చూడవచ్చు. 14 శతాబ్ధంలో యూరోపియన్లు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పటికి మాయా సంస్కృతి అంతరించింది.
1524 సంవత్సరంలో ఈదేశం స్పెయిన్ కాలనీగా మారింది. 1821 సంవత్సరంలో స్పెయిన్ నుండి ఈ దేశం స్వాతంత్రం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 1,08,889 చ.కి.మీ. రాజధాని గౌతమాలా నగరం. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ quetzal (GTQ), US dollar. ప్రజలు క్రైస్తవ మతానికి చెందినవారు. మాయన్ ఇండియన్లు మాయన్ భాష మాట్లాడుతారు.
అట్టిలాన్ సరస్సు, ఇజాబల్ సరస్సు, రియోడలా పాశన్ నది, రియో యూసుమాసింటా నది, రియో మొగాటాగౌ నది, రియోగ్వాసలాటే నది, సాలినాస్ నది సమాలా నది, పోలో చిక్ నది, అమాటిన్ సరస్సు, పెట్లిన్ సరస్స ముఖ్యమైన జలాధారాలు.
కాఫీ ప్రధాన వాణిజ్య పంట. అమెరికాకు కాఫీ ఎగుమతి చేస్తుంది. వరి, ప్రత్తి, అరటిపండ్లు, చెరకు, గోధుమలు, మొక్కజొన్న వ్యవసాయ ఉత్పత్తులు.ఫసిఫిక్ తీరంలో పశువుల పెంపకం సాగిస్తారు.
ఆహారపానీయాల తయారీ, జవుళీ, హస్తకళలు ప్రజల జీవనోపాదులు.
పెట్రోల్, నికెల్, అరుదైన కలప, చేపలు, హైడ్రోపవర్ సహజ సంపదలు.

haiti flag

Country : Haiti

Capital Port-au-Prince ………. Language French/ Haitian Creole ………. Currency Haitian gourde ………. Calling Code + 509 ………. Religion Christian

హెయ్‌టీ

హెయ్‌టీ… కరేబియన్‌ద్వీపమైన హిస్పానియోలా భూభాగాన్ని పంచుకునే రెండు దేశాల్లో చిన్న దేశం. 1492లో క్రిస్టఫర్‌కొలంబస్‌మొదటిసారిగా ఈ దేశంలో అడుగుపెట్టాడు. 1804 జనవరి 1న ఫ్రాన్స్‌నుంచి స్వాతంత్య్రం పొందింది. 1804 – 1915 మధ్యలో 70 మందికిపైగా నియంతలు పరిపాలించారీ దేశాన్ని. అంటే ఈ 111 సంవత్సరాల వ్యవధిలో నియంతలదే అధికారం.
హెయ్‌టీ రాజధాని పోర్టా ప్రిన్స్‌జనాభా: 1,06,04,000. దేశం విస్తీర్ణం 27,750 చదరపు కిలోమీటర్లు భాష: ఫ్రెంచ్‌, హెయ్‌టియన్‌క్రియోల్‌కరెన్సీ హెయ్‌టియన్‌గౌర్డే. ఈ దేశం క్రిస్టియన్ దేశం
కరేబియన్‌ప్రాంతంలో అత్యధికంగా పర్వతాలున్న దేశమిది. అందుకే దీనికి ‘ల్యాండ్‌ఆఫ్‌ది మౌంటెన్స్‌’ అని పేరు. ఇక్కడ 8 వేల అడుగుల ఎత్తయిన పర్వత శిఖరాలుంటాయి. ప్రపంచ పురాతన జెండాల్లో ఈ దేశ జెండా ఒకటి. వివిధ జాతుల ఏకతను ఈ పతాక రంగులు సూచిస్తాయి. నీలం రంగు ఆఫ్రికా నుంచి వచ్చిన నల్ల జాతీయుల మూలాలకు గుర్తు. ఇక్కడ స్థిరపడిన విభిన్న ప్రాంత ప్రజలకు ఎరుపు రంగు చిహ్నం. దేశంలో 53 శాతం మందికి మాత్రమే చదవడం, రాయడం వచ్చు.
1950 నుంచి ఇక్కడి స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. 1915 అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌హెయ్‌టీ దేశంలో శాంతియుత పరిస్థితుల్ని తీసుకురావడం కోసం తమ నావికదళాన్ని పంపారు. 2010లో ఇక్కడ వచ్చిన భారీ భూకంపం రెండు లక్షల మందికిపైగా ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. ఎన్నో నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.
ఈ దేశంలోని విద్యార్థుల్లో 10 శాతం మంది మాత్రమే ఉన్నత పాఠశాలలో చేరుతారు. మిగిలిన వారంతా ప్రాథమిక పాఠశాలతోనే చదువు ఆపేస్తారు. పర్యటక రంగం ఇక్కడ అత్యధికంగా లాభాల్ని తెచ్చిపెట్టే పరిశ్రమ. దేశ దేశాల నుంచి లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ 15 ఏళ్లలోపు పిల్లలు 20 శాతం మంది కంటే తక్కువగా ఉంటారు.
కాఫీ, చెరకు, మామిడి పండ్లు, వరి, కర్రపెండలం దుంపలు పండుతాయి
బాక్సైట్, రాగి, బంగారం, మార్పుల్స్ సహస సంపదలు

honduras flag

Country : Honduras

Capital Tegucigalpa ………. Language Spanish ………. Currency Lempira ………. Calling Code + 504 ………. Religion Roman Catholic

హోండూరాస్….

హోండూరాస్ మధ్య అమెరికాలోని స్వతంత్ర గణ రాజ్యం. ఒకప్పుడు స్పెయిన్ వలస రాజ్యం. 250 AD నుండి 900AD వరకు మయాన్ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. 1821వ సంవత్సరంలో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 1,12, 088 చ.కి.మీ.. ఈ దేశ రాజధాని టెగుసిలల్ఫా. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ lempira. 80 శాతం మంది ప్రజలు మెస్టిజో అనే సంకరజాతులవారు, రెడ్ ఇండియన్ లతో సంకరణం చెందిన స్పెయిన్ దేశీయులు, నీగ్రో జాతివారున్నారు.
ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. ప్రజలు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు .
పటూకా నది, అగౌన్ నది, సికో నది, గేయాసీ నది, ఉలా నది జలాధారాలు. .
హోండూరాస్ అరటిపండ్ల దేశంగా ప్రసిద్ధి చెందినది. అరటిపండ్లను ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తారు. అరటిపండ్ల ఎగుమతికి వీలుగా రైల్వే వ్యవస్ధ కూడా ఉన్నది. .
కాఫీ, పొగాకు, మొక్కజొన్న, ప్రత్తి, వరి, చెరకు ప్రధానమైన పంటలు. .
వెండి లభ్యత ఉంది. కలప పరిశ్రమ, ఆహారపానీయాలు, సిగరెట్ల తయారీ, బీరు, సారాయి, సిమెంట్, పంచదార, నూలు వస్త్రాలు ముఖ్యమైన పరిశ్రమలు.

jamaica flag

Country : Jamaica

Capital Kingston ………. Language English ………. Currency Jamaican dollar ………. Calling Code + -875 ………. Religion Christian

జమైకా

జమైకా కరీబియన్‌సముద్రంలో ఉన్న పెద్ద ద్వీప దేశాలలో మూడవది . సార్వభౌమ దేశమే అయినా లాంఛన చక్రవర్తిగా బ్రిటన్‌ఎలిజబిత్‌వ్యవహరిస్తారు. 1494 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దేశ ఉనికిని కనుగొన్నాడు. ఈ రాజధాని కింగ్‌స్టన్‌. దేశ జనాభా 29,50,210 . ఈ దేశ విస్తీర్ణం 10,991 చదరపు కిలోమీటర్లు వీరి భాష ఆంగ్లం. కరెన్సీ జమైకన్‌డాలర్‌. ఈ దేశం క్రిస్టియన్ దేశం. .
ఈ దేశ జెండాలోని నలుపు రంగు కష్టాలను అధిగమించడానికి సూచన అయితే, బంగారువర్ణం సహజ సంపదకూ, సూర్యకాంతికీ గుర్తు, ఆకుపచ్చ రంగు ఆశాభావానికీ, వ్యవసాయ వనరులకూ సూచన. 1962 సం. ఆగస్ట్ 6 తేదీన జమైకా గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ప్రపంచంలోనే అత్యధిక చర్చిలున్న ప్రాంతమిది. 1600 చర్చిలతో గిన్నిస్‌రికార్డుకెక్కింది. ఉత్తర అమెరికా, కెనడాల తర్వాత అత్యధిక శాతం ప్రజలు ఆంగ్లం మాట్లాడేది ఇక్కడే. 116 దేశాల్లోని ప్రజలు వీసా లేకున్నా జమైకాకు వెళ్లవచ్చు. ఇలా అనుమతి లభించిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సీతాకోక చిలుక ‘స్వాలోటేల్‌’ నివాసం ఈ దేశమే. ఇక్కడ కేవలం ఎనిమిది జాతుల పాములు ఉంటాయి. అవి కూడా విషరహితమైనవి. 1872లో చెరకు తోటలను ధ్వంసం చేస్తున్న ఎలుకల్ని చంపడానికి ఈ ప్రాంతానికి ముంగిసల్ని తీసుకొచ్చారట. ఎలుకలతో పాటు అవి పాముల పని కూడా పట్టడంతో ఈ దీవిలో పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది.
ప్రఖ్యాత పరుగుల వీరులు ఉస్సేన్‌బోల్ట్‌, యోహాన్‌బ్లేక్‌లు ఇక్కడి వారే. 200కి పైగా ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అరటి పండ్లని ఎగుమతి చేసే దేశం ఇదే. జేమ్స్‌బాండ్‌సృష్టికర్త ఇయాన్‌ఫ్లెమింగ్‌జమైకాలోనే ‘గోల్డెన్‌ఐ’ పేరిట సొంత ఇల్లు కట్టుకున్నారు.
ప్రాచుర్యం పొందిన ‘రెగే’ సంగీత శైలి పుట్టింది ఇక్కడే. ఈ ద్వీపదేశం చిన్నదే అయినా పర్యటకానికి పేరు పొందింది. ఏటా పదిలక్షలకు పైగా పర్యాటకులు వస్తుంటారు.

mexico flag

Country : Mexico

Capital Mexico City ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 52 ………. Religion Roman Catholism

మెక్సికో

మెక్సికో రాజధాని మెక్సికో నగరం. మెక్సికో నగరం ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల నగరాల్లో ఒకటి. దేశ జనాభా 11,95,30,753 ఈ దేశ విస్తీర్ణం 19,72,550 చదరపు కిలోమీటర్లు. వీరి భాష స్పానిష్‌. అధికారిక భాషలు 68. కరెన్సీ మెక్సికన్‌పెసో. కరెన్సీ నోట్లపై బ్రెయిలీ లిపిలో గుర్తులు ఉంటాయి మెక్సికో జనాభాపరంగా పదకొండో అతిపెద్ద దేశం, వూబకాయులు అధికంగా గల దేశం. ఈ దేశం క్రిస్టియన్ దేశం. దేశంలో 89 శాతం మంది ప్రజలు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు
ఈదేశ జెండాలోని పచ్చ, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండి మధ్యలో ‘కోట్‌ఆఫ్‌ఆర్మ్స్‌’ ఉంటుంది. ఆకుపచ్చ ఆశావహ దృక్పథానికి, తెలుపు ఐక్యతకు, ఎరుపు రంగు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికీ ప్రతీకలు. అమెరికాలో ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్‌. అది 1836లో మెక్సికో నుంచి విడివడి స్వతంత్రం ప్రకటించుకుంది. తర్వాత 1845లో అమెరికాలో కలిసిపోయింది.
అమెరికా, మెక్సికోలది ప్రపంచంలోనే అతి పెద్ద రెండో సరిహద్దు రేఖ. దీని నుంచి చాలా మంది మెక్సికన్లు సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాకు వలస వెళుతుంటారు. ఈ దేశం మొత్తానికి ఒకే ఒక ఆయుధాల దుకాణం ఉంది. మిగిలినవన్నీ అమెరికా నుంచి అక్రమంగా దిగుమతి అవుతాయి. ఏటా అమెరికా, మెక్సికో సరిహద్దులో రెండు దేశాలకూ ఒక వాలీబాల్‌మ్యాచ్‌జరుగుతుంది. ఈ కోర్టు సగభాగం ఆ దేశంలో, సగ భాగం ఈ దేశంలో ఉంటుంది.
.పిరమిడ్లనగానే అందరికీ ఈజిప్టు గుర్తొస్తుందిగానీ ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్‌ఉన్నది మాత్రం ఇక్కడి చోలులాలోనే. ఇక్కడి కళాకారులు తమ కళారూపాల్ని ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు.
పాప్‌కార్న్‌, చాక్లెట్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ దేశమే. మిరపకాయ పుట్టింది కూడా ఇక్కడే. మెక్‌డొనాల్డ్స్‌బర్గర్లపై వాడే నువ్వుల్లో 75శాతం ఇక్కడే సాగవుతాయి.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఒకప్పుడు మెక్సికోదే. 1848లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం తర్వాత అది అమెరికా సొంతమైంది. 1945లో ఇక్కడొక రైతు పొలంలో అకస్మాత్తుగా అగ్ని పర్వతం బయటకు పుట్టు కొచ్చింది. ఒక్కవారంలోనే ఐదంతస్తుల భవనమంత, ఏడాదిలోగా 1,100 అడుగుల ఎత్తు పెరిగిపోయింది.
అస్సలు జుట్టు లేకుండా ఉండే జోలోటిజ్‌క్యుంట్లి జాతి శునకాలు ఇక్కడివే. ఇది ఈ దేశ జాతీయ శునకం కూడా ‘వాల్కెనో రేబిట్‌’ అనేది ఇక్కడ మాత్రమే కనిపించే అరుదైన కుందేలు. ప్రపంచంలో ఉన్న జీవ జాలంలో 10 నుంచి 12శాతం ఇక్కడే ఉంది. ఇక్కడ మొత్తం రెండు లక్షలకు పైగా జీవులు ఉన్నాయి. 67జాతీయ పార్కులు కూడా ఉన్నాయి.
మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్, వరి, ప్రత్తి, కాఫీ, పండ్లు, టమాటోలు పండిస్తారు. పశుమాంసం, కోళ్ల పరిశ్రమ, పాల ఉత్పత్తులు ఇతరాలు.
పెట్రోలియం, వెండి, రాగి, బంగారం, జింక్, సహజ వాయివు, కలప ఈ దేశంలో లభించే సహజ సంపదలు.

nicaragua flag

Country : Nicaragua

Capital Managua ………. Language Spanish ………. Currency Córdoba ………. Calling Code + 505 ………. Religion Roman Catholicism

నికరాగ్వా

నికరాగ్యా మధ్య అమెరికాలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. ఈ దేశానికి ఉత్తరాన హోండూరస్, తూర్పున కరేబియన్ సముద్రం, దక్షిణాన కోస్టారికా, పశ్చిమాన ఫసిఫిక్ సముద్రం సరిహద్దులు. దేశ రాజధాని మనగ్యా. ఈ దేశ విస్తీర్ణం 1,30,375 చ.కి.మీటర్లు. వీరి భాష స్పానిష్ ఈ దేశ కరెన్సీ కర్డోబా. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. ప్రజలలో 72.9 శాతం మంది రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. 15 శాతం మంది ఎవాంజిలికల్ సంప్రదాయాన్ని పాటిస్తారు
1821 సంవత్సరలో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశానికి మధ్య అమెరికా ఉష్ణమండల స్వర్గం అనిపేరు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు నికరాగ్యా.
మధ్య అమెరికాలోని ప్రఖ్యాత నృత్యం పాలో డి మాయో పుట్టింది ఇక్కడే. ఇక్కడి ప్రపలు స్పానిష్, ఆంగ్ల భాషలతో పాటు కొన్ని స్థానిక భాషలను, వేల సంవత్సరాలనాటి మయాన్ భాషను కూడా మాట్లాడతారు.
నికరగ్యాకు భారతదేశానికి అవినాభావ సంభందం ఉన్నది. భారతదేశం నుండి నికరాగ్యాకు వలస వచ్చిన తెగ పేరు నికరా. అగ్యా అంటే స్పానిష్ భాషలో నీళ్లు అని అర్థం. వీటి మీదే ఈ దేశానికి నికరగ్యా అనే పేరు వచ్చింది.
మధ్య అమెరికా మొత్తంలో అతి ప్రాచీనమైన నగరం ఉన్నది ఈ దేశంలోనే. దీని పేరు రూయిన్స్ ఆఫ్ లియోన్ వైజో. ఇది 1500 వందల సంవత్సరాల క్రితం నాటిది. లేక్ నికరాగ్వా అతి పెద్దదైన సహజసిద్ధమైన సరస్సు. ఇందులో 430 అగ్నిపర్వత ద్వీపాలున్నాయి. అంతేకాకుండా ఇది మంచి పర్యాటక ప్రాంతం. తాగునీటిని ఎంతో మందికి అందిస్తుంది.
కాఫీ, అరటిపండ్లు, చెరకు, ప్రత్తి, వరి, మొక్కజొన్న, పొగాకు, నువ్వులు, సోయాబీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోళ్ల పరిశ్రమ, పందిమాంసం, పాల ఉత్పత్తులు ఇతరాలు.
బంగారం, వెండి, రాగి. టంగ్ స్టన్, జింక్, సీసం, కలప, చేపలు సహజ వనరులు.

panama flag

Country : Panama

Capital Panama City ………. Language Spanish ………. Currency Balboa ………. Calling Code + 507 ………. Religion Roman Catholicism

పనామా…

మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. కోస్టారికా, కొలంబియా, అట్లాంటిక్ సముద్రం(కరేబియన్ సముద్రం), పసిఫిక్ మహా సముద్రాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ అధికారిక భాష స్పానిష్ అయినా ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడతారు. వీరి అధికారిక కరెన్సీ బాల్బో. ఒక బాల్బో ఒక అమెరికన్ డాలర్కు సమానం. అయితే దీనికి బదులు ఇక్కడ అమెరికా డాలరే చలామణీలో ఉంటుంది. రాజధాని పనామా సిటీ మరియు అత్యంత పెద్ద నగరం కూడా. దీనిలోనే వర్షాధార అడవులూ ఉన్నాయి. ఇలాంటి అడవులున్న రాజధాని నగరం ప్రపంచంలో ఇదొక్కటే.దేశ విస్తీర్ణం 75,417 చ. కిలోమీటర్లు. ప్రజలలో రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని 85 శాతం మంది, 15 శాతం మంది ప్రొటెస్టంట్ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.
ఈ దేశం రెండు స్వాతంత్య్ర దినోత్సవాల్ని జరుపుకొంటుంది. పదహారో శతాబ్దం నుంచి 1821 వరకూ స్పెయిన్ వారి అధీనంలో ఉండి అప్పుడు స్వతంత్రం పొందింది. మళ్లీ కొలంబియా పాలకుల చేతుల్లోకి వెళ్లి 1903లో స్వతంత్రాన్ని పొందింది.
వస్తురవాణా ఓడలు, పెట్రోలియంని శుద్ధి చేసి ఎగుమతి చేయడం, పర్యాటకం..పనామా ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. దాదాపుగా 1500మైళ్ల తీర రేఖ ఉంది.
ఈ దేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. పనామా ఉష్ట మండల దేశం. ఎత్తయిన పర్వతాలు, అందమైన ఇసుక బీచ్లతో ఉంటుంది. విదేశీయులూ ఇక్కడ ఇళ్లు కొనుక్కునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే స్థానిక చట్టాల ప్రకారం ఇక్కడ విదేశీయులు ఎవరైనా ఇళ్లు కొనుక్కోవచ్చు. పెట్టుబడులూ పెట్టొచ్చు.
రెండు మహా సముద్రాల మధ్యలో అతి సన్నగా ఉన్న ఇక్కడి. భూభాగం పొడవు 80 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న చోట నుంచే పసిఫిక్ మహా సముద్రంలోంచి సూర్యోదయాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో సూర్యాస్తమయాన్ని వేరువేరు సమయాల్లో చూడవచ్చు. ఇలాంటి దృశ్యం కనిపించే దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
నట్ కార్వింగ్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన కళ. చిన్న గింజలపై రకరకాల ఆకారాలు చెక్కి వాటిని అమ్ముతారు. సముద్ర జీవులు, మాంసం, గుడ్డు, గోధుమపిండిని ఉపయోగించి చేసుకునే వంటల్ని ఇక్కడ ఎక్కువగా తింటారు. గుడ్డు ఆమ్లెట్లో మాంసం కూరి చేసే ఫ్రైడ్ యోకాని వీరు ఇష్టంగా తింటారు
ఈ దేశంలో ప్రధానంగా రెండే కాలాలు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకూ డ్రై సీజన్ అని, మే నుంచి నవంబర్ వరకూ రెయినీ సీజన్ అనీ పిలుస్తారు. అయితే వర్షపాతం అధికం.
చాలా సార్లు హారికేన్ల తాకిడి వల్ల ఎక్కువగా నష్టపోతుంటుంది.
ఇక్కడ పది వేలకుపైగా మొక్క జాతులు, పద్నాలుగు వందల రకాల ఆర్కిడ్లు, పదిహేను వందల రకాలకుపైగా వృక్ష జాతులూ ఉన్నాయి.
మొత్తం 976 పక్షి జాతులు ఉన్నాయి. అమెరికా, కెనడాల్లో ఉన్న పక్షిజాతుల సంఖ్య కంటే ఇదే ఎక్కువట.
అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాల మధ్య కృత్రిమంగా నిర్మించినదే పనామా కాలువ. ఈ రెండు సంద్రాల మధ్యలో ఓడల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ దేశం గుండా ఈ కాలువను ఏర్పరచారు. రెండు మహా సముద్రాల మధ్య దీని ద్వారా ఓడలు తిరుగుతాయి.
ఈ కాలువ పై మూడు లాకులు ఉన్నాయి. ఓడలు వచ్చినప్పుడల్లా వాటి గేట్లను పైకెత్తుతారు. దీని నుంచి వెళ్లేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది. ఈ దారి తెరుచుకున్నప్పుడు అంటే 1914లో ఏడాదికి వెయ్యి ఓడలు దీని ద్వారా ప్రయాణించేవి. అయితే 2012 లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇప్పుడు ఎనిమిది లక్షల పై చిలుకుకు చేరింది.
ఈ కాలువ ద్వారా వెళ్లే ఓడలన్నీ ఈ దేశానికి టోల్ కట్టాల్సి ఉంటుంది. ఓడను బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి టోల్ ఫీజు నిర్ణయిస్తారు. ఈ టోల్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోట్లలో కూడా ఉంటాయి.
అరటిపండ్లు, వరి, మొక్కజొన్న, కాఫీ, చెరకు కూరగాయలు పండిస్తారు. పశు సంపద కలదు.
రాగి, మహాఘని అడవులు, రొయ్యలు, హైడ్రోపవర్ సహజ సంపదలు.

Saint Kitts and Nevis

Country : Saint Kitts and Nevis

Capital Basseterre ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + +1 869 ………. Religion Christian

సెయింట్ కిట్స్ – నెవిస్

ఈ దేశం కరేబియన్ సముద్రంలో ఉన్న రెండు చిన్న దీవులు. జనభా పరంగా, వైశాల్యం పరంగా ఉత్తర అమెరికాలో చిన్నవి. 1493 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దీవుల ఉనికిని కనిపెట్టాడు.
1623 సంవత్సరంలో ఇంగ్లీష్ వారు ఈ దీవులలో ప్రవేశించి దీనిని బ్రిటీష్ కాలనీగా మార్చారు. కరేబియన్ దీవులలో మొదటి బ్రిటీష్ కాలనీ ఇదే. తరువాత ఈ దీవుల మీద ఆదిపత్యం కోసం బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వారి మద్య చాలా సంవత్సరాల పాటు ఖర్షణ జరిగింది. కానీ ఈ దీవుల మీద బ్రిటీష్ వారి ఆధిపత్యం కొనసాగింది. చివరకు 1983 సంవత్సరంలో ఈ దీవులు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నాయి.
ఈ దేశ విస్తీర్ణం269 చ.కి.మీ. రాజధాని బస్సే-టెర్రే. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రోజాతికి చెందినవారు 90 శాతం మంది ఉన్నారు. భారతీయులు 3 శాతం మంది, సంకరజాతులు 5 శాతం మంది ఉన్నారు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. 76 శాతం మంది క్రైస్తవాన్ని అనుసరిస్తారు. వీరి కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్.
చెరకు, కొబ్బరి, పండ్లు, వేరుశెనగ, చేమదుంపలు, వరి,అరటి, ప్రత్తి పంటలను సాగుచేస్తారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమలు కలవు. పంచదార, మొలాసిస్ ముఖ్యమైన పరిశ్రమలు. వ్యవసాయ యోగ్యమైన భూములు కలవు.

Saint Lucia

Country : Saint Lucia

Capital Castries ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + +1 758 ………. Religion Roman Catholic

సెయింట్ లూసియా…

సెయింట్ లూసియా కరేబియన్ సముద్రంలో ఒక ద్వీపదేశం. మొదటగా అమెరికన్లు ఈ దీవులలో నివాసం ఏర్పరుకున్నారు. తరువాత ఈ దీవి కరీబియన్ల అధికారంలోకి వెళ్లింది. 15, 16 వ శతాబ్ధాలలో స్పానిష్ వారు కూడా ఈ దీవులలోకి వచ్చారు.
1815 సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈ దీవులకు వచ్చి పంచదార పరశ్రమను స్తాపించారు. 1979 సంవత్సరలో ఈ దేశం తెల్ల వారి నుండి పూర్తి స్వాతంత్రం సంపాదించుకుంది.
ఈ దేశ రాజధాని కాస్త్రీస్. ఈ దేశ వైశాల్యం 617 చ.కి.మీ. వీరి భాష ఇంగ్లీష్. ఫ్రెంచ్ పెష్యో. ప్రజలు నీగ్రో జాతికి చెందినవారు. ఇది క్రైస్తవ మతానికి చెందిన దేశం.
అరటి, మామిడి, కొబ్బరి, చిలగడ దుంపలు, నారింజ, కోకో, అల్లం, కూరగాయలు ముఖ్యమైన పంటలు. అరటి పండ్లను ఎగుమతి చేస్తారు. పశువుల పెంపకం చేపల వేట. ప్రజల జీవనోపాధి.
కాగితం, బోర్డు, పానీయాలు, ఆటవస్తువులు ముఖ్యమైన పరిశ్రమలు.

Saint Vincent and the Grenadines

Country : Saint Vincent and the Grenadines

Capital Kingstown ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + +1 784 ………. Religion Christian

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్…

కరేబియన్ సముద్రంలోని వెస్ట్ ఇండీస్ లో ఉన్న ఒక ద్వీపదేశం ఇది. 1979 సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 369 చ.కి.మీ. ఈ దేశ రాజధాని కింగ్స్ టౌన్. వీరి భాష ఇంగ్లీష్. వీరి కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. 74 శాతం మంది నీగ్రో జాతులకు చెందినవారు. ఇది క్రిస్టియన్ దేశం.
అరటి, కొబ్బరి, చిలకడ దుంపలు, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం కలదు.
హైడ్రోపవర్, వ్యవసాయ భూములు సహజ సంపదలు.

Trinidad and Tobago

Country : Trinidad and Tobago

Capital Port of Spain ………. Language English ………. Currency Trinidad and Tobago Dollar ………. Calling Code + +1 (868) ………. Religion Christian/Hindu

ట్రినిడాడ్ మరియు టుబాగో….

వెస్ట్ ఇండీస్ దీవులలో ప్రధానమైన ద్వీప దేశం ఇది. ఒకప్పుడు బ్రిటీష్ వారి వలసరాజ్యం. 1962 సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకొని 1976 సం.లో గణతంత్ర రాజ్యంగా మారింది.
ఈ దేశ విస్తీర్ణం 5,124 చ.కి.మీ. రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. వీరి భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రో జాతి వారికి చెందినవారు. రెడ్ ఇండియన్స్ కూడా ఉన్నారు. కేధలిక్స్ 26 శాతం మంది హిందువులు 22.5 శాతం మంది మిగతా వారు అనేక జాతులకు చెందినవారు. ఈ దేశంలో క్రిస్టియన్స్ మరియు హిందువులు దాదాపు సమానంగా ఉన్నారు.
చెరకు, నిమ్మ, కోకో, వరి, కాఫీ, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్ల పరిశ్రమ కలదు.
పెట్రోలియం, సహజవాయివు, ఆస్పాల్ట సహజ వనరులు.
అందమైన ప్రకృతి దృశ్యాలతో విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న పర్యాటక దేశం.

united states of america

Country : United States of America

Capital Washington, D.C. ………. Language English ………. Currency United States dollar ………. Calling Code + 1 ………. Religion Christian

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

ప్రపంచంలోనే ఆగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా ఉత్తర అమెరికా ఖండంలోని దేశం. మొత్తం 50 రాష్ట్రాలతో ఉండే ఈ దేశానికి ఉత్తర దిశలో కెనడా, దక్షిణ దిశలో మెక్సికో దేశాలు భూ సరిహద్దులు. దీన్ని అమెరికా అనీ, యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనీ పిలుస్తారు. ఈ దేశం ఒకప్పుడు బ్రిటీష్ కాలనీ 1776 సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్రం సంపాదించుకుం.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి. జనాభా 32,53,65,189. వైశాల్యం 98,33,520 చదరపు కిలోమీటర్లు. వైశాల్యపరంగా ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశమిది. కరెన్సీ డాలర్. ఈ దేశంలో ఎక్కువగా ఆంగ్లమే మాట్లాడుతారు. ప్రభుత్వం కూడా ఈ భాషనే వాడుతుంది. కానీ ఈ దేశానికి అధికారిక భాష మాత్రం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. ఈ దేశం మొత్తంలో ఎక్కువమంది జనాభా ఉన్న రాష్ట్రం న్యూయార్క్. .
ప్రఖ్యాత నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను 1492లో ఈ దేశం యొక్క ఉనికిని కనుగొన్నాడు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘న్యూ వరల్డ్’ అని పిలుచుకునేవారు. కొలంబస్ను అనుసరించిన మరో నావికుడు ‘అమెరిగో వెస్పు’ ఈ ప్రాంతం గురించి చాలా పుస్తకాలు రాశారు. ఆయన పేరుమీదుగానే ఈ దేశానికి ‘అమెరికా’ అనే పేరు స్థిరపడింది. .
దక్షిణ కరోలినా తీరంలో మొత్తం కోతులతో నిండిన ఒక ద్వీపం ఉంది. పిజ్జా ఇక్కడి వారి ఇష్టమైన ఆహారం. వీరు ఒక్క రోజులో తినే పిజ్జాలు 100 ఎకరాల్లో సరిపోతాయి. ప్రతి సెకనుకు 100 పౌండ్ల చాక్లెట్లు తినేస్తారు దాదాపు 46 కిలోలు.
  అమ్యూజ్మెంట్ పార్కులో ఉండే ఫెర్రిస్ వీల్ ను ఈ దేశానికి చెందిన జార్జ్ వాషింగ్టన్ గాలె ఫెర్రిస్ అనే ఆయన కనిపెట్టారు. విద్యుద్దీపం, ఏసీ, విమానం వంటి ఎన్నో ప్రముఖ ఆవిష్కరణలయ్యింది ఈ దేశంలోనే. వీటితో పాటు జిప్, ట్రాఫిక్ సిగ్నల్, మైక్రోఓవెన్, ఎల్ఈడీ లైట్లు పుట్టిందీ ఇక్కడే.
నయాగరా జలపాతం, మిస్సిసీపీ నది అమెరికా పేరు వినగానే గుర్తొచ్చే ప్రకృతి అందాల ప్రాంతాలు. అమెరికా అనగానే లిబర్టీ విగ్రహం గుర్తుకు వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ లిబర్టీ విగ్రహం స్వేచ్ఛను చాటుతుంది. దీన్ని ఫ్రాన్స్ బహుమతిగా ఇచ్చింది. యు.ఎస్.ఎ. ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా రూపు దిద్దుకున్న ఈ విగ్రహాన్ని 1886లో నిల బెట్టారు. దీనిని ప్రఖ్యాత శిల్పి ఆగస్టీ బార్థోల్డి రూపొందించారు జీన్ ప్యాంట్ కనిపెట్టబడింది అమెరికాలోనే. లేవీ స్ట్రాస్, జాకోబ్లు తయారు చేశారు. గట్టిగా ఉండే డెనిమ్ వస్త్రంతో 1873లో మొదటి జీన్స్ దుస్తులు తయారు చేశారు.
అమెరికాకు అలస్కా రాష్ట్రాన్ని 1867లో రష్యా అమ్మింది. రెండు సెంట్లకు ఒక ఎకరం చొప్పున. ఈ దేశంలోని రాష్ట్రాల్లో అలస్కానే పెద్దది.

%d bloggers like this: