ఆస్ట్రేలియా దేశాలు

austrilia flag

Country : Australia

Capital Canberra ………. Language English ………. Currency Australian Dollar ………. ……… Calling Code +. 61 ………. Religion Christian

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా ఖండం భూభాగాలతో పాటు టస్మానియా మరెన్నో ద్వీపాలతో ఉన్న దేశం. ఈ దేశానికి సరిహద్దులు పపువా, న్యూగినియా, ఇండోనేషియా, తూర్పు తిమోర్ , సాలమన్ ద్వీపాలు, పనాటూ, న్యూజిలాండ్ దేశాలు.ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా. ఈ దేశ విస్తీర్ణం 76,92, 024 చ. కి.మీటర్లు. వీరి కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. అధికారిక భాష ఆంగ్లం. ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం. విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో ఆరో పెద్ద దేశం.
ఈ దేశంలో క్రీయాశీలక అగ్నిపర్వతం ఒక్కటికూడా లేదు. ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములు 15 జాతులలో 10 రకాలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి.
పర్యాటకపరంగా అతి పెద్ద సముద్రతీరం కలిగి ఉన్న దేశం ఆస్ట్రేలియా. పదివేలకు పైగా బీచ్ లు ఉన్నాయి. ఆస్ట్రేలియా అనగానే వెంటనే కంగారులు గుర్తుకు వస్తాయి. ఇక్కడ ఉన్న కంగారులలో 60 జాతులున్నాయి. ఈ దేశ జనాభాకన్నా కంగారుల సంఖ్యే ఎక్కువ. గొర్రెల పెంపకం కూడా ఇక్కడా ఎక్కువే. 150 మిలియన్ల గొర్రెలున్నాయి. ఇవి కూడా ఈ దేశ జనాభాకన్నా ఎక్కువే.
ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్ మైదానం ఉన్నది. దీని పొడవు 850 మైళ్లు.
గోధుమలు, బార్లీ, చెరకు, పండ్లు పండిస్తారు. పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్లపెంపకం కలదు.
బాక్సైట్, బోగ్గు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, యురేనియం, నికెల్, టంగ్ స్టన్, జింక్, వజ్రాలు, సహజవాయువు, పెట్రోల్ సహజ. నిక్షేపాలు.

fiji flag

Country : Fiji

Capital Suva ………. Language English ………. Currency Fijian Dollar ………. ……… Calling Code +. 679 Religion Christian/Hindu

ఫిజీ దీవులు….

‘ఫిజీ’ అనే ఈ ద్వీప దేశం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మొత్తం 322 ద్వీపాల సమూహంతో ఈ దేశం ఏర్పడింది. 332 ద్వీపాల్లో 110 ద్వీపాల్లో మనుషులు నివసించడం లేదు. ఆస్ట్రేలియాకు ఈశాన్య దిశలో.. దక్షిణ అమెరికాకు పశ్చిమ దిశలో ఉన్న పసిఫిక్ మహా సముద్రం నడుమ ఈ ద్వీపాలున్నాయి. ఇక్కడ నివసించే జనాభాలో 38 శాతం మంది భారతీయులే. దేశ సాంప్రదాయాలను ఇక్కడ పక్కగా పాటిస్తారు. హిందూ దేవాలయాలను చాలా చోట్ల చూడవచ్చు.
ఫిజీ రాజధాని సువా. ఇక్కడ ఇంగ్లీష్, బు ఫిజీ, హిందీ భాషలు మాట్లాడతారు. దేశ వైశాల్యం 18,270 చ.కి.మీ. 52 శాతం మంది క్రిస్టియన్లు, 38 శాతం మంది హిందువులు, 8 శాతం మంది ముస్లింలు ఈ దేశంలో కలరు. బ్రిటీష్ వారి నుంచి విముక్తి పొందినా.. ఆ దేశం జెండాలను మార్చలేదు. ఇక్కడ ఇంకా క్వీన్ ఎలిజిబెత్ -2 చిత్రాలు ఉన్న నోట్లు, నాణాలనే నగదుగా వాడుతున్నారు.
ఇక్కడ చాలామంది ప్రజలు ఇండియా, ఇండో-ఫిజిన్స్. వీరంతా ప్రధాన ఐలాండ్ విటి లెవులో నివసిస్తున్నారు. ఫిజీలో హిందూ, క్రిస్టియన్ జనాభా ఎక్కువ
1874లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ దీవులను ఆక్రమించింది. ఈ దేశంలో చెరకు తోటల్లో పనిచేసేందుకు భారతీయ కూలీలను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడ భారత సంతతి జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. 1970లో బ్రిటీషు ప్రభుత్వం ఫిజీకి స్వాతంత్ర్యాన్నిచ్చింది. అప్పటి నుంచి ఈ దేశాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ ది ఫిజీ ఐలాండ్స్’ అని పిలుస్తున్నారు. ఇక్కడ ‘బులా’ అంటే ‘హలో’ అని అర్థం. అక్కడ అడుగుపెట్టే పర్యటకులను స్థానికులు ‘బులా’ అని పలకరిస్తారు. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.
ఈ ద్వీపంలోని విటీ ద్వీపంలో దాదాపు 8,00,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. చూట్టు సముద్రం.. మధ్యలో కొండలు, తీర ప్రాంతాలతో ఫిజీ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి ప్రజలు FIJIని ‘ఫన్ ఇన్ జంగిల్ ఐలాండ్’ అంటారు.
. ఫీజిలోని నది ప్రాంతంలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్య ఆలయం ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఫీజీలో స్థిరాస్తి వ్యాపారాలనేవి కనిపించవు. ఎందుకంటే అక్కడ 80 శాతం భూములు గ్రామ సంఘాల ఆధీనంలోనే ఉంటాయి. కేవలం పది శాతం స్థలాలను మాత్రమే విక్రయాలు, కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. మిగతావి నివాస స్థలాలు.
ఇక్కడ మట్టి రూపంలో ఉండే ద్రవాన్ని జాతీయ డ్రింక్గా తాగుతారు. చూసేందుకు ఇది బురద రూపంలో ఉంటుంది. ఈ ద్రవం తాగితే ఒత్తిడి, ఇన్సోమ్నియా, తలనొప్పి తగ్గుతుంది. ఇక్కడి ప్రజలు ఇక్కడ రగ్బీ ఆడతారు. ప్రజలు ఎక్కువగా మాంసం, చేపలను ఆహారంగా తీసుకుంటారు.
ఫిజీకి కేవలం విమానాల్లో మాత్రమే వెళ్లాలి. భారతదేశంలోని ముంబయి నుంచి ఫిజీకి విమానాలు అందుబాటులో ఉన్నాయి.
చెఱకు, కొబ్బరికాయలు, కర్రపెండలం దుంపలు, వరి, బంగాళా దుంనలు, అరటికాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశువులు, పందులు, గుర్రాలు, గొర్రెలను పెంచుతారు.
కలప, బంగారం, చేపలు సహజ సంపదలు

kirbati flag

Country : Kiribati

Capital Tarawa ………. Language English/Gilbetese ………. Currency Kiribati dollar/Australian dollar ………. ……… Calling Code +. 686 Religion Christian

కిరిబటి

కిరిబటి… పసిఫిక్‌సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీప దేశం. 33 దీవులతో ఉండే ఈదేశంలో 21 దీవుల్లో మాత్రమే జనాలుంటారు. ఈ దేశం భారతదేశంలోని హైదరాబాద్‌కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. దేశం మొత్తంలో లక్ష మందికి పైగా ప్రజలుంటారంతే.
కిరిబటి రాజధాని తరవా. ఈ దేశ విస్తీర్ణం 811 చదరపు కిలోమీటర్లు వీరి అధికార భాషలు ఆంగ్లం, గిల్బర్టీస్‌. కరెన్సీ ఆస్ట్రేలియన్‌డాలర్‌. రాజధాని తరవా, గిల్బర్టే దీవుల్ని 1941లో మొదటి సారిగా జపనీయులు కనిపెట్టారు. జనాభా మొత్తంలో 90 శాతం మంది గిల్బర్టే ద్వీపంలో ఉంటారు. 1979 జులై 12వ తేదీన బ్రిటీష్ వారినుండి ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది, దేశ ప్రజలలో 52 శాతం మంది క్రిస్టియన్లు.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పగడపు దీవులతో (కోరల్‌రీఫ్స్‌) ఉన్న దేశం ఇదే. దేశంలో సగం పగడపు దీవులే ఉంటాయి.
ఈ దేశంలో సముద్రమట్టానికి ఎక్కువ ఎత్తులో ఉన్న ఏకైక ద్వీపం బనబా. ఇది 266 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేశంలోని దీవుల్లో చాలావరకు సముద్ర మట్టానికి మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 1999లో టెబువా తరవా, అబనువా అనే చిన్నద్వీపాలు మునిగిపోయాయి కూడా. మరో 50 ఏళ్లలో ఈ దేశం కూడా మునిగిపోతుందని అనుకుంటున్నారంతా. అందుకే ఈ దేశ ప్రజల్ని వేరే దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ దేశంలో క్రిస్మస్‌దీవి వైశాల్య పరంగా ప్రపంచంలో అతి పెద్దది. ఈ దీవుల్లో క్రీస్తుపూర్వం 3000, క్రీస్తుశకం 1300 మధ్య కాలంలో మైక్రోనీషియన్స్‌అనే జాతి వారుండేవారట. కిరిబటి ప్రముఖ వేడుక ఏటా మార్చినెలలో జరిగే యప్‌డే ఫెస్టివల్‌.
చేపల ఎగుమతి, పర్యాటకం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.

marshal islands flag

Country : Marshal Islands

Capital Majuro ………. Language Marshallese/English ………. Currency US Dollar ………. ……… Calling Code +. 692 Religion Christian

మార్షల్ ఐల్యాండ్స్…..

పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపరాజ్యం మార్షల్ ఐల్యాండ్స్. 1986 అక్టోబర్ 21న స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ రాజధాని మజురో. మార్షలీస్ వీరి అధికార భాష. వీరి కరెన్సీUS డాలర్స్. ఈ దేశ విస్తీర్ణం 11,854 చ.కి.మీ. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది.
కొబ్బరి, టమాటోలు, మెలన్, టారో దుంపలు, పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. పందులు, కోళ్లను పెంచుకుంటారు.
కొబ్బరి ఉత్పత్తులు, సముద్రపు ఉత్పత్తులు, సముద్రపు మినరల్స్ వీరి సహజ సంపదలు.

micronesia flag

Country : Micronesia

Capital Palikir ………. Language English ………. Currency US Dollars ………. ……… Calling Code +. 691 Religion No Religion

మాక్రోనేసియా…

మాక్రోనేసియా పశ్చిమ పసిఫిక్ సముద్రతీరాన గల 600 దీవులతో ఏర్పడిన దేశం. ఈ దేశ రాజధాని పాలికిర్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు మాట్లాడే ఇతర భాషలు Trukese, Pohnpeian, Yapese, Kosrean, Ulithian, Woleaian, Nukuoro, Kapingamarangi.
ఈ దేశ కరెన్సీ అమెరికన్ డాలర్స్. ఈ దేశ ప్రజలలో రోమన్ కేథలిక్స్ 50 శాతం, ప్రొటెస్టంట్లు 47 శాతం, ఇతరులు 3 శాతం మంది కలరు. ఈ దేశ వైశాల్యం 702 చ.కి.మీ. 1986 నవంబర్ 3న ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
నల్లమిరియాలు, కొబ్బరి, కర్రపెండలం, ఉష్టమండలానికి సంబంధించిన పండ్లు, కూరగాయలు, బంగాళాదుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం, కోళ్లపెంపకం కలదు. చేపలు విరివిగా దొరకుతాయి.
అడవులు, సముద్రపు ఉత్పత్తులు, పాస్ఫేట్ సహజసంపదలు.

nauru flag

Country : Nauru

Capital Yaren ………. Language Nauruan/English ………. Currency Australian dollar ………. ……… Calling Code +. 674 Religion Christian

newzeland flag

Country : New Zealand

Capital Wellington ………. Language English ………. Currency New Zealand dollar ………. ……… Calling Code +. 64 Religion Christian

న్యూజిల్యాండ్….

ఆస్ట్రేలియాకు ఆగ్నేయ దిశలో దాదాపు 2000 కి.మీ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపరాజ్యం. న్యూజీల్యాండ్ రాజధాని వెల్లింగ్ టన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. దేశ విస్తీర్ణం 2,67,515 చ. కి.మీటర్లు. కరెన్సీ న్యూజీల్యాండ్ డాలర్స్. ఆక్లాండ్, క్రీస్ట్ చర్చ్ ఇతర ముఖ్యపట్టణాలు. న్యూజీల్యాండ్ క్రిస్టియన్ దేశం.
న్యూజిల్యాండ్ ప్రజల ప్రధాన వృత్తి పాడి పరిశ్రమ. గొర్రెలను పెంచి ఉన్ని, మాంసాన్ని ఎగుమతి చేస్తారు. అనేక రకాల పాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మత్స్యపరిశ్రమ చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. జవుళీ పరిశ్రమ మొటారు కారుల తయారీ, కాగితం పరిశ్రమలు ఉన్నాయి.
గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు, మొక్కజొన్న, ఓట్ ధాన్యం పండిస్తారు.
జలవిద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. పారిశ్రామికంగా అభివృద్ది చెందిన దేశం.

palau flag

Country : Palau

Capital Ngerulmud ………. Language English, Palauan ………. Currency US Dollar ………. ……… Calling Code +. 680 Religion Christian

పలావ్

పలావ్ ఫిలిఫైన్స్ కు ఆగ్నేయ దిశలో 500 మైళ్ల దూరంలో ఉన్న ద్వీపరాజ్యం. 200 ద్వీపాల సమూహం. 1994 సంవత్సరంలో అమెరికా నుండి స్వాతంత్ర్యం పొందినది. ఈ దేశ రాజధాని Koror. వైశాల్యం 458 చ.కి.మీ. ప్రజలలో ఎక్కువ మంది రోమన్ కేథలిక్స్ మరియి ప్రొటెస్టంట్లు. వీరి కరెన్సీ అమెరికన్ డాలర్స్. వీరి అధికార భాష Palauan.
కొబ్బరి, కర్రపెండలం, చిలకడ దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. చేపలు దొరకుతాయి.
అడవులు, సముద్రపు ఉత్పత్తులు, బంగారం, మినరల్స్ సహజ సంపదలు.
ఈ దేశం పర్యాటక పరంగా కూడా పేరుపొందినది. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది. పర్యాటకం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.

papua new guines

Country : Papua New Guinea

Capital Port Moresby ………. Language Hiri Motu Tok Pisin ………. Currency Papua New Guinean ………. ……… Calling Code +. 675 Religion Christian

పపువా న్యూ గినియా

పపువా న్యూగినియా ఒక దీవి. ప్రజలు 850 భాషలకు పైనే మాట్లాడుతారు. అంటే ప్రపంచ భాషల్లో పదో వంతు భాషలు మాట్లాడేది ఇక్కడే. అధికారిక భాష ఆంగ్లమే అయినా ఎక్కువగా స్థానిక భాషలే చలామణిలో ఉంటాయి.
ఈ దేశ రాజధాని పొర్ట్‌మెర్సిబ్‌ జనాభా 80,83,700 (2018) ఈ దేశ విస్తీర్ణం 4,62,840 చదరపు కిలోమీటర్లు కరెన్సీ పపువా న్యూ గినియా కినా(పీజీకే). పట్టణాల్లో ఉండేవారు కేవలం పద్దెనిమిది శాతం మందే. 1933 వరకు సముద్రపు గవ్వల్ని కరెన్సీగా వాడేవారు. ఎక్కువమంది క్రిస్టియన్లు. జెండాలో బంగారు వర్ణంలో ఉండే ప్యారడైజ్‌పక్షి బొమ్మ స్థానిక గిరిజనులకు చిహ్నం. 1971లో ఈ జెండాను 15 ఏళ్ల సుసాన్‌అనే అమ్మాయి రూపొందించింది.
ప్రపంచంలోనే తొలిసారిగా వ్యవసాయం చేసిన దేశాల్లో ఇదీ ఒకటి. సుమారు ఆరున్నర వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ పంటలు పండించిన ఆధారాలున్నాయి. ఇక్కడి ‘కుక్‌’ అనే వ్యవసాయ క్షేత్రం పురాతనమైనది. ప్రపంచ వారసత్వపు జాబితాలో చేర్చారు. ఇక్కడ బర్డ్‌ఆఫ్‌ప్యారడైజ్‌పక్షులతో పాటు 750కి పైగా ఇతర పక్షి జాతులున్నాయి. ప్రపంచంలోనే విషపూరితమైన పక్షి హుడెడ్‌పితోహు ఈ ప్రాంతానికి చెందినదే.
కాఫీ, కోకో, టీ ఆకులు, చెరకు, బంగాళా దుంపలు, పండ్లు, రబ్బర్, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు
బంగారం, రాగి, వెండి, సహజవాయులు ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.

samoa flag

 Samoa

Capital Apia ………. Language Tala ………. Currency Samoan/English ………. ……… Calling Code +. 685 Religion Christian

సమోవా

సమోవా పసిఫిక్ సముద్రానికి దక్షిణ దిశలో ఉన్న ద్వీపరాజ్యం. ఈ దేశం రెండు భాగాలుగా విభజింపబడింది. తూర్పు సమోవాను అమెరికన్లు ఆక్రమించారు. ఈ ప్రాంతాన్ని అమెరికన్ సమోవా అంటారు. పశ్చిమ భాగాన్ని జర్మన్లు ఆక్రమించారు. దీనిని జర్మన్ సమోవా అంటారు. 1962 సంవత్సరంలో సమోవా స్వతంత్రదేశంగా అవతరించింది.
సమోవా రాజధాని అపివా. దేశ వైశాల్యం 2,944 చ.కి.మీ. వీరి అధికార భాష సమోవాన్ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ తాలా. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
కొబ్బరి, అరటి, టారో దుంపలు(చేమదుంపలు), కాఫీ, కోకోవా, చిలకడ దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు.

solomom islands flag

Country : Solomon Islands

Capital Honiara ………. Language English ………. Currency Solomon Islands dollar ………. ……… Calling Code +. 677 Religion Christian

సోలమన్‌ ఐలాండ్స్‌

పసిఫిక్‌ మహా సముద్రంలో దక్షిణాన ఉన్న ద్వీపదేశం సోమన్‌ ఐల్యాండ్స్‌. ఆస్ట్రేలియాకు ఈశాన్యంవైపు ఉండే దీవులివి. పవునా న్యూగినియా, వనాటూలు పొరుగు దేశాలుగా ఉన్నాయి. దీనిలో దాదాపుగా వెయ్యి ద్వీపాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఆరు. అవి చోయ్‌సల్‌, గౌడాల్‌కెనాల్‌, మలైటా, మకైరా, న్యూజార్జియా, శాంటాఐస్‌బల్‌లు. ఈ దేశం 1978లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి స్వతంత్రం పొందింది.
సోలమన్‌ ఐలాండ్స్ రాజధాని హోనియారా ఈ దేశ విస్తీర్ణం 28,400 చదరపు కిలోమీటర్లు జనాభా 5,23,000. (2018) వీరి అధికార భాష ఆంగ్లం . కరెన్సీ సోలమన్‌ ఐలాండ్స్‌ డాలర్‌. ఒక సోలమన్‌ ఐలాండ్స్‌ డాలర్‌ దాదాపుగా మన కరెన్సీలో ఎనిమిది రూపాయలకు సమానం వీరి అధికారిక భాష ఆంగ్లమే అయినా దాన్ని మాట్లాడేవారు దాదాపుగా ఒకటి నుంచి రెండు శాతం మంది మాత్రమే. ఇక్కడ 120 వరకు స్థానిక భాషలున్నాయి. వాటిల్లోనే వీరు ఎక్కువగా సంభాషణలు జరుపుతారు. స్థానికుల్ని మెలనేషియన్లు అంటారు. వీరే ఇక్కడ 94.5శాతం మంది ఉంటారు. మిగిలినవారిలో చైనీయులు, యూరోపియన్లు, మైక్లోనేషియన్లు ఉన్నారు.
రాజధాని హోనియారా ఇక్కడి గౌడాల్‌కెనాల్‌ ద్వీపంలో ఉంది. ఈ దేశంలో అత్యంత ఎత్తయిన చోటుకూడా ఈ ద్వీపంలోనే ఉంది. దాన్ని ఉల్ట్రాపీక్‌ అని పిలుస్తారు. ఇది సముద్రమట్టానికి 2300మీటర్ల ఎత్తులో ఉంది. దేశంలో 90శాతం దట్టమైన అడవులే. ఎత్తయిన పర్వతాలు, లోయలు, పగడపుదిబ్బలకు ఈ దేశం పెట్టిందిపేరు. ఈ దేశం ఉష్ణమండల ప్రాంతం. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు వేడిగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు చల్లగా ఉంటుంది. ఈ దేశానికి 5,313 కిలోమీటర్ల తీర రేఖ ఉంది.
దాదాపు 30,000సంవత్సరాల క్రితం పపువా న్యూగినియా నుంచి కొందరు వచ్చి తొలిసారిగా ఇక్కడ స్థిరపడ్డారని చెబుతారు. ఈ దేశానికి మిలటరీనే లేదు. కేవలం 500మంది గల పోలీసుదళం ఉంది. సరిహద్దుల్లో కాపలానూ వారే కాస్తారు.
నివాసాలకోసం ఇక్కడ కృత్రిమంగా ద్వీపాలనూ ఏర్పాటు చేసుకుంటారు. రాళ్లను ఒకదగ్గరకు చేర్చికదలకుండా చేసి వాటిపై నివాసాలు ఏర్పరుచుకుంటారు. చదువు ఎవరికీ నిర్బంధం కాదు.
ఇక్కడి ఆర్నవన్‌ ద్వీపాలు అంతరించిపోతున్న హౌకిస్‌బిల్‌ తాబేళ్లకు నెలవులు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు నీటి మడుగుల్లో ఒకటైన మరోవో ఇక్కడి న్యూజార్జియా దీవిలో ఉంది. 700చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. పగడపు దిబ్బలుండటంతో దీన్ని సంరక్షిత ప్రాంతంగా చేశారు. పగడపు దిబ్బలతో ఏర్పడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి ఈస్ట్‌ రెన్నెల్స్‌ ఇక్కడే ఉంది. ఈ దేశంలో 61రకాల ఉభయచరాలు, 163 రకాల పక్షులు, 53 రకాల క్షీరదజాతులున్నాయి. దాదాపుగా 230 రకాల ఆర్కిడ్‌లు, ఇతర ఉష్ణమండల పూలు కనిపిస్తాయి.
కొకొవా, కొబ్బరి, వరి, బంగాళాదుంపలు, పామ్‌తోటల్ని ఎక్కువగా సాగు చేస్తారు. పశువులు, పందుల్ని పెంచుతారు. కలప, చేపలు, పామాయిల్‌లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. చైనా, థాయిలాండ్‌, జపాన్‌, న్యూజీలాండ్‌, మలేషియా, సింగపూర్‌, ఆస్ట్రేలియాలతో ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి.
బంగారం, సీసం, జింకు, నికెల్‌లు ఇక్కడ ఎక్కువగా దొరికే ఖనిజాలు.

tonga flag

Country : Tonga

Capital Nukuʻalofa ………. Language Nukualofa ………. Currency Paʻanga ………. ……… Calling Code +. 676 Religion Christian

టాంగా…

పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఉన్న ఈ దేశం 176 ద్వీపాలతో ఉన్న దేశం. 1800 సంవత్సరంనుండి ఈ దేశంలో క్రైస్తవమతం వ్యాప్తి చెందినది. ఈ దేశ వైశాల్యం 748 చ.కి.మీ. దేశ రాజధాని Nuku’alofa . 1970 సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందింది.
టోంగన్ మరియు ఇంగ్లీష్ వీరి భాషలు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. వీరి కరెన్సీ pa’anga.
వీరి కొబ్బరి, అరటి, వెనీలా బీన్స్, భూమిలో పండే దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. ఉష్ణమండలపు సముద్రతీరాలు, వర్షాధార అడవులు, అగ్నిపర్వతాలు ఈ దేశంలో ఉన్నాయి. పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశం టాంగా. పర్యాటక పరంగా ఈ దేశానికి అధిక ఆదాయం సమకూరుతుంది.

tuvalu flag

Country : Tuvalu

Capital Funafuti ………. Language Tuvaluan/ English ………. Currency Tuvaluan dollar ………. ……… Calling Code +. 688 Religion Christian

తువాలూ

తువాలూ… చాలా చిన్న దేశం. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్నవైన వాటికన్‌సిటీ, మోనాకో, నౌరు దేశాల తర్వాతి స్థానం దీనిదే. నాలుగో అతి చిన్న దేశమన్నమాట. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్యాన పసిఫిక్‌మహా సముద్రంలో ఉంటుంది. ఈ ద్వీప దేశంలో మొత్తం తొమ్మిది దీవులు. వీటిలో అయిదు పగడపు దీవులు. ఈ ద్వీప దేశానికి ‘ఎలైస్‌దీవులు’ అనే పేరూ ఉంది. ఈ దేశ రాజధాని ఫునాఫుతిలో మాత్రమే దేశ జనాభాలో 56 శాతం మంది నివసిస్తారు. తువాలూ రాజధాని ఫునాఫుతి జనాభా: 10,045. విస్తీర్ణం 26 చదరపు కిలోమీటర్లు. వీరి భాషలు తువాలూయన్‌, ఆంగ్లం. కరెన్సీ తువాలూయన్‌, ఆస్ట్రేలియన్‌డాలర్లు, తువాలూ బ్రిటిష్‌సామ్రాజ్యంలో ఎక్కువ కాలం ఉన్నందుకు జెండా పై భాగంలో ఎడమవైపున్న యూనియన్‌ జాక్‌ సూచిక, తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది ద్వీపాలకు గుర్తు. బ్రిటిష్‌సామ్రాజ్యం నుంచి ఈ దేశం 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశంలో రోడ్లన్నీ కలిపితే ఎనిమిది కిలోమీటర్ల పొడవే ఉంటాయి. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి కూడా పడవల్లో వెళ్లాల్సిందే. దేశం మొత్తంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంటుంది. ఎక్కువ మంది వ్యవసాయం, చేపలు వేటాడటం మీదే ఆధారపడతారు. కొబ్బరిని ఎక్కువగా సాగుచేస్తారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్‌తో పోరాటం జరుపుతున్నప్పుడు ఈ దీవులే అమెరికా సైనిక స్థావరాలుగా ఉండేవట. మూడు వేల సంవత్సరాల క్రితం పాలినేషియన్లు ఇక్కడికి మొదటిసారిగా వలస వచ్చారట. సముద్రం మధ్యలో దూరంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య చాలా తక్కువ. ఏడాది మొత్తంలో రెండు వేలమంది లోపే సందర్శిస్తారట. ఇక్కడ ‘కిలికిటి’ అనే ఆట ఆడుకుంటారు. ఇది అచ్చు మనం ఆడుకునే క్రికెట్‌ఆటలానే ఉంటుంది..

vanuatu flag

Country : Vanuatu

Capital Port Vila ………. Language Bislama/French/English ………. Currency Vanuatu vatu ………. ……… Calling Code +. 678 Religion Christian

వనౌతు…

పసిఫిక్ మహాసముద్రంలోని స్వతంత్ర గణ రాజ్యం వనౌతు. 1774 సంవత్సరంలో కెప్టెన్ కుక్ ఈ దేశాన్ని సందర్శించి న్యూహెబ్రిడీన్ అని పేరు పెట్టాడు. ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పెత్తనం సాగించారు. తరువాత ఈ దేశం 1980 పంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకొని వనౌతుగా మారింది.
ఈ దేశంలో 80 చిన్న, చిన్న దీవులు, 13 పెద్దదీవులు ఉన్నాయి. పెద్ద దీవి పేరు ఎస్పిరితూ సాంతో. ఒకప్పుడు యూరోప్ దేశానికి చెందిన దొంగ నావికులకు స్థావరంగా ఉంది. 1906 సం. లో ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వచ్చింది.
వనౌతూ రాజధాని విలా, ఈ దేశ విస్తీర్ణం 12,190 చ.కి.మీ. వీరి అధికార భాషలు ఇంగ్లీష్ మరియు పిడ్జిన్. వీరి కరెన్సీ వాటు. ప్రజలు మెలనీషన్ జాతులకు చెందినవారు. ప్రజలలో 82 శాతం మంది క్రైస్తవ మతానికి చెందినవారు.
కొబ్బరి, కాఫీ, కోకో, కందమూలాలు, వేరు సెనగ, అరటి, మొక్కజొన్న, ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం ఎక్కువ. మత్య్యపరిశ్రమ కలదు. మాంగనీస్ ఖనిజాన్ని జపాన్ కు ఎగుమతి చేస్తారు.

%d bloggers like this: