ఆఫ్రికా దేశాలు

Algeria

algeria flag
Capital Algiers ………. Language Arabic/Berbere ………. Currency Dinar ………. 
Calling Code + 213 ………. Religion Islam

అల్జీరియా

ఉత్తర ఆఫ్రికాలోని స్వతంత్ర రాజ్యం అల్జీరియా. ఒకప్పుడు ఫ్రెంచ్ వారి వలస రాజ్యం. 1962 సం.లో తీవ్రమైన విప్లవం ద్వారా స్వాతంత్ర్యం సాధించుకొంది.
అల్జరియా రాజధాని ఆల్ జీర్. అల్జీరియా దేశ విస్తీర్ణం 23,81,741 చ.కి.మీ. వీరి భాష అరబిక్. ప్రజలు ఎక్కువమంది సున్నీ ఇస్లాం మతస్థులు. పండ్లు, ధాన్యం, ద్రాక్ష పండిస్తారు. సారాయి పరిశ్రమ ఉంది.
పెట్రోలు, ఇనుము, ఫాస్పేట్, బొగ్గు, చమురు వాయివు ఇతర పరిశ్రమలు.
ఈ దేశంలో అట్లాస్ శ్రేణి నుండి వచ్చే చెల్ప్ నది పెద్దది. 720 కి.మీటర్లు మేర ఈ దేశంలో ప్రవహిస్తుంది.
కెబిర్, సాకిల్, సెబేస్, సిగ, పిఫ్నా ఇతర జల వనరులు.

Angola

angola flag

Capital Luanda ………. Language Portugese ………. Currency Luanda ………. 

Calling Code + 244 ………. Religion Christian

అంగోలా

అంగోలా రాజధాని లువాండా. దీనిని ‘ప్యారిస్ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తుంటారు. అధికార భాష పోర్చుగీస్ కరెన్సీ క్వాంజా
ప్రధాన భాష పోర్చుగీస్ అయినా బంటు, కికోంగో మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా మాట్లాడతారు. అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అవసరమైన వనరులు ఉన్నప్పటికీ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంలో ఉండాల్సి వచ్చింది అంగోలా.
ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసువారి వలస దేశంగా ఉంది. తమ ప్రయోజనాల కోసం ఈ భూభాగాన్ని వాడుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు పోర్చు గీసు పాలకులు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో అంగోలా … పోర్చుగీసు పాలకులకు ‘బానిసలు విరివిగా దొరికే ప్రాంతం’గానే ఉండిపోయింది. ఇక్కడి నుంచి బానిసలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తరువాత కాలంలో ఈ బానిస వ్యాపారం రద్దయిపోయి… తిరుగుబాటు ఉద్యమాలు వెల్లువెత్తాయి. గెరిల్లా యుద్ధం మొదలైంది.
పోర్చుగీసు రాజ్యంపై సాయుధపోరాటానికి దిగిన వివిధ దళాల మధ్య ఐక్యత లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు దిగేవాళ్లు. ఈ అనైక్యత తరువాతి కాలంలో దేశంలో సామాజిక అశాంతికి దారి తీసింది.
పోర్చుగల్ నుంచి 1975లో స్వాతంత్య్రం పొందింది అంగోలా. స్వాతంత్య్రం వచ్చిన మాటేగానీ శాంతి లేదు. దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
రాజ్యాధికారం కోసం ‘పీపుల్స్ మూవ్ మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా’, ‘నేషనల్ యూనియన్ ఫర్ ది టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా’ల మధ్య పోరు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషాన్ని ఈ పోరు మాయం చేసింది. దేశం అతలా కుతలం అయింది. దేశంలో శాంతిని నెలకొల్ప డానికి 1991లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అది 1992లో విఫలమైంది. తిరిగి 1994లో కాల్పల విరమణ ఒప్పందం కుదిరింది.
1998లో ఈ ఒప్పదం విఫలమైంది. చాలాకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 2002లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. అయినప్ప టికీవెనక్కి తగ్గకుండా యుద్ధశిథిలాల్లో నుంచి లేచి తనను తాను పునర్నిర్మించుకుంటూ కొత్త అడుగులు వేసింది. 2010లో దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పాలనాపరంగా చెప్పాలంటే… అంగోలా 8 ప్రావిన్సులుగా, 163 మున్సిపాలిటీలుగా విభజితమైంది.
చాలాకాలం పాటు వలస దేశంగా ఉండడం వల్ల అంగోలా కళాసంస్కృతులపై పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది.
అంగోలా, నమీబియా సరిహద్దుల్లో ఉన్న రౌకెనా జలపాతం ప్రకృతి అందాలకు ప్రతిబింబం. విస్తారమైన ఖనిజ సంపద, పెట్రోలియం నిల్వలు ఉండటంతో తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అంగోలా అంటే అశాంతి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి!
అంగోలాలో ఆదరణ ఉన్న క్రీడ బాస్కెట్బాల్. అంగోలాలో సుంబే సంగీతం ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘సుంబే మ్యూజిక్ ఫెస్టివల్’ ఘనంగా జరుగుతుంది.
చమురు, వజ్రాలు ప్రధాన ఆర్థిక వనరులు. చైనాకు ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం అంగోలా నుంచే ఎగుమతి అవుతుంది.
అంగోలాలో అతి ఎత్తయిన పర్వతం… సెర్రా మౌంటెన్. దీని ఎత్తు 2,306 మీటర్లు.
అంగోలాలో మరణాల రేటు ఎక్కువ.‘డ్రెడ్లాక్ హెయిర్ స్టయిల్’ ఇక్కడే పుట్టింది. అంగోలా అందాలరాశి లైలా లోపెజ్ 2011లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుంది.

Benin

benin flag

Capital Porto-Novo ………. Language French ………. Currency West African CFA franc (XOF) ………. Calling Code + 229 ………. Religion Christian/Muslim

బెనిన్‌
బెనిన్‌… ఆఫ్రికా ఖండంలోని దేశం. రాజధాని పోర్టో నోవొ. జనాభా 1,08,79,829 ఈ దేశ విస్తీర్ణం 1,14,763 చదరపు కిలోమీటర్లు. వీరి భాష ఫ్రెంచ్‌. కరెన్సీ పశ్చిమ ఆఫ్రికన్‌ సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌
ప్రజలు ఫ్రెంచ్‌ తర్వాత ఫాన్‌, యోరుబా భాషల్ని ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ దేశానికి పశ్చిమాన టోగో, తూర్పున నైజీరియా, ఉత్తరాన బుర్కినాఫాసో, నైజర్‌ దేశాలు సరిహద్దులు. దక్షిణాన అట్లాంటిక్‌ మహా సముద్ర భాగమైన గినియా అఖాతం ఉంది.
ఈ దేశ జెండాలోని ఎరుపు రంగు ధైర్యానికి, పసుపు రంగు సంపదకు, ఆకుపచ్చ ఆశకి గుర్తులు.
రాజధాని పోర్టోనోవొలో 17వ శతాబ్దం మొదట్లో బానిసల వ్యాపారం ఎక్కువగా జరిగేది. అందుకే ఈ తీరాన్ని బానిసల తీరంగా పిలిచేవారు. ఇక్కడి నుంచి బానిసల్ని నౌకల్లో వేరే ప్రాంతాలకు రవాణా చేయడం ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది.
బెనిన్‌ 1960 ఆగస్టు ఒకటిన ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది. 1975 నవంబరు నుంచి ఈ దేశాన్ని బెనిన్‌ అని పిలువబడుతుంది. 1990లో నియంతృత్వ పాలన నుంచి బహుళ పార్టీలున్న ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఈ దేశంలోఎడమ చేతితో తినడం కానీ, ఎడమ చేతితో ఇతరులకు ఏదైనా ఇవ్వడం కానీ చేయకూడదు. అలా చేస్తే అమర్యాదగా భావిస్తారు.
ఈ దేశానికే దహోమి అని మరో పేరు. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఇది దహోమి రాజ్యంగా ఉండేది. ఈ దేశప్రజలప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ దేశ జాతీయ క్రీడ సాకర్‌.
దేశంలో 31 శాతం భూభాగాన్ని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. 40 శాతం అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడ నేరాలు తక్కువే. కానీ దొంగతనాలు ఎక్కువ. అందుకే ప్రతి ఇంటి యజమానీ రాత్రి వేళల్లో వాచ్‌మేన్‌ను తప్పక పెట్టుకుంటారు.
ఒకరితో మాట్లాడే ముందూ, వీడ్కోలు చెప్పిన తరువాత కరచాలనం చేయడం వీరి సంప్రదాయం. ప్రజలు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అవి దుర్వినియోగం అవుతాయని భావిస్తారు.
రాజధాని పోర్టోనోవొని అడ్జటేజ్‌, హగ్‌బోనౌ అని కూడా పిలుస్తారు. దేశం మొత్తంలో పెద్ద నగరం కొటోనౌ. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం చెక్కతో చెక్కిన ముసుగులకు ప్రసిద్ధి.

Botswana

botswana flag

Capital Gaborone ………. Language English ………. Currency Pula ………. 

Calling Code + 267 ………. Religion Christian

బోట్స్ వానా

బోట్స్ వానా ఆఫ్రిరా ఖండం దక్షిణ భాగంలో తూర్పున ఉన్న ఒక స్వతంత్ర దేశం. ఈ దేశానికి దక్షిణాన దక్షిణాఫ్రికా, పశ్చిమాన సమీబియా, ఉత్తరా జింబాబ్యే దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1966 సంవత్సరానికి ముందు ఈ దేశం పేరు బెచువానీ ల్యాండ్.
ఈ దేశం అవినీతి రహితమైనది మరియు మానవ హక్కులు పాటించే దేశం కూడా. ఈ దేశ విస్తీర్ణం 581,730 sq km.వీరి అధికార భాష ఇంగ్లీష్. మరియు సెట్స్ వానా భాష కూడా మాట్లాడుతారు. ఈ దేశంలో క్రిస్టియన్లు ఎక్కువ తరువాత స్థానిక మతాలను అవలంభించే వారున్నారు. వీరి కరెన్సీ పేరు పులా.
ఈ దేశ విస్తీర్ణం 5,81,730 చ.కి.మీ. దేశ రాజధాని గాబోరెనే. వీరి అధికార భాష ఇంగ్లీష్. బోట్స్ వానా ప్రజలు ఆదిమ జాతులవారు. త్య్యానా తెగవారు 75 శాతం మంది, షోనా తెగవారు 12 శాతం మంది, శాన్ తెగవారు 4 శాతం, ఖోయిఖోయిన తెగవారు 3 శాతం మంది కలరు.
కలహారీ ఎడారి ఈ దేశం అంతా వ్యాపించి ఉంది. ఉత్తర దిశలో అంగోలా దేశం నుండి ఓకోవాన్గో నది న్గామి ల్యాండ్ ప్రాంతంలోనికి ప్రవహిస్తుంది. నిద్రా వ్యాధిని కలుగ చేసే ట్సీట్సీ ఈగ బెడదకు భయపడి ఈ ప్రాంతంలో ఎవరూ నివసించరు.
బొబ్బర్లు, మొక్కజొన్న, చిక్కుళ్ళు, ప్రత్తి, జొన్న, వేరుశెనగ, చిరు ధాన్యాలు, పొగాకు ప్రధానమైన పంటలు.. గొడ్డుమాంసం కోసం పశువులను పెంచుతారు. మేకలను కూడా పెంచుతారు.
రాగి, ఆస్ బెస్టాస్, వజ్రాలు, నికెల్, నేలబొగ్గు, మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. పరిశ్రమలు తక్కువ. ప్రపంచంలోనే వజ్రాలు ఎక్కువగా లభించే దేశం బోట్స్ వానా. వజ్రాలను త్రవ్వి ఎగుమతి చేసి విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు.

Burkina Faso

burkina faco flag

Capital Ouagadougou ………. Language French ………. Currency West African CFA franc (XOF) ………. Calling Code + 226 ………. Religion Islam/Christian

బర్కీన ఫాసో

రాజధాని వాగడూగో . విస్తీర్ణం 2,74,200 చదరపు కిలోమీటర్లు.భాష ఫ్రెంచ్. కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సీఎఫ్ఏ ఫ్రాంక్
బర్కీన ఫాసో పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని దేశం. చుట్టూ భూభాగాలే ఈ దేశ సరిహద్దులు. మాలి, నైగర్, బెనిన్, టోగో, ఘనా, ఐవరీ కోస్ట్ దేశాలు దీనికి సరిహద్దులు. బర్కీన ఫాసో అంటే ‘ల్యాండ్ ఆఫ్ ఆనెస్ట్ పీపుల్’ అని అర్థం.
ఈ దేశం ఆఫ్రికా ఖండంలో సురక్షితమైన దేశాల్లో ఒకటి. 19వ శతాబ్దం చివరి వరకూ మోస్సీ రాజ్యం పాలనలో ఉండేదీ దేశం. ఆ తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చి ఈ దేశాన్ని తమదంటూ ప్రకటించి రాజధానిని ఏర్పాటు చేశారు. ఆగస్టు 5, 1960న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది.
మొదట్లో ఈ దేశాన్నే ‘అప్పర్ వోల్టా’ అని పిలిచేవారు. 1984 నుంచి బర్కీన ఫాసోగా పేరు మార్చారు. ఇక్కడ 60 స్థానిక తెగలున్నాయి. ప్రతి తెగకూ ప్రత్యేక భాషా సంప్రదాయాలు ఉన్నాయి. అతిపెద్ద తెగ మోస్సీ.
ఆఫ్రికా పేద దేశాల్లో ఇదీ ఒకటి. డ్రమ్, సంగీత కళలు ఇక్కడి సంస్కృతిలో భాగం.
పీనట్స్, పత్తి, ఆవాల్ని ఎక్కువగా పండిస్తారు. రకరకాల సహజవనరులు ఇక్కడి ప్రత్యేకత. మాంగనీస్, సున్నపు రాయి, ప్యూమిక్, ఉప్పు… మొదలైనవి. పాడిపంటలు ఎక్కువే ఈ దేశంలో .
ప్రపంచంలో పురాతనమైన నగరాల్లో ఈ దేశ రాజధాని ‘వాగడూగో’ ఒకటి. ‘డబ్ల్యూ’ అనే ఉద్యానవనం ఈ దేశంతో పాటు బెనిన్, నైగర్ దేశాల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ దేశంలో ఓ రకమైన సిల్క్ లైనింగ్ క్లాత్ని పందుల చెవుల నుంచి తయారుచేస్తారు. సాకర్, హ్యాండ్బాల్, సైక్లింగ్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ బర్కీన ఫాసో దేశంలో ప్రధాన క్రీడలు.
బంగారం.. ఈ దేశం ఎగుమతి చేసేవాటిల్లో ప్రధానమైంది. దీని తర్వాత పత్తి, జంతువుల ఉత్పత్తులు ఉంటాయి. 497 జాతుల పక్షులున్నాయీ దేశంలో. ఏనుగులు, సింహాలు, చిరుతపులులు ఎక్కువ. వృక్షజంతు సంపదల సంరక్షణ కోసం ప్రత్యేక ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు.
ఇక్కడ రెండు సంవత్సరాలకోసారి ‘స్పిరిట్ ఆఫ్ మాస్క్’ అనే పండగ జరుగుతుంది. చిత్ర విచిత్రమైన వేషాల ధరించి వేసుకుని అంతా సంబరాలు జరుపుకుంటారు.

Burindi

burindi flag

Capital Bujumbura ………. Language French/Kirundi ………. Currency Burundian franc ………. Calling Code + 257 ………. Religion Christian

బురుండి…

బురుండీ తూర్పు ఆఫ్రికాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశ విస్తీర్ణం 27,834 చ.కి.మీ. రాజధాని బుజుబూరా. వీరి అధికార భాషలు రుండీ, ఫ్రెంచ్. వీరి కరెన్సీ బురుండియన్ ఫ్రాంక్ లు. ప్రజలలో రుండీ తెగ వారు 97 శాతం మంది ఉన్నారు. హూట్టూ, టూట్సీ త్వాపిగ్మీ ఇతరజాతులవారు నివసిస్తున్నారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. కొద్దిమంది ఆదిమ జాతుల వారు ఉన్నారు. ప్రపంచంలోని బీద దేశాలలో బురుండీ ఒకటి
ఈ దేశానికి నైరుతి దిశగా టాంగానీక్వా సరస్సు, ఈ శాన్యంగా కోహాహా సరస్సు, రువేరు సరస్సు, రుసిజీ నది, రువేరున్జీ నది, రూవూబూ నదులు ఉన్నాయి. ఇవే ఈ దేశానికి ప్రదాన జనవనరులు.
అరటి, చిరుగడం, కర్రపెండలం, కందమూలాలు, వేరుశెనగ చిరుధాన్యాలు, పామ్ గింజలు, ప్రత్తి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. పశుపోషణ, కోళ్లపెంపకం, గొర్రెలు, మేకల పెంపకం ప్రజలకు జీవనాధారాలు. కయొలిన్ మన్ను, సున్నం, బంగారం ప్రదాన ఖనిజాలు ఇక్కద దొరకుతాయి. మద్యపానీయాలు, సిగరెట్లు, పాదరక్షలు ప్రధాన పరిశ్రమలు.

cape verde flag

Country : Cape Verde

Capital Praia ………. Language Portugese ………. Currency Cape Verdean escudo ………. Calling Code + 238 ………. Religion Christian

కేప్ వర్డే

ఆఫ్రికాకు పశ్చిమంలో కేప్ వర్డ్ దేశం ఉంది. ఈ దేశం 1975 సం.నికి ముందు పోర్చుగీసు వలస రాజ్యం. 1975 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశంలో 10 పెద్ద దీవులు, 5 చిన్న దీవులు ఉన్నాయి. భూమి సారవంతమైనది కాదు. ఆహార పదార్ధాలు పూర్తిగా దిగుమతి చేసుకోవలసిందే.
ఈ దేశ విస్తీర్ణం 4,033 చ.కి.మీ. . దీని రాజధాని ప్రాయా. వీరి అధికార భాష పోర్చుగీసు. ప్రజలలో సంకర జాతులకు చెందిన వారు ఎక్కువ. నీగ్రో జాతుల వారు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రజలు ఎక్కవ మంది క్రైస్తవంలో రోమన్ కేథలిక్స్.
కాఫీ, వేరుశెనగ , చేపలు, ఉప్పు ఎగుమతి చేస్తున్నారు. కొబ్బరి, చెరకు, మొక్కజొన్న వ్యవసాయ ఉత్పత్తులు.

Cameroon

cameroon flag

Capital Yaoundé ………. Language French/English ………. Currency Central African CFA franc ………. Calling Code + 237 ………. Religion Christian

కామెరూన్

ఆఫ్రికా పశ్చిమ తీరాన ఉన్న స్వతంత్ర దేశం కామెరూన్. 1960 సం.లో స్వాతంత్ర్యం పొందింది. కామెరూన్ రాజధాని యవాన్ డా. వీరి భాషలు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ CFA Franks. నీగ్రో ఆదిమ జాతుల వారూ, బంటూ జాతివారూ అధికంగా ఉన్నారు. ఈ దేశ విస్తీర్ణం 4,75,458 చ.కి.మీ. ఈ దేశంలో ప్రజలు క్రైస్తవ మతస్థులు.
సనగా నది, బెన్యూ నదులు ప్రధానమైన నీటి వనరులు. కోకో, కర్రపెండలం, అరటి, కాఫీ, ప్రత్తి, మొక్కజొన్న, పామ్ నూనె గింజలు, జొన్న, తేయాకు, పొగాకు, వేరు శెనగ ప్రధానమైన పంటలు.
కలప, రబ్బరు అడవుల నుండి సేకరిస్తారు. అల్యూమినియం తయారీ, రసాయనిక ద్రవ్వాలు ముఖ్యమైన పరిశ్రమలు.

Central African Republic (CAR)

central african republic flag

Capital Bangui ………. Language French/Sango ………. Currency Central African CFA franc ………. Calling Code + 236 ………. Religion Christian

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ….

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చుట్టూ భూభాగాలే కలదేశం. ఈ దేశ రాజధాని Bangui. దేశ వైశాల్యం 6,22,984 చ.కి.మీ. వీరి అధికార భాషలు ఫ్రెంచ్ మరియు సాంఘో. వీరి కరెన్సీ CFA Franc. ఈ దేశం ఫ్రాన్స్ నుండి 13 ఆగస్ట్ 1960 సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది. కానీ అప్పటినుండి దేశంలో స్థిరత్యం లేదు. జనాభా పరంగా అభివృద్ది చెందని దేశం.
ఈ దేశానికి చుట్టూ చాద్, సూడాన్, కాంగో, కామరూన్ దేశాలు కలవు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది.
వజ్రాలు, బంగారం, యురేనియం, కోబాల్డ్, కలప మరియు ఆయిల్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఈ దేశ అభివృద్ధి చెందలేదు. ఆరోగ్యపరంగా కూడా వెనుకబడిన దేశం.
ప్రత్తి, కాఫీ గింజలు, పొగాకు, చేమదుంపలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. వ్యవసాయ యోగ్యమైన భూములు చాలా కలవు.

Chad

chad flag

Capital N’Djamena ………. Language French/Arabic ………. Currency Central African CFA franc ………. Calling Code + 235 ………. Religion Muslim/Christian

చాద్‌

చాద్‌.. మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు. అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే ఉంటుంది. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్‌, దక్షిణాన సెంట్రల్‌ ఆఫ్రికా రిపబ్లిక్‌ ఉన్నాయి. అలాగే కామెరూన్‌, నైజర్‌ దేశాలూ ఈ దేశానికి సరిహద్దులు.
చాద్‌ రాజధాని అన్‌జమేనా. జనాభా 1,36,70,084. ఈ దేశ విస్తీర్ణం 12,84,000 చదరపు కిలోమీటర్లు. భాషలు ఫ్రెంచ్‌, అరబిక్‌ ఇవి కాక ఈ దేశంలో 100 భాషలు మాట్లాడతారు. ఫ్రెంచ్‌ ఎక్కువ మాట్లాడే దేశాల్లో దీని స్థానం 21. కరెన్సీ మధ్య ఆఫ్రికా ఫ్రాంక్‌
ఇక్కడి చాద్‌ అనే సరస్సు ఆఫ్రికాలోనే రెండో అతి పెద్దది. ప్రపంచంలో పదిహేడో అతి పెద్ద సరస్సు ఇది. దీని పేరు మీదుగానే ఈ దేశానికీ పేరొచ్చింది. ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి, అమ్మాయి వాళ్ల పొలంలో మూడు సంవత్సరాలు పని చేయాలి. అత్తింటివారి కోసం చిన్న గుడిసె, ఈత చాపలు తయారుచేయాలి.
పిల్లలు పుట్టిన వెంటనే తల్లి వేరే ప్రదేశానికి వెళ్లకూడదు. అలా వెళితే దుష్టశక్తుల ప్రభావం పడుతుందని నమ్ముతారు.
ఇక్కడ సహజవనరులు ఎక్కువ. పెట్రోలియం, యురేనియం, బంగారం, సున్నపురాయి అధికంగా దొరుకుతాయి. ఈ దేశ జాతీయ మ్యూజియంలో 9వ శతాబ్దానికి చెందిన కళారూపాల్ని చూడొచ్చు.
ఈ దేశ జెండాలో నీలం రంగు ఆకాశానికీ, నమ్మకానికీ సూచిక. పసుపు రంగు సూర్యుడికి చిహ్నం. ఎరుపు అగ్నికీ, ఐకమత్యానికీ గుర్తు.
చాద్ లో క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి ప్రజలు నివసిస్తున్నారు. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దంలో బెర్బర్లు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ దేశం ఫ్రెంచ్‌ కమ్యూనిటీలో స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్‌గా 1946లో అవతరించింది. 1960లో ఫ్రాన్స్‌ నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందింది.
చాద్ లోని జకోమా నేషనల్‌ పార్కులో 226 జాతుల పక్షుల్ని గుర్తించడం జరిగింది.

Comoros

comoros

Capital Moroni ………. Language Comorian Arabic French ………. Currency Comorian franc ………. Calling Code + 269 ………. Religion Islam

కొమరోజ్

కొమరోజ్… హిందూ మహాసముద్రంలో ఉన్న సార్వభౌమ ద్వీప దేశం. ఈ దేశానికి వాయవ్యంలో టాంజానియా, తూర్పున గ్లోరియోస్ ద్వీపాలు, నైరుతీలో మడగాస్కర్, పశ్చిమాన మొజాంబిక్ ఉంటాయి. చిన్నాపెద్దా అగ్నిపర్వతాలతో నిండి ఉంటుందీ దేశం. ఈ ద్వీప దేశం చాలా చిన్నది. మన దేశంలోనే చిన్నదైన గోవా రాష్ట్రం కన్నా చిన్నది. ఈ దేశ రాజధాని మొరోని. వీరి భాషలు కోమోరియన్, అరబ్ మరియి ఫ్రెంచ్. వీరి కరెన్సీ కొమోరియన్ ఫ్రాంక్స్. కొమరోజ్ ముస్లిం దేశం. ‘కొమరోజ్’ అరబిక్ పదం నుంచి వచ్చింది. దీనర్థం చంద్రుడు.
ఈ దీవుల్లో మొదటిసారిగా అడుగుపెట్టింది పాలీనీషియన్లు, మెలనీషియన్లు, మలయాలు, ఇండోనేషియన్లు. వీరంతా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి ముందే ఇక్కడికొచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నచిన్న దీవులతో ఉన్న ఈ ద్వీప దేశంలో గ్రాండీ కొమరీ, మొహెలీ, అన్జోన్, మయొట్టీ అనే నాలుగు ముఖ్యమైన దీవులుంటాయి. వీటిల్లో మయొట్టీ ద్వీపం ఇంకా ఫ్రాన్స్ అధీనంలోనే ఉంది.
ఈ దేశం 1975 జులైలో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది.
సువాసన నూనెల్లో ఉపయోగించే ‘ఇలాంగ్ ఇలాంగ్’ అనే నూనెల్ని ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందీ దేశం. ఈ ద్వీప వాతావరణంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన 20 పక్షి జాతులు ఇక్కడుంటాయి. మాంగూస్ లెమర్లు మడగాస్కర్తో పాటు ఈ దేశంలో మాత్రమే కనిపిస్తాయి.
బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు, సిమెంట్, ఇతర ఆహార పదార్థాల్ని ఈ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా లవంగాలు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల్ని పండిస్తారు.

Democratic Republic of the Congo

democratic republic of congo

Capital Kinshasa ………. Language French, Lingala ………. Currency Congolese franc ………. Calling Code + 243 ………. Religion Christian

కాంగో

ఈ దేశం తాజా సర్వేల ప్రకారం అవినీతికి, అంతర్యుద్ధాలకు పేరుపొందినది. ఈ అంతర్యుద్ధాల వలన లక్షలాది ప్రజలు ఆహార కొరత, పోషకాహారలోపం వలన బాధపడ్డారు. యుద్దాలలో లక్షలాది ప్రజలు మరణించారు. ఈ దేశం విశాలమైనది మరియు అపారమైన ఆర్ధిక వనరులు కల దేశం. 1960, జూన్ 30వ తేదీన బెల్జియం దేశం నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశ రాజధాని Kinshasa . ఈ దేశ కరెన్సీ Congolese franc ఈ దేశ వైశాల్యం 2,345,410 చ.కి.మీ. వీరి ప్రధాన భాషలు French, Lingala, Kiswahili, Kikongo, Tshiluba. ఈ దేశం క్రిస్టియన్ దేశ్ మరియు కొద్ది సంఖ్యంలో ఇస్లాం మతస్తులున్నారు.
కాఫీ, చెరకు, పామ్ నూనె గింజలు, రబ్బర్, టీ, క్వినైన్ ధాన్యం, అరటి, మెక్కజొన్న, కర్రపెండలం, పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు.
కోబాల్ట్, రాగి, టాంటాలమ్. పెట్రోలియమ్, బంగారం, వెండి, జింక్, వజ్రాలు, మాంగనీస్, యురానియమ్, మాంగనీస్ ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.
ఈ దేశం గొప్ప జీవ వైవిధ్యం కల దేశం. ఈ దేశంలోని ఐదు జాతీయ పార్కులు జంతుసంపదకు పేరుపొందినవి మరియు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. పెద్ద చింపాంజీలు, కోతులు ఇక్కడ మాత్రమే కనబడతాయి.

Republic of the Congo

Capital Brazzaville ………. Language French ………. Currency Central African CFA franc ………. Calling Code + 242 ………. Religion Christian
కాంగో దేశం ఆఫ్రికా ఖండంలో ఒక గణతంత్ర దేశం. ఈ దేశం ఫ్రెంచ్ ఈక్విటోరియల్ ఆఫ్రికాలో ఒక ప్రాంతంగా ఉండేది. 1969 సం.లో స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 3,42,000 చ.కి.మీ. దేశ రాజధాని బ్రజవెల్లీ. వీరి అధికార భాష ఫ్రెంచ్.వీరి కరెన్సీ Central African CFA franc. ప్రజలు కంగో, తేకే, మ్మోషీ, సాంగా, పూనూ, మాక, పిగ్మీ ఆదిమ జాతులకు చెందినవారు.
వస్తుజాలానికి కూడా ప్రాణం లేకపోయినా ఆత్మ ఉందని వీరు విశ్వసిస్తారు. ఎక్కువ మంది క్రైస్తవులు. కొద్దిగా ముస్లింలు కూడా ఉన్నారు.
వైరానది, శ్టాన్లీ మడుగు (కృత్రిమంగా ఏర్పాటు చేయబడిన సరస్సు), కాంగో నది, కంగో ఉపనదులు సనగా, ముబాంగీ నదులు జలవనరులు. ఈ పరిసర ప్రాంతాలు సారవంతమైనవి.
వరి మొక్కజొన్న, అరటి, కర్రపెండలం, పామ్ నూనె గింజలు, చిలకడదుంపలు, కంద లను ఎక్కువగా పండిస్తారు.
కాంగోలోని సహజసంపదలు పోటాష్ ఖనిజం. అడవుల నుండి వచ్చే ఒకామ్ మహాఘని, లింబా కలప ముఖ్యమైనవి.

Cote d’Ivoire

cote d' ivorie flag

Capital Yamoussoukro (political)  ………. Language French ………. Currency West African CFA franc ………. Calling Code + 225 ………. Religion Islam/Christianity

ఐవరీ కోస్ట్

ఐవరీ కోస్ట్ ఆఫ్రికా ఖండానికి పశ్ఛిమతీరంలో సింధుశాఖను ఆనుకుని ఉన్న చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశం సాధికార నామం కోటెడ్ ఐవరీ. 1893 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1960 వ సం.లో ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించింది.
ఈ దేశ విస్తీర్ణం 3,20,763 చ.కి.మీ. ఐవరీ కోస్ట్ దేశానికి రెండు రాజధానులు ఉన్నాయి అభిడ్జాన్ ఆర్ధికపరంగానూ, యమోస్క్రో రాజకీయపరంగానూ రాజధానులు. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ West African CFA Franc. ఇస్లాం మతస్తులు ఎక్కువ తరువాత క్రైస్తవ మతస్తులు ఉన్నారు
నీగ్రో తెగల వారు ఎక్కువగా ఉన్నారు. వీరు 60 మాండలిక భాషలు మాట్లాడుతారు. బండమా, కావల్లీ, కోమో, సస్సాంధ్ర, నదులు ప్రధానమైన జలవనరులు. బండమా నది పొడవు 800 కి.మీ. కానీ ఈ నది కొండల గుండా ప్రవహించడం వలన కేవలం 60 కి.మీ. మాత్రమే పడవ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఉష్ణమండల అడవులు ఎక్కువ. కాఫీ, కోకో పంటలు ఎక్కువగా పండుతాయి.

Djibouti

dijibouti flag

Capital Djibouti City ………. Language French/Arabic ………. Currency Djiboutian franc ………. Calling Code + 253 ………. Religion Islam

జిబౌటి

హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలలో ఒకటి… జిబౌటి. ఈ దేశ రాజధాని జిబౌటి నగరం. ఫ్రెంచ్, అరబిక్ వీరి భాషలు. మూడింట రెండు వంతుల మంది దేశరాజధానిలోనే నివసిస్తారు. ఫ్రెంచ్, అరబ్బీలతో పాటు సోమాలి, అఫర్లను మాట్లాడతారు. వీరి కరెన్సీ Djiboutian franc. జిబౌటి ముస్లిం దేశం. దేశంలో అక్షరాస్యత 68 శాతం.
ఈ దేశానికి ఉత్తరంలో ఎరిట్రియా, దక్షిణంలో ఇథియోపియా, ఆగ్నేయంలో సోమాలియా దేశాలు సరిహద్దులు. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉంది జిబౌటి. 1966 ఆగస్ట్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాతంత్య్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘ఫ్రెంచ్ అధీనంలో ఉంటారా? స్వాతంత్య్రం కావాలా?’ అనే అంశంపై ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ లూయిస్ సాగెట్ రెఫరెండం నిర్వహించారు.
60 శాతం మంది ఫ్రెంచ్ పాలనలోనే ఉండడానికి మొగ్గు చూపారు. కానీ నిరసనలు ఆగలేదు. స్వాతంత్య్రకాంక్ష ఏదో ఒక ఉద్యమ రూపంలో వ్యక్తమవుతూనే ఉండేది. చివరకు 1977లో ఫ్రెంచ్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది జిబౌటి. ఒకవైపు స్వాతంత్య్ర సంబరాలు, దేశంలోని నాన్ సోమాలి అఫార్స్-సోమాలి ఇస్సాస్ మధ్య ఉన్న విభేదాలు… దేశప్రగతికి అడ్డుపడతాయనే అంచనా ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం ఈ రెండు వర్గాల మధ్య ‘అధికార మార్పిడి’ ఫార్ములా విజయవంతంగా అమలుకావడంతో… ఆ అనుమానాలు, అంచనాలేవీ నిజం కాలేదు. 1991లో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ తరువాత జరిగిన చర్చలతో శాంతియుత వాతావరణం ఏర్పడింది.
820 రకాల మొక్కలు, 360 రకాల పక్షులు, 66 రకాల క్షీరదాలు ఉన్న జిబౌటి జీవవైవిధ్యానికి కొంగు బంగారంగా నిలిచింది. గోడ పర్వతాల్లోని ‘డే ఫారెస్ట్ నేషనల్ పార్క్’ జీవవైవిధ్యానికి మరో ప్రత్యేకతగా నిలిచింది. జిబౌటిలో సంగీతానికి మంచి ప్రాచుర్యం ఉంది. మొదట్లో ఇతర ప్రాంతాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరువాత తనదైన శైలితో ప్రత్యేకతను నిలుపుకుంది. జిబౌటి కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. వంద పంక్తుల కవిత ‘గబె’కు జిబౌటి సాహిత్యంలో ప్రత్యేకత ఉంది.
కొద్దిపాటి వర్షపాతం వల్ల పండ్లు, కూరగాయలు మాత్రమే పండుతాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.
అంతర్యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ, ఆ తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో పరిస్థితి కుదుటపడింది. స్వాతంత్య్రనంతరం జిబౌటి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నిరుద్యోగం, పేదరికం సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ‘సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది.
నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాలలో జిబౌటి ఒకటి. రాజధాని జిబౌటి ఆఫ్రికా ఖండంలోని చిన్న పట్టణాలలో మూడవది. ఫ్రెంచ్, ఇస్లాం సంప్రదాయం, సంస్కృతుల ప్రభావం భవననిర్మాణ కళలో కనిపిస్తుంది. ఉప్పునీటి సరస్సు లక్ అసల్ ‘ఉప్పు’ గృహ అవసరాలకు ఉపయోగపడడమే కాదు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
జిబౌటిలో మాత్రం క్రిస్మస్ను జనవరి 7న జరుపుకుంటారు. సూర్యోదయం తరువాత ట్యాక్సీ రేట్లు పెరుగుతాయి.
నిర్మాణాలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, సాల్ట్మైనింగ్, పెట్రోలింగ్ రిఫైనరీ… మొదలైనవి దేశంలో ప్రధాన పరిశ్రమలు.

Egypt

egypt flag

Capital Cairo ………. Language Egyptian Arabic ………. Currency Egyptian pound ………. Calling Code + 20 ………. Religion Muslim

ఈజిప్ట్
ఈజిప్ట్ రాజధాని కైరో, విస్తీర్ణం 10,10,407 చదరపు కిలోమీటర్లు. జనాభా: 9,16,70,000 (2019 సం) ఈ దేశ కరెన్సీఈజిప్షియన్‌ పౌండ్‌. వీరి భాష అరబిక్‌. మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది. జనాభాలో 90 శాతం మంది ముస్లింలే.
ఈజిప్ట్ అనగానే గుర్తొచ్చేవి పిరమిడ్లే. ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు, వారి కుటుంబాల్లో చనిపోయిన వారి శరీరాల్ని భద్రపరిచేందుకు వీటిని నిర్మించేవారు. 130కి పైగా పిరమిడ్లు ఉన్నాయిక్కడ. ఇక్కడున్న పిరమిడ్లన్నింటిలో ఖుఫు పిరమిడ్‌ అతి పెద్దది. అన్నింటికీ నాలుగు తలాలు ఉంటే దీనికి ఎనిమిది తలాలుంటాయి. దీన్నే గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా అని కూడా అంటారు. దీని పొడవు 460 అడుగులు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కంటే ఇదే పెద్దది.
టోలెమిక్‌ రాజవంశంలో చివరిగా ఈజిప్టును పరిపాలించిన రాణి క్లియోపాత్ర. అందగత్తె అయిన ఆమె అంతర్యుద్ధంతో రగిలిపోతున్న రాజ్యంలో శాంతిని నింపి చరిత్రలో నిలిచిపోయింది ఈ దేశంలో పిల్లుల్ని పూజిస్తారు. గతంలో వాటిని చంపడం నేరం. ప్రమాదవశాత్తూ అలా జరిగినా ఇక్కడ కఠిన శిక్షలుండేవి. వాటిని తమ అదృష్ట దేవతలుగా భావించేవారు.
ప్రాచీన కాలంలోనే ఈ దేశంలో రాసేందుకు లిపి ఉంది. వారు అప్పట్లోనే రాళ్లతో తయారు చేసిన తలగడల్ని వాడేవారు. మనం ఇప్పుడు ఆడే బోర్డ్‌గేమ్‌లు వారికి రెండు వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. ప్రపంచంలోనే పాత చొక్కా ఇక్కడ దొరికింది. ఇది 5000 ఏళ్ల క్రితం నాటిదట.
కాగితం, కలం, తాళాల్ని తొలుత వీరే తయారుచేశారు. ఎప్పటి నుంచో వీరు టూత్‌పేస్ట్‌ని కూడా తయారుచేసుకుని ఉపయోగించేవారు. పడవల్ని మొట్టమొదట తయారుచేసిందిక్కడే. క్రీ.పూ. 3000 సంవత్సరాల్లోనే వీరు వాటిలో ప్రయాణించి వ్యాపారాలు చేసేవారు.
అతి పొడవైన నైలు నది ఈ దేశంలోనే కాకుండా పది దేశాల్లో ప్రవహిస్తోంది. దీని పరీవాహక ప్రాంతాల్లోనే పంటలు పండిస్తారు. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కావడంతో మిగిలిన ప్రాంతాలు ఎడారుల్ని తలపిస్తాయి.
ఇక్కడి అలెగ్జాండ్రియాలో ఓ గ్రంథాలయం ఉంది. అంతర్జాల వెబ్‌సైట్లలో ఉండే ప్రతి వెబ్‌సైట్‌ పేజీలు ఇందులో ఉంటాయిట. 1996లో దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలో అంతర్జాలాన్ని ఎక్కువగా వాడే దేశాల్లో ఇది 21వ స్థానంలో ఉంది.
ప్రాచీన ఈజిప్షియన్లు, 2000 మందికి పైగా దేవుళ్లను కొలిచేవారు. స్త్రీలు, పురుషులు మేకప్‌ వేసుకునేవారు. సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం కళ్ల దగ్గర రాగి లేదా సీసంతొ తయారు చేసిన నల్లటి రంగు వేసుకునేవారు. మరుగుజ్జులు ఈ దేశంలో గౌరవింపబడతారు. వారిని చులకనగా చూడరు. పెళ్లిళ్ల సమయంలో ఉంగరాలు మార్చుకునే సంప్రదాయం ఇక్కడిదే.

Equatorial Guinea

equtor guinea flag

Capital Malabo ………. Language Spanish/French/Portuguese ………. Currency Central African CFA franc ………. Calling Code + 240 ………. Religion Christian

ఈక్వటోరియల్ గినియా…

మధ్య ఆఫ్రికాలో ఉన్న చిన్న స్వతంత్రదేశం ఈక్వటోరియల్ గినియా. ఈ దేశం ముఖ్యంగా రెండు భాగాలుగా ఉంది. మొదటిది Rio Muni భూభాగం. రెండవది ఐదు ద్వీపాలు ఆఫ్రికాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పేరుపొందిన దేశం.
ఈ దేశ వైశాల్యం 28,051 చ.కి.మీ. వీరి అధికార భాష స్పానిష్ మరియు ఫ్రెంచ్ ఇతర భాషలు pidgin English, Fang, Bubi, Ibo. ఈ దేశ రాజధాని మలాబో. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. వీరి కరెన్సీ CFA Franc.
12 అక్టోబర్, 1968 సంవత్సరంలో స్పెయిన్ నుండి స్వాతంత్యం పొందింది.
కాఫీ, కోకోవా, రైస్, చేమదుంపలు, అరటికాయలు, కర్రపెండలం, పామ్ నూనె గింజలు వ్యవసాయ ఉత్పత్తులు.
పెట్రోలియం, సహజవాయువు, కలప, బాక్సైట్, బంగారం, వజ్రాలు ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.

Eritrea

eritrea flag

Capital Asmara ………. Language Tigrinya ………. Currency Nakfa ………. Calling Code + 291 ………. Religion Christian/Muslim 

ఎరిట్రియా

ఎరిట్రియా ఈశాన్య ఆఫ్రికాలోని ఒక స్వతంత్ర దేశం. సూడాన్, ఇధోపియా, జిబౌటి దేశాలు సరిహద్దులుగా కలవు. ఈశాన్యంలో రెడ్ సీ సముద్ర తీరం కలదు. ఈ దేశాన్ని Horn of Africa అని అంటారు. 1885 సంవత్సరంలో ఇటాలియన్స్ చే ఆక్రమించబడింది. తరువాత ఈ దేశం ఇధోపియాలో కలపబడింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం 1993 సంవత్సరంలో ఇధోపియా నుండి స్వాతంత్యం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 1,21,320 చ.కి.మీ. ఈ దేశ రాజధాని ఆస్మారా. వీరి భాషలు Afar, Arabic, Tigre and Kunama, Tigrinya, other Cushitic వీరి కరెన్సి nakfa . ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు అధిక సంఖ్యలో కలరు.
జొన్న, ఆకుకూరలు, కూరగాయలు, మొక్కజొన్న, ప్రత్తి, పొగాకు వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెల పెంపకం, పశువుల పెంపకం కలదు. చేపలు లభిస్తాయి.
బంగారం, పొటాష్, జింక్, రాగి, ఉప్పు, చేపలు సహజ సంపదలు.

Ethiopia

ethipia flag

Capital Addis Ababa ………. Language Amharic ………. Currency Birr ………. Calling Code + 251 ………. Religion Christian/Islam

ఇధోపియా
ఈ దేశం ఆఫ్రికా ఖంఢంలో ఈశాన్యంలో ఉంది. పర్వతాలు ఎక్కువ. ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతతో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ దేశానికి 2000 సం.రాల చరిత్ర ఉంది. ఈ దేశ విస్తీర్ణం 12,23,500 చ.కి.మీ. ఇధోపియా రాజధాని అడిస్ అబాబా. వీరి అధికార భాష అంబారిక్. వీరి కరెన్సీ బిర్ లు.
40కి పైగా మాండలిక భాషలు ఇక్కడి ప్రజలు మాట్లాడతారు. క్రైస్తవ మతస్థులు ఎక్కువ. తరువాత కొద్ది శాతం మంది ముస్లిం జనభా ఉన్నారు.
ప్రకృతిపరంగాఈ దేశం సుందర దృశ్యాలతో కనువిందు చేస్తుంది. చర్చ్ లు, రాతి కట్టడాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఏనుగులు, జిరాఫీలు, చిరుతపులులు, సింహాలు, కంచర గాడిదలు, ఖడ్గమృగాలను ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడి నదులు లోతైన లోయల గుండా ప్రవహిస్తాయి. బ్లూ నైలు నది ప్రధానమైనది. కాఫీని ప్రధానంగా ఈ దేశం ఎగుమతి చేస్తుంది. చెరకు, బార్లీ, నూనె దినుసులు, గోధుమ, ప్రత్తి, బంగాళా దుంపలు, చిరుధాన్యాలు ఈ దేశంలో పండిస్తారు. తోళ్లు కూడా ఎగుమతి చేస్తారు.
బంగారం, ప్లాటినం వంటి ఖరీదైన ఖనిజ సంపద కల దేశం.

Gabon

gabon f;ag

Capital Libreville ………. Language French ………. Currency Central African CFA franc ………. Calling Code + 241 ………. Religion Christian.

గాబన్…

15 వ శతాబ్ధంలో పోర్చుగీస్ వారు ఈ దేశాన్ని సందర్శించి ఈ దేశానికి gaba అని పేరు పెట్టారు. తరువాత ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వారు ఈ దేశానికి వచ్చారు. అప్పటి నుండి ఈ దేశం బానిసలు ఎక్కువగా లభించే దేశంగా పేరుపొందింది. 1885 సంవత్సలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1960, 17 ఆగస్ట్ న ఈ దేశం ఫ్రెంచ్ వారినుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ వైశాల్యం 2,67,667 చ.కి.మీ. దేశ రాజధాని లిబ్రవిల్లే. వీరి కరెన్సీ Communaute Financiere Africaine franc వీరి అధికార భాష ఫ్రెంచ్. Fang, Myene, Nzebi, Bapounou, Eschira, Bandjabi ఇతర భాషలు. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది.
కోకోవా, కాఫీ, చెరకు, రబ్బర్, పామ్ నూనె గింజలు వ్యవసా ఉత్పత్తులు. పశువులను పెంచుకుంటారు. చేపల లభ్యత కలదు.
పెట్రోలియం, సహజవాయువు, యురేనియం, వజ్రాలు, బంగారం, యురేనియం, కలప సహజ సంపదలు.

Gambia

gambia flag

Capital Banjul ………. Language English ………. Currency Dalasi ………. Calling Code + 220 ………. Religion Islamic

గాంబియా
ఆఫ్రికా పశ్చిమ తీరాన ఉన్న చిన్న పేద దేశం గాంబియా. ఈ దేశ విస్తీర్ణం 10,689 చ.కి.మీ. రాజధాని బాన్జూల్. పులానీ, డిమోలా, మాలిన్కే, పూలోఫ్, సోనిన్కే అనే అయిదు నీగ్రో తెగలవారున్నారు. ప్రజలు ఆదిమ భాషలలో మాట్లాడతారు. వీరి అధికార భాష ఇంగ్లీష్. వీరి కరెన్సీ Dalasi. . గాంబియా ఇస్లామిక్ దేశం.
475 కి.మీ పొడవున్న ప్రవహిస్తున్న గంబియా నది ఈ దేశానికి ప్రధాన జలవనరు మరియు నౌకా మార్గం కూడా.
వరి, వేరుశెసగ, బొప్పాయి, పామ్, అరటి, కర్రపెండలం, మొక్కజొన్న పంటలు పండుతాయి. పశువులు, మేకలు, గొర్రెల పెంపకం ఎక్కువ. ఖనిజ సంపద, పరిశ్రమలు ఈ దేశంలో లేవు.

Ghana

ghana flag

Capital Accra ………. Language English ………. Currency Ghana cedi ………. Calling Code + 233 ………. Religion Christian/Muslim 

ఘనా

పశ్చిమ ఆఫ్రికాలో స్వతంత్ర దేశం ఘనా. ఒకప్పటి బ్రిటీష్ వలసరాజ్యం. టోగోలాండ్, గోల్డ్ కోస్ట్ దేశాలతో కలసి సుక్రుమా నాయకత్వంలో స్వతంత్ర ప్రతిపత్తిని 1957 సం.లో సంపాదించుకుంది.
ఘనా విస్తీర్ణం 2,38,533 చ.కి.మీ. ఘనా రాజధాని ఆక్రా. వీరి అధికార భాష ఇంగ్లీష్. వీరి కరెన్సీ ఘనా సెడి. ప్రజలు నీగ్రోలు క్రైస్తవ మతస్తులు.
గినీ సింధుశాఖ నుండి క్వాహూ పీఠభూమి వరకు వ్యాపించి ఉన్న పెద్ద మైదానంలో జనసాంద్రత ఎక్కువ. పీఠభూమికి రెండు వైపులా వోల్టా నది, బ్లాక్ వోల్టానది ప్రవహిస్తున్నాయి. ప్రానది, టానో నదులు, వోల్టా సరస్సులు ప్రధాన జలవనరులు. వోల్టా సరస్సు మానవ నిర్మితమైనది.
కోకో పంటకు ఘనా పేరు పొందినది. రబ్బరు, కాఫీ, కొబ్బరి, అరటి, పామ్ గింజలు, షీగింజలు వ్యవసాయ ఉత్పత్తులు.
బంగారాన్ని త్రవ్వి శుద్ధి చేసి ఎగుమతులు చేసే దేశాలలో ఘనా ప్రధానమైనది. బాక్సైట్, మాంగనీస్, వజ్రాలు లభిస్తాయి. కలప సమృద్ధిగా లభిస్తుంది.

Guinea

guinea flag

Capital Conakry ………. Language French ………. Currency Guinean franc ………. Calling Code + 224 ………. Religion Muslim 

గిని

పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న స్వతంత్ర రాజ్యం గిని. అందమైన దృశ్యాలతో నిండి ఉన్న లోయలు, జలపాతాలతో కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు ఈ దేశ సొంతం.
గినీ వీస్తీర్ణం 2,45,857 చ.కి.మీ. ఈ దేశ రాజధాని కోనాక్రీ. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ Guinean franc. ఆదిమ జాతి ప్రజలు స్థానిక మాండలిక భాషలు మాట్లాడతారు. గిని ముస్లిం దేశం. .
1849 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1858 సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా రూపొందింది. నైజర్ నది ఈ దేశానికి జలవనరులను అందిస్తుంది. వరి, పామ్, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుసెనగ, అనాస, చిలకడ దుంపలు, టారో కందమూలం, అరిటి, కర్రపెండలం, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా సాగులో ఉన్నాయి. .
బంగారం, ఇనుపరాయి, వజ్రపు గనులు, బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అల్యూమినియం పరిశ్రమ ప్రధానమైనది.

Guinea-Bissau

guinea bissau flag

Capital Bissau ………. Language Portuguese ………. Currency West African CFA franc ………. Calling Code + 245 ………. Religion Islam/Christian 

గిని-బిస్సా

పశ్చిమ ఆఫ్రికాలో సెనెగల్, గినీ దేశాల మధ్య ఉన్న స్వతంత్ర దేశం గిని-బిస్సా. ఒకప్పుడు పోర్చుగీసు వలస రాజ్యం.
ఈ దేశ విస్తీర్ణం 36,125 చ.కి.మీటర్ల. రాజధాని బిస్సా. వీరి అధికార భాష పోర్చుగీసు. ఆదిమ జాతుల ప్రజలు – బలాంటే, పులానీ, మాలిన్కే, మాండ్యాకో, పీపిల్ మొదలైన జాతులకు చెందినవారు. వీరి కరెన్సీ West African CFA franc దేశ ప్రజలలో ఎక్కువ మంది ముస్లిం మతస్తులు తరువాత క్రైస్తవులు.
ఈ దేశం మైదానాలతో, పీఠభూములతో నిండి ఉంది. వరి, కర్రపెండలం, జొన్న, వేరుసెనగ, కొబ్బరి, అరటిపండ్లు, చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, పామ్ ఆయిల్. జీడిమామిడి, చెరకు, బొప్పాయి పండ్లు, అపరాలు పంటలు పండించి ఎగుమతి చేస్తారు.

Kenya

kenya flag

Capital Nairobi ………. Language English and Kiswahili ………. Currency Kenyan shilling (KES) ………. Calling Code + 254 ………. Religion Christian 

కెన్యా

హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆఫ్రికా ఖండంలో భూమద్య రేఖ మీద ఒక స్వతంత్ర్య దేశం కెన్యా. 1963 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 5,82,646 చ.కి.మీ. రాజధాని నైరోబీ. వీరి అధికార భాషలు స్వాహిలీ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ కెన్యా షిల్లింగ్. .
క్రైస్తవ మతస్తులు ఎక్కువ. ఆదిమ జాతి మతస్థులు, ముస్లింలు కొద్ది శాతం మంది నివసిస్తున్నారు. కిసుమూ, నాకూరు, మచాకోస్ ప్రధాన పట్టణాలు. మొంబాస ప్రధాన రేవు పట్టణం. .
అతి నది, టానా నది, న్గిరో, టుక్వాతీవ్ పెద్ద నదులు. మాగదే, విక్టోరియా సరస్సులు కూడా జనవనరులు. కోస్తాతీర ప్రాంతం సారవంతమైనది. జీడిమామిడి, కొబ్బరితోటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. .
కెన్యా వ్యవసాయ ప్రధానమైన దేశం. కాఫీ, తేయాకు, సిసాల్ నార, వాటిల్ బెరడు, పైరత్రామ్, కర్రపెండలం, మొక్కజొన్న, ప్రత్తి, గోధుమ, వరి, చెరకు పండిస్తారు. పశుపెంపకం , పాడి పరిశ్రమలు కూడా ఉన్నాయి. .
రాగి, సోడా యాష్, ఉప్పు, సున్నపురాయి ఈ దేశంలో లభ్యమయ్యే ఖనిజాలు. అడవుల నుండి కలప కూడా లభిస్తుంది. పర్యాటక దేశం కూడా. అభయారణ్యాలలో ఉన్న ఏనుగులు, జీబ్రాలు, గాజిల్ వంటి జంతువులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Lesotho

lesotha flag

Capital Maseru ………. Language Sortho/English ………. Currency Lesotho loti ………. Calling Code + 266 ………. Religion Christian 

లెసోతో

లెసోతో… ఆఫ్రికా ఖండంలో అన్ని దిక్కులా దక్షిణ ఆఫ్రికా దేశం భూభాగం ఉండటం ఈ దేశపు ప్రత్యేకత. లెసోతో ప్రజలు ఏ దిశలో వెళ్లినా సరిహద్దులు దాటినా దక్షిణ ఆఫ్రికా భూభాగంలో అడుగుపెట్టాల్సిందే. లెసోతో చాలా చిన్న దేశం. మన దేశంలోని కేరళ రాష్ట్రం కన్నా చిన్నగా ఉంటుంది. లెసోతో సార్వభౌమాధికార దేశమే అయినా లాంఛనంగా ఓ చక్రవర్తి ఉంటారు.
లెసోతో రాజధాని మసేరు. ఈ దేశ విస్తీర్ణం 30,355 చ.కి.మీ. వీరి కరెన్సీ లోటీ. అధికార భాషలు భాషలు సెసోతో మరియు ఇంగ్లీష్. ఈ దేశం 1966లో యూకే నుంచి స్వాతంత్య్రం పొందింది. లెసోతో మొత్తం జనాభాలో ఎక్కువ మంది రాజధాని మసేరులోనే నివసిస్తుంటారు. అక్షరాస్యత శాతం 82.
ఈ దేశ జెండాలోని నీలం రంగు వర్షానికి, తెలుపు శాంతికి చిహ్నాలు. ఆకుపచ్చ సంపదకు గుర్తు. మధ్యలో ఉండే నలుపు టోపీ స్థానిక ప్రజలకు లను సూచిస్తుంది
దేశ భూభాగంలో 80శాతం సముద్రమట్టం కన్నా 1,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్కడ చూసినా కొండలు, లోయలే కనిపిస్తాయి. చేతికి అందినట్లుండే మేఘాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు కనిసిస్తాయి. ఇక్కడి ‘ఆఫ్రిస్కై రిసార్ట్‌’ సముద్రమట్టానికి ఏకంగా 3,050 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లేసోతో బీద దేశం. జలవనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.
గడ్డితో చేసిన ప్రత్యేకమైన టోపీలు ఇక్కడ ప్రసిద్ధి. ‘బసోతో టోపీ’లుగా పిలిచే ఇవి ఈ ప్రాంతంలోని వివిధ పర్వతాల రూపాల్లో తయారవుతాయి. ఈ దేశంలోని ‘కాట్సే డ్యామ్‌’ ఆఫ్రికా మొత్తంలో ఎత్తయిన ఆనకట్ట. ఇది దక్షిణ ఆఫ్రికా, లెసోతో దేశాలు కలిపి నిర్మించిన ప్రాజెక్టు. ఇక్కడి నుంచి నీళ్లను దక్షిణ ఆఫ్రికాకు సరఫరా చేస్తారు.
లేసోతోను ‘పర్వతాల రాజ్యం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి భూభాగంలో మూడింట రెండో వంతు పర్వతాలే ఉంటాయి కాబట్టి. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ఇక్కడ 90 శాతం మంది క్రైస్తవులే.
ఈ దేశంలో వజ్రాల గనులు, జల వనరులు అధికం. ఉన్ని, దుస్తులు, పాదరక్షలు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ‘లెవిస్‌’ జీన్స్‌ ఇక్కడ ఎక్కువగా తయారవుతాయి. దేశ ప్రజలలో ఎక్కువ మంది వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడతారు.
ఈ దేశంలో ‘మలెట్‌సన్‌యనె’ అనే ఒకే ధార గల జలపాతం మంచి పర్యటక ప్రాంతం. ఇది 192 మీటర్ల ఎత్తు నుంచి కిందకు జాలువారుతుంది.
కంబళిని ఈ దేశ ప్రజలు సంప్రదాయ దుస్తులుగా భావిస్తారు. ఈ సంప్రదాయం మరే దేశంలోనూ కనిపించదు. రకరకాల రంగులతో పూర్తిగా ఉన్నితో వీటిని తయారు చేసుకుంటారు. చలి నుంచి రక్షణ కోసమే కాకుండా కంబళిని హోదాకు గుర్తుగా భావిస్తారు.

Liberia

liberia flag

Capital Monrovia ………. Language English ………. Currency Liberian dollara ………. Calling Code + 231 ………. Religion Christians 

లైబీరియీ

లైబీరియా పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఒకదేశం. వర్షపాతపు అడవులతో జంతుసంపదకు మరియు వృక్షసంపదకు పేరు గాంచినది. 235 వృక్షజాతులు కలవు.
ఈ దేశ వైశాల్యం 1,11,370 చ.కి.మీ. వీరి అధికార భాష ఇంగ్లీష్. కానీ దేశంలో 20 శాతం మంది ప్రజలు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలరు, వ్రాయగలరు. ఆదిమజాతివారు దాదాపు 20 స్థానిక భాషలలో మాట్లాడుతారు. 26 జులై, ఈ దేశం ఏ ఇతర దేశాలతో ఆక్రమించబడలేదు.
ఈ దేశ రాజధాని మన్రోవియా. వీరి కరెన్సీ లైబీరియన్ డాలర్. క్రిస్టయన్లు 40 శాతం మంది, ముస్లింలు 20 శాతం మంది స్థానిక మతస్తులు 40 శాతం మంది కలరు.
రబ్బర్, కాఫీ, కోకోవా, రైస్, కర్రపెండలం, నూనె గింజలు, చెరకు, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలను, మేకలను పెంచుతారు.
ఇనుప ఖనిజం, కలప, వజ్రాలు, బంగారం ఖనిజ నిక్షేపాలు

Libiya

libiya flag
 Capital Tripoli ………. Language Arabic ………. Currency Libyan dinar ………. Calling Code + 218 ………. Religion Islam

లిబియా…

ఉత్తర ఆఫ్రికాలో మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న సోషలిస్ట్ రాజ్యం లిబియా. ఒకప్పుడు ఇటలీ వలస రాజ్యంగా ఉండి 1949 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ రాజధాని నగరం ఆల్జూపూర్. వీరి అధికార భాష అరబ్పీ.ఈ దేశ కరెన్సీ లిబియన్ దీనార్లు. ప్రజలు లిబియన్ అరబ్బీ, బెల్ బెర్ జాతులకు చెందిన వారు. ఈ దేశం ముస్లిం దేశం. ఈ దేశస్తులు సున్నీ ఇస్లాం మతాన్ని పాటిస్తారు. ఈ దేశ వైశాల్యం 17,75,000 చ. కి.మీ.
ఈ దేశంలో వాయువ్యాన ఉన్న కోస్తా మైదానం, ఈశాన్యంలో ఉన్న మిట్ట ప్రాంతాలు సారవంతమైన నేలలు. లిబియా దక్షిణ భాగమంతా సహారా ఏడారి. అక్కడక్కడా ఉన్న ఒయాసిస్సుల ప్రాంతాలలో నేల సారవంతమైనది. ఆగ్నేయంలో ఉన్న ఆల్ కుఫ్రా వద్ద ఉన్న సరస్సు అవసరమైన పంటనీటిని అందిస్తుంది. సముద్ర మట్టానికి 2286 మీ. ఎత్తున్న బెట్టే పర్వత శిఖరాగ్రం లిబియాలో మిక్కిలి ఎతైనది.
గోధుమ, ఆలివ్, పుచ్చకాయలు, బంగాళా దుంపలు, బార్లీ, ఉల్లి, ఖర్జూరం, టమాటోలు, నారింజ, ద్రాక్ష ప్రధానమైన పంటలు.
ఒంటెలు, గాడిదలు ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయి. గొర్రెలు, మేకలను పెంచుతారు.
జిప్సం, ఉప్పు ఖనిజాలు లభిస్తాయి. పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయి. పెట్రో ఎగుమతికి ప్రసిద్ధిగాంచినది. పెట్రోల్ ఎగుమతులు ఈ దేశానికి ప్రధాన ఆర్ధిక వనరు. జవుళీ, మత్స్య పరిశ్రమలు ముఖ్యమైనవి. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన పట్టణం ఆల్ ఆజియిహా లిబియాలోనే ఉన్నది.

Madagascar

madagaskar flag

Capital Antananarivo ………. Language Malagasy French ………. Currency Malagasy ariary ………. Calling Code + 261 ………. Religion Traditional/Christian/Muslim

మడగాస్కర్..

మడగాస్కర్ పెద్ద ద్వీపదేశం. ప్రపంచంలోనే నాలుగవదైన పెద్ద ద్వీపదేశం. మొదటి మూడు గ్రీన్ ల్యాండ్, న్యూ గినియా, బోర్నియో. 1960 సంవత్సరంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంతకు ముందు ఫ్రెంచ్ వారి వలస రాజ్యం. ఆఫ్రికా తూర్పు తీరానికి 500 కి.మీ. దూరంలో ఉంది. ఈ దేశ విస్తీర్ణం 5,87,041 చ.కి.మీ. ఈ దేశ రాజధాని అంతనా నరీవ్. వీరి అధికార భాష మలగాసీ. తరువాత ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ Malagasy ariary … ప్రజలు క్రైస్తవ, ముస్లిం మతాలను అనుసరిస్తారు. స్థానిక సంప్రదాయ మతస్తులు కూడా ఉన్నారు.
ఈ దేశంలో కనపడే జంతువులు, పక్షులు ఈ దేశానికే ప్రత్యేకం. ఈ దేశం ఆర్ధికంగా బీద దేశం. విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నది బెమరీవూ నది, బెట్సుబోకా నది, మాంగో నదులు ప్రదాన జలవనరులు. ఇవి కాక సరస్సులు, తటాకాలు కూడా ఉన్నాయి. వరి వీరి ముఖ్య ఆహార పంట. కర్రపెండలం, మొక్కజొన్న, చెరకు, బంగాళా దుంపలను ఎక్కువగా పండిస్తారు. కాఫీ ముఖ్యమైన ఎగుమతి పంట మడగాస్కర్ వెనిల్లాకు ప్రపంచ ప్రసిద్ది గాంచినది. పొగాకు, లవంగాలు వాణిజ్య పంటలు.
మైకా, నికెల్, రాగి క్రోమైట్ ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.

Malawi

nalawi flag

Capital Lilongwe ………. Language English ………. Currency Kwacha ………. Calling Code + 265 ………. Religion Christian

మలావీ…

ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో న్యాసా సరస్సుకు ఆనుకుని ఉన్న స్వతంత్ర్యదేశం మలావీ. 1964 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాంతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 1,14,484 చ.కి.మీ.. రాజధాని నగరం లిలోన్వే. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా మారానీ, టోంగా, చెనా, తుంబుగా భాషలు కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ Kwacha మలావి క్రైస్తవ మతానికి చెందిన దేశం. ముస్లిం మతస్తులు కూడా ఉన్నారు. మొక్కజొన్న వీరి ప్రధాన ఆహారం.
న్యాసా సరస్సు, షీర్వా సరస్సు, బూవా నది, షీరే నది ప్రధాన జలవనరులు. కానీ పంటలకు అనుకూలమైన నేలలు లేక పోవటంలో వ్యవసాయపరంగా మలావీ అభివృద్ధి చెందలేదు.
చెరకు, కాఫీ, ప్రత్తి, వేరుశెనగ, తేయాకు, పొగాకు పంటలను పండిస్తారు. టీ, పంచదార, ప్రత్తి. పొగాకు ఎగుమతులమీద దేశ ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉన్నది. మలావీ సరస్సు మత్స్యపరిశ్రమకు అనుకూలమైనది. ఈ దేశానికి ఖనిజ సంపదలు లేవు. పరిశ్రమలు కూడా తక్కువే. ఆర్ధికంగా వెనుకబడి దేశం మలావీ. కానీ పర్వత పానువులలో ఉన్న సుందరమైన వృక్ష సంపద, సరస్సులు, ప్రకృతి దృశ్యాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

Mali

mali flag

Capital Bamako ………. Language French ………. Currency West African CFA franc ………. Calling Code + 223 ………. Religion Islam

మాలీ…

మాలీ పశ్చిమ ఆఫ్రికాలోని ఒక స్వతంత్ర దేశం. ఆఫ్రికాలో పెద్ద దేశం. ఇది 1960 సంవత్సరంలో ఫ్రెంచ్ వారి నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 12,40,192 చ.కి.మీ. రాజధాని నగరం బామాకో. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ West African CFA franc . మలావీ ముస్లిం దేశం. ప్రజలు నీగ్రో జాతి వారు.
బావి నది, నైజర్ నదులు ఈ దేశం దక్షిణాన ప్రవహిస్తున్నాయి. ప్రత్తి, మొక్కజొన్న, వరి, చిరుధాన్యాలు, షియా నూనె గింజలు, పండ్లు పండిస్తారు. పశువుల పెంపకం, ఒంటెల పెంపకం ప్రధాన వృత్తి. నదులలోని చేపలు పట్టి ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటారు. పదును చేసిన తోలు కూడా ఎగుమతి చేస్తారు.

Mauritania

mauritania flag
 Capital Nouakchott ………. Language Arabic ………. Currency Ouguiya ………. Calling Code + 222 ………. Religion Islam

మారిటానియా..

పశ్చిమ ఆఫ్రికాలో స్వతంత్ర రాజ్యం మారిటానియా. ఒకప్పుడు ఫ్రెంచ్ వలస రాజ్యంగా ఉండేది. 1958 సంవత్సంలో స్వాతంత్ర్యం సాధించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 10,30,700 చ.కి.మీ. రాజధాని నగరం నౌవాక్ చోట్. వీరి అధికార భాష అరబ్బీ.వీరి కరెన్సీ Mauritanian ouguiya ప్రజలు నీగ్రోలు. 99 శాతం మంది ఇస్లాం మతానికి చెందినవారు. వీరు దేశ దిమ్మరులు. ఒంటె రోమాలతో చేసి గుడారాలను వేసుకొని జివిస్తుంటారు.
సహారా ఎడారి ఈ దేశానికి చుట్టూర ఉంది. అక్కడక్కడా ఒయాసిస్సులు ఉన్నారు. దక్షిణ దిశలో సెనెగల్ నది సరిహద్దుగా ఉన్నది. ఈ నదిని ఆనుకుని సారవంతమైన మైదానం ఉన్నది.
వరి, చిరుధాన్యాలు, కందమూలాలు, పుచ్చకాయలు, అపరాలు పండిస్తారు.. ఖర్జూరం, వేరుసెనగ అరబిక్ బంక వాణిజ్య ఉత్పత్తులు. రాగి, ఇనుపరాయి ఖనిజాలు లభిస్తాయి. కలప లభిస్తుంది. పశుపోషణ కూడా ఉంది.


Mauritius

mauritius flag

Capital Port Louis ………. Language English ………. Currency Mauritian rupee ………. Calling Code + 230 ………. Religion Hindu(52)/Christian/Islam

మారిషస్‌

మారిషస్‌… ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉండే ఓ ద్వీప దేశం.
ఈ దేశ రాజధాని పోర్ట్ లూయిస్. వీరి అధికార భాష ఏమీ లేదు ఈ దేశంలో మారిషస్‌ క్రియోల్‌, ఫ్రెంచ్‌, భోజ్‌పురీ, ఆంగ్లం, హిందీలతో పాటు మన తెలుగు కూడా మాట్లాడతారు.
మారిషస్ రాజధాని: పోర్ట్‌ లూయిస్‌ అతి తక్కువ జనాభా సుమారు13,50,000.(2018)
విస్తీర్ణం: 2,040 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు: ఆంగ్లం, ఫ్రెంచ్‌
మారిషస్ కరెన్సీ: మారిషియన్‌ రుపీ
లక్షల ఏళ్ల క్రితం భూగర్భంలోని అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. మొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది పోర్చుగీసు వారు. ఇక్కడ భారత్‌, ఆఫ్రికా,చైనా దేశాల సంతతివారు ఎక్కువగా ఉంటారు. .
ఇప్పుడు అంతరించి పోయిన డోడో అనే పక్షులు ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే ఉండేవి. .
ఈ దేశం1968లో బ్రిటన్‌ నుంచి స్వతంత్రం పొందింది. .
మారిషస్ పర్యాటక దేశం కూడా. ఈ ద్వీప దేశాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రముఖ రచయిత మార్క్‌ ట్వైన్‌ ఈ దేశం గురించి‘ముందు మారిషస్‌ ఏర్పడింది ఆ తర్వాతే స్వర్గం తయారైంది అని అన్నారు. .
ఇక్కడ ముఖ్యమైన పర్యటక ప్రాంతం ఛామరెల్‌లోని ‘ఏడు రంగుల నేల’. తక్కువ ప్రదేశంలోని ఇక్కడి ఇసుక వేరువేరు రంగుల్లో భలేగా కనిపిస్తుంది. ఇది అగ్నిపర్వతాల ప్రభావంతోనే ఏర్పడింది.
ఈ ఐలాండ్‌లో క్రూరమృగాలు ఉండవు. ఇక్కడ కనిపించే పాములు కూడా విషపూరితమైనవి కావు.
ఈ ద్వీపం చుట్టూ ఉండే కోరల్‌ రీఫ్స్‌ ఉష్ణోగ్రతల నుంచి, షార్కు, జెల్లీఫిష్‌ వంటి జలచరాల నుంచి సందర్శకుల్ని కాపాడుతుంటాయి.
దేశం మొత్తం జనాభాలో రాజధాని పోర్ట్‌ లూయిస్‌లోనే 40 శాతం మంది నివసిస్తారు.
మారిషస్‌ అనే పేరు ఒకప్పటి రాజకుమారుడు మారిస్‌ డె నాసో పేరు మీదుగా వచ్చింది.
ఇక్కడి మొత్తం వ్యవసాయ భూమిలో 90 శాతం చెరకునే పండిస్తారు.
రెండు చేతులతో బహుమతి తీసుకోవడం గౌరవంగా భావిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. కుడి చేతితో మాత్రమే బహుమతి తీసుకోవాలి.

Morocco

morocco flag

Capital Arabic / Berber ………. Language Rabat ………. Currency Moroccan dirham ………. Calling Code + 212 ………. Religion Muslim

మొరాకో

ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఉన్న చిన్న దేశం మొరాకో. అట్లాంటిక్‌ మహా సముద్రంతో దీనికి పొడవైన తీర రేఖ ఉంది. మధ్యధరా, అట్లాంటిక్‌ సముద్రాలు రెండింటితోనూ ఇది సరిహద్దుల్ని పంచుకుంది. ప్రపంచంలో ఇటువంటి దేశాలు దీనితో పాటుగా మూడే ఉన్నాయి. మొరాకో రాజధాని రాబాట్‌ అయినా ఇక్కడ అతి పెద్ద నగరం మాత్రం కాసాబ్లాంకా. ఫెజ్‌, అగదిర్‌, ఉజ్దా…లూ ఇతర ముఖ్యమైన నగరాలు.
ఈ దేశ రాజధాని రాబాట్‌ జనాభా 3,38,48,242 (2018) ఈ దేశ విస్తీర్ణం: 7,10,850 చదరపు కిలోమీటర్లు వీరి అధికారిక భాషలు అరబిక్‌, బెర్బర్‌. ఈ దేశ కరెన్సీ మొరాకన్‌ దిర్హామ్‌ ఈ దేశం ముస్లిం దేశం. మూడు కోట్లకు పైగా ఉన్న జనాభాలో 99 శాతం సున్నీ ముస్లింలే. మిగిలిన ఒక శాతం యూదులు, క్రైస్తవులు ఉన్నారు.
చరిత్ర ఆధారాల్ని బట్టి చూస్తే 2.6మిలియన్‌ సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులే లేరు. తర్వాత్తర్వాతే రోమన్‌లు, ఇతర సంచార జాతి వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మొరాకో ఆగ్నేయ భాగంలో సహారా ఎడారి ఉంటుంది. అయితే దీని సరిహద్దుల విషయంలో ఈ దేశానికి మారుటేనియా, అల్జేరియాలతో వివాదాలున్నాయి.
ఎత్తయిన పర్వతాలు, ఎడారి ప్రాంతం, సముద్ర తీరాలు, పచ్చిక మైదానాలు, దట్టమైన అడవులు… ఇలా అన్ని రకాల భూ స్వరూపాల్నీ ఇక్కడ ఉన్నాయి.
ఆఫ్రికన్‌ యూనియన్‌, అరబ్‌ లీగ్‌ల్లో సభ్యత్వం కలిగిన దేశమిది. గొర్రెమాంసంతో చేసే హరీరా సూప్‌ ఇక్కడ ప్రముఖ వంటకం. ఎక్కువగా రంజాన్‌ నెలలో దీన్ని చేసుకుంటారు. ఆహారంలో బ్రెడ్‌ను ప్రధానంగా వాడతారు. గ్రీన్‌ టీ వీరి జాతీయ పానీయం.
ఈ దేశంలో ప్రధానంగా రెండు రకాల పర్వతాలున్నాయి. ఒకటి అట్లాస్‌, రెండు రిఫి. అట్లాస్‌ పర్వతాలు ఇక్కడి భూభాగాన్ని విభజిస్తాయి. అందుకే వీటికి ‘ద బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ మొరాకో’ అనే పేరుంది. ఇవి విభజించిన ప్రాంతాల్నే మిడిల్‌ అట్లాస్‌, యాంటీ అట్లాస్‌, హై అట్లాస్‌లుగా పిలుస్తారు. హై అట్లాస్‌లో ఈ పర్వతాలపైనే చిన్న చిన్న గ్రామాలుంటాయి. బెర్బర్‌ ప్రజలు వీటిపై ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తుంటారు.
ఈ చిన్న దేశంలో రకరకాల వాతావరణాలు కనిపిస్తాయి. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో వేసవిలోనూ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవు. చల్లగానే ఉంటుంది. అదే ఈ దేశ దక్షిణ ప్రాంతాల్లో మాత్రం 30డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో ఇక్కడ ఎండలు మండిపోతాయి. సహారా ఎడారికి ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ దాని మీదుగా గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం పొడిగా రాత్రిళ్లు చలిగా ఉంటుంది.
మొరాకో పర్యాటక దేశం కూడా. పర్యాటకం వల్లా ఈ దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ఏటా కోటి మందికి పైగా పర్యాటకులు ఈ దేశాన్ని చూడటానికి వస్తారు. అట్లాస్‌, రిఫి పర్వతాలు అడ్వంచర్‌ టూరిజంకి ప్రసిద్ధి. వీటిపై రిసార్టులు, షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి. సహారా ఎడారి ప్రాంతాన్ని డెసర్ట్‌ టూరిజం హబ్‌గా మార్చారు.
ఆఫ్రికా దేశాల్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఈ దేశానిది ఐదో స్థానం. దేశ ఆర్థిక అభివృద్ధికి సహజ వనరులే ప్రధానం. ఇక్కడ పాస్పేట్‌ ఎక్కువగా లభిస్తుంది. పాస్పేట్‌ ను క్రిమి సంహారకాలు, ఎరువుల్లో ఎక్కువగా వాడతారు. కోబాల్ట్‌, బారైట్‌, సీసం.. తదితరాల లభ్యత ఎక్కువగా ఉంది.
నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు, ఆలివ్‌, టమాటాలు ఎక్కువగా పండుతాయి. లెదర్‌, వస్త్రాల్నీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.
ఇక్కడ వాడే విద్యుత్‌ చాలా మటుకు బొగ్గుతోనే తయారవుతుంది. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తుంది.

Mozambique

mozambique flage

Capital Maputo ………. Language Portuguese ………. Currency Mozambican metical ………. Calling Code + 258 ………. Religion Christian/Muslim

మొజాంబిక్…

మొజాంబిక్ తూర్పు ఆఫ్రికాలోని స్వతంత్ర్య దేశం. ఉత్తర దిశలో టాంజానియా, పశ్చిమాన మలావీ, జాంబియా, బోట్స్ వానా, జింబాబ్యే, దక్షిణాఫ్రికా, దక్షిణ దిశలో స్వాజిలాండ్, తూర్పున హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఈ దేశం పోర్చుగల్ నుండి 1975 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ రాజధాని నగరం మాపుటో. ఈ దేశ విస్తీర్ణం 7,99,380 చ.కి.మీ. మలావీ, షోనా, మాకొండే., షోనా జాతి ప్రజలు ఉన్నారు. వీరి అధికార భాష పోర్చగీస్. వీరి కరెన్సీ Mozambican metical . ఈ దేశంలో ప్రధానంగా క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు.
పశ్చిమ దిశలో మలావీ సరస్సు ఉంది. జాంబజీ నది, సావే నది, లింపోపో నది. ఢిఫాంట్స్ నది తూర్పుగా ప్రవహించి హిందూ మహాసముద్రంలో కలుస్తున్నాయి.
జీడిమామిడి, కొబ్బరి, సిసాల్ నార, జొన్న, వరి, చెరకు, తేయాకు, మొక్కజొన్న, కర్రపెండలం, అరటి పండ్లు, వేరుసెనగ, చిరుగడం వ్యవసాయ ఉత్పత్తులు.
ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తుంది. నేలబొగ్గు, వజ్రాలు, బాక్సైట్ ఉన్నాయి. బెరిల్, టాంటలైట్ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నవి.

Namibia

nambia flag

Capital Windhoek ………. Language English ………. Currency Namibian dollar ………. Calling Code + 264 ………. Religion Christian

నమీబియా..

నమీబియా ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. పశ్చిమదిశలో అట్లాంటిక్ మహాసముద్రం కలదు. అంగోలా, జాంబియా, బోట్స్ వానా, జింబాబ్వే,దక్షిణ ఆఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
నమీబియాలో మొదటిగా శాన్ ఆటవిక తెగల ప్రజలు నివసించారు. వీరి ప్రధాన వృత్తి. తరువాత 14వ శతాబ్ధంలో బంటూ జాతి ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చారు.
1990 వ సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యం పొందింది. నమీబియా రాజధాని Windhoek వీరి కరెన్సీ నమీబియన్ డాలర్. ఈ దేశ వైశాల్యం 8,25,418 చ.కి.మీ. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. క్రిస్టియన్లు 90 శాతం మంది, 10 శాతం స్థానిక మతస్తులు ఉన్నారు. వీరి అధికార భాష ఇంగ్లీష్ కానీ కేవలం 7 శాతం మంది మాత్రమే మట్లాడుతారు. 60 శాతం ప్రజలుWindhoek మాట్లాడుతారు.
చిరుధన్యాలు, జొన్న, వేరుసెనగ, ద్రాక్ష వ్యవసాయ ఉత్పత్తులు. పశుసంపద కలదు. చేపలు కూడా దొరకుతాయి.
వజ్రాలు, రాగి, యురేనియం, సీసం, లిధియం, కాడ్మియం, జింక్, ఉప్పు సహజ సంపదలు.

Niger

niger flag

Capital Niamey ………. Language French ………. Currency West African CFA franc ………. Calling Code + 227 ………. Religion Islam

నైజర్…

ఒకప్పుడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న ఈ రాజ్యం 1970 సం.లో స్వాతంత్రం సంపాదించుకుంది. దేశం విశాలమైనది కానీ సహజ సంపదలు ఎక్కువగా లేని దేశం. జనసాంద్రత కూడా తక్కువే. అల్జీరియా, లిబియా, చాద్, నైజీరియా, బెనిన్ దేశాలు సరిహద్దులుగా కల దేశం. ఈ దేశంలో ప్రవహించే చేజర్ నది పేరు వలన ఈ దేశానికి నైజర్ అనే పేరు వచ్చింది.
ఈ దేశం ముస్లిం దేశం. 85 శాతం ప్రజలు సున్నీ ఇస్లాంను అనుసరిస్తారు. ఈ దేశ విస్తీర్ణం 11,86,408 చ.కి.మీ. రాజధాని నగరం నియామే. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీWest African CFA franc.
ఈ దేశానికి ఉత్తరాన సహారా ఎడారి ఉంది. నైరుతీ దిశలో ప్రవహించే నైజర్ నది ఒక్కటే ప్రధాన జలవనరు.
తుమ్మ చెట్లు, ఈత చెట్లు, తాటిచెట్లను పెంచుతారు. ప్రత్తి, వేరుసెనగ ప్రధానమైన పంటలు. ఇవి కాక వరి, జొన్న, అపరాలు, కందమూలాలు, గోధుమ, పొగాకు, మొక్కజొన్న ఇతర పంటలు. పశువుల పెంపకం ప్రజలకు ప్రధాన జీవనాధారం. తగరం, యురేనియం, నెట్రాన్, రాతి ఉప్పు ప్రధాన ఖనిజ సంపదలు.

Nigeria

nigeria flag

Capital Abuja ………. Language English ………. Currency Naira ………. Calling Code + 234 ………. Religion Christian/Islam

నైజర్…

పశ్చిమ ఆఫ్రికాలోని ఒక స్వతంత్ర దేశం నైజీరియా. 1960 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. కళల పరంగా ఈ దేశం పేరు పొందింది. పికాసో వంటి సుప్రసిద్ధ కళాకారులను ప్రభావితం చేసిన దేశం. విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు గల దేశం
ఈ దేశ విస్తీర్ణం 9,23,768 చ.కి.మీ. రాజధాని నగరం లావోస్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రో వర్గానికి చెందినవారు. ఈ దేశం ఇస్లాం మతానికి చెందినది. వీరి కరెన్సీ నైరాలు. ఇక్కడ ప్రజలు వందలాది స్థానిక భాషలు మాట్లాడుతారు
నైజీరియాలో సహజసంపదలు ఎక్కువగా ఉన్నాయి. నైజర్ నది ఎక్కువగా ఈ దేశంలోనే ప్రవహిస్తున్నది. దీని ఉపనది బెన్యూ కూడా ఎక్కువ ప్రాంతంలో ప్రవహిస్తున్నది. చాద్ సరస్సులో కదూనా-కోమాదుగు మోజ్ నది నైజీరియాలోనే ఉన్నది.
నైజీరియా వ్యవసాయ ప్రధానమైన దేశం. అరటిపండ్లు, వరి, మొక్కజొన్న, కర్రపెండలం, వరి, చిరుధాన్యాలు, దుంపజాతులను పండిస్తారు.ప్రత్తి. కోకో, పామ్ గింజలు. వేరుసెనగ, రబ్బరు వాణిజ్య పంటలు. ముఖ్యంగా కోకో, వేరుసెనగ, పామ్ గింజల నూనెకు నైజీరియా పేరు గాంచినది. కలప ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి.
కొంబైట్ అనే ఖనిజం ఉత్పత్తి ఎక్కువ. నేలబొగ్గు, బంగారం, ఇనుపరాయి, సీసం, సున్నపురాయి, జింకు ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. పెట్రోల్ నిక్షేపాలు, సహజవాయువు పుష్కలంగా ఉన్నాయి.

Rwanda

rwanda flag

Capital Kigali ………. Language Kinyarwanda/English/French ………. Currency Rwandan franc ………. Calling Code + 250 ………. Religion Roman Catholica

రువాండా

ఆఫ్రికా మద్యలో భూమద్య రేఖ మీద ఉన్న స్వతంత్ర దేశం రువాండా. ఈ దేశ రాజధాని కిగాలీ. వీరి అధికార భాష ఫ్రెంచ్, కిన్యార్వాండ్ . వీరి కరెన్సీ రువాండ్ ఫ్రాంక్. రువాండ్ రోమన్ కేధలిక్ కు చెందిన క్రిస్టియన్ దేశం.
వబగసేరా సరస్స, కీవూ సరస్సు, తేమా సరస్సు, కాగేరా నది, అకన్యారూ నది, రూజీజీ నది, వ్యబరోన్గో నదులు ముఖ్య జలాధారాలు. నీటి వనరులున్నప్పటికీ ప్రజలు తమకు అవసరమైనంత వరకే ఆహారపు పంటలు పండిస్తారు. జొన్న, మొక్కమొన్న, కర్రపెండలం, కందమూలాలు, బంగాళాదుంపలు కొద్దిగా పండిస్తారు. కాఫీ విరివిగా పండించి ఎగుమతి చేస్తారు
వీరు పండించే రోబుస్టా రకం ఇన్ స్టంట్ కాపీ తయారు చేయటానికి పనికి వస్తుంది. తేయాకు, పొగాకు ఇతర వాణిజ్య పంటలు.
జిరేనియా, పైరద్రామ్ ఓషదులకూడా పండించి ఎగుమతులు చేస్తున్నారు. పశువుల పెంపకం మీద జనం ఆధారపడతారు. తగరపు రాయి, టంగ్ స్టన్, టాంటలైట్, బెరిల్ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. తోళ్లు ఎగుమతి చేస్తారు. రువాండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం.

Sao Tome and Principe

Sao Tome and Principe

Capital São Tomé ………. Language Portuguese ………. Currency Dobra ………. Calling Code + 239 ………. Religion Roman Catholic
Sao Tome and Principe… ఈ దేశం పశ్చిమ ఆఫ్రికా తీరంలో చిన్న చిన్న దీవులు, అగ్నిపర్వతాలతో ఉన్నది. 1400 వ సంవత్సరం నుండి పోర్చుగల్ వారు ఈ దేశంలో ప్రవేశించి స్థానిక ప్రజలను బానిసలుగా మార్చి చెరకుపంటను సాగుచేసారు. అప్పటినుండి బానిసల ఎగుమతి రాజ్యంగా మారింది. 1975 సంవత్సరంలో పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం పొందింది
ఈ దేశ రాజధాని సావో టామీ. ఈ దేశ వైశాల్యం 1, 001 చ.కి.మీ. అధికార భాష పోర్చుగీస్. వీరి కరెన్సీ డోబ్రా. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
కోకోవా, కొబ్బరి, దాల్చిన చెక్క, మిరియాలు, కాఫీ, అరటిపండ్లు, బొప్పాయి, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపెంపకం కలదు. చేపలు లభిస్తాయి.
చేపలు హైడ్రో పవర్ సహజ సంపదలు.

Senegal

senegal flag

Capital Dakar ………. Language French ………. Currency CFA franc ………. Calling Code + 221 ………. Religion Islam
పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ ను ఆనుకుని ఉన్న స్వతంత్ర దేశం సెనెగల్. ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండి మాలీ సమాఖ్యలో భాగమై తరువాత 1960 సం.లో స్వతంత్ర రాజ్యం అయినది. ఈ దేశ విస్తీర్ణం 1,96,722 చ..కి.మీ.. ఈ దేశ రాజధాని డాకర్. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ CFA franc ప్రజలు నీగ్రో జాతులకు చెందినవారు. సెనెగల్ ముస్లిం దేశం. ఎక్కువ మంది సున్ని ముస్లింలు. తరువాత కొద్ది సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. సెనెగల్ దేశాన్ని గేట్ వే ఆఫ్ ఆఫ్రికా అంటారు.
సీవే నది, సాలూమ్ నది, గాంజీనది, కసామాన్సే నది ప్రధాన జలవనరులు. వేరుసెనగ ప్రధాన వ్యవసాయోత్పత్తి. 72 శాతం వేరుశెనగను ఎగుమతి చేస్తారు. వరి, జొన్న, మొక్కజొన్న, చిక్కుడు, కర్రపెండలం, బంగాళాదుంప, చిరుగడం, చెరకు, ప్రత్తి పంటలను పండిస్తారు. గొర్రెలు, మేకలను పెంచుతారు. .
జిర్కోనియం, కాల్షియం, ఫాస్పేట్ ఈ దేశ ఖనిజ సంపదలు. టూనా చేపలు దొరకుతాయి. .
సిమెంట్, జవుళీ, వీరు, సారాయి, వేరుసెనగ ఉత్పుత్తులు ప్రధాన పరిశ్రమలు.

Seychelles

seychelles flag

Capital Victoria ………. Language English/French/Seychellois Creole ………. Currency Seychellois rupee ………. Calling Code + 248 ………. Religion Christian

సీషెల్లీస్

సీషెల్స్‌ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. హిందూ మహాసముద్రం మధ్యలో 115 ద్వీపాల సమూహం సీషెల్స్‌. హనీమూన్‌ డెస్టినేషన్‌గా ఈ ద్వీపదేశానికి మంచి పేరుంది. అందమైన తీరాలు, అత్యద్భుతమైన జలపాతాలు, అడవులు, పర్వతాలతో పర్యావరణ కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఈ ద్వీపదేశం 1500 సంవత్సరంలో యూరోపియన్స్ చే కనిపెట్టబడినది. 1903 నుండి బ్రిటీష్ కాలనీగా ఉండి1976 సంవత్సరంలో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశ రాజధాని విక్టోరియా. ఈ దేశ వైశాల్యం 455 చ.కి.మీ. క్రెడోల్ మరియు ఇంగ్లీష్ వీరి భాషలు. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
కొబ్బరి, దాల్చిన చెక్క, వెనీలా, చిలకడ దుంపలు, కర్రపెండల అరటి వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపెంపకం కలదు.
చేపలు, కొబ్బరి, దాల్చిన చెక్క చెట్లు సహజ సంపదలు
సీషెల్లీస్ పర్యాటక దేశం

Sierra Leone

sierra leone flag

Capital Freetown ………. Language English ………. Currency Leone ………. Calling Code + 232 ………. Religion Islam

సియారా లియోన్

సియారా లియోన్… పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం. గిని, లైబేరియా, అట్లాంటిక్ సముద్రం ఈ దేశానికి సరిహద్దులు.
సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్. దేశ విస్తీర్ణం 71,740 చ. కిలోమీటర్లు. వీరి అధికార భాష ఆంగ్లం ఈ దేశ కరెన్సీ లియోన్. ఈ చిన్న దేశంలో ఉన్న 16 తెగల ప్రజలకు ప్రత్యేకమైన భాషలున్నాయి. మెండె, టెమ్నె, క్రియో ముఖ్యమైన స్థానిక భాషలు. ఈ దేశ అధికారిక భాష ఆంగ్లమే అయినా ప్రతి ఒక్కరూ కనీసం రెండు నుంచి మూడు భాషల వరకు మాట్లాడతారు. రాజధాని నగరం ఫ్రీటౌన్లో కాటన్ ట్రీ పేరుతో పెద్ద వృక్షం ఉంది. బానిసత్వం నుంచి విముక్తి చెంది ఆఫ్రికన్లు తెచ్చుకున్న స్వాతంత్య్రానికి గుర్తు ఇది.
ఈ దేశంలో ఖనిజసంపదలు ఎక్కువ. ముఖ్యంగా వజ్రాల గనులు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో వజ్రాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే పది దేశాల్లో ఇదీ ఒకటి.
భిన్న సంస్కృతులు, ఫ్యాషన్లకు నిలయమిది. అందుకే ‘ది లిటిల్ జ్యువెల్’ అని పిలుస్తారు. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల జాతుల ప్రజలు దాదాపు 2500 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకున్నారని చెబుతుంటారు. క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారిక్కడ.
ఈ దేశం 1961 ఏప్రిల్ 27న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. సియారా లియోన్ అనేది ‘సెర్రా లియో’ అనే పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘లయన్ మౌంటెన్ రేంజ్’. బ్రిటన్ అధీనంలోనే ఇక్కడ ‘ది సియారా లియోన్ పోలీసు వ్యవస్థ 1894లో ఏర్పాటైంది. దక్షిణ ఆఫ్రికాలోని ప్రాచీన పోలీసు దళాల్లో ఇదీ ఒకటి.
వజ్రాలతోపాటు కొబ్బరి, కాఫీని ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం. రకరకాల వ్యాధులు ఈ దేశాన్ని దడపుట్టిస్తుంటాయి. రేబీస్, డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్, టైఫాయిడ్.. లాంటివి. ఆ మధ్య అందర్నీ భయపెట్టిన ఎబోలా వైరస్ వల్ల ఇక్కడ 2014లో పదహారు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. .
ఈ దేశం ముస్లిం దేశం. మొత్తం జనాభాలో 60 శాతం మంది ముస్లింలు, 10 శాతం క్రైస్తవులు, మిగతా 30 శాతం మంది స్థానిక తెగల ప్రజలున్నారు. .
ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. దీంతో రకరకాల పద్ధతుల్లో పదార్థాల్ని తయారుచేసుకుంటారు. ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. దీంతో రకరకాల పద్ధతుల్లో పదార్థాల్ని తయారుచేసుకుంటారు
ఇక్కడ ప్రధాన సందర్శక ప్రాంతాలు బీచ్లు, పర్వతాలు, ద్వీపాలు, సంరక్షణ కేంద్రాలు. ఏటా లక్ష మందికిపైగా పర్యాటకులు వస్తుంటారు. ఈ దేశంలో జెయింట్ స్నెయిల్స్ని చూడొచ్చు. ఏడు అంగుళాల పొడవు, మూడున్నర అంగుళాల వెడల్పుతో ఉంటాయీ పెద్ద నత్తలు.

Somalia

Capital Mogadishu ………. Language Somali/Arabic ………. Currency Somali shilling ………. Calling Code + 252 ………. Religion Muslim

సోమాలియా

ఆఫ్రికా ఖండంలో వెనుకబడిన చిన్నదేశం సోమాలియా. పడమరన ఇధోపియా, వాయువ్యంలో డిజిబౌట్, నైరుతిలో కెన్యా, మిగిలిన వైపుల హిందూ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులు . 1960 సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్వం పొందింది.
సోమాలియా రాజధాని మొగాదిషు. ఈ దేశ కరెన్సీ సోమాలి షిల్లింగ్. సోమాలి, అరబిక్ భాషలు మాట్లాడతారు. ఈ దేశం ప్రపంచంలొనే అతి బీద దేశం
వ్యవసాయం ఇక్కడి ప్రజలకు ముఖ్య జీవనాధారం. మొక్కజొన్న, అరటి పండిస్తారు. ఇక్కడ ప్రధాన నదులు షిబెల్లే మరియు జుబే. కానీ ఈ దేశంలో బీదరికం ఎక్కువ కావటంతో ఆకలి చావులు కూడా ఎక్కువే. అక్షరాస్యత కూడా తక్కువే. దీనితో ఈ దేశంలోని చాలా మంది పౌరులు సముద్రపు దొంగలుగా మారారు. ఈ మార్గంలో ప్రయాణించే ఓడలను దోచుకుంటూ లేక ఓడలను స్వాధీనం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. మనం తరచుగా పత్రికలలో ఈ వార్తలను చూస్తుంటాము
వీరి డబ్బు విలువ కూడా చాలా తక్కువ. మన రూపాయకి 11 సోమాలి షిల్లింగ్ లు వస్తాయి. రవాణా, పాలు, మాంసానికి ఎక్కువగా ఒంటెలపైనే ఆధారపడతారు.
ఇక్కడ అతి ఎత్తైన పర్వత ప్రాంతం షింభిరిస్, ఇది సముద్ర మట్టానికి 2,416 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉండే లమాదయా జలపాతం అచ్చం పిల్లలు జారే జారుడు బల్లలాగే ఉంటుంది.
సోమాలియాలో సముద్రతీరం ఎక్కువ. బీచ్ లు కూడా ఎక్కువే. కానీ విదేశీ పర్యాటకులు ఇక్కడకు రావటానికి భయపడతారు. ఎందుకంటే బీదరికం కారణంగా దోపిడీలు, నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

South Africa

south africa flag

Capital Pretoria (executive) ………. Language 11 languages ………. Currency South African rand ………. Calling Code + 27 ………. Religion Christian

South Sudan

south sudan flag

Capital Juba ………. Language English ………. Currency South Sudanese pound ………. Calling Code + 211 ………. Religion Christian/Muslim

సౌత్ సూడాన్…

సౌత్ సూడాన్ మధ్య ఆఫ్రికాలో ఉన్న స్వతంత్ర దేశం. 2011, జులై 9 వ తేదీన ఈ దేశం సుడాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. కెన్వా, ఉగాండా, సెంట్రల్ ఆఫ్రికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో సరిహద్దులు కలవు. ప్రపంచంలోని బీద దేశాలలో ఈ దేశం కూడా ఒకటి.
ఇంగ్లీష్ వీరి భాష. ఈ దేశ రాజధాని జూబా. 6,19,745 చ.కి.మీ. ఈ దేశ వైశాల్యం. వీరి కరెన్సీ సూడనీస్ పౌండ్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది.
ఏనుగులు, సింహాలు, కోతులు, చింపాంజీలు, జిరాఫీలు ఈ దేశంలో పరిరక్షించబడుతున్నాయి.
జొన్న ఇక్కడి ప్రధాన వ్యవసాయ పంట. తరువాత మొక్కజొన్న, రైస్, చిరు ధాన్యాలు, కర్రపెండలం పండిస్తారు. వేరుసెనగ వాణిజ్య పంట.

Sudan

Capital Khartoum ………. Language Arabic/English ………. Currency Sudanese pound ………. Calling Code + 249 ………. Religion Islam

సూడాన్…

ఆఫ్రికాలోని ఈశాన్య ప్రాంతంలోని స్వతంత్రదేశం సూడాన్. క్రీ.పూర్యం 1500 సం.లో కుష్ నాగరికత వర్ధిల్లిన ప్రాంతం. 19వ శతాబ్ధంలో బ్రీటీష్ వారి పాలనలో ఉన్నది. 1895 సం.లో స్వాంతంత్ర్యం సాధించుకుంది. ఈ దేశానికి ఉత్తరదిశలో ఈజిప్ట్, దక్షిణ దిశలో జెయిరీ, ఉగాండా పశ్చిమాన సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, చాద్, లిబియా, తూర్పున ఇధోపియా, రెడ్ సీ ఉన్నాయి. ఆఫ్రికా ఖంఢంలో మరియు అరబ్ దేశాలలో పెద్ద దేశం
ఈ దేశ వైశాల్యం25,03,890 చ.కి.మీ. దేశ రాజధాని ఖార్దూమ్ నగరం. వీరి అధికార భాష అరబ్బీ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ సూడానీస్ పౌండ్లు. ఈ దేశం సున్నీ తెగకు చెందిన ఇస్లాం దేశం. తరువాత క్రైస్తవులు 7 శాతం మంది ఉన్నారు. ప్రజలు నదులు, నీరు ఉన్న చోట నివసించటానికే ఇష్టపడతారు. ఉత్తరంలో లిబియా ఎడారి, సహారా ఎడారులున్నాయి.
వైట్ నైల్ నది, ఆల్ అరబ్ నది, నాసర్ సరస్సులు సూడాన్ దక్షిణ భాగంలో ఉన్నాయి. గోధుమ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పుచ్చకాయలు, కర్రపెండలం, పెండలం, నువ్యులు, వేరుసెనగ, వరి, చెరకు, పొగాకు, జొన్నలు పండిస్తారు. జొన్న సూడాన్ ముఖ్య ఆహారపు పంట. మిర్చి, పొడుగుపింజ ప్రత్తి వ్యవసాయ ఉత్పత్తులు. జిగురు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. పశుపోషణ ప్రజలకు జీవనాధారం.
బంగారం, క్రోమైట్, ఇనుపరాయి, మాంగనీస్, మాగ్నైసైట్, రాగి, పెట్రలోల్ ఖనిజ నిక్షేపాలు. పంచదార, సిమెంట్, జవుళీ, పాదరక్షల పరిశ్రమలు ఉన్నాయి.

Swaziland

swaziland flag

Capital Mbabane ………. Language Swaji/English ………. Currency South African rand Swazi lilangeni ………. Calling Code + 268 ………. Religion Christian

స్వాజిల్యాండ్…

మూడు వైపులా దక్షిణ ఆఫ్రికా సరిహద్దులుగా ఉన్న స్వాజిల్యాండ్ రాజవంశీయుల పాలనలో ఉంది. నాలుగో వైపు తూర్పున మొజాంబిక్ దేశం కలదు. బ్రీటీష్ రక్షణలో ఉన్న ఈ దేశం 1968 సం.లో స్వాతంత్రం సాధించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 17,364 చ.కి.మీ. రాజధాని నగరం మ్బామేనే. వీరి అధికార భాష స్వాజీ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ South African Rand Swazi lilangen. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. అత్యధికులు క్రైస్తవ మతస్తులు. మిగిలిన వారు ఆదిమ జాతుల వారుHIV/AIDS ఈ దేశానికి ప్రధాన సమస్య. ఈ దేశంలో ప్రాధమిక విద్య ఉచితం. కానీ తప్పనిసరి కాదు. Incwala అనే సాంస్కృతిక ఉత్సవం ఈ దేశస్తులు జరుపుకునే ముఖ్యమైన పండగ. రాజుగారి గౌరవార్ధం మరియు పంటలు దిగుబడి వచ్చిన సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు.
చెరకు ప్రధానమైన పంట. మొక్కజొన్న, నారింజ జాతులు, కందమూలాలు, అపరాలు, ప్రత్తి పంటలను పండిస్తారు. కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు పెంచుతారు.కలప లభిస్తుంది. .
విలువైన వజ్రాలు. ఆస్బెస్టాస్ ఖనిజాలు లభిస్తాయి. ఇనుపరాయి ఎగుమతి చేస్తారు. కాగితం, రసాయినిక ద్రవ్యాలు, ఆహార పానీయాలు, కర్ర సామాగ్రి, ధాతు సామాగ్రి, జవుళీ మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.

Tanzania

tanzania flag

Capital Dodoma ………. Language None de jure ………. Currency Tanzanian shilling ………. Calling Code + 255 ………. Religion Christian/Muslim

టాంజానియా

ఆఫ్రికా ఖండంలో తూర్పువైపున ఉన్న దేశం టాంజానియా. కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి, కాంగో, జాంబియా, మలావి, మొజాంబిక్, హిందూ మహా సముద్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. టాంజానియా రాజధాని డొడోమా. విస్తీర్ణం 9,45,087 చదరపు కిలోమీటర్లు కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్ అధికారిక భాష స్వాహిలి. అయితే ఇంగ్లిష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు.
120కి పైగా ఆఫ్రికా తెగల వారు ఈ ఒక్కదేశంలోనే ఉంటారు. .
మూడొంతుల్లో ఒకవంతు క్రైస్తవ, మరో వంతు ముస్లిం మతస్థులు ఉన్నారు. మిగిలిన ఒక్కశాతంలో ఆఫ్రికన్ వారూ ఉన్నారు. సాధారణంగా చాలా దేశాల్లో నగరాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం 90శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు.
ఇక్కడి తీర ప్రాంత పట్టణం జంజిబర్ తూర్పు ఆసియా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. పూర్వం అరబ్బులు, పోర్చుగీసు వ్యాపారులు ఇక్కడి వారిని బానిసలుగా చేసుకుని వ్యాపారాలు చేసుకునేవారు.
1890 నుంచి బ్రిటన్ వాళ్లు జంజిబర్ని ఆక్రమించి పాలించడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాంజానియాలోని ప్రధాన భూభాగమైన టంగాన్యికా జర్మనీ అధీనంలో ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత 1964లో ఈ రెండు ప్రాంతాలు కలిసి స్వతంత్ర టాంజానియాగా ఏర్పడ్డాయి.
ఇక్కడ 30 శాతం భూమిలో జాతీయ12 పార్కులు , 38 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కలవు. రకరకాల అడవి మృగాలు ఇక్కడ దాదాపుగా నలభై లక్షలకు పైగా ఉన్నాయి. చదరపు కిలోమీటరుకు అత్యధిక సంఖ్యలో మృగాలున్న దేశాల్లో ఇది మొదటిది. ఎక్కువ సంఖ్యలో ఏనుగులున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి రువాహ్ నేషనల్ పార్కులో వీటి సంఖ్య అత్యధికం. ప్రపంచంలోనే అతి పెద్ద పీతల జాతైన కోకోనట్ క్రాబ్లు ఈ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.
టాంజానీయాలో లోని రెండు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పర్యాటక ప్రాంతాలు. అవి ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో మరియు Serengeti లాంటి జాతీయ పార్కులు. మనం క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడినట్లు వీరంతా ఫుట్బాల్, బాక్సింగ్, రగ్బీలను ఇష్టపడతారు.
వర్షాకాలం మొదలుకాగానే ఇక్కడి నుంచి 20 లక్షలకుపైగా వన్యమృగాలు కెన్యాకు వలస వెళతాయి. దీన్నే ‘ది గ్రేట్ మైగ్రేషన్’ అంటారు. చిరుతలు చెట్లెక్కడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి లేక్ మన్యారా నేషనల్ పార్కులో చెట్లెక్కే సింహాల జాతి ఉంది. ఇలాంటివి ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇవి పైకెక్కడమే కాదు అచ్చం కోతుల్లా అక్కడే నిద్రిస్తాయి.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపగా చెప్పుకునే మ్యాపింగో చెట్టు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సంగీత వాయిద్యాల తయారీలో ఎక్కువగా వాడతారు. అందుకే ‘మ్యూజిక్ ట్రీ ఆఫ్ ఆఫ్రికా’గా పిలుస్తారు.
ఈ ఖండంలో ఎక్కువ సరస్సులు ఉన్నది కూడా ఈ దేశంలోనే . వాటిల్లో లేక్ విక్టోరియా, లేక్ తాగన్యికా, లేక్ నైసా ప్రధానమైనవి. ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది ఈ దేశంగుండా ప్రవహిస్తుంది.
ఈ ఖండంలో దక్షిణాఫ్రికా, ఘనాల తర్వాత అధికంగా బంగారం ఉత్పత్తి చేసే మూడో దేశమిది. ప్రపంచంలోనే అతి పెద్ద అగ్ని పర్వత బిలం ఇక్కడ ఉంది. 19కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండే నగోరొంగోరో అగ్నిపర్వత బిలం 600 మీటర్ల లోతు ఉంటుంది.
ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో ఉన్నదిక్కడే. శిఖరం వరకూ ఇది 19,441 అడుగుల ఎత్తుంటుంది. ఇది 5,510కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దీని చుట్టూ చాలా రకాల నేలలు కనిపిస్తాయి. ఓవైపు పంటలు పండే భూమి, మరోవైపు వర్షాధార అడవులు, ఇంకోవైపు ఆల్ఫన్ ఎడారి. ఈ దేశంలో అత్యంత ఎత్తయిన ప్రాంతం కూడా దీని శిఖరమే.

Togo

togo flag

Capital Lomé ………. Language French ………. Currency West African CFA francWest African CFA franc ………. Calling Code + 228 ………. Religion Christian
పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం టోగో. ‘టోగో’ అంటే ఎవ్ భాషలో ‘నీటి మీద ఉన్న ఇల్లు’ అని అర్థం. ఈ దేశానికి పశ్చిమాన ఘనా, తూర్పులో బెనిన్, ఉత్తరాన బర్కిన ఫాసో దేశాలు ఉన్నాయి. అధికార భాష ఫ్రెంచ్తో పాటు ఎవ్, మిన, డగోంబ… మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా దేశంలో మాట్లాడతారు.
ఈ దేశ వైశాల్యం 56,785 sq km. వీరి అధికార భాష ఫ్రెంచ్. క్రిస్టియన్స్ మరియు మస్లింలు ఎక్కువగా ఉన్నారు. దేశీయమైన తెగలు వారు కూడా ఉన్నారు. వీరి కరెన్సీ CFA (Communaute Financiere Africaine) franc. పదకొండు, పదహారవ శతాబ్దాల మధ్యలో రకరకాల తెగల ప్రజలు టోగో భూభాగంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో బానిసల కొనుగోలు వ్యాపారానికి టోగో అతి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. 1884లో టోగోల్యాండ్ను తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ. ఎన్నో తెగల ప్రజలు నివసించే టోగోలో జనాభా పరంగా ‘ఎవ్’ తెగ ఆధిక్యత ఎక్కువ. దేశంలో 70 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆధారం.
జర్మనీ అధీనంలో ఉన్న టోగోల్యాండ్ ను ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు 1914లో ఆక్రమించుకున్నాయి. మూడింట ఒక వంతు బ్రిటిష్ వారి అధీనంలో, రెండు వంతులు ఫ్రాన్సు అధీనంలో ఉండిపోయింది టోగోల్యాండ్. ఫ్రాన్సు నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది టోగోల్యాండ్.
పరిపాలన పరంగా టోగోను 5 విభాగాలుగా విభజించారు. అవి 1. సవనెస్ 2. కర 3. సెంట్రల్ 4. ప్లెటక్స్ 5. మారిటైమ్.
ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన టోగోల్యాండ్కు తొలి అధ్యక్షుడు సిల్వెనస్ ఒలింపియో. 1963లో జరిగిన సైనిక తిరుగుబాటులో సిల్వెనస్ హత్యకు గురయ్యాడు. సాయుధ దళాల నాయకుడిగా గాసింబే అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ నిషేధించబడ్డాయి.
మూడు దశాబ్దాలకు పైగా తన నియంతృత్వంతో టోగోను పాలించాడు గాసింబే. ఈ నియంత మరణించిన తరువాత కొడుకు ఫారే గాసింబే దేశ అధ్యక్ష పదవిని చేపట్టాడు. రాజకీయ పార్టీల మీద ఉన్న నిషేధాన్ని తొలగించడం, ప్రజాస్వామ్య అనుకూల రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటి చర్యలు చేపట్టినా… దేశంలో నియంతృత్వం మాత్రం పోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో టోగో నియంతృత్వ పాలకులపై అంతర్జాతీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీలతో టోగోకు బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక విలువల మాట ఎలా ఉన్నా… రాజకీయ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగి… ఆఫ్రికాలోని ఒక పేదదేశంగా మాత్రమే ఉండిపోయింది టోగో. టోగోలో ఎన్నో చిన్న సరస్సులు ఉన్నాయి. వీటిలో పెద్ద సరస్సు పేరు టోగో. జాతీయ జెండాలోని పచ్చటి భాగాలు ఆశ, వ్యవసాయానికి సూచికలు.
ఫ్రెంచ్ అధీనంలోని ‘టోగోల్యాండ్’ 1960లో ‘టోగో’గా మారింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులు ఫాస్ఫేట్, కోకో, పత్తి.
రాజధాని లోమ్లో పెద్ద వూడూ మార్కెట్ ఉంది. ఫాస్ఫేట్ ఉత్పత్తిలో టోగో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది. దేశంలో ప్రసిద్ధ ఆట ఫుట్బాల్. యునెటైడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా… మొదలైన వాటిలో టోగోకు సభ్యత్వం ఉంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోల్చితే టోగో పర్యాటకరంగంలో ముందంజలో ఉంది.

Tunisia

tunisia flag

Capital Tunis ………. Language Arabic ………. Currency Tunisian dinar ………. Calling Code + 216 ………. Religion Muslims

టూనీజియా

టూనీజియా… ఉత్తర ఆఫ్రికా లోని ఒక చిన్న దేశం. అల్గేరియా, లిబియా దేశాలు, మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులు. ఫ్రాన్స్ నుంచి మార్చి 20, 1956లో ఈ దేశం స్వాతంత్య్రం పొందింది.
టూనీజియా రాజధాని టూనీస్ దేశ విస్తీర్ణం 1,63,610 చ. కిలోమీటర్లు. వీరి అధికార భాష అరబిక్. ప్రజలు ఫ్రెంచ్ భాష కూడా మాట్లాడుతారు. కరెన్సీ టూనీజియన్ దినార్. ఒక టూనీజియన్ దినార్ మన కరెన్సీలో దాదాపు 27 రూపాయలకు(2018) సమానం.ఈ దేశం ముస్లిం మతానికి చెందినది. ఈ దేశంలో ముస్లిం జనాభా ఎక్కువ.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఈ దేశంలోనూ కొంత భాగం విస్తరించి ఉంటుంది. పెట్రోలియం, గనులు, పర్యాటకం, వస్త్ర, పాదరక్షల పరిశ్రమలు అధికం. వేడి, పొడి వాతావరణం ఉంటుందిక్కడ.
ఇక్కడ మత్మాతా అనే ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ భూగర్భ ఇళ్లలో నివసిస్తున్నారు. వేడి, బలమైన ఎడారి గాలుల్నించి తప్పించుకోవడం కోసమే గుహల్లాంటి ఈ భూగర్భ ఇళ్లని నిర్మించుకున్నారట. ఈ ఇళ్లు 23 అడుగుల లోతు, 33 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రపంచం మొత్తంలో గుహల్లో నివసించే ట్రాగ్లోడైట్స్ జాతి ప్రజలు అత్యధికంగా ఉండేది ఇక్కడే.
ఈ దేశం పర్యాటక దేశం కూడా. అందమైన సముద్ర తీరాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడి అడవుల్లో జంతువులు ఎక్కువ. పులులు, సింహాలు, చిరుతపులులు, హైనాలు, జింకలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. స్టార్ వార్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ సినిమాల షూటింగ్లకు పెట్టింది పేరిది సిది బో సైద్ అనే పట్ణణం మంచి సందర్శక ప్రాంతం. ఇక్కడ కట్టడాలన్నీ నీలం, తెలుపు రంగులతో ఉంటాయి. ఈ దేశంలో ఓ మంచి ఆకర్షణ ‘రోజ్ ఆఫ్ ది సహారా డిజర్ట్’ అనే పువ్వు. ఉప్పు, ఇసుకతో ఎడారిలో తయారవుతుంది. అక్వేరియాల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు దీన్ని.
ఇక్కడి జాతీయ వంటకం ‘కాస్కాస్’. దీన్ని మాంసం, కూరగాయలతో చేస్తారు. టమాటా, షుగర్ బీట్, బాదం, ఆలివ్లు, ఖర్జూర పండ్లు ఎక్కువగా పండుతాయి.

Uganda

uganda flag

Capital Kampala ………. Language English/Swahili ………. Currency Ugandan shilling ………. Calling Code + 256 ………. Religion Christian

ఉగాండా

ఉగాండా అనే పేరు బుగాండా రాజ్యం పేరు మీదుగా వచ్చింది. 1962లో బ్రిటిష్‌ పరిపాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. ఉగాండా… తూర్పు ఆఫ్రికాలోని ఓ దేశం. ఉత్తరాన దక్షిణ సూడాన్‌, తూర్పున కెన్యా, దక్షిణాన టాంజానియా, పశ్చిమాన కాంగో దేశాలు దీనికి సరిహద్దులు. ఉగాండాను ‘ఆఫ్రికా ముత్యం’ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. చుట్టూ భూభాగాలతో ఉన్న దేశాల్లో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం.
ప్రజలు నీగ్రో వర్గానికి చెందినవారు. ఇక్కడ స్థానికంగా మాట్లాడే భాషల సంఖ్య 30 కన్నా ఎక్కువ. వీరి అధికార భాషలు ఇంగ్లీష్ మరియు స్వాహేలి. ఈ దేశంలో క్రిస్టియన్లు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ దేశ కరెన్సీ ఉగాండా షిల్లింగ్స్. దేశ రాజధాని కంపాలా. ఈ దేశ వైశాల్యం 241,038 sq km. యువజనాభా ఎక్కువున్న దేశాల్లో ఇదొకటి. జనాభా మొత్తంలో 70 శాతం మంది 25 సంవత్సరాల లోపున్నవారే. (2018)
ఈ దేశ జెండాలోని నలుపు, పసుపు, ఎరుపు రంగులు ఉగాండా ప్రజలకూ, సూర్యకాంతికీ, ప్రజల మధ్య ఉండే సోదరభావానికీ సూచికలు. ఈ దేశంలో ఎక్కడపడితే అక్కడ నడవడానికి వీలు ఉండదు. కొన్ని ప్రదేశాల్లో నడకకు అనుమతించరు. చాలా వూళ్లలో ప్రయాణికుల కోసం ‘బోడా బోడా’ అనే మోటార్‌ సైకిల్‌ టాక్సీలు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా దూసుకెళుతూ కొత్త వారిని చాలా భయపెట్టేలా ఉంటాయి.
ప్రపంచంలో అతి పొడవైన నైలు నది పుట్టింది ఈ దేశంలోనే. గొరిల్లాలకు ఈ దేశం పేరు పొందినది. ప్రపంచం మొత్తంలో ఉన్న 880 మౌంటెన్‌ గొరిల్లాల్లో సగం ఈ దేశంలోనే ఉన్నాయి.
ఉగండాలో జలవనరులు ఎక్కువ. వర్షం పుష్కలంగా కురుస్తుంది. వైట్ నైల్ నది, విక్టోరియయా సరస్సు,, ఆల్ బర్ట్ సరస్సు నీటివనరులు. ఉగాండా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. కర్రపెండలం, మొక్కజొన్న, జొనన, వరుశెనగ, కు, గగాకు, కాఫీ, అరటి, ప్రత్తి, బంగాళా దుంపలు, తేయాకు మొదలగునవి ఇక్కడ పండిస్తారు. పశుపోషణ కూడా ఎక్కువ. ఈ దేశ ప్రజలు చెట్లను ఎక్కువగా ఇష్టపడతారు. చెట్లను నరికివేస్తే, తప్పకుండా మూడు మొక్కలు నాటాల్సిందే. రకరకాల అరటిపండ్లు పండుతాయి. అనాస పండ్లకు ఈ దేశం ప్రసిద్ధి.
ఉగాండా మంచి పర్యాటక ప్రాంతం కూడా. ఏటా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పది లక్షలకుపైనే. ఇక్కడ ఆడవాళ్లు పొట్టి దుస్తులను వేసుకోవడం తప్పుగా భావిస్తారు. తీవ్రమైన ప్రయత్నాల వలన HIV/AIDS నుండి విజయం పొందిన దేశం ఉగాండా.

Zambia

zambia flag

Capital Lusaka ………. Language English ………. Currency Zambian kwacha ………. Calling Code + 260 ………. Religion Christian

జాంబియా

Zambia…..జాంబియా… దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశం.భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే దేశం. ఉత్తరం వైపున కాంగో, టాంజానియా, తూర్పున మలవి, మొజాంబిక్, జింబాబ్వే, బోట్స్ వానా, దక్షిణాన నమీబియా, పడమర అంగోలా దేశాలు కలిగి ఉన్నది.. జాంబేజీ నది ఈ దేశం గుండా ప్రవహించటం వలన ఈ దేశానికి జాంబియా అనే పేరు వచ్చింది. ఈ నది మీద నిర్మించిన కరీబా డాం ప్రపంచంలోని పెద్ద డాంలలో ఒకటి. ఇక్కడ జల విద్యుత్ కుడా ఉత్పత్తి జరుగుతుంది. కరీబా డాం జాంబియా, జింబాబ్వే ఉమ్మడి నిర్వహణలో ఉంది. రెండుదేశాలకు పంటనీటిని అందిస్తుంది. కాంగో నది, కపూయీ నది, లౌపులా నది మేట్వారు సరస్స ప్రధాన జలవనరులను అందిస్తాయి. 1964 కి ముందు ఈ దేశాన్ని ఉత్తర రొడేషియా అని పిలిచేవారు. 1964లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
జాంబియా రాజధాని లుసాకా…వీరి భాష ఆంగ్లం. కరెన్సీ…జాంబియన్ క్వాచా. స్థానిక భాషలు… బెంబ, . నియాంజ, లోజి, బోంగా, లుండా, లువలే, కవొండే అనేవి. ఈ దేశం క్రిస్టియన్ దేశం. క్రిస్టయన్ల తరువాత కొద్దిగా ముస్లింలు, హిందువులు, స్థానిక మతాల వారు ఉన్నారు. ఈ దేశ వైశాల్యం 752,614 sq kmజ. ప్రజలలో 70 శాతం మంది ఆదిమ తెగలకు చెందిన నీగ్రోలు. వీరు ఎనిమిది మాండలిక భాషలను మాట్లాడుతారు. జాంబియా విస్తీర్ణం7,52,614 చ.కి.మీ.
జాంబియా ప్రకృతి వింతలకు పేరు. వందలాది నదులు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన దేశం. ఈ దేశంలో వేటాడటం… చెట్లను నరకటం నిషిద్ధం. ఈ దేశంలో ఇనుము, రాగి గనులు ఎక్కువ. ఈ దేశంలో ఎక్కువమంది జనం పట్టణ ప్రాంతాలలోనే నివసిస్తారు.
అడవి జంతువులు ఎక్కువ… ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, హైనాలు, జీబ్రాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ప్రపంచంలతోనే అతి పెద్ద జలపాతంగా పేరుపొందిన విక్టోరియా జలపాతం ‘విక్టోరియా ఫాల్స్’ ఈ దేశంలోనే ఉంది. ఈ జలపాతం వెడల్పు 5,600 అడుగులు. రాగి ఖనిజం పుష్కలంగా లభించడం చేత ఈ దేశం సుసంపన్నమైంది.
పొగాకు, ప్రత్తి, మొక్కజొన్న, కర్రపెండలం, వేరుసెనగ, చిరుధాన్యాలు, చెరకు మొదలగు పంటలు పండిస్తారు. రాగి, సీసం, జింకు గనులున్నాయి. మాంగనీసు, కోబాల్టు, యురేనియం నిక్షేపాలు కూడా కలవు. కరీబా సరస్సు ప్రాంతంలో నేలబొగ్గు గనులు కలవు.
కపూయీ జాతీయ పార్క్ మంచి పర్యాటక ప్రాంతం.

Zimbabwe

zimbabwe flag

Capital Harare ………. Language 16 languages ………. Currency United States dollar ………. Calling Code + 263 ………. Religion Christian

జింబాబ్వే…

ఈ దేశం 1980 సంవత్సరంలో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. 2000 సంవత్సరం వరకు ఈ దేశం కరవుతో బాధపడింది. ఈ దేశ ప్రజలు కూడా ఆహారం లేక బాధపడ్డారు.
ఈ దేశ రాజధాని హరారే. దేశ వైశాల్యం 3,90,580 చ.కి.మీ. వీరి కరెన్సీ జింబాబ్వేనియన్ డాలర్. వీరి అధికార భాష ఇంగ్లీష్. Shona, Sindebele (the language of the Ndebele ఇతర భాషలు. ఈ దేశం క్రిస్టియన్ దేశం. .
మొక్కజొన్న, పత్తి, పొగాకు, గోధుమలు, కాఫీ, చెరకు, వేరుసెనగ వ్యవసాయ ఉత్పత్తులు. మేకలు, గొర్రెలు, పందులు పెంచుకుంటారు. .
బొగ్గు, క్రోమియం, బంగారం, నికెల్, రాగి, ఇనుప ఖనిజం, ప్లాటినం సహజ సంపదలు.

%d bloggers like this: