యూరోపియన్ దేశాలు

Albania

albania flag

Capital Tiranna ………. Language Albanian ………. Currency Lek ………. Religion Islam/Christianity ………. Calling Code +. 355

అల్బేనియా

Albenia….అల్బేనియా అల్బేనియా.. ఐరోపా ఖండంలోని చిన్న ద్వీపకల్ప దేశం . దీనికి గ్రీస్‌, మాసిడోనియా, కొసోవో, మాంటినేగ్రో దేశాలు.. అడ్రియాటిక్‌ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఎన్నో జాతులు పరిపాలించినా తన భాష, సంస్కృతులను మాత్రం పదిలంగా కాపాడుకుంది అల్బేనియా. భౌగోళిక అందాలు ఈ చిన్న దేశానికి కొండంత గుర్తింపును తెచ్చాయి. ఇది చాలామటుకు పర్వతాలతో నిండి ఉంది. వాటిల్లో అల్బేనియన్‌ ఆల్ఫ్స్‌ కూడా ఉన్నాయి.
అల్బేనియా రాజధాని తిరానా. దేశ జనాభా 29,94,667 (2018). ఈ దేశ విస్తీర్ణం 28,748 చదరపు కిలోమీటర్లు కరెన్సీ అల్బేనియన్‌ లెక్‌ ఒక అల్బేనియన్‌ లెక్‌ మన రూపాయల్లో 60 పైసలకు సమానం. వీరి అధికారిక భాష అల్బేనియన్‌స్థానికుల్లో 70 శాతం మంది ముస్లింలు, 17శాతం మంది క్రైస్తవులున్నారు. మిగిలిన కొద్ది శాతం ఇతర మతాలవారు. తరతరాలుగా ఎన్నో జాతుల దండయాత్రకు గురైన అల్బేనియా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒట్టోమన్ సుల్తాన్లు అల్బేనియాను నాలుగు శతాబ్దాలు పరిపాలించారు. పన్నుల పెంపు, నిర్బంధ సైనిక శిక్షణ మొదలైన కారణాలతో తలెత్తిన ‘అల్బేనియన్ తిరుగుబాటు’ ఉద్యమం ఆ దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి దారి తీయడమే కాదు… ఒట్టోమన్ సామ్రాజ్యం బలహీనమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
1912లో ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందింది అల్బేనియా. 1944-1946ల మధ్య ‘డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్ అల్బేనియా’గా, 1946-1976ల మధ్య ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా’గా అల్బేనియా ఉనికిలో ఉంది. 1944 నుంచి రష్యా, చైనా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఇది 1991లో ఎట్టకేలకు స్వతంత్ర దేశంగా మారింది. పార్టీల్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్య దేశమయ్యింది. ఐరోప ఖండంలో ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టం కలిగే దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ పుట్టిన వారు ఇక్కడి కంటే బయటి దేశాల్లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. మాసిడోనియా, గ్రీస్‌, టర్కీ, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్‌…లాంటి దేశాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.
కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్వెర్ హోజా 1967లో అల్బేనియాను ‘ప్రపంచంలో తొలి నాస్తికదేశం’గా ప్రకటించాడు. ‘డెమొక్రటిక్ పార్టీ’ స్థాపన ఆ దేశ రాజకీయ చరిత్రలో మరో ముఖ్య ఘట్టం. దేశంలో డెబ్భైశాతం కొండలే. అల్బేనియాలో ఎత్తైన పర్వతం కొరబ్. 9,068 అడుగుల ఎత్తున్న ఈ పర్వతం అల్బేనియా, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలకు సరిహద్దుగా ఉంది.
ఆగ్నేయంలో ఉన్న ఒహ్రిడ్ సరస్సు యూరప్లోని ప్రాచీనమైన, లోతైన సరస్సులలో ఒకటి. 1979లో యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటు చేసుకుంది. చిన్న దేశమైన అల్బేనియా జీవవైవిధ్యంలో మాత్రం విశాలమైనది. 3000 రకాల భిన్నమైన జాతుల మొక్కలు ఈ దేశంలో పెరుగుతాయి. 353 పక్షుల జాతులు అల్బేనియాలో ఉన్నాయి. ఒకప్పుడు సోషలిస్ట్ దేశంగా పేరుగాంచిన అల్బేనియా ఆ తరువాత పెట్టుబడిదారి దారిలో నడిచింది.
దేశంలో విదేశీ పెట్టబడులు పెరిగాయి. ఒకప్పుడు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్న అల్బేనియా ఇప్పుడు విద్యుత్ను ఎగుమతి చేసే స్థాయికి చేరింది . వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో సహజ వాయువు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పర్యాటకపరంగా కూడా అల్బేనియాకు ప్రాధాన్యత ఉంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకరంగం నుంచే వస్తుంది. ఒట్టోమన్ పాలనలో సుదీర్ఘకాలంగా ఉండడం వలన… మిగిలిన యురోపియన్ దేశాలతో పోల్చితే అల్బేనియా కళారూపాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రస్తుతం అల్బేనియా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపులో ఉంది.
తల అడ్డంగా ఊపడం అనేది ‘ఇష్టం లేదు’ అనే భావానికి సూచనగా భావిస్తాం. కానీ అల్బేనియాలో మాత్రం రివర్స్. తల అడ్డంగా ఊపడం అనేది ‘నాకు ఆమోదమే’ అని చెప్పడం! నిలువునా ఊపితే ‘నాకు ఇష్టం లేదు’ అని తెలియచేయటం.
అల్బేనియా ప్రధాన క్రీడ ఫుట్బాల్.అల్బేనియాను స్థానికంగా ‘షిక్విపేరియా’ అని పిలుచుకుంటారు. దీని అర్థం ‘డేగల భూమి’. దేశవ్యాప్తంగా ఏడు లక్షల వరకు బంకర్లు ఉన్నాయి.
ఈ దేశ జాతీయ పుష్పం రెడ్‌పాపీ ఫ్లవర్‌. ఇక్కడ 3,250కిపైగా పూలజాతుల మొక్కలున్నాయి. వీటిలో 30శాతం ఎంతో అరుదుగా ఐరోపాలో మాత్రమే కనిపించేవి.
ఈ దేశంలో చాలా ఎక్కువగా మిలటరీకి సంబంధించిన పాత బంకర్లు కనిపిస్తాయి. మొత్తంమీద ప్రతి 5.7చదరపు కిలోమీటర్లకొక బంకరుందని లెక్కలు తేల్,రు. మొత్తం 7,50,000 బంకర్లున్నాయట. గతంలో కమ్యూనిస్టు పాలకుల కాలంలో శత్రువుల నుంచి రక్షణ కోసం వీటినిలా నిర్మించారంటారు. వీటిలో కొన్ని పాతబడిపోతే మరికొన్నింటిలో మ్యూజియాలు, కేఫ్‌ల్లాంటి వాటిని నడుపుతున్నారు. కొందరు ఇళ్లుగానూ వీటిని వాడేసుకుంటున్నారు.
ఇక్కడ రవాణా సౌకర్యాలు చాలానే అధ్యాన్నంగా ఉంటాయి. దేశం మొత్తం మీద కేవలం నాలుగే విమానాశ్రయాలున్నాయి. 677కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి. బస్సులు ఉంటాయిగానీ వాటికి ఒక నియమిత టైమే లేదు. డ్రైవర్ల ఇష్టప్రకారం బస్సులు బయలుదేరతాయి. జనాభా సంఖ్య 29 లక్షలకు పైగా ఉన్నారు. అయినా ఇక్కడ వాడే కార్ల సంఖ్య మాత్రం మూడు వేల లోపే. పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల వారు మాత్రం తప్పకుండా కార్లు వాడతారు.
భారతదేశంలోని కోల్‌కతా మురికివాడల్లోని వారికి సేవలందించిన మదర్‌ థెరెసా పుట్టింది ఈ దేశంలోనే. ఆదర్శవంతమైన మహిళగా ఆమెపై ఇక్కడివారంతా అభిమానాన్ని చూపిస్తారు.
జనాభా మొత్తంలో 60శాతం మంది వ్యవసాయం చేస్తారు. ఈ దేశంలో సుమారు 200 రకాలకు పైగా సంప్రదాయ దుస్తులు ఉన్నాయి. ఈ దేశం అందమైన బీచ్‌లకు, భిన్న సంస్కృతులకు సంబంధించిన రుచికరమైన ఆహార పదార్థాలకు పెట్టింది పేరు. ఇళ్ల ముందు ఎక్కడ చూసినా ఎక్కువగా దిష్టి బొమ్మలు కనిపిస్తాయి. ఇందుకు కొన్ని రకాల టెడ్డీబేర్లనూ వీరు వాడతారు. కొందరు వీటి వల్ల తమకు అదృష్టం కలుగుతుందని నమ్ముతారట.
దాదాపుగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ ఎక్కువగా సాయంత్రపు నడకను ఇష్టపడతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ చుట్టుపక్కల వారితో కలిసి సరదాగా రోడ్ల మీద నడుస్తారు. ఈ సాయంత్రపు నడక ఇక్కడ అధికారికం. దీన్ని ఇక్కడ క్షిరో అని పిలుస్తారు. ఈ సమయంలో కొన్ని గంటలపాటు టౌన్లలో కార్లలాంటి వాహనాల్ని లోపలికి అనుమతించరు. రహదారుల్ని ఖాళీగా ఉంచడానికే ఈ ఏర్పాటు.

Andorra

andorra flag

Capital Lavella ………. Language Catalan ………. Currency Euro ………. Religion Catholic ………. Calling Code +. 376

అండోరా… యూరప్‌లోని ఒక చిన్న దేశం. ఇది పైరెనీస్‌పర్వతాలకు తూర్పున ఉంటుంది. స్పెయిన్‌, ఫ్రాన్స్‌దేశాలు సరిహద్దులు. జెండాలోని రంగులన్నీ ఫ్రాన్స్‌, స్పెయిన్‌దేశాల నుంచి పొందిన స్వాతంత్య్రానికి గుర్తులు. నీలం, ఎరుపు ఫ్రాన్స్‌నుంచి, ఎరుపు, పసుపు స్పెయిన్‌నుంచి తీసుకున్నారు.
అండోరా అనే పదం అరబిక్‌భాషలోని అల్‌దురా అనే పదం నుంచి వచ్చిందట. దీనర్థం ‘ముత్యం’ అని. ఈ దేశ రాజధాని అండోరా లా వెల్లా యూరప్‌మొత్తంలో ఎత్తయిన రాజధాని. సముద్రమట్టానికి 3,356 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండోరా రాజధాని అండోరా లా వెల్లా జనాభా 85,470 (2018) దేశ విస్తీర్ణం 467.63 చదరపు కిలోమీటర్లు. కరెన్సీ యూరో, అధికారిక భాషలు కాటలాన్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌ ప్రజలు ఫ్రెంచ్‌కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు.
ఇక్కడ అక్షరాస్యత రేటు ఎక్కువ. ఈ దేశం మంచి పర్యాటక ప్రాంతం. గత ఏడాది కోటి మందికిపైగా పర్యాటకులు వస్తారు ఈ దేశానికి. దేశంలో కేవలం 2 శాతం భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఎక్కువ భాగం ఆహారం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ దేశంలో విమానాశ్రయాలు, రైల్వే లైన్లు లేవు. రోడ్డు మార్గం ఎక్కువగా వాడుతారు. ప్రపంచంలో సురక్షితమైన దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ దొంగతనాలు చాలా చాలా తక్కువ. జేబు దొంగలు అసలు ఉండరట.
ఈ దేశ సైనికులకు కేటాయించే బడ్జెట్‌ స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడి ఉంటుంది కుటుంబ యజమానిగా ఉండే మగవారి దగ్గర ఆత్మరక్షణ కోసం చట్ట ప్రకారం తుపాకీ ఉండొచ్చు.

Austria

austria flag

Capital Vienna ………. Language Austrian/German ………. Currency Euro ………. Religion Roman Ctholic ………. Calling Code +. 43

ఆస్ట్రియా

మధ్య యూరోప్ లోని చిన్న దేశం ఆస్ట్రియా. ప్రాచీన చరిత్ర గల దేశం. రోమన్లు, షార్లమాన్లు, ఓటొ, హేప్స్ బర్గ్ లు మొదలైన వారు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా. ఈ దేశ విస్తీర్ణం 83,857 చ.కి.మీ. వీరి అధికారిక భాష జర్మన్. వీరి కరెన్స యూరోలు. ప్రజలు క్రైస్తవ మతం పాటిస్తారు. ఈ దేశం యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశం
మెట్టేర్నేక్ నాయకత్వంలో విప్లవం జరిగింది. కానీ తరువాత ఆస్ట్రియా హంగేరీ సమాఖ్యలో చేరటం జరిగింది. 1918 సం.లో మరలా విడిపోయి స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.
ఈ దేశం సుప్రసిద్ధ, పాశ్చాత్య వాగ్గేయకారులు మొజర్ట్, షాన్ బెర్గ్, షూబెర్ట్ వంటి వారికి జన్మస్థానం. ఆస్ట్రియా వాస్తు, శిల్ప సందదలకు పేరుపొందినదేశం. వియన్నాలోని శిల్ప కళాసంపద ప్రపంచవ్యాప్తంగా పేరుపొందినది.
ఆల్ఫ్ పర్వతశ్రేణులు ఉన్న ఈ దేశం కొండలతో నిండి ఉంటుంది. ఖనిజ సంపద ఎక్కువే కానీ నాణ్యత ఉండదు. లిగ్నేట్, బొగ్గురాయి, రాగి, గ్రాఫైట్, ఇనుము, సీసం, చమురువాయివు, జింకు, ఉప్పు ముఖ్య ఖనిజాలు. ఆస్ట్రియాలో జలవనరులు ఎక్కువగా ఉన్నాయి. జలవిద్యుత్ ను పొరుగు దేశాలకు అమ్ముతుంది.
బార్లీ, రై ఓట్స్, బీట్ రూట్ లను ఎక్కువగా పండిస్తారు. పశువుల పెంపకం కూడా ఎక్కువే.
సిమెంట్, రసాయనిక ద్రవ్యాలు, కర్రసామాను, విద్యుత్ పరికరాలు, ఉక్కు, తోలు సామాగ్రి, మోటారు కార్లు, కాగితపు గుజ్జు వస్త్రపరిశ్రమ ముఖ్యమైనవి.

Belarus

belarus flag

Capital Minsk ………. Language Belorasian/Russia ………. Currency Belorusian Ruble ………. Religion Orthodox ………. Calling Code +. 375

బెలారస్

బెలారస్ లో 10,000 సంవత్సరాల క్రితమే ప్రజలు నివసించినట్లు చారిత్రిక ఆధారాలు లభించాయి. ఆదునిక బెలారస్ విషయంలో 13 వ శతాబ్ధంలో గ్రాండ్ డచ్ ఆఫ్ లిధూనియాలో భాగంగా ఉంది. 1795 సంవత్సరంలో రష్యాచేత ఆక్రమించబడి రష్యా విచ్చిన్నం వరకు ఆ దేశంలో భాగంగా ఉంది. 1991 లో స్వతంత్ర దేశంగా అవతరించింది.
బెలారస్ రాజధాని మిన్స్క్. ఈ దేశ వైశాల్యం 2,07,600 చ.కి.మీ. వీరి భాష బెలారసియన్ మరియు రష్యన్. వీరి కరెన్సీ బెలారసియన్ రూబుల్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. గింజ ధాన్యాలు, బంగాళాదుంపలు, కూరగాయలు, అవిశలు వ్యవసాయ ఉత్పత్తులు. పాడి, పశుమాంసం లభిస్తాయి.
కొద్దిగా సహజవాయివు, ఆయిల్, గ్రనైట్, డోలమైట్, లైమ్ స్టోన్, చాక్, ఇసుక సహజసంపదలు.

Belgium

belgium flag

Capital Brussels ………. Language Dutch/French/German ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 387

బెల్జియం

యూరోప్ ఖండంలో చిన్న దేశాలలో బెల్జియం ఒకటి. రాజ్యాంగాన్ని ఏర్పరుచుకుని రాజవంశీయులు పరిపాలిస్తున్న దేశం. 1830 సంవత్సరంలో నెదర ల్యాండ్స్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశానికి ఉత్తర సముద్రాన్ని ఆనుకుని 60 కి.మీ సముద్ర తీరం ఉంది. బెల్జియం విస్తీర్ణం 30,518 చ.కి.మీ. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. వీరి అధికార భాషలు డచ్ మరియు ఫ్రెంచ్ భాషలు. ఈ దేశ కరెన్సీ యూరోలు. ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. బ్రెజిల్ క్రైస్తవ దేశం
అంట్ వేర్ప్ రేవు పట్టణం. లిగాజ్, నాల్ సెయింట్, చార్లెరోయి పారిశ్రామిక పట్టణాలు. ఘెంట్, లవువెయిన్, లీగే ప్రముఖ పట్టణాలు.
ఉత్తర ప్రాంతంలో సారవంతమైన బంకమన్ను నేలలో వ్యవసాయం చేస్తారు. ఈ ప్రాంతన్ని ఫ్లాండర్స్ అంటారు. ఇక్కడ పల్లపు మైదానాలను పోల్డర్లు అంటారు. మధ్య మైదానాలు కూడా సారవంతమైనవే. లీ నది, మాసీ నది, సంబ్ర్ నది, జేర్తె నది, సమోలా నదులు బెల్జియంలో ప్రధాపమైన నదులు, జలాధారాలు. సాగునీటికి సమస్య లేదు. కళలు, సంగీతం, నిర్మాణాలు బెల్జియం ప్రజల జీవితంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.
గోధుమ, ఓట్ ధాన్యం, బీటు దుంపలు, ఫ్లాక్స్, రై ధాన్యం, హెంప్ నార, చికోరీ , బంగాళా దుంపలు పండిస్తారు. జింక్, మార్బుల్ రాయి, స్లేట్ క్వారీలు కూడా కలవు. కాడ్, హెర్రింగ్, అయిస్టర్ చేపలు ఎక్కువగా దొరకుతాయి. ఓస్టెండ్ ప్రాంతం మత్స్య పరిశ్రమకు పేరుగాంచింది. పారిశ్రామిక దేశంగా బెల్జియం పేరుపొందింది. సాకర్ ను ఈ దేశ ప్రజలు ఎక్కువగా ఆడతారు.
ఇనుప ఖనిజాలు, నేలబొగ్గు లభ్యత లేనందువలన వీటిని దిగుమతి చేసుకొని కర్మాగారాలు నడుపుతున్నారు. వీటిలో గాజు పరిశ్రమ ప్రముఖమైనది. జవుళీ, సంగీత పరికరాలు, పొయానో, ర్గాన్, కలప సామాగ్రి, తోలు వస్తువులు, మార్గరీన్, వెనార్, పంచదార, కిటికీల రంగు గాజు పలకలు, వజ్రాలను సానపెట్టడం, సారా బట్టీలు ప్రధానమైన పరిశ్రమలు.

Bosnia & Herzegovina

Bosnia & Herzegovina

Capital Sarejovina ………. Language Bosnian/Croatian/Serbion ………. Currency Convertable Mark ………. Religion Not Available ………. Calling Code +. 387

బోస్నియా మరియు హెర్జ్ గోవేనియా

Bosnia and Herzegovina….బోస్నియా మరియు హెర్జ్ గోవేనియా ఒకప్పుడో బోస్నియా రోమన్ సామ్రాజ్యంలో భాగం. రోమన్ సామ్రాజ్య పతనం తరువాత బోస్నియాగా అవతరించింది. కానీ 1463 సంవత్సరంలో అట్టోమన్ల టర్కీలచే ఆక్రమించబడింది. వీరి తరువాత ఆస్టినా-హంగరీ తరువాత యుగోస్లోవియా లో భాగంగా ఉంది.
ఏప్రియల్ 5, 1992 సంవత్సరంలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Sarajevo . ఈ దేశ వైశాల్యం 51,129 చ.కి.మీ. వీరి భాషలు బోస్నియన్, క్రోయోసియా, సెర్బియన్. వీరి కరెన్సీ మార్కా. 40 శాతం ముస్లింలు, రోమన్ కేథలిక్స్ 15 శాతం మంది, ఆర్ధోడక్స్ 31 శాతం మంది ఇతర మతస్తులు 14 శాతం మంది ఉన్నారు.
గోధుమలు, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు పండిస్తారు.
బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, సీసం, జింక్, కోబాల్ట, మాంగనీస్, నికెల్, జిప్సం, ఉప్పు, అడవులు సహజసందలు.

Bulgeria

bulgeria

Capital Sofia ………. Language Bulgarian ………. Currency Bulgarian LIV ………. Religion Orthodox ………. Calling Code +. 359

బల్గేరియా….

బల్గేరియా…. బల్గేరియా దేశం ఐరోపా ఖండం లోనిది. ఈ దేశానికి ఉత్తరాన రొమేనియా, పశ్చిమాన సెర్బియా, మాసిడోనియా, దక్షిణాన గ్రీస్‌, టర్కీ దేశాలు సరిహద్దులు. తూర్పున నల్ల సముద్రం ఉంటుంది. ఐరోపా మొత్తంలో దేశం ఏర్పడ్డాక పేరు మారకుండా ఉన్న ఏకైక దేశమిది. క్రీస్తు శకం 681 నుంచి ఈ దేశం పేరు బల్గేరియానే.
బల్గేరియా రాజధాని సోఫియా. జనాభా 72,02,198 (2018) . దేశ విస్తీర్ణం 1,10,994 చదరపు కిలోమీటర్లు వీరి భాష బల్గేరియన్‌ వీరి కరెన్సీ లెవ్‌.ఈ దేశం ఆర్ఢోడాక్స్ తెగకు దేశం. తరువాత ముస్లింలు, క్రిస్టియన్స్ కొద్దిశాతం మంది ఉన్నారు. ప్రాచీన బల్గేరియా క్యాలెండర్‌ను ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన క్యాలెండర్‌గా 1976లో యునెస్కో పేర్కొంది.
జెండాలోని పాన్‌స్లేవిక్‌రంగుల్లోని ఎరుపు, తెలుపు రంగుల్ని స్వీకరించారు. ఆ రంగుల్లో మూడోదైన నీలం స్థానంలో రష్యన్‌త్రివర్ణాల్లోని ఆకుపచ్చ రంగును జెండాలో ఉంచారు. ప్రపంచంలో పురాతనమైన బంగారు నిధి దొరికింది ఇక్కడే. 294 సమాధుల్లో ఆరువేల ఏళ్ల నాటి మూడువేల బంగారు వస్తువులు లభించాయి.
ఈ దేశ విస్తీర్ణంలో అత్యధికంగా మూడింట ఒక వంతు అడవులే. ఇక్కడ రోజాపూలను ఎక్కువగా సాగుచేస్తారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రోజ్‌ఆయిల్‌మొత్తంలో 85 శాతం ఈ దేశంలోనే తయారవుతుంది.
పుట్టిన రోజుల కన్నా ఇక్కడి ప్రజలు నామ కరణం రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే బర్త్‌డే కంటే మించి ఏటా నేమ్‌డేస్‌ని ఘనంగా చేసుకుంటారు. ‘కాదు’ అని తెలపడానికి తలను అటూ ఇటూ అడ్డంగా తిప్పటం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ‘అవును’ అని చెప్పడానికి పైకీ కిందకీ తిప్పుతారు. కానీ ఈ దేశంలో దీనికి వ్యతిరేకం. అడ్డంగా వూపితే అవుననీ, పైకీ కిందకీ ఆడిస్తే కాదనీ అర్థం.
యుద్ధంలో ఒక్కసారి కూడా ఓటమిపాలవ్వని ఘనత బల్గేరియా సైన్యానిది. మొదటి ఎలక్ట్రానిక్‌కంప్యూటర్‌ని తయారుచేసింది ఈ దేశానికి చెందిన జాన్‌విన్సెంట్‌అటనసోఫ్‌. తొలి డిజిటల్‌గడియారాన్ని తయారు చేసిన పీటర్‌పెట్రోఫ్‌కూడా బల్గేరియా వాసే. ప్రపంచంలోనే తొలి మిలటరీ పైలట్‌మహిళ రైనా కసబోవా ఈ దేశస్థురాలే.

Croatia

croatia flag

Capital Zagreb ………. Language Croatian ………. Currency Kuna ………. Religion Christian ………. Calling Code +. 385

క్రొయేషియా

క్రొయేషియా రాజధాని జాగ్రెబ్. విస్తీర్ణం 56,594 చదరపు కిలోమీటర్లు వీరి భాష క్రొయేషియన్ దేశ కరెన్సీ కునా. ఈ దేశం మధ్య ఐరోపా, ఆగ్నేయ ఐరోపా, మధ్యధరా సముద్రాల కూడలిలో ఉంది. ఈ దేశం మొత్తంలో వెయ్యి ద్వీపాలున్నాయి. వీటిలో 50 దీవులు నివాసయోగ్యం కానివి.
ప్రజలు ఎక్కువ మంది రోమన్ కేధలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఆర్ఢోడక్స్, ముస్లింలు కొద్దిమంది ఉన్నారు. జెండాలోని తెలుపు రంగు శాంతికి, నిజాయితీకి గుర్తు, ఎరుపు రంగు దృఢత్వానికి, ధైర్యానికి సూచిక, నీలం రంగు విధేయత, న్యాయానికి చిహ్నం.
ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం ఇక్కడే ఉంది. పేరు హమ్. ఇక్కడ 17 నుంచి 23 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ 16 ఏళ్లకు కూడా ఓటు వేసే హక్కు లభిస్తుంది. కానీ వారికి ఉద్యోగం ఉంటేనే! దేశ రాజధాని జాగ్రెబ్లో ‘బ్రోకెన్ రిలేషన్షిప్స్’ పేరిట ఓ వింత మ్యూజియం ఉంది. విడిపోయిన అయిదున్నర కిలోమీటర్ల పొడవైన స్టోన్ వాల్స్ కోట గోడను చూడ్డానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడుండే ‘కోపాకీ రిట్ నేచర్ పార్కు’ ఐరోపా మొత్తంలో అతిపెద్ద తడినేలల రక్షిత ప్రాంతం. హుందాతనానికి గుర్తుగా భావించే ‘టై’ని కనిపెట్టింది ఈ దేశంలోనే.
ఈ దేశంలోనే ‘స్లావోల్జబ్ పెన్కల’ అనే ఆవిష్కర్త 1906లో బాల్పాయింట్ పెన్నును తయారు చేశారు. ప్రముఖ విద్యుత్తు ఉపకరణాల ఆవిష్కర్త నికోలా టెస్లా వూరు ఇక్కడే ఉంది. టెస్లా మ్యూజియంగా మలిచిన ఈయన ఇంటికి ఎందరో పర్యాటకులు వస్తుంటారు.
మూడో వంతు అడవులే ఉన్నాయి.ఇక్కడి ‘బ్రాక్’ అనే దీవిలో ఉన్న ‘జ్లాట్నిరాట్’ బీచ్ వింతగా ఉంటుంది. గాలివాటాన్ని బట్టి ఇది రంగుల్నీ, ఆకారాన్నీ మార్చుకుంటూ ఉంటుంది. భారతదేశంలోని ఓరుగల్లును పరిపాలించిన రుద్రమదేవి పాలన గురించి రాసిన నావికుడు మార్కోపోలో పుట్టింది క్రొయేషియాలోనే.
‘డాల్మేషియా కుక్క జాతి’ ఇక్కడిదే. ఇక్కడి డాల్మేషియా ప్రాంతంలో పుట్టింది కాబట్టి దీనికీ పేరొచ్చింది. గోదుమలు, మొక్కజొన్న, పంచదార దుంపలు, బార్లీ, పొద్దుతిరుగుడు గింజలు, ద్రాక్ష, సోయా, బంగాళాదుంపలు మొదలగు పంటలు పండిస్తారు. పాడిపరిశ్రమ ఉంది. ఆహార పదార్ధాలు, రసాయనాలు, ట్రాన్స్ పోర్ట్ పరికరాలు ఎగుమతి చేస్తారు.
బాక్సైట్, ఆయిల్, తక్కువ నాణ్యతగల ఇనుపఖనిజం, జిప్సం, సెలికా, మైకా మొదలగుని సహజసంపదలు.

Czech Republic

czech republic flag

Capital Prayue ………. Language Czech ………. Currency Czech Krona ………. Religion Non-Religions ………. Calling Code +. 420

ఛెక్ రిపబ్లిక్

మధ్య యూరప్ లోని ఒక దేశం. దీనికి ఈశాన్య దిశలో పోలండ్, పశ్చిమాన జర్మనీ, దక్షిణాన ఆస్ట్రియా మరియు తూర్పున స్లొవేకియా దేశాలు సరిహద్దులుగా గలవు.
ఈ దేశ రాజధాని మరియు పెద్దనగరం ప్రేగ్. వీరి అధికార భాష ఛెక్ ఈ దేశ వైశాల్యం 78,866 చ.కి.మీ. కరెన్సీ పేరు కొరూనా. ఈ దేశంలో 75 శాతం మంది ప్రజలు ఏ మతానికి చెందిని వారు కాదు.
ఆర్ధిక పరంగా అభివృద్ధి చెందిన దేశం ఛెక్ రిపబ్లిక్. జనవరి 1, 1993 సంవత్సరంలో జకోస్లోవియా దేశం నుండి విడిపోయి ఛెక్ రిపబ్లిక్ గా అవతరించింది.
గోధుమలు, బంగాళా దుంపలు, పంచదార దుంపలు పండిస్తారు. కోళ్ల పరిశ్రమ ఉంది.
గ్రాఫైట్, బొగ్గు, కలప మొదలగు సహజవనరులు లభిస్తాయి.

Denmark

denmark

Capital Copenhagen ………. Language Danish ………. Currency Danish Krone ………. Religion Church of Denmark ………. Calling Code +. 45

డెన్మార్క్

యూరప్ లోని ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రాల మధ్య ఉన్న డెన్మార్క్ అభివృద్ధి చెందినదేశం. డెన్మార్క్ ను ఆనుకున్న ఉన్న 480 చిన్న దీవులు, ఆర్క్ టిక్ వలయంలోని గ్రీన్ ల్యాండ్, ఫాడో దీవులు కూడా డెన్మార్క్ కు చెందినవే. డెన్మార్క్ విస్తీర్ణం 43,092 చ.కి.మీ. రాజధాని కోపెన్ హెగ్. వీరి అధికార భాష డేనిష్. కరెన్సీ డానిష్ క్రోన్.
డెన్మార్క్ రాజవంశ పాలనలో ఉంది. ఎన్నికైన పార్లమెంట్ కూడా ఉంది. డెన్మార్క్ వ్యయసాయ ప్రధానమైన దేశం. పాడిపరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. సహకారోద్యమం విస్తృతంగా ఉన్న దేశం. 1866 సం.లో మొదటి సహకార సంస్థ స్థాపించబడినది.
నౌకా నిర్మాణం, యంత్ర సామాగ్రి ఉత్పత్తి ముఖ్యమైన పరిశ్రమలు. కోపెన్ హగ్ హార్బరులో నల్ల రాతిలో చెక్కిన అందమైన మెర్ మెయిడ్ శిలా విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
బార్లీ, గోధుమలు, బంగాళాదుంపలు, పంచదార దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం, పాడిపరిశ్రమలు కలవు.
పెట్రోల్, సహజవాయువు, చేపలు, ఉప్పు మొదలగు సహజసంపదలు లభిస్తాయు.

Estonia

estinia flag

Capital Tallin ………. Language Estonian ………. Currency Euro ………. Religion Christian ………. Calling Code +. 372

ఎస్తోనియా…

ఎస్తోనియా ప్రజలు పురాతన కాలం నుండి స్వతంత్రంగా జీవించారు. తరువాత ఈ దేశం డెన్మార్, స్వీడన్, రష్యా, జర్మనీ దేశస్తుల చే 1200 సంవత్సరం తరువాత ఆక్రమించబడింది. 1940 వ సంవత్సరంలో ఎస్తోనియా బలవంతంగా సోవియట్ యూనియన్ లో కలపబడింది.
1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న తరువాత ఎస్తోనియా స్వతంత్ర దేశంగా అవతరించింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా చేరింది.
ఈ దేశ రాజధాని టాల్లిన్. ఈ దేశ వైశాల్యం 45,226 చ.కి.మీ. వీరి అధికార భాష ఎస్తోనియా. తరువాత రష్యాభాష కూడా 37 శాతం మంది ప్రజలు మాట్లాడుతారు. ప్రజలు ఎక్కువమంది క్రిస్టియన్ మతానికి చెందినవారు. వీరి కరెన్సీ ఎస్తోనియన్ క్రోన్.
బంగాళాదుంపలు మరి కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పాల ఉత్పత్తులు, చేపలు, పశుసంపద ఇతర జీవనోపాధులు.
ఫాస్పేట్, లైమ్ స్టోన్, ఇసుక, డోలోమైట్, క్లే, పీట్, వ్యయసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.

Finland

finland

Capital Helsink ………. Language Finnish ………. Currency Euro ………. Religion Chrisian ………. Calling Code +. 358

ఫిన్లాండ్‌

ఐరోపా ఖండంలో ఉండే ద్వీపకల్ప దేశం ఫిన్లాండ్‌. దీనికి స్వీడన్‌, నార్వే, రష్యా సరిహద్దులు. ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకి. జనాభా 55,09,717 (2018) విస్తీర్ణం 3,38,424చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాషలు ఫినిష్‌, స్వీడిష్‌ కానీ 63శాతం మంది ఆంగ్లం మాట్లాడగలరు. దేశ కరెన్సీ యూరో. దేశ జనాభాలో 84శాతం మంది పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటారు. డిశెంబర్ 6, 1917 సంవత్సరంలో రష్యానుండి స్వాతంత్ర్య పొందింది
. ఈ దేశంలోనే 1,87,888 సరస్సులున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సరస్సులున్న దేశంగాఈ దేశానికి ప్రపంచ రికార్డు ఉంది. సైమా ఇక్కడ అత్యంత పెద్ద సరస్సు. ఐరోపాలో అయితే నాలుగోది. మంచి నీళ్లలో బతికే అత్యంత అరుదైన ఫ్రెష్‌వాటర్‌ సీళ్లు దీనిలో వందలాదిగా ఉన్నాయి. దేశంలో 78శాతం అడవులే ఈ దేశం పరిధిలో ఉన్న సముద్రంలో చుట్టూ అంతా కలిపి 1,79,584 ద్వీపాలున్నాయి.
దీనికి ‘ల్యాండ్‌ ఆఫ్‌ మిడ్‌నైట్‌ సన్‌’ అనే పేరుంది. ఎందుకంటే ఈ దేశంలో పావు వంతు ఆర్కిటిక్‌ వలయంలో ఉంది. అందుకే ఇక్కడ వేసవిలో దాదాపు 73 రోజులు సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలంలో 51 రోజుల పాటు సూర్యుడు ఉదయించడు.
అతి వేగంగా కారు నడిపి ఎవరైనా పట్టుబడితే ఇక్కడ శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. దాదాపుగా రెండు లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో కోటికి పైగా జరిమానా విధిస్తారట.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వాటర్‌ టన్నెల్‌ ఉన్నది ఇక్కడే. పేరు పైజాన్‌ వాటర్‌ టన్నెల్‌. ఇది మంచి నీళ్లను దక్షిణ ఫిన్లాండ్‌కి సరఫరా చేస్తుంది.
క్రిస్మస్‌ సందర్భంగా చాలా చోట్ల శాంతాక్లాజ్‌ వేషాల్లో క్రిస్మస్‌ తాతల్లా వేషాలేసుకుంటుంటారు. అసలైన శాంతాక్లాజ్‌ పేరు సెయింట్‌ నికోలస్‌. ఆయన ఇక్కడి లేప్‌ల్యాండ్‌లో నివసించేవారు.
వీరికి అత్యంత ఇష్టమైన పానీయం కాఫీ. ప్రతి వ్యక్తీ ఇక్కడ ఏడాదికి సగటున 12 కేజీల కాఫీ పొడిని వాడేస్తాడు. కాఫీని ఇంత పెద్ద ఎత్తున వాడే దేశాల్లో ఇదే మొదటిది. బ్రెడ్‌ని ఇక్కడి భోజనంలో ఎక్కువగా వాడతారు. లోపల అన్నం నింపి పైకి బ్రెడ్‌ ఉండే కరేలియన్‌ పేస్ట్రీ ఇక్కడి సంప్రదాయ వంటకం. చేపలు, మాంసాల్ని ఎక్కువగా తింటారు. ఇక్కడ ఎక్కువగా దొరికే బిల్‌బెర్రీలనూ పండ్ల డెసర్ట్‌ల్లో ఎక్కువగా వాడతారు.
ఇక్కడ సరదాగా ఆనందించడానికీ చిత్రమైన ఛాంపియన్‌షిప్‌లు పెడుతుంటారు. అందులో చాలా ప్రాచుర్యం పొందింది ‘వైఫ్‌ కేరియింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’. ఇంకా దోమల్ని వేటాడటం, బురదనేలలో ఫుట్‌బాల్‌, రబ్బరు బూట్లు విసరడం, మొబైల్‌ ఫోన్‌ గిరాటేయడంలాంటి చిత్ర విచిత్రమైన పోటీలన్నీ ఉంటాయి
. ప్రపంచంలోనే చాలా మంచి విద్యా వ్యవస్థ ఈ దేశానిది. ఇప్పుడు ఇక్కడ వంద శాతం అక్షరాస్యత ఉంది. ఇక్కడ ఏడాదిలో బడులు దాదాపు 180 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆడుతూ పాడుతూనే పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు. ఇక్కడ యూనిఫాంలు, ర్యాంకులు ఏమీ ఉండవు. ఇక్కడి ఉపాధ్యాయుల బోధనా పద్ధతులూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈ విద్యా విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. తొమ్మిదో తరగతికి వచ్చే వరకు అసలు పరీక్షలే ఉండవు. 9 తరువాత కచ్చితంగా పరీక్ష పాసైతేనే పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్‌లో మనం ఏమన్నా బ్రౌజ్‌ చేసుకోవాలంటే క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపేరా అంటూ ఏదో ఒక బ్రౌజర్‌లోకి వెళ్లిపోతాం. మరి ప్రపంచంలోని మొదటి బ్రౌజర్‌ తయారయ్యింది ఇక్కడే. దాని పేరు ‘ఎర్విస్‌’. హెల్సింకిలో విద్యార్థులే దీన్ని తయారుచేశారు. అయితే దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి వీలుగా పెట్టుబడులు తొందరగా సమకూరలేదు. ఆ లోపుగానే మొజైక్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి.
ఇంటర్నెట్‌ని మొదటిసారిగా ప్రజలు వాడుకునేందుకు వీలు కలిపించింది కూడా ఈ దేశమే. నోకియా సంస్థ పుట్టింది ఇక్కడే. ఎప్పుడంటే 1865లోనే. ఇక్కడున్న నోకియన్‌విర్టా నది పేరు మీదుగా దీనికీ పేరొచ్చింది. లినక్స్‌ ఓఎస్‌, ఎస్‌.ఎం.ఎస్‌లు పుట్టింది ఇక్కడే. బార్లీ, గోధుమలు, బంగాళా దుంపలు ఎక్కువగా పండిస్తారు. పాడి, చేపల పరిశ్రమలు కలవు. కలప ఇనుప ఖనిజం, రాగి, జింక్, క్రోమైడ్, నికెల్, బంగారం, వెండి సహజ సంపదలు.

France

france

Capital Paris ………. Language French ………. Currency Euro ………. Religion Christian ………. Calling Code +. 33

ఫ్రాన్స్

పశ్చిమ యూరోప్ లోని ప్రముఖ దేశం ఫ్రాన్స్. జర్మనీ, ఇటలీ దీనికి సరిహద్దులు. సుదీర్ఘమైన చరిత్ర గల దేశం. ఒకప్పడు రాజులు పాలించి దేశం. 1789-1793 సం.ల మధ్య కాలంలో ఫ్రెంచ్ విప్లవం ఫలితంగా ప్రజాతంత్ర దేశంగా ఆవిర్భబించింది. తరువాత కొంతకాలం నెపోలియన్ వంటి నియంతలు కూడా పాలించారు.
ఫ్రాన్స్ దేశ విస్తీర్ణం 5,43,965 చ.కి.మీ. రాజధాని పారిస్. వీరి అధికార భాష ఫ్రెంచ్. ప్రజలు సౌందర్యోపాసకులు. సుఖ జీవనాన్ని కోరుకుంటారు. వీరు వంటలు ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందినవి. ఫ్రాన్స్ ఆర్ధికపరంగా సంపన్నమైన దేశమే కాక బలమైన సైనిక సంపత్తి గల దేశం కూదా.
ఫ్రాన్స్ లోని రైన్ నదీలోయ సారవంతమయినదే కాకుండా పడవ ప్రయాణాలకు సౌకర్యం గల నది. గారొన్నే నదీ ప్రాంతం సారాయికి అనువైన ద్రాక్షా తోటల పెంపకానికి అనువైన ప్రాంతం. 1050 కి.మీ. నడివిగల లోయిరే నది ఫ్రాన్స్ లో పెద్దనది. ఆల్ప్, జూరా కొండలలో పారే ఏరులున్న ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు.
రైన్ నది సాగు నీటిని అందిస్తుంది. రైస్ నదీ ప్రాంతంలోని రివీరా పర్యాటక ప్రాంతం కూడా.
గోధుమ రే ధాన్యం, బీటు పంచదార దుంపలు,ద్రాక్ష, మొక్కొన్న, బంగాళాదుంపలు, రేప్ సీడ్, పొద్దు తిరుగుడు, ఆపిల్, కూరగాయలు, పీచ్, ఓట్ ధాన్యం పండిస్తారు. వీటిని భారీగా ఇతరదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
పాల ఉత్పత్తులు, మాంసం కూడా ఎగుమతి చేస్తారు. పీతలు, హెర్రింగ్ చేపలు, గండుమీను, గండు రొయ్యలు, మేకరిల్, అయిస్టర్ చేపలు, సార్డీన్ చేపలు ఎక్కువగా దొరకుతాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం ఫ్రాన్స్.
విమానాల తయారీ, మోటారు కార్ల తయారీ, యంత్రసామాగ్రి, విద్యుత్ పరికరాలు, కలప సామాగ్రి, ఇనుము, ఉక్కు, ఆభరణాలు, అత్తర్లు, జవుళీ, మధ్యం, కాగితం, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి.
చరిత్ర ప్రసిద్ది పొందిన డెకార్డే, వాల్టేర్, విక్టర్ హూయగో, జోన్-ఆఫ్-ఆర్క్, నెపోలియన్, మోనాసా వంటి గొప్పవారికి జన్మనిచ్చిన దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశం పర్యాటక దేశం కూడా. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఐఫీల్ టవర్ ఫ్రాన్స్ లోనే ఉంది.

Germany

germany

Capital Berlin ………. Language German ………. Currency Euro ………. Religion Christian(60%) ………. Calling Code +. 49

జర్మనీ

జర్మనీ దేశం యూరోప్ ఖంఢం మధ్యలో కలదు. ఈ దేశంలోని ప్రజలలో ప్రతి పదిమందిలో ఒకరు విదేశీయులే. జర్మనీ దేశం కళలకు ముఖ్యంగా క్లాసికల్ సంగీతానికి ప్రసిద్ధి చెందినది. రెండవ ప్రపంచ యుద్దంలో(అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో) జర్మనీ పరాజయం పాలై దారుణంగా నష్టపోయింది. ఈ యుద్ధం తరువాత జర్మనీ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ రెండు దేశాలుగా విడిపోయింది. క్రమ క్రమంగా పశ్చిమ జర్మనీ యూరోప్ లోనే ఆర్ధికంగా బలమైన దేశంగా రూపొందింది. 1989 వ సంత్సరంలో తూర్పు జర్మనీ మరియు పశ్చిమ జర్మనీ కలసిపోయాయి. పశ్చిమ జర్మనీ తూర్పు జర్మనీ అభివృద్ధికి బిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టింది.
జర్మనీ రాజధాని బెర్లిన్ వీరి అధికార భాష జర్మన్. ఈ దేశ వైశాల్యం 3,49,334 చ.కి.మీ. జర్మనీ క్రిస్టియన్ దేశం. వీరి కరెన్సీ యూరోలు.
బంగాళా దుంపలు, గోధుమలు, బార్లీ, పండ్లు, క్యాబేజీ వ్యవసాయ ఉత్పత్తులు. పశువులు, పందులు, కోళ్ల పెంపకం కలదు.
బొగ్గు, లిగ్నేట్, సహజవాయువు, ఇనుప ఖనిజం, యూరేనియం, పొటాష్, సాల్ట్, కలప, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.

Greece

greece flag

Capital Athens ………. Language Greek ………. Currency Euro ………. Religion Greek Orthodox ………. Calling Code +. 30

.గ్రీస్…

గ్రీస్ లేదా గ్రీక్ ఐరోపా ఖండంలో ఉన్న ఓ చిన్నదేశం. రాజధాని నగరం ఏథెన్స్. కరెన్సీ యూరోలు. వీరి అధికారిక భాష గ్రీక్. చాలా మంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఐరోపాలోని ప్రాచీన భాషలలో గ్రీక్ ఒకటి. గ్రీకులలో ఎక్కువ భాగం గ్రీక్ ఆర్ధడెక్స్ చర్చి మతస్థులు. తరువాత ముస్లిం మైనారిటీలు ఉన్నారు. .
గ్రీస్ దాదాపు తమిళనాడు రాష్ట్రం అంత ఉంటుంది. ఈ దేశ భూభాగంలో దాదాపు 80 శాతం పర్వతాలే. సూర్యరశ్మి ఎక్కువ కాలం ఉంటుంది ఈ దేశంలో.
శాంతాక్లాజ్ గా పేరుపడిన శాంతానికోలస్ ఇక్కడివాడే. తెల్లటి గడ్డంతో ఉండే ఇతను పేదలకు, పిల్లలకు ఏదో విధంగా సహాయపడేవాడు.
గణితాన్ని కనుగొన్నది ఈ దేశస్థులే అంటారు. ఇక్కడ నివసించే ప్రజలు 98 శాతం మంది స్థానికులే. మిగతా రెండు శాతం మంది మాత్రమే బయటనుండి వచ్చి స్థిరపడినవారు. 18 సంవత్సరాలు నిండినవారు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఓటు వేయకపోవటం నేరం.
గ్రీస్ ఓ ద్వీపకల్ప సముదాయం. మొత్తం 2000 వేల ద్వీపాలు ఉన్నాయి. కానీ వీటిలో 170 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు.గ్రీకు యువకులు కచ్చితంగా 18 నెలలపాటు సైన్యంలో పనిచేయవలసిందే. క్రీస్తుపూర్వం 776 సంవత్సరంలో మొదటి ఒలింపిక్స్ జరిగింది ఇక్కడే.
పర్యాటకం ద్వారా ఈ దేశానికి అధిక ఆదాయం చేకూరుతుంది. ఇక్కడి ప్రజలకంటే పర్యాటకులే ఎక్కువగా ఉంటారు. ప్రపంచం మొత్తంలో పూరావస్తు ప్రదర్శనశాలలు ఉన్నది గ్రీస్ దేశంలోనే. గ్రీసు దేశానికి 9000 మైళ్ల సముద్రతీర రేఖ ఉన్నది.
గోధుమలు, మొక్కజొన్న, బంగాళా దుంపలు, బార్లీ, బీట్ దుంపలు, పొగాగు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, డైరీ ఉత్పత్తులు కలవు. లిగ్నేట్, పెట్రోల్, ఇనుప ఖనిజం, బాక్సైట్, లీడ్, జింక్, నికెల్, సాల్ట్ మొదలగునవి సహజ సంపదలు కలవు
కొద్ది సైన్యంతో ప్రపంచంలో అనేక దేశాలు జయించిన అలెగ్జాండర్ గ్రీస్ దేశంలోని మాసిడోనియా రాజ్యాని చెందిన వాడు.

Hungary

hungary

Capital Budapest ………. Language Hungarian ………. Currency Forint ………. Religion Christian ………. Calling Code +. 36
మధ్య యూరోప్ లోని సోషలిస్ట్ దేశం హంగేరి. ఇది కమ్యూనిస్ట్ దేశం. హంగేరీ విస్తీర్ణం 93,031 చ.కి.మీ. రాజధాని బుడాపెస్ట్. వీరి అధికార భాష మాగ్యార్. దేశ కరెన్సీ ఫోరింట్. ప్రజలు మాగ్యార్, ఫిన్నిష్- ఉగ్రిక్ మరియు టర్కిష్ జాతులకు చెందినవారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. రోమన్ కేధలిక్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హంగేరీ జానపద సంగీతం వీనుల విందుగా ఉంటుంది.
డాన్యూట్, తిస్జా నదులు ప్రధానమైన నదులు. మైదానాలు సారవంతమైనవి. బాలాటన్ సరస్సు ప్రాంతం సారవంతమైనది. ద్రాక్ష, మొక్కజొన్న, రైధాన్యం, ఓట్స్, పంచదార తయారుచేసే బీట్ దుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, బంగాళా దుంపలు, పొద్దు తిరుగుడు, గోధుమలు ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తులు.
గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమలున్నాయి.
బాక్సైట్, మాంగనీస్, యురేనియం, నేలబొగ్గు, ఇనుపరాయి, లిగ్నైట్, డోలమైట్, చమురు వాయివు పెట్రల్ ఖనిజ నిక్షేపాలున్నాయి, సిమెంట్, రసాయనిక ద్రవ్యాలు, ధాతు సామాగ్రి, యంత్ర సామాగ్రి తయారీ ప్రధాన పరిశ్రమలు.

Iceland

iceland

Capital Reykjavik ………. Language Icelandic ………. Currency Icelandic Krona ………. Religion Church of Iceland ………. Calling Code +. 354

ఐస్ లాండ్ …..

ఐరోపాలోని ఈ దేశం ప్రశాంతమైన దేశం ఐస్ లాండ్. రాజధాని రెక్ జావిక్. వీరి అధికార భాష ఐస్ లాండిక్. కరెన్నీ ఐస్ లాండిక్ క్రోనా. విస్తీర్ణం 39 వేల 682 చ.మైళ్లు. ఎక్కువమంది క్రిస్టియన్లు కాని మత స్వాతంత్ర్యం ఉంది. వీరి జాతీయ క్రీడ హ్యాండ్ బాల్. 1 డిసెంబర్ 1918 సంవత్సరంలో డెన్మార్క్ నుండి ఈ దేశం స్వాతంత్ర్య పొందింది. ఈ దేశ ప్రజలలో ఎక్కువ మంది లూధరన్ చర్చ్ మతాన్ని అనుసరిస్తారు.
ఈ దేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవు. ఐస్ లాండ్ లో నేరాల శాతం కూడా చాలా తక్కువ. అందు చేతనే ఇక్కడి పోలీసుల చేతుల్లో తుపాకులు కనబడవు. సమాజం స్నేహపూరితం. చేపలు, రొయ్యలు ఉత్పత్తుల ద్వారా వీరికి అధిక ఆదాయం సమకూరుతుంది.
ఇక్కడి ప్రజలలో 97.6 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తారు. వీరు ఎక్కువగా సినిమాలు చూస్తారు. వందశాతం అక్షరాస్యత ఉన్న దేశం ఐస్ ల్యాండ్. ఈ దేశంలో రైళ్లు లేవు అంతా భూమార్గమే.
అందమైన జలపాతాలు, సముద్రాతీరాలు, అగ్నిపర్వతాలు ఐస్ ల్యాండ్ లో కనిపిస్తాయి. ఐస్ ల్యాండ్ పేరుకు తగ్గట్టుగానే వేసవిలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించదు. విచిత్రంగా వేసవికాలంలో కూడా 24 గంటలూ ఎండ ఉంటుంది
బంగాళా దుంపలు. కూరగాయలు పండిస్తారు. చేపల పరిశ్రమ, పాల ఉత్పత్తుల పరిశ్రమలున్నాయి.

Ireland

ireland

Capital Dublin ………. Language English/Irish / ………. Currency Euro ………. Religion Christianity ………. Calling Code +. 353

ఐర్లాండ్

ఐర్లాండ్… ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఓ ద్వీపదేశం. చుట్టూ నీళ్లే సరిహద్దులు. ఐర్లాండ్ రాజధాని డుబ్లిన్. విస్తీర్ణం 70,273 చదరపు కిలోమీటర్లు . వీరి అధికార భాషలు ఐరిష్, ఆంగ్లం. దేశ కరెన్సీ యూరో ఈ దేశ జాతీయ చిహ్నం హార్ప్. ఇదో సంగీత వాద్యం.
ఈ దేశంలో రెండు భాగాలుంటాయి. ఒకటి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. రెండోది ఉత్తర ఐర్లాండ్. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కు పూర్తి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఉత్తర ఐర్లాండ్ ఇంకా యూకేలో భాగమే.
అమెరికా వైట్ హౌస్ డిజైనర్ జేమ్స్ హోబన్ ఈ దేశానికి చెందినవాడే.
ఇక్కడ ఎక్కువ మంది సర్ నేమ్ ఓ(O),మ్యాక్(MAC)లతో మొదలవుతుంది. మ్యాక్ అంటే ‘సన్ ఆఫ్’ అని, ఓ అంటే ‘గ్రాండ్సన్ ఆఫ్’ అని అర్థమట. ఇక్కడి హుక్ లైట్ హౌస్ ప్రపంచంలో చాలా కాలంగా పనిచేస్తున్న లైట్ హౌస్గా చెబుతారు. చరిత్రలో నిలిచిపోయిన టైటానిక్ ఓడను తయారుచేసింది ఈ దేశంలోని బెల్ఫాస్ట్లోనే. జ్వరం వస్తే డాక్టర్ దగ్గర ఇంజక్షన్ ఇప్పించుకుంటాం కదా. ఆ హైపోడెర్మిక్ సిరంజీని కనిపెట్టింది ఇక్కడే.
డుబ్లిన్లో ‘రొటుండా’ అనే ఆసుపత్రిని 1745లో ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే ఎక్కువకాలంగా ప్రసూతి సేవలందిస్తున్న ఆసుపత్రి ఇది.
కాఐర్లాండ్లో పాములే ఉండవు. కారణం పాములు శీతల రక్త జీవులు (కోల్డ్బ్లడెడ్ యానిమల్స్). ఇవి అత్యంత చలిని తట్టుకోలేవు. వేల ఏళ్ల క్రితం హిమానీ నదాల వల్ల ఐర్లాండ్ అంతా గడ్డకట్టుకుపోయి ఉండేదట. దీంతో పాములు ఉండేవి కావు. ఇప్పుడు కూడా చుట్టూ సముద్రం, ఎప్పుడూ చల్లగా ఉండటంతో పాములు అస్సలుండవన్నమాట.
ఈ దేశం ఎక్కువగా బంగాళా దుంపల్ని ఎగుమతి చేస్తుంది. టర్నిప్ దుంపలు, బంగాళా దుంపలు, బార్లీ, గోధుమలు, పశు మాంసం, పాల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు.
సహజవాయువు, రాగి, జింక్, బేరైట్, జిప్సం, డోలోమైట్, లైమ్ స్టోన్ సహజ వనరులు.

Italy

italy flag

Capital Rome ………. Language Italian ………. Currency Euro ………. Religion Christianity ………. Calling Code +. 39

ఇటలీ….

ఇటలీ ఐరోపా ఖండంలోని ఒక పేరుపొందిన దేశం. మధ్యధరా సముద్రం మధ్యభాగంలో ఉన్నది. ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, ఆస్ట్రియా, స్లోవేనియా, సాన్ మారినో, వాటికన్ సిటీలు ఈ దేశ సరిహద్దులు. ఇటలీకి పశువుల నేల అనే అర్ధం వస్తుంది. ఇటలీ దేశ రాజధాని రోమ్. విస్తీర్ణం 3,01, 338 చదరపు కిలోమీటర్లు. వీరి భాష ఇటాలియన్. వీరి కరెన్సీ యూరో. ఇటలీలో 90 శాతం మంది ప్రజలు రోమన్ కేధలిక్స్.
ధర్మామీటర్, వయోలిన్, టెలిఫోన్ ఈ దేశస్థులు కనిపెట్టినవే. ఇటలీలో 3వేలకు పైగా మ్యూజియంలు ఉన్నాయి. ప్రపంచలోనే అత్యధికంగా ఈ దేశంలో ఎలివేటర్లు ఉన్నాయి.
ప్రపంచంలోనే పురాతన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన రోమ్ విశ్వవిద్యాలయాన్ని 1303 సంవత్సరంలో ఏర్పాటు చేసారు. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గాలలో ఇటలీలో ఉన్న ‘లాట్స్ చ్ బెర్గ్ బెసె టన్నెల్ ఒకటి. దీని నిర్మాణానికి 17 సంవత్సరాలు పట్టిందట.
పర్యాటకపరంగా ఈ దేశం ప్రసిద్ధి చెందినది. రోమ్, నప్లెస్, మిలాన్ నగరాలు ఇటలీలో అందమైన నగరాలుగా పేరుపొందినవి. పీసా, వెనిస్ నగరాలు కూడా అందమైనవే. లీవింగ్ టవర్ ఆఫ్ పీసా గొప్ప పర్యాటక ప్రాంతం. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశాలలో ఇటలీ అయిదో దేశం. దేశంలోని 5 భాగాలలో నాలుగవ వంతు పర్వతాలే. ఏటా సుమారుగా అయిదు కోట్లమంది ఈ దేశాన్ని సందర్శిస్తారు.
నియంత జూలియస్ సీసర్, క్రిస్టోఫర్ కొలంబస్, ప్రముఖ చిత్రకారుడు మైఖేల్ ఏంజిలో, ముస్సోలినీ, మార్కోపోలో ఈ దేశానికి చెందినవారే. మెర్కురీ, పోటాష్, జింక్, మార్బుల్ బెరైట్, సహజవాయువు, క్రూడ్ ఆయిల్ ఈ దేశంలో లభించే సహజ వనరులు.
పండ్లు, కూరగాయలు, ద్రాక్ష, బంగాళాదుంపలు, బీట్ దుంపలు, సోయా, చిరుధాన్యాలు వ్యవసాయ ఉతప్పత్తులు.

Kosova

kosovo flag

Capital Pristina ………. Language Albanian/Serbian ………. Currency Euro ………. Religion Islam ………. Calling Code +. 383

కొసావో

కొసావో సెర్బియాలోని భూభాగం. 2008 సంవత్సరంలో సెర్బియా నుండి విడిపోయి స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. అమెరికా మరియు కొన్ని యూరోపియన్ దేశాలు మొత్తం 113 దేశాలు కోసావాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. కానీ చాలా దేశాలు కొసావోను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు
అన్బేనియన్ మరియు సెర్బియన్ ఈ దేశ అధికార భాషలు. ఈ దేశం అధికారికంగా ఏ మతానికి చెందనప్పటికీ ప్రజలలో అధికశాతం మంది ముస్లింలు. చాలా కొద్దిమంది క్రిస్టియన్లు కలరు. కొసావో రాజధాని ప్రిస్టీనా. ఈ దేశ వైశాల్యం 10, 908 చ.కి.మీ. ఈ దేశ కరెన్సీ యూరోలు.
కొసావో పర్యాటకపరంగా పేరుపొందినది. బాల్కనో ద్వీపాన్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. పర్యాటకం ద్వారా అధిక ఆదాయం ఈ దేశానికి వస్తుంది.

Latvia

latvia flag

Capital Riga ………. Language Latvian ………. Currency Euro ………. Religion Christian ………. Calling Code +. 371

లాట్వియా….

10వ శతాబ్ధంలో బాల్టిక్ తెగల వారు లాట్వియాలో స్వతంత్ర ప్రభుత్వాలు ఏర్పరుచుకున్నారు. 11 వ శతాబ్దంలో జర్మన్ల ప్రభావం ఈ దేశంపై పడింది. తరువాత 1721 సంవత్సరంలో లాట్వియా రష్యా అధికారంలోకి వచ్చింది.
రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ లాట్వియాలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకుంది. మూడువంతుల ప్రజలు జర్మన్స్ మరియు రష్యన్స్ చేత చంపబడ్డారు. .
1991 సంవత్సరంలో రష్యా విచ్ఛినం అయిన తరువాత లాట్వియా స్వతంత్ర దేశంగా అవతరించింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో చేరింది. .
లాట్వియా రాజధాని రీగా. దేశ వైశాల్యం 64,589 చ.కి.మీ. వీరి అధికార భాష లాట్వియన్. రష్యన్ భాషను 37 శాతం ప్రజలు మాట్లాడుతారు. వీరి కరెన్సీ లాట్వియన్ లాట్. లాట్వియా క్రిస్టియన్ దేశం. ప్రజలు లూధరన్స్, లూధరన్ కేథలిక్స్, రష్యన్ ఆర్ధోడెక్స్ పంప్రదాయాలను పాటిస్తారు. .
గింజ ధాన్యాలు, షుగర్ బీట్, బంగాళా దుంపలు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, పందిమాంసం, పాలు, చేపలు ఇతర ఉత్పత్తులు. .
లైమ్ స్టోన్, కలప, డోలోమెట్, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.

Liechtenstein

Liechtenstein flag

Capital Vaduz ………. Language German ………. Currency Swiss Franc ………. Religion Roman Catholism ………. Calling Code +. 423

లిచెన్ స్టెయిన్

ఈ దేశం యూరోప్ ఖండంలో స్విట్జర్ లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య రైస్ నది మీద ఉన్న చాలా చిన్న రాజ్యం. 1866 సం.లో స్థాపించబడిన ఈ దేశాన్ని రాజవంశీయులు పాలిస్తున్నారు. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలదు. ఈ దేశ విస్తీర్ణం 160 చ.కి.మీ. రాజధాని వాడుజ్. వీరి అధికార భాష జర్మన్. ప్రజలు 87 శాతం మంది రోమన్ కేధలిక్ క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు.
బార్లీ, గోధుమ మొక్కజొన్న పంటలు పండిస్తారు. పాడి పరిశ్రమ కూడా ఉంది. ఆర్దికవ్యవస్థ పరిశ్రమల మీద ఆధారపడి ఉంది. ఈ దేశానికి సైన్యం లేదు. రెండు ప్రపంచ యుద్ధాలలో తటస్తంగా ఉంది.
జవుళీ, యంత్రసామాగ్రి, ఎలక్ట్రానిక్ సామాగ్రి, మైక్రోస్కోపులు, ఆహార పదార్ధాలు, ధాతు సామాగ్రి, హై వాక్యూమ్ పంపులు, తోలు సామాగ్రి తయారీ మొదలగునవి ప్రధాన పరిశ్రమలు.

Lithuania

lithuania flag

Capital Vilnius ………. Language Lithuanian ………. Currency Euro ………. Religion Roman Cath.Church ………. Calling Code +. 370

లిధువేనియా…

1990 సంవత్సరలో సోవియట్ రష్యా విచ్చిన్నం తరువాత లిధువేనియా స్వాతంత్ర్య రాజ్యంగా అవతరించింది. ఐరోపా ఖంఢంలోని బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయ దిశలో ఉన్న తీరంలో ఉన్న మూడు దేశాలలో లిధువేనియా ఒకటి. 2004 సంవత్సరంలో యూరోపియన్ సమాఖ్యలో సభ్యదేశంగా చేరింది.
ఈ దేశం పూర్వచరిత్ర ప్రకారం బాల్టిక్ జాతి ప్రజలు మెదట్లో ఇక్కడ నివసించారు. ఈ దేశ రాజధాని వెల్ నూయిస్. వీరి అధికార భాష లిధువేనియన్ తరువాత రష్యన్, పోలిష్ భాషలు చాలా కొద్దిమంది మాట్లాడుతారు. ఈ దేశ వైశాల్యం 65,200 చ.కి.మీ. వీరి కరెన్సీ లిటాస్. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. ప్రజలలో 79 శాతం మంది రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. ధాన్యాలు, బీట్ దుంపలు, బంగాళాదుంపలు, కూరగాయలు పండిస్తారు. పశుమాంసం, పాలు, గుడ్లు, చేపలు ఇతర ఉత్పత్తులు. వ్యవసాయ యోగ్యమైన భూములున్నాయి.

Luxembourg

luxembourg flag

Capital Luxembourg City ………. Language Luxembourgish ………. Currency Euro ………. Religion Roman Catholic ………. Calling Code +. 352

లక్సెమ్ బర్గ్

యూరోప్ లో పశ్చమ జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న చిన్న రాజ్యం లక్సెమ్ బర్గ్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాజ్యం. రాజ్యంగాన్ని ఏర్పరుచుకుని రాజవంశీయు పరిపాలిస్తున్న దేశం. ఈ దేశ విస్తీర్ణం 2,586 చ.కి.మీ. రాజధాని లక్సెమ్ బర్గ్. వీరి అధికార భాష Luxembourgish. జర్మనీ మరియు ఫ్రెంచ్. ప్రజలు ఇంగ్లీష్ , జర్మన్ భాషలు కూడా మాట్లాడుతారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. ఎస్బీ సుర్ ఆల్ జెట్టీ, డిఫర్ డాంగే, డుడులాంగే ప్రముఖ పట్టణాలు.
సాగునేల ప్రధానంగా ఉన్న ప్రాంతాన్ని బాన్ వేన్ అంటారు. ఈ నేలలు నదుల తీరాన, కొండలతోనూ, పీఠభూమితోనూ నిండి ఉన్నాయి. అతెర్త్ నది, ఆల్జత్తే నది, మొసల్లే నది, మారే నదులు బాన్ వేన్ ప్రాంతంలో ప్రవహిస్తున్న ముఖ్యనదులు. గోధుమ, బార్లీ, ఓట్ ధాన్యం, బంగాళా దుంపలు, ద్రాక్ష ప్రధానమైన పంటలు.
ఇనుప రాయి పుష్కలంగా దొరకుతుంది. పశువుల పెంపకం, పందుల పెంపకం ప్రజల ఇతర జీవనోపాధులు.
ఉక్కు ప్రధాన పరిశ్రమ. ద్రాక్ష సారాయి పరిశ్రమ కూడా ఉంది. ఈరోపియన్ ఆర్ధిక సంఘంలో సభ్యత్వం కలిగి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సాగిస్తుంది.

Macedoniea

macedonia flag

Capital Skopje ………. Language Macedonian ………. Currency Macedonian Dinar ………. Religion Eastreran Orthodox ………. Calling Code +. 389

మాసిడోనియా

మాసిడోనియా దేశం ఆసియా నుండి యూరోప్ దేశాలకు ప్రయాణించే వర్తకులకు మరియు ఆక్రమణ దారులకు కేంద్రంగా ఉండేది. క్రీస్తు పూర్వం 356లో మాసిడన్ ఫిలిప్-2 మాసిడోనియన్ లో చాలా ప్రాంతాలను ఏకం చేసాడు. ఇతని కుమారుడు అలెగ్జాండర్ ది గ్రేట్ మాసిడోనియన్ ను మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు.
గ్రీకుల తరువాత ఈ దేశాన్ని రోమన్లు, అట్టోమన్లు 1912 సంవత్సరందాకా పాలించారు. రెండవ ప్రపంచయుద్దం తరువాత ఈ దేశం యుగోస్లోవియాలో భాగంగా ఉంది. 1991 సంవత్సరంలో యుగోస్లోవియా నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
మాసిడోనియా రాజధాని Skopje . ఈ దేశ వైశాల్యం 25,333 చ.కి.మీ. వీరి భాష మాసిడోనియన్, అల్బేనియన్ మరియు టర్కిష్, రోమా, సెర్బియన్. వీరి కరెన్సీ మాసిడోనియన్ దీనార్లు. ప్రజలలో ఎక్కవ మంది క్రిస్టియన్లు తరువాత 33 శాతం మంది ముస్లింలు కలరు.
ద్రాక్ష, ద్రాక్షా సారాయి, పొగాకు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పాలు, గ్రుడ్లు లభిస్తాయి.
రాగి, సీసం, జింక్, నాణ్యతలేని ఇనుప ఖనిజం, మాంగనీస్, నికెల్, లైమ్ స్టోన్, బంగారం, వెండి, జిప్సం, కలప, టంగ్ స్టన్ సహజ సంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూమి కలదు.

Malta

malta flag

Capital Valletta ………. Language Maltese/English ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 356
మాల్టా ద్వీప దేశం మధ్యధరా సముద్రంలో ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంది. ఇది కొన్ని ద్వీపాల సమూహం. ఇందులో ప్రధానమైన ద్వీపం మాల్టాతో పాటు గోజో, కోమినో అనే చిన్న ద్వీపాలు, నివాసయోగ్యం లేని అతిచిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. విస్తీర్ణం, జనాభా పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీనులు దీన్నే ‘మెలిటా’గా పిలిచేవారు. అంటే తేనె ద్వీపమని అర్థం.
ఈ దేశ రాజధాని వాలెట్టా. ఇది ప్రముఖ చారిత్రక నగరం. ఈ దేశ జనాభా 4,45,426 (2018) దేశ విస్తీర్ణం 316 చ.కి.మీ. వీరి భాషలు ఆంగ్లం, మాల్టీస్‌. ఈ దేశ కరెన్సీ యూరో. ఈ దేశం శతాబ్దాల తరబడి పరాయి దేశాల పాలనలో ఉంది. 1964 సంవత్సరంలో మాల్టా స్వాతంత్ర్యం పొందింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా చేరింది. ఈ దేశ ప్రజలలో 98 శాతం మంది రోమన్ కేధలిక్స్(క్రిస్టియన్స్). జెండాలో ఎరుపు, తెలుపు రంగులతో ఉండే ఈ దేశ పతాకం యూకే దేశ చిహ్నంతో ఉండటం వల్ల ప్రత్యేకమైందిగా భావిస్తారు.
ఇక్కడ 1980లో ‘పొపెయే’ అనే చిత్రం కోసం అందమైన ఇళ్లతో ఒక గ్రామాన్ని నిర్మించారు. ‘పొపెయే విలేజ్‌’గా పిలిచే ఈ గ్రామం మంచి పర్యాటక ప్రాంతం. వాలెట్టా దగ్గర్లో ఉండే ‘గ్రాండ్‌హార్బర్‌’ ప్రపంచంలోనే సహజంగా ఏర్పడిన లోతైన నౌకాశ్రయం. .
ఇక్కడుండే గ్యాన్‌టిజ, అయిదు వేల ఏళ్లనాటి హగర్‌కిమ్‌దేవాలయాలు ఈజిప్టు పిరమిడ్ల కన్నా పురాతనమైనవి. ఇక్కడ పడవలకు మెరిసే రంగులతో కళ్ల బొమ్మలు వేస్తారు. సముద్రపు చెడును, దురదృష్టాన్ని పోగొట్టడానికే ఈ ఆచారం. గోజో ద్వీప దేశంలో ‘అజూరే విండో’ అనే సున్నపురాయి తోరణం ప్రసిద్ధి చెందినది. ఇది ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంటుంది. .
బంగాళ దుంపలు, కేలిఫ్లవర్, ద్రాక్ష, గోధుమలు, బార్లీ, టమాటోలు, సిట్రస్ జాతి పండ్లు పండిస్తారు. పందుల పెంపకం, కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమలు కలవు. .
లైమ్ స్టోన్, సాల్ట్, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.

Moldava

moldava flag

Capital Chisinau ………. Language Romanian ………. Currency LEU ………. Religion Orthodox Christian ………. Calling Code +. 373

మాల్డోవా

మాల్డోవా ఆసియా మరియు తూర్పు యూరోప్ ఖంఢాలకు వచ్చేదారి పోయే దారిగా ఉండటం వలన గ్రీక్స్, రోమన్స్, హాన్స్, బల్గర్స్ మరియు మంగోల్ ల దాడికి గురై వీరి ఆధీనంలోకి వెళ్లింది. 14వ శతాబ్ధంలో మాత్రం కొద్ది కాలం పాటు స్టీఫెన్ ద గ్రేట్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా వ్యవహరించింది. కానీ 16వ శతాబ్ధంలో అట్టోమన్ల చేత ఆక్రమించబడింది. రూసో, టర్కిష్ యుద్దంలో ఈ దేశం రెండుగా విభజించబడి తూర్పు భాగం రష్యా వారి ఆధీనంలోకి పశ్చిమభాగం టర్కీవారి చేతిలోకి వెళ్లిపోయాయి. 1918 సంలో రష్యావారి ఆధీనంలో ఉన్న భాగం రోమేనియా చేతిలో వెళ్లింది. 1944 ప్రాంతంలో తిరిగి ఈ ప్రాంతాన్ని రష్యావారు ఆక్రమించారు.
1991 సంవత్సరంలో రష్యా విచ్చిన్నం తరువాత మాల్డోవా స్వాతంత్ర్యం ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.
ఈ దేశ రాజధాని Chisinau . ఈ దేశ వైశాల్యం 33,843 చ.కి.మీ. వీరి భాషలు మాల్డోవన్, రష్యా మరియు గగాజ్. వీరి కరెన్సీ మాలడేవియన్ లియూ. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ఈస్ట్రన్ ఆర్ధోడాక్స్ శాఖకు చెందినవారు.
కూరగాయలు, పండ్లు, గింజ ధాన్యాలు, పొద్దు తిరుగుడు గింజలు, పొగాకు వ్యవసాయ ఉత్పత్తులు. ఎద్దుమాంసం. పాలు ఇతర ఉత్పత్తులు.
లిగ్నేట్, ఫాస్పరేట్, జిప్సం, లైమ్ స్టోన్ సహజ సంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూములున్నాయి.

Monoco

monoco flag

Capital Monoco ………. Language French ………. Currency Euro ………. Religion Roman Catholicism ………. Calling Code +. 377
ప్రపంచంలోని చిన్న దేశాలలో మొనాకో ఒకటి. రాజవంశీయుల పాలనలో ఉంది. ఫ్రాన్స్ దేశానికి ఆగ్నేయ దిశ మూలగా మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్నది. ఈ దేశ విస్తీర్ణం కేవలం 1.9 చ.కి.మీ. 1993 సంవత్సరంలో మొనాకో యునైటెడ్ నేషన్స్ లో ఓటుహక్కు గల దేశంగా గుర్తించబడ్డది. ఈ దేశ ప్రజలలో 90 శాతం మంది రోమన్ కేథలిక్ శాఖకు చెందినవారు.
రాజధాని మొనాకో. అధికార భాషలు ఫ్రెంచ్, మొనాగాస్క్యే. ప్రజలు క్రైస్తవులు. మాంటి కార్లో, మొనాకో విల్లీ, ఫాంటకవీయిల్లీలా కొండలమీద పక్కపక్కనే ఉన్న పట్టణాలు. కేజినో జాదగృహాలు, పెద్ద హోటళ్ళు, దుకాణాలు ఈ పట్టణంలో ఉన్నాయి.
మాంటీ కార్టో ర్యాలీ, మొనాకో గ్రాండ్ ప్రిక్స్, మోటారు కార్ల ర్యాలీ, జూద గృహాలు అంతర్జాతీయంగా పేరుపొందాయి. పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తారు. ఈ జూద గృహాలలో జేమ్స్ బాండ్ సినిమాలు కూడా చిత్రీకరించ బడ్డాయి.
రసాయనిక ద్రవ్యాలు, పాల ఉత్పత్తులు, పొగాకు పరిశ్రమ, పర్యాటకం మొనాకో ఆర్థిక వ్యవస్థలు మూలం. ఈ దేశానికి సహజసంపదలు, వ్యవసాయ ఉత్పత్తులు గాని లేవు.

Montenegro

montenegro flag

Capital Podgorica ………. Language Montenegrin ………. Currency Euro ………. Religion Muslim/Christian ………. Calling Code +. 382

మౌంటెనాగ్రో

ఐరోపా ఖండంలో ఉన్న చిన్న దేశం మౌంటెనాగ్రో. క్రొయేషియా, బోస్నియా అండ్‌ హర్జెగోవీన్యా, సెర్బియా, కొసోవో, అల్బేనియా దేశాలు, అడ్రియాటిక్‌ సముద్రం దీనికి సరిహద్దులు. మౌంటెనాగ్రో రాజధాని పోడ్‌గొరీసా అతి పెద్ద నగరం కూడా రాజధాని పోడ్‌గొరీసానే. ఈ దేశ విస్తీర్ణం 13,812 చదరపు కిమీ జనాభా 6,42,550 (2018) ఈ దేశ కరెన్సీ యూరో వీరి అధికారిక భాష మౌంటెనాగ్రిన్‌. సెర్బియా నుంచి 2006 జూన్‌ 3న స్వతంత్రం పొందింది.
ఈ దేశం పేరుకు అర్థం ‘నల్ల పర్వతం’. ఇక్కడ భూభాగంలో కొంత శాతం నల్లని పర్వతాలు అడవులతో నిండి ఉంటాయి. అందుకే దీనికీ పేరొచ్చింది. దేశంలో 44.6శాతం మౌంటెనాగ్రియన్లు ఉన్నారు. ఇంకా సెర్బియన్లు, బోస్నియక్‌లు, అల్బేనియన్లు, క్రోట్లు…ఇలా చాలా జాతుల వారు నివసిస్తున్నారు. ప్రజలు ఆర్ఢోడాక్స్, రోమన్ కేధలిక్, ముస్లిం మతస్తులు.
ఇక్కడ జనాభాలో 25 నుంచి 54ఏళ్ల మధ్య వారు 47శాతం మంది ఉన్నారు. 99శాతం అక్షరాస్యత ఉంది, 64శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. దాదాపుగా 60శాతం భూమి సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ అతి ఎత్తయిన ప్రాంతం ‘బొబోటొవ్‌ కుక్‌’.
ఉల్సిన్జ్‌ మున్సిపాలిటీ దగ్గరున్న బీచ్‌ ఐరోపాలోని పొడవాటి ఇసుక బీచ్‌ల్లో ఒకటి. ఇది మొత్తం 12.5కిలో మీటర్లుంటుంది. హార్స్‌బ్యాక్‌ రైడింగ్‌, కైట్‌ సర్ఫింగ్‌, బీచ్‌సాకర్‌, వాలీబాల్‌ క్రీడలకు ఇది ప్రసిద్ధి.
60శాతం మంది జనాభా ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. 250కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి.
ఇక్కడ మిట్రోవిసా అనే గ్రామంలో ఒక ఆలివ్‌ చెట్టుంది. దీన్ని ప్రపంచంలోనే అతి పురాతన ఆలివ్‌ చెట్టుగా చెబుతారు. దాదాపుగా 2000 ఏళ్ల కిందటిది. ఐరోపాలో అధికంగా పొడగరులున్న దేశమిది. సరాసరిన చూస్తే ఇక్కడి మౌంటెనాగ్రియన్లంతా దాదాపుగా ఆరడుగుల ఎత్తుంటారు. ఐరోపాలో మొదటిగా కారు వాడిన దేశమిదే. సెర్బియా, ఇటలీ, జర్మనీ, క్రొయేషియా, హంగేరీలతో ఈ దేశానికి ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి.
ఇక్కడున్న తారా అనే నది చాలా స్వచ్ఛమైన నీరు కలిగిందిగా ప్రసిద్ధికెక్కింది. వాటిని ఫిల్టర్‌ అవసరం లేకుండానే తాగవచ్చంటారు. ఇది ఈ దేశంలో 110 కిలోమీటర్లు ప్రయాణించి బోస్నియా అండ్‌ హర్జెగోవీన్యాలోకి ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా విభజన రేఖగానూ ఉంటుంది.
ఈ నదీపరివాహక ప్రాంతంలో ఉన్న లోయను ఐరోపా ఖండంలోనే అతి లోతైన లోయగా చెబుతారు. ఇది 1300 మీటర్ల లోతున ఉంటుంది. దీనిలోనే ‘దుర్మిటర్‌ నేషనల్‌ పార్క్‌’ ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఏడులక్షల్లోపే జనాభా ఉన్న ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. ఎందుకంటే దీనికి ఆనుకుని అడ్రియాటిక్‌ సముద్రం ఉంది. మొత్తం 118 మైళ్ల తీర రేఖ ఉంటే 120 అందమైన బీచ్‌లున్నాయి. వరల్డ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ కౌన్సిల్‌ మంచి పర్యాటక దేశాల జాబితాలో దీని పేరును మొదటే పొందుపరిచింది. ఇక్కడ 360రోజులు చక్కటి వాతావరణం ఉంటుంది. చలికాలం మాత్రం మంచు ఎక్కువ. దీంతో స్కీయింగ్‌, ఐస్‌ స్కేటింగ్‌ల కోసం ఇక్కడకు వచ్చేవారి సంఖ్యా అధికమే.
స్టీల్‌, అల్యూమినియంలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలూ ఎక్కువే. 40 శాతం భూమిలో అడవులే ఉన్నాయి. వాటి ఉత్పత్తులతో ఇక్కడ కార్పెట్లు, చెక్క శిల్పాలు తయారవుతాయి. సిరామిక్‌ వస్తువుల్నీ తయారుచేసి ఎగుమతి చేస్తారు.
ఫిలిగ్రీ జ్యూవెలరీ ఇక్కడ ఎక్కువగా తయారవుతుంది.
గింజ ధాన్యాలు, పొగాకు, బంగాళా దుంపలు, సిట్రస్ జాతి పండ్లు, ద్రాక్షలను పండిస్తారు.

Netherlands

netherlands flag

Capital Amsterdam ………. Language Dutch/Russian/English ………. Currency Euro ………. Religion Irreligion ………. Calling Code +. 31

నెదర్లాండ్స్

పశ్చిమ యూరోప్ లో ఉత్తర సముద్రాన్ని ఆనుకుని రైన్ నదీ ముఖద్యారాన్ని ఆనుకుని ఉన్న సంపన్న దేశం నెదర్లాండ్స్. రాజవంశీయులు రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసుకొని పాలిస్తున్న దేశం. ఈ దేశ విస్తీర్ణం 41,863 చ.కి.మీ. రాజధాని ఆమ్ స్టర్ డామ్ . వీరి భాష డచ్. కరెన్సీ యూరోలు. ఆమ్ ప్టరక్ డాం, రోటర్ డాంలు ప్రధాన నగరాలు
ఈ దేశంలో సారవంతమైన నేలలున్న ప్రాంతం పోల్డరు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 7 మీటర్ల దిగువున ఉన్నది. డైకు నిర్మాణాల ద్వారా ఈ ప్రాంతం సముద్రపు ముంపు కాకుండా రక్షిస్తుంటారు. వ్యవసాయంలో యంత్రాలను ఎక్కువగా వాడుతుంటారు. బార్లీ, ఓటు ధాన్యం, పంచదార బీటు దుంపలు, గోధుమ, తులిప్ పువ్వులు పండిస్తారు,
మత్స్య పరిశ్రమ భారీ స్థాయిలో సాగుతుంది.
చమురు వాయువు, పెట్రోల్, ఉప్పు ఖనిజ నిక్షేపాలు. పారిశ్రామికంగా ఈ దేశం అభివృద్ధి చెందినది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉక్కు, జువుళీ, ఇనుము, ఆహార పదార్ధాలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.
అమ్ స్టర్ డామ్ పట్టణం వజ్రపరిశ్రమకు ప్రధాన కేంద్రం. రాటర్ డామ్ పట్టణం పెద్ద రేవు పట్టణం.

Norway

norway flag

Capital Oslo ………. Language Norwaygian ………. Currency Norwaygian Krone ………. Religion Evangelical Luthern  ………. Calling Code +. 47

నార్వే

యూరోప్ ఖండంలో వాయువ్య దిశలో ఉన్న దేశం నార్వే. రాజ్యంగం ఏర్పరుచుకుని రాజవంశీయులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు.ఈ దేశంలో మే, జూన్, జులై నెలలో సూర్యుడు అస్తమించడు. నవంబర్ నెల చివరినుండి జనవరి చివరి వరకు సూర్యుడు ఉదయించడు. అర్ధరాత్రి ‘‘ఆరోరా బొరియాలిస్ ’’ అనే కంతులు ఈ దేశంలో కనిపిస్తాయి.
ఈ దేశ విస్తీర్ణం3,23,878 చ.కి.మీ. రాజధాని అస్లో. వీరి అధికార భాష నార్విజియన్.
పర్వతాలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో సహజసంపద పుష్కలంగా లభిస్తుంది. బార్లీ, ఓట్స్, రై ధాన్యం, బంగాళా దుంపలు పండిస్తారు.
గండుమీను చేపలు, హెర్రింగ్, టూనా, సీల్ చేపలు, మేకరిల్, సాల్మన్ చేపలు లభిస్తాయి. అడవులనుండి లభ్యమయ్యే కలపతో కలపగుజ్జు తయారీ, కాగితం తయారీ, ప్లైవుడ్ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. జలవిద్యుత్ పుష్కలంగా ఉత్పత్తి కావటం వలన ఫ్యాక్టరీలకు ఇంధనం కొరత లేదు.
నార్వే పశ్చిమ తీరం వెంటబడి ఫియోర్డ్ లనే ఎత్తయిన కొండశిఖరాలు కనిపిస్తాయి.

Poland

poland flag

Capital Warsaw ………. Language Polish ………. Currency Polish Zloty ………. Religion Roman Catholicism ………. Calling Code +. 48

పోలాండ్

ఐరోపా ఖంఢంలోని తొమ్మిదవ పెద్ద దేశం పోలండ్. ఇక్కడ ప్రజలను పోల్స్ అంటారు. ఈ పేరుమీదు గానే ఈ దేశానికి పోలండ్ అనే పేరు వచ్చింది. పోలండ్ 1918వ సంవత్సరంలో రష్వా నుండి స్వాతంత్ర్యం పొందింది. 1922 సంవత్సరం నుండి ప్రజాస్వామ్య దేశంగా మారింది.
దేశ రాజధాని వర్సావ్. వీరి భాష పోలిస్. దేశ కరెన్సీ పోలిష్ వీరి భాష పోలీష్ కొంచెం కష్టమైనది ఇతరులు నేర్పుకోవటానికి కష్టపడాలి. దేశ విస్తీర్ణం 3,12,679 చ.కి.మీటర్లు ప్రజలలో ఎక్కువ మంది రోమన్ కేధలిక్ వర్గానికి చెందినవారు
పోలండ్ లో అక్షరాస్యతా 90 శాతం. మళ్లీ వీరిలో 50 శాతం మంది డిగ్రీ వరకు చదువుకున్నవారే.
ఇక్కడున్న వైల్జ్ కా ఉప్పుగని ప్రాచీనమైన గనులలో ఒకటి. 13వ శతాబ్ధంలో ఉప్పు సేకరణ మొదలు పెట్టారు. 2007 వరకు ఉప్పును సేకరించారు. 178 మైళ్లున్న ఈ ఉప్పుగని ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారింది.
ఐరోపా మొత్తం మీద యూదులు ఎక్కువగా ఈ దేశంలోనే ఉన్నారు.
బొగ్గు నిల్వలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మరో 500 సంవత్సరాలకు సరిపడా వీరి అవసరాలకు బొగ్గు సరిపోతాయని అంటారు.
పసుపు రంగులో ఉండే అంబర్ రత్నాలను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. వీరి ఆహారం, సూప్, మాంసం, బేక్ చేసిన పదార్ధాలు.
బంగాళా దుంపలు, పండ్లు, కూరగాయలు, గోధుమలు పండిస్తారు. పందుల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం కలవు.

Portugal

portugal flag

Capital Lisbon ………. Language Portugese ………. Currency Euro ………. Religion Roman Catholic ………. Calling Code +. 351

పోర్చుగల్

ఐరోపా ఖండంలో చిన్న దేశం పోర్చుగల్. దాదాపు కోటి మంది జనాభా మాత్రమే ఉన్నారు. స్పెయిన్, అట్లాంటిక్ మహా సముద్రాలు సరిహద్దులు. దేశంలో మూడు వంతుల్లో ఒక వంతు భూమిలో అడవులే ఉన్నాయి. పోర్చుగల్ రాజధాని లిస్పన్. వీరి కరెన్సీ యూరో. వీరి అధికారిక భాష పోర్చుగీసు. ఈ దేశ వైశాల్యం 92,391 చ.కి.మీటర్లు. దేశ ప్రజలలో 94 శాతం మంది రోమన్ కేధలిక్ శాఖను అనుసరిస్తారు. మిగతా వారు ప్రొటెస్టెంట్లు. ఈ దేశం క్రిస్టియన్ దేశం
ప్రపంచవ్యాప్తంగా ఈ భాషను 23కోట్లమందికి పైగా మాట్లాడుతున్నారని అంచనా. ఈ భాష ఈ దేశానికే కాదు మరో తొమ్మిది దేశాలకూ అధికారిక భాషే. ప్రపంచంలో ఇంగ్లిష్, స్పానిష్ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది ఈ భాషే. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ పురుషుల కంటే స్త్రీల ఆయుష్షు ఆరేళ్లు ఎక్కువ.
ఐరోపా ఖండంలో ఉన్న రాతి గుహల్లో అతి అరుదైనది ‘ద బెనాగిల్ కేవ్’. ప్రపంచంలోని తొలి పది అతి చల్లని గుహల్లో ఇదీ ఒకటి. సముద్ర తీరంలో ఉండే ఈ గుహ వింతగా ఉంటుంది. పైన ఆకాశం కనిపించేలా ఓ రంధ్రం ఉండి చుట్టూ గోడలతో మూసుకుని ఉన్నట్టు ఉంటుంది. వాటి మధ్య ఉన్న ఖాళీల నుంచి సముద్రపు అలలు లోపలికి వస్తుంటాయి. దీంతో గుహ లోపల ఉండే ఈ బీచ్లో సరదాగా గడిపేందుకు చాలా మంది వస్తుంటారు. ఇది పోర్చుగల్ దక్షిణ భాగంలో బెనాగిల్ అనే ఓ చిన్న పల్లెలో ఉంది. ఈ వూరి పేరు మీదనే ఈ గుహనూ పిలిచేస్తారు.
పునరుత్పాదక(రెన్యుబుల్) వనరుల నుంచి ఎక్కువగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందీ దేశం. వీళ్ల అవసరాల్లో 70శాతం విద్యుత్ ఇలాగే ఉత్పత్తి అవుతుంది.
ప్రపంచంలో సర్ఫింగ్కి అతి అనువైన సముద్ర తీరం ఈ దేశానిదేనంటారు. ఏడాది పొడవునా ఇక్కడ అలలు సర్ఫింగ్కి అనుకూలంగా ఉంటాయట. ప్రజా రవాణా కోసం స్ట్రీట్ కార్లను 1890 నుండి వాడేస్తున్నారు. ఇంటికి ఆహ్వానించిన అతిథులకి పూలు, చాక్లెట్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం వీరికి ఉంది. పదమూడు సంఖ్యను దురదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. .
ఈ దేశ రాజధాని లిస్బన్లో 1732లో ఓ పుస్తకాల దుకాణం ప్రారంభించబడింది. దీని పేరు లివ్రారియా బెర్ట్రండ్.ఈ దుకాణం ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉంది. ప్రపంచంలోనే అతి ప్రాచీన పుస్తకాల దుకాణంగా దీన్ని చెబుతారు.
అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఇక్కడున్న కోయింబ్రా ఒకటి. 1290వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఐరోపా ఖండంలో అతి పొడవైన వంతెన ఇక్కడే ఉంది. దాని పేరు ‘వాస్కోడీగామా బ్రిడ్జ్’. 17కిలోమీటర్ల పొడవుంటుంది.
చరిత్రలో అతి పెద్ద భూకంపంగా చెప్పుకునే ‘గ్రేట్ లిస్బన్ ఎర్త్క్వేక్’ 1755లో ఇక్కడ వచ్చింది. రిక్టరుస్కేలుపై 9 తీవ్రతతో నమోదైన భూకంపం. ఆ వెంటే సునామీ వచ్చింది. ఏకంగా పది వేల మందికి పైగా ప్రాణాలొదిలారు.
ఇక్కడ తృణ ధాన్యాల్ని ఎక్కువగా పండిస్తారు. ఇవే కాకుండా బంగాళాదుంపలు, ద్రాక్ష, బాదం,ఆలివ్, టమాటాలనూ సాగుచేస్తారు. గొర్రెలు, బాతులను పెంచుతారు. చేపలు, కోళ్ల పరిశ్రమ, పాడి పశువుల పెంపకం కలదు. ఇతర దేశాలకు టామాటా పేస్ట్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశం ఇదే.
ఇనుప ఖనిజం, రాగి, జింక్, టంగ్ స్టన్, వెండి, బంగారం, యురేనియం, జిప్సం, సాల్ట్ సహజ సంపదలు.

Romania

romania flag

Capital Bucharest ………. Language Romanian ………. Currency Romanian LEU ………. Religion Eastern Orthodox ………. Calling Code +. 40

రుమేనియా

సోషలిస్ట్ రిపబ్లిక్ దేశం రుమేనియా. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండటంతో రుమేని అని పేరు వచ్చింది. ఈ దేశం నల్ల సముద్రాన్ని ఆనుకుని ఉంది. 1859లో ఏర్పాటైన ఈ దేశం 1940 సం.లో కమ్యూనిస్ట్ ల పాలనలోకి వచ్చింది. సోవియట్ ప్రాబల్య అప్పట్లో ఎక్కువగా ఉండేది.ప్రస్తుతం సోవియట్ జోక్యం లేదు.
ఈ దేశ విస్తీర్ణం 2,37,500 చ.కి. మీ. రాజధాని బుఖారెస్ట్. వీరి అధికార భాష రోమేనియన్. ప్రజలలో రోమన్ ల వారసులు 88 శశాతం మంది ఉన్నారు. రోమేనియన్ ఆర్తడక్స్ క్రైస్తవమతాన్ని పాటిస్తారు.
ట్రాన్స్ లేనియా పర్వతశ్రేణి పీఠభభూమి వలయాకారంలో విస్తరించి ఉంది. డాన్యూబు నది పప్రధానమైనది. ఈ నది 1400 కి.మే ప్రవహించి నల్ల సముద్రంలుతుంది. జ్యూనరి, ఓల్తుత్ , పూత్, ఆర్గేసుల, అయిలోమితా, సిరెతోల్ నదులు ప్రధానమైన నదులు. పర్వతాలు ప్రకృతి సౌందర్యంతో అలరిస్తాయి. ఈ దేశంలో 2500 సరస్సులు, తటాకాలు ఉన్నాయి. నేలకూడా సారవంతమైనది. చక్కటి పచ్చిక బయళ్లు ఉన్నాయి. అటవీ సంపద ఉంది. పెట్రోల్, సహజవాయువు, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి.
బాక్సైట్, నేలబొగ్గు, సీసం, రాగి, బంగారం, ఇనుపరాయి, వెండి, జింకు లోహాలు ఈ దేశంలో లభించే ఇతర ఖనిజాలు.
గోధుమ, మొక్కజొన్న, రైధాన్యం, పండ్లు, బంగాళాదుంపలు, పంచదార బీటు దుంపలు, సమిష్టి వ్యయసాయ క్షేత్రాలలో సాగుచేస్తారు.
యంత్ర సామాగ్రి, దుస్తుల తయారీ, ఆహార దినుసులు, డీజెల్ రైలు ఇంజన్లు, సహజ వాయువు, పెట్రోల్, పెట్రో రసాయనికాలు, ఎరువులు ముఖ్యమైన పరిశ్రమలు.

San Marino

san marino flag

Capital San Marino ………. Language Italian ………. Currency Euro ………. Religion Roman Catholic ………. Calling Code +. 378

సాన్ మారినో

సాన్ మారినో చాలా ప్రాచీనమైన దేశం యూరోప్ లో క్రీ.శకం 321 సంవత్సరం నుండి ఈ దేశ చరిత్రకు ఆధారాలున్నాయి.. అసినైన్ పర్వత శ్రేణులలో ఉంది. చుట్టూరా ఇటలీ భూభాగమున్నది.
ఈ దేశ వైశాల్యం 61 చ.కి.మీ. రాజధాని సాన్ మారినో. వీరి అధికార భాష ఇటాలియన్. ప్రజలు క్రైస్తవ మతస్తులు. 95 శాతం మంది రోమన్ కేధలిక్స్.
గోధుమ, ద్రాక్షా, ఆలివ్ పంటలను పండిస్తారు. పింగాణీ, ఆహాపదార్ధాలు, సిమెంట్, తోలు, ఉన్ని ప్రధాన పరిశ్రమలు. పర్వాటక దేశం కావటం వలన పర్యాటకుల ద్వారా విదేశీ ద్రవ్యం లభిస్తుంది.

Serbia

sderbia flag

Capital Belgrade ………. Language Serbian ………. Currency Serbian Dinar ………. Religion Eastern Orthodox ………. Calling Code +. 381

సెర్బియా

ఐరోపా ఖండంలో చుట్టూ భూభాగం గల దేశం సెర్బియా. హంగేరీ, రొమేనియా, బల్గేరియా, మెకడోనియా, క్రొయేషియా, బోస్నియా, మోంటెన్గ్రో, అల్బేనియాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాజధాని బెల్గ్రేడ్. పెద్ద నగరం కూడా. వీరి కరెన్సీ సెర్బియన్ దినార్. ఒక సెర్బియన్ దినార్ మన రూపాయి కంటే తక్కువే. దాదాపుగా 64పైసలు దేశ విస్తీర్ణం 88,361 చదరపు కిలోమీటర్లు జనాభా 70,58,322 అధికారిక భాష సెర్బియన్
ఐరోపాలోని అతి ప్రాచీన నగరాల్లో బెల్గ్రేడ్ ఒకటి. ఏడు వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగానూ పేరొందింది. ప్రాచీన కాలంలో ఉన్న రోమన్ రాజ్యంలో సెర్బియా ఒక భాగం. మొత్తం 18 మంది రోమన్ చక్రవర్తులు పుట్టినచోటు ఈ దేశమేనని చెబుతారు. వారి రాజధాని నగరాల్లో నాలుగు ఇప్పటి సెర్బియాలోనే ఉన్నాయి.
70 లక్షలకు పైగా జనాభాకు 90లక్షలకు పైగా ఫోన్లున్నాయి. జనాభా వృద్ధి రేటు మాత్రం తిరోగమనంలో ఉంది. నలభైలక్షల మందికి పైగా ఇంటర్నెట్ని వాడుతున్నారు.
మొత్తం భూభాగంలో 31శాతానికిపైగా అడవులున్నాయి. 57శాతంలో పంటలు పండిస్తారు. ఇక్కడి వారందరికీ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం.
ప్రపంచ వ్యాప్తంగా సెర్బియన్ల ఆతిథ్యానికి చాలా మంచి పేరుంది. ‘అతిథి దేవోభవ’ భారతీయ సంప్రదాయంలాగే అతిథుల్ని దేవుడిలాగే భావించాలని వీరు నమ్ముతారు. విదేశాల్నించి రోగులు ఇక్కడ ఆసుపత్రులకు రావడానికి ఇదీ ఒక కారణం. అలాగే ఇక్కడ ఎవరింటికైనా అతిథిగా వెళితే ఏదో ఒక బహుమతి ఇవ్వకుండా మాత్రం పంపించరు. చాక్లెట్లు, పువ్వుల దగ్గర నుంచి ఏదో ఒకటి బహూకరిస్తారు. ఇంటికొచ్చిన అతిధిని చాలా గౌరవంగా చూస్తారు. వారు నోరు తెరిచి ఏదీ అడగకుండానే అన్నీ అందివ్వాలనుకుంటారు.
ఇక్కడి ప్రజలు కాఫీని ఎక్కువగా ఇష్టపడతారు. కాఫీ తాగేందుకూ పక్కవారిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. స్నేహితులంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు టీ తాగినట్లు వీళ్లు కాఫీ తాగుతారు.
బస్సుల్లో గర్భిణులకు రిజర్వ్డ్ సీట్లుంటాయి.
ప్రపంచంలో మంచి గడియారాలన్నింటినీ స్విట్జర్లాండ్ ఎక్కువగా తయారు చేస్తుంటుంది. అయితే స్విస్ వారికంటే 600ఏళ్ల ముందు నుంచే సెర్బియన్లు గడియారాల్ని తయారు చేయడం మొదలుపెట్టారు.
ప్రజలంతా చూసుకోవడానికి వీలుగా మొదటి మెకానికల్ గడియారాన్ని రష్యాలో 1404లో తయారు చేశారు. దాన్ని చేసింది మాత్రం సెర్బియా దేశస్థుడు లేజర్.
సెర్బియా సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే పర్వతాలు, వాటిపై గడ్డి మైదానాలతో చూడచక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని డెవిల్స్ టౌన్ అని స్థానికులు పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టితో స్తంభాల మాదిరిగా ఏర్పడిన నిర్మాణాలు ఉంటాయి. పొడవుగా ఉండే ఇవి 220కిపైగా ఉన్నాయి. ఇవి నేల కోత వల్ల ఏర్పడ్డ చిత్రమైన నిర్మాణాలు. అయితే వీటిని దెయ్యాలే ఇలా నిర్మించాయంటూ స్థానికులు చెబుతారు.
ఎర్రగా చూడగానే నోరూరిపోయేలా ఉండే రాస్బెర్రీలు ఇక్కడ అధికంగా పండుతాయి.
చమురు, గ్యాస్, బొగ్గు, ఇనుపఖనిజం, కాపరు, జింకు, బంగారం, వెండి, మెగ్నీషియం, సున్నపురాయి, మార్బుల్, ఉప్పు సహజ సంపదలు.

Slovakia

slovokia flag

Capital Bratislava ………. Language Slovak ………. Currency Euro ………. Religion Roman Ctholics ………. Calling Code +. 421

స్లోవాకియా

స్లోవాకియా 9 వ శతాబ్ధంలో గ్రేట్ మోరావియా సామ్రాజ్యంలో ఒక భాగం. మోరావియా సామ్రాజ్య పతనానంతరం స్లోవాకియా హంగేరియన్ సామ్రాజ్యంలో అనేక సంవత్సరాల పాటు భాగంగా ఉంది. మొదటి ప్రపంచయుద్ధం తరువాత స్లోవాకియా చెకోస్లోవియాలో భాగమైంది. 1993 వ సంవత్సరంలో ఈ దేశం స్వాతంత్రం సంపాదించుకుంది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ సమాఖ్యలో సభ్యత్వం తీసుకుంది.
ఈ దేశ రాజధాని Bratislava. ఈ దేశ వైశాల్యం 48,845 చ.కి.మీ. వీరి అధికార భాష స్లోవాక్. తరువాత హంగరీ, రోమా, యుక్రేనియన్ భాషలు మాట్లాడుతారు. వీరి కరెన్సీ స్లోవాక్ కోరూనా. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. రోమన్ కేథలిక్స్, ప్రొటెస్టంట్స్ తెగలకు చెందిన వారు.
గింజ ధాన్యాలు, బంగాళా దుంపలు, సుగర్ దుంపలు, పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపరిశ్రమ ఉంది. అటవీ ఉత్పత్తులు లభిస్తాయి.
బ్రౌన్ కోల్, లిగ్నేట్, రాగి, మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది.

Slovenia

slovinia flag

Capital Ljubljana ………. Language Slovene ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 386

స్లోవెనియా…

స్లోవెనియా…హబ్స్ బర్గ్ సామ్రజ్యం వారి పాలనలో 1300 సంవత్సరం నుండి 1918 సంవత్సరంలో మొదటి ప్రపంచయుద్దం జరిగే వరకు ఉంది. తరువాత సెర్బ్ లో ఆ తరువాత యుగోస్లేవియాలో భాగమైంది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత స్లోవేనియా స్వతంత్రరాజ్యంగా అవతరించింది.
ఈ దేశ రాజధాని Ljubljana . ఈ దేశ వైశాల్యం 20,273 చ.కి.మీ. వీరి భాష స్లోవేనియన్ (91 శాతం) సెర్బో క్రోషియన్ భాష కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ టోలార్. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
బంగాళా దుంపలు, సుగర్ దుంపలు, మొక్కజొన్న, ద్రాక్ష వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలను పెంచుతారు. కోళ్లపరిశ్రమ కలదు. లిగ్నేట్, బొగ్గు, సీసం, జింక్, పాదరసం, యురేనియం, వెండి ఖనిజ నిక్షేపాలు.

Spain

spain flag

Capital Madrid ………. Language Spanish ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 34

స్పెయిన్

పశ్చిమ యూరోప్ లో రష్యా, ఫ్రాన్స్ తరువాత పెద్ద దేశాలలో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. నీపోడీ ఎస్పానా స్పెయిన్ దేశపు అధికార నామం. రాజ్యాంగం ద్వారా రాజవంశీయులు పరిపాలిస్తున్న దేశం.
స్పెయిన్ దేశ విస్తీర్ణం 5,04,783 చ.కి.మీ. రాజధాని మాడ్రిడ్ బార్సిలోనా. వేలెన్షియా, సెవిల్లా, జారాగో జా ఇతర ముఖ్యమైన పట్టణాలు. వీరి అధికార భాష స్పానిష్.ప్రజలలో ఎక్కువమంది స్పానిష్ జాతులు, కాటాలిన్ గాలీషియన్ బాస్క్ తెగల వారు నివసిస్తున్నారు. వీరిలో 97 శాతం మంది రోమన్ కేధలిక్స్.
కొంతకాలం ఫ్రాంకో నియంత పరిపాలనలో ఉంది (1930-75). స్పానిష్ వారు సాహసవంతులైన నావికులుగా పేరుపొందారు. అమెరికా ప్రాంతంలో కాలు మోపిన మొదటి యూరోపియన్ కొలంబస్ స్పెయిన్ దేశస్తుడు. మటడార్ అనే గిత్త(ఎద్దు)లతో పోరాడే క్రీడకు స్పెయిన్ పేరు పొందింది.
ప్రధానమైన నది టాగస్ పశ్చిమంగా 900 కి.మీ పయనించి పోర్చుగల్ లో ప్రవేశిస్తుంది. మెసెతా పెద్ద పీఠభూమి. గ్వాడెల్ క్వివిర్ నది 640 కి.మీ. మేర ప్రవహించి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. 1950 సం.రానికి ముందు స్పెయిన్ దేశం ఆర్ధికంగా వెనుకబడి ఉంది. తరువాత పారిశ్రామిక ప్రగతి సాధించింది.
ఆలివ్, నారింజ, సారాయికి పనికి వచ్చే ద్రాక్షా, గోధుమ ప్రధానమైన పంటలు. బార్లీ, గజనిమ్మ, ఉల్లి పాయలు, మొక్కజొన్న, నారింజ, రైధాన్యం, బీటు దుంపలు, బంగాళా దుంపలు ఇతర పంటలు.
కాంటాబ్రియన్ పర్వతాలలో నాణ్యమైన ఇనుప ఖనిజం, నాసిరకం నేలబొగ్గు, రాగి, పాదరసం, పోటాష్, సీసం, జింకు, పైరిటీస్, టైటానియం, మాంగనీస్ లభిస్తాయి.
మోటారు కార్ల తయారీ, నౌకానిర్మాణాలకు స్పెయిన్ దేశం పేరుపొందింది.సహజ వాయివు, పెట్రోల్ ఉత్పత్తులు, సిమెంట్ర, రసాయినిక ద్రవ్యాలు, దుస్తులు, పానీయాలు, ఉక్కు, పాదరక్షలు, రవాణా వాహనాలు, విద్యుత్ యంత్రాలో ఇతర పరిశ్రమలు.
పర్యాటక పరమైన దేశం కావటం వలన ఆర్ధికంగా కూడా బలపడింది. తీరప్రాంతాలలో పర్యాటకులకు తగిన వసతులున్నాయి. రాజులకు సంబంధించిన కట్టడాలు, గిత్తల పోరాటాలు వీరి సాంస్కృతిక సంబరాలు విదేశీ యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణలు. ధరలు అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి.

Sweden

Sweden Flag, प्रिंटेड झंडा, प्रिंटेड ...

Capital Stockholm ………. Language Swedish ………. Currency Swedish Krona ………. Religion Lutheran Christianity ………. Calling Code +. 46

స్వీడన్

యూరోప్ లో ఉత్తర దిశలో ఉన్న ఒక సంపన్న దేశం స్వీడన్. సోవియట్ రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్ తరువాత నాలుగవ పెద్ద దేశం కూడా. క్రీ.శ. 1434 సం.నుండి రాజ్యాంగం ప్రకారం రాజవంశీయులు పాలిస్తున్న దేశం. స్వీడిష్ భాషలో ఈ దేశం పేరు కొనున్గారికెట్ స్వెరిగే. ఉత్తరాన ఆర్కిటిక్ వలయం విస్తరించి ఉన్నది. దక్షిణాన, తూర్పున బాల్టక్ సముద్రం, పశ్చిమాన నార్వేదేశం సరిహద్దులు కలిగి ఉంది.
స్వీడన్ విస్తీర్ణం 4,49,732 చ.కి.మీ. రాజధాని స్టాక్ హోం. అధికార భాష స్వీడిష్. ప్రజలు నార్డిక్ జాతికి చెందినవారు. క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. గోటెబర్గ్, మాల్మో, ఉప్పలా, ఓరెబో, నోర్కోసింగ్ ఇతర ప్రధాన పట్టణాలు
ప్రపంచంలోనే ఈ దేశం కలప, కలప గుజ్జు, కాగితం తయారీలో ఆగ్రస్థానం వహిస్తుంది. ఫిర్, పైన్, స్ర్పూస్ వృక్షజాతులు ఎక్కువ.
హిమనదులు, చెరువులు, సరస్సులు చాలా ఉన్నాయి కానీ అతి శీతల దేశం కావటంతో భూమి వ్యవసాయానికి పనికి రాదు. ఐనా దేశానికి కావలిసిన బార్లీ, ఓటు, రై ధాన్యం, బంగాళాదుంపలు, బీటు దుంపలు, గోధుమ సాగుచేస్తున్నారు. పాడిపరిశ్రమ, ఆవులు, పందుల పోషణ ఎక్కువగా ఉంది. కొనిఫెరస్ అడవుల సంపద పుష్కలంగా ఉంది. జలవిద్యుత్ కూడా ఎక్కువగా ఉంది.
రాగి, సీసం, బంగారం, జింకు, ఇనుపరాయి, యురేనియం ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. యంత్రపు పనిముట్లను తయారు చేయటానికి ఉపయోగపడే ఉక్కు తయారీ ఈ దేశం ప్రసిద్ధి చెందినది.
కాడ్ చేప, హెర్రింగ్, మెకెరెల్, సాల్మన్ చేపలు లభిస్తాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం స్వీడన్. విమానాలు, మోటారు కార్లు, వ్యవసాయపు పనిముట్లు, బాల్ బేరింగులు, విద్యుత్ యంత్రసామాగ్రి, ఎరువులు, గాజు, కాగితంలో రకాలు, నౌకా నిర్మాణం, ఉక్కు సామాగ్రి ఇంకా అనేక ఎగుమతులకు సంబంధించి పరిశ్రమలు స్వీడన్ లో ఉన్నాయి.
సుప్రసిద్ధ నోబుల్ బహుమానం రూపకర్త రాబర్ట్ నోబుల్ స్వీడన్ దేశానికి చెందినవాడే.

Switzerland

swutzerland flag

Capital Bern ………. Language German/French/ ………. Currency Swiss Franc ………. Religion Christianity ………. Calling Code +. 41

స్విట్జర్లాండ్‌

స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌. జనాభా 83,41,000 దేశ విస్తీర్ణం: 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, రోమన్ష్‌ కరెన్సీ స్విస్‌ ఫ్రాంక్‌. చతురస్రాకారంలో ఉండే జెండా వాటికన్‌సిటీ, స్విట్జర్లాండ్‌లకు మాత్రమే ఉంది. మొత్తం ఎరుపు రంగులో ఉండి మధ్యలో తెల్లని ప్లస్‌ గుర్తు ఉంటుంది. అది వీరి సేవా దృక్పథానికి ప్రతీక. ఈ దేశంలో చలి ఎక్కువ. శీతకాలం -20 డిగ్రీలు కూడా నమోదవుతుంది. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’లో డెన్మార్క్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
స్విట్జర్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం జ్యురిచ్‌. 60 శాతం భూభాగంలో ఆల్ప్స్‌ పర్వతాలే ఉన్నాయి. మోంటే రోసా అన్నింటికంటే ఎత్తైనది. ఏకంగా 24 పర్వతాలు 4000 మీటర్లకంటే ఎత్తున్నాయి. 1500కు పైగా సరస్సులున్నాయి.
జనాభాలో 25 శాతం మంది విదేశీయులే. స్విట్జర్లాండ్‌లో పిల్లలకు ఇష్టం లేని పేరుతో తల్లిదండ్రులు పిలవకూడదు. అది చట్టరీత్యా నిషిద్ధం. పార్లమెంటులో పాసై చట్టమైన దాన్ని దేన్నైనా అక్కడి ప్రజలు కోర్టులో సవాల్‌ చెయ్యొచ్చు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. 1971 వరకు ఇక్కడి మహిళలకు ఓటు హక్కు లేదు.
కుక్కల్ని పెంచుకోవాలంటే పన్ను కట్టాల్సిందే. వాటిని ఎలా చూసుకోవాలన్న దానిపై ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిందే.
18 ఏళ్లు దాటిన స్విస్‌ యువకులు తప్పకుండా మిలటరీలో పని చేయాల్సిందే. మహిళలకు ఈ నిబంధన లేదు. ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇదొకటి. ప్రజా అవసరాల కోసం వాడే విద్యుత్తులో సగం జల విద్యుత్‌ ప్లాంట్ల నుంచే వస్తుంది. బెర్న్‌ నగరంలో లో 100కు పైగా ఫౌంటెన్లు ఉన్నాయి. అందుకే దీన్ని ‘సిటీ ఆఫ్‌ ఫౌంటెన్స్‌’ అంటారు.
ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రెడ్‌క్రాస్‌ పుట్టిందిక్కడే. ఇక్కడి జెనీవాలో దీన్ని 1863లో ప్రారంభించారు. ఇక్కడ అందరికంటే ఎక్కువ జీతం వచ్చేది ఉపాధ్యాయులకే.
జపాన్‌ తర్వాత సమయానికి రైళ్లు నడిచేదిక్కడే. బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లిస్తారు. ప్రపంచంలోనే పొడవైన గొత్తర్డ్‌ సొరంగం(రైల్వే టన్నెల్‌) ఉన్నదిక్కడే. దీని పొడవు 57 కిలోమీటర్లు. అందులో 2.3 కిలోమీటర్లు ఆల్ప్స్‌ పర్వతాల కింద నుంచే ఉంది. ఇటు నుంచి అటు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణించేందుకు 45 నిమిషాలపైనే సమయం పడుతుంది.
అప్పటికప్పుడు పొడి కలుపుకుని తాగే ఇన్‌స్టెంట్‌ కాఫీకి జన్మస్థలం ఈ దేశమే. 1938లో నెస్లే సంస్థ నెస్కెఫే పేరుతో దీన్ని తయారు చేసింది. ఇక్కడి అరావూ రైల్వే స్టేషన్‌ వద్ద పెద్ద గడియారం ఉంది. ఐరోపాలో అది రెండో అతిపెద్దది.
తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పండిస్తారు. మాంసం, కోడిగుడ్లు ఇతర ఉత్పత్తులు.

Turkey

turkey flag

Capital Ankara ………. Language Turkish ………. Currency Turkish Lira ………. Religion Islam ………. Calling Code +. 90

టర్కీ……

టర్కీ దేశం ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంటుంది. దేశమంతా కలిపినా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. టర్కీ ఎనిమిది దేశాల సరిహద్దులున్న దేశం. టర్కీ రాజధాని అంకారా… దేశ విస్తీర్ణం 7,83,356 చ.కి.మీ భాషలు టర్కిష్‌. వీరి కరెన్సీ టర్కిష్‌ లీరా. ఇస్తాంబుల్‌నగరం దేశం మొత్తంలో అతి పెద్దది. ప్రపంచంలో రెండు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఇదే. జెండాలో నక్షత్రం, నెలవంక ఇస్లాం మతానికి గుర్తు, ఎరుపు రంగు 17వ శతాబ్దంలో ఈ దేశాన్ని పాలించిన ఒట్టోమన్‌రాజ్యానికి చిహ్నం. ఒట్టోమన్‌రాజ్యం పతనం తర్వాత 1923లో ఆధునిక టర్కీ ఏర్పడింది
టర్కీ పక్షి నిజానికి ఈ దేశానికి చెందినది కాదు. అమెరికాకు చెందింది. కానీ తొలిసారిగా టర్కీలో కనిపించడంతో పొరపాటున ఈ పేరు పెట్టారు. ప్రాచీన ప్రసిద్ధ ట్రాయ్‌ నగరం ఇక్కడిదే. ఆస్పెండోస్‌ రోమన్‌ ప్రదర్శనశాల ఎంతో ప్రాచీనమైంది. వార్షిక వేసవి ఉత్సవం ఇప్పటికీ నిర్వహిస్తారు. దీన్ని 15వేల మంది ఇక్కడ కూర్చుని చూస్తారు.
ఒట్టోమన్‌రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లోనే 14 వందల ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. ప్రముఖ రచయిత్రి అగాథా క్రిస్టీ ‘మర్డర్‌ఆన్‌ది ఓరియంట్‌ఎక్స్‌ప్రెస్‌’ను ఇస్తాంబుల్‌లోనే రచించారు. నాలుగు వేల దుకాణాలతో ఉండే ఇక్కడి ‘గ్రాండ్‌బజార్‌’ ప్రపంచంలోనే అతి పురాతమైన పేద్ద దుకాణ సముదాయం.
ఇస్తాంబుల్‌లో పెద్ద ఎత్తున మంచు కురుస్తూ ఉంటుంది. అందుకే ఇది పర్యటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇక్కడి కప్పడోసియా భూగర్భ నగరాలు మంచి సందర్శక ప్రాంతాలు. వీటి నిర్మాణానికి వందల ఏళ్లు పట్టింది హాలండ్‌కు చిహ్నమైన తులిప్‌పూలు టర్కీవే. ఇస్తాంబుల్‌నుంచి నెదర్లాండ్స్‌కు ఎగుమతి అయ్యాయివి.
దాదాపు 11వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో పంటలు పండించినట్టు ఆధారాలున్నాయి. 16, 17 శతాబ్దాల్లో ఇక్కడ కాఫీ తాగడం నేరంగా ఉండేది. కాఫీ కేంద్రాల్లో రాజకీయ విప్లవ కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో వాటిని అరికట్టడానికి ఒట్టోమన్‌సుల్తాన్‌ఈ నిబంధన పెట్టారు.
కార్లు, విమానాలు, ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం.

Ukraine

ukraine flag

Capital Kiev ………. Language Ukranian ………. Currency Ukranian/Hryunia ………. Religion Orthodox(65%) ………. Calling Code +. 380
ఉక్రేయిన్… ఆధునిక కాలంలో ఉక్రేయిన్ పోలెండ్ ఆ తరువాత రష్యాలో భాగంగా ఉండేది. రష్యావారి బారి నుండి ఉక్రేనియన్లు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారు. రష్యా వారు వీరిని అనేక బాధలకు గురిచేసారు. జోసఫ్ స్టాలిన్ ఉక్రేయన్ల మీద ఆధిపత్యం నిలుపుకోవటం కోసం లక్షలాది మంది ఉక్రేనియన్లను చంపించాడు. తరువాత రెండవ ప్రపంచయుద్ధంలో జర్మన్ నాజీలు ఒక మిలియన్ ఉక్రేనియన్లను హతమార్చారు.
1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఉక్రనియన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Kyiv . ఈ దేశ వైశాల్యం 6,03,700 చ.కి.మీ. వీరి భాష ఉక్రేనియా తరువాత రష్యన్ భాష . ఈ దేశ కరెన్సీ hryvnia
గింజ ధాన్యాలు, షుగర్ దుంపలు, పొద్దు తిరుగుడు దుంపలు, కూరగాయలు పండిస్తారు. పశుమాంసం, పాలు ఇతర ఉత్పత్తులు.
ఇనుప ఖనిజం, బొగ్గు, మాంగనీస్, సహజవాయువు, ఆయిల్, సల్ఫర్, గ్రాఫైట్, టైటానియం, మేగ్నీషియమ్, నికెల్, పాదరసం, కలప సహజసంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూమి ఉంది.

United Kingdom

united kingdom flag

Capital London ………. Language English ………. Currency Pound Sterling ………. Religion Christian ………. Calling Code +. 44

గ్రేట్ బ్రిటన్

ప్రపంచ ప్రసిద్ధి పొందిన దేశం గ్రేట్ బ్రిటన్. యూరోప్ లో పశ్చిమదిశలో ఉంది. దీనినే యునైటెడ్ కింగ్ డమ్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్ దేశానికి బ్రిటీష్ దీవులకు మధ్య ఇంగ్లీష్ ఛానల్ కలదు. ఈ దేశ విస్తీర్ణం 2,44,110 చ.కి.మీ. రాజధాని లండన్ నగరం. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు క్రైస్తవులు. బర్మింగ్ హామ్, గ్లాస్కో, లీడ్స్, షెఫీల్డ్, లివర్ పూల్, బ్రాడ్ ఫర్డ్, మాంచెస్టర్, ఎడిన్ బర్గో, బ్రిస్టల్ మొదలగునవి బ్రిటన్ లో ప్రధాన దేశాలు.
వేల్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్, మాన్ దీవి, ఛానల్ దీవులను కలిపి యునైటెడ్ కింగ్ డమ్ గా పిలుస్తారు. బ్రిటీష్ వారు నైపుణ్యం కలిగిన నావికులు. సుదూర ప్రాంతాలకు సముద్రమార్గంలో నావలలో ప్రయాణించి అనేక రాజ్యాలను ఆక్రమించి తమ రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశం కూడా అందులో ఒకటి. అనేక వలస రాజ్యాలు స్థాపించి ఒకప్పుడు రవి అస్తమించని రాజ్యం అని పేరు పొందింది బ్రిటన్.
17వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు వీరి ప్రాబల్యం కొనసాగింది. ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు వీరి దేశం కంటే పెద్ద దేశాలు కూడా భారతదేశం, చైనాతో సహా వీరి దురాక్రమణకు గురయ్యాయి. చాలా దేశాలు వీరి కుయుక్తుల వలన వారి సంప్రదాయాలను, ఆచారాలను కోల్పోయాయి. భారతదేశం నుండి అపార సంపద, శిల్పసంపద దోచుకుని పోయారు. వాటిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కూడా ఒకటి
క్రమంగా ఈ దేశాలన్నీ స్వాతంత్ర్యం సంపాదించుకోవటంతో ప్రస్తుతం ఈ దేశం నామమాత్రంగా మిగిలింది. కానీ ఇంగ్లీష్ భాష మరియు వీరి సంప్రదాయాలు చాలా దేశాలలో పాదుకొనిపోయాయి.
ఎలిజబెత్ – 1, విక్టోరియా మహారాణుల కాలంలో ఈ దేశం బాగా విస్తరించింది. డిజ్రేలీ, గ్లాడ్ స్టన్, చాంబర్లేన్, లాయిడ్ జార్జ్, విన్ స్టన్ చర్చిల్ వంటి ప్రతిభావంతులైన వారు ప్రధాన మంత్రులుగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.
షేక్స్ పియర్, మిల్టన్ వంటి పేరుపొందిన కవులకు ఈ దేశం జన్మస్థానం. 18వ శతాబ్దంలో ఆవిరి యంత్రం ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి బీజం పడింది ఈ దేశంలోనే. ప్రపంచానికి గ్రీనిచ్ కాలమానం పరిచయం చేసింది కూడా ఈ దేశమే.
గ్రేట్ బ్రిటన్ లో ధేమ్స్ నది పెద్దది. దీని పొడవు 346 కి.మీ. సెవర్న్ మరియు ఉత్తర ఐర్లాండ్ లోని లఫ్ నీగ్ సరస్సు జలవనరులు.
బ్రిటీష్ మ్యూజియం ప్రపంచ ప్రసిద్ధి పొందిన మ్యూజియం. ఆక్సఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ యూనివర్శిటీలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి.
బర్మింగ్ హామ్, షెఫీల్డ్, లివర్ పూల్, మాంచెష్టర్, లీడ్స్, బ్రిస్టల్ ప్రధానమైన పారిశ్రామిక కేంద్రాలు.
లండన్ నగరం కూడా పారిశ్రామిక కేంద్రం. ఇనుప ఖనిజం, సుద్ద, బంకమన్ను, సున్నపురాయి, ఉప్పు ఖనిజ నిక్షేపాలు. మాటారు కార్లు, విమానాలు, నౌకలు, జవుళీ, కాగితం, ధాతు పరిశ్రమలు, విద్యుత్ యంత్రాలు, కంప్యూటర్లు, శాస్ర్తీయ పరికరాలు, ప్లాస్టిక్ గాజు, ఆహార పదార్ధాలు మొదలగు వాటికి లండన్ నగరం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం.
బార్లీ, ఓట్స్, బంగాళా దుంపలు, ఓట్స్, మొక్కజొన్న, బీట్ దుంపలు ప్రధానంగా పండిస్తారు.
కోళ్ల పరిశ్రమ, పశుపోషణ పందుల పోషణ, గొర్రెల పెంపకం ఎక్కువ.

Vaticn City

vatican city flag

Capital Vatican city ………. Language Italian ………

వాటికన్ సిటి…

ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో వాటికన్ సిటి ఒకటి. ఈ దేశ వైశాల్యం కేవలం 100 ఎకరాలు. రోమ్ (ఇటలీ)నగరం మధ్యలో ఉన్నది. ఇది ఒక మతపరమైన దేశం క్రైస్తవమతంలోని రోమన్ కేధలిక్ చర్చి తెగ వారికి ప్రధాన కేంద్రం. ఈ నగరం చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. ఈ నగరం కేధలిక్స్ చర్చ్ వారికి చెందినది మరియు కేధలి చర్చ్ వారిచే పరిపాలించబడుచున్నది. ఈ దేశ కరెన్సీ యూరోలు. ఈ దేశ జనాభా కేవలం 1000 మంది మాత్రమే (2019 లెక్కలను అనుసరించి.) 1929 సంవత్సరంలో ఈ దేశం ఏర్పడింది.St. Peter;s Basilica కట్టడం మతపరమైన కట్టడాలలో ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడం.
ఇక్కడ రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని అనుసరించే క్రైస్తవుల మతగురువు బిషప్ (బిషప్ ఆఫ్ రోమ్) నివసిస్తారు. ఈదేశానికి టెలిఫోన్, తపాలాకార్యాలయం సొంత వ్యవస్ధలు కలవు. రేడియో వ్యవస్థ, బ్యాంక్ కూడా కలవు.
ఇక్కడ ఉన్న రోమన్ కేధలిక్ చర్చ్ ప్రపంచ ప్రసిద్ధి గాంచినది మరియు రోమన్ కేధలిక్స్ కు పుణ్యక్షేత్రం. వాటికన్ మ్యూజియం, సిస్టేన్ చాపెల్ భవనం ప్రసిద్ధి చెందినవి.

%d bloggers like this: