Asian Countries

 Afghanistan
afghanistan flag
Capital Kabul ………. Language - Pastho-dari ………. Currency - Afgani ………. 
Calling code + 93 ………. Religion Islam

అఫ్గానిస్థాన్....
ఆసియా ఖండం మధ్యలో ఉన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే. ఇరాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, తజికిస్థాన్, చైనా దేశాలు దీనికి సరిహద్దులు. అఫ్గానిస్థాన్లో తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. .అఫ్గానిస్థాన్ విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయిందీ. ఇప్పటికీ (2019) రాజకీయ కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. ఈ దేశస్థులు సంస్కృతికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇసుక నేలలు ఎక్కువ. .ఇక్కడి ప్రజల్లో 99 శాతం మంది ఇస్లాం మతస్థులే. 1919లో ఆగస్టు 19న బ్రిటన్ నుంచి ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. .
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ . ఈ దేశ విస్తీర్ణం 6,52,864 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు: పష్తూ, దారి (పర్షియన్) అఫ్గానిస్థాన్ కరెన్సీ అఫ్గానీ. ఈ దేశంలో 14 తెగలున్నాయి. తీవ్రంగా విద్యుత్తు కొరత ఉన్న దేశాల్లో ఇదీ ఒకటి. ఈ దేశంలో శుక్రవారం దుకాణాలకు, వ్యాపారాలకు సెలవు. .
అఫ్గానిస్థాన్ అంటే అఫ్గానుల ప్రదేశం అని అర్థమట. .
ఈ దేశ జాతీయ ఆట ‘బుజ్కెషి’. దీన్నే గోట్ గ్రాబింగ్ అని కూడా అంటారు. ఈ ఆట కాస్త ప్రమాదకరంగా ఉంటుంది. రెండు జట్లుగా ఉండే ఈ ఆటలో గుర్రపు సవారీ చేస్తూ మేకను పట్టుకోవాలి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆట ప్రాచుర్యంలో ఉంది. .
వాతావరణం : ఇక్కడ వేసవి కాలంలో చాలా వేడిగానూ... చలికాలంలో చాలా చల్లగానూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న భూకంపాలు తరచూ వస్తుంటాయి. పర్యావరణ మార్పుల వల్ల గడిచిన 20 ఏళ్లలో ఎక్కువ మొత్తంలో అడవులు నశించాయి.
దేశంలో కొత్త సంవత్సరాన్ని‘నౌరోజ్’ అంటారు. మార్చి 21న చేసుకుంటారీ వేడుక. ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకుంటారు. భారీ జెండాలను ఎగరవేస్తారు. .
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. వరి, జొన్న, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, గోధుమ, పుగాకు పండిస్తారు. సహజవాయువులు, చమురు ప్రధాన వనరులు. .
ఎక్కువగా పుచ్చకాయ, దానిమ్మ, ద్రాక్ష, ఖుబానీ (యాప్రికాట్) పండ్లను ఎగుమతి చేస్తుందీ దేశం. అఫ్గానిస్థాన్ రగ్గులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అక్షరాస్యత మగ వారిలో 52 శాతం, ఆడవారిలో 24 శాతం ఉందీ దేశంలో. .
ఇక్కడి ‘బమియన్’ గుహలు ఎంతో ప్రాచీనమైనవి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్స్కి నిలయమివి. ఈ పెయింటింగ్స్... క్రీస్తుపూర్వం 650 ఏళ్లనాటివి. ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహాలు ఇక్కడే ఉండేవి. ఈ బమియన్ బుద్ధ విగ్రహాలను తాలిబాన్లు 2001లో ధ్వంసం చేశారు.
మంచు చిరుత, ఎగిరే ఎర్ర ఉడత వంటి ప్రత్యేకమైన జీవుల్ని ఈ దేశంలో చూడవచ్చు.

 Armenia
armenia flag
Capital Yerevam ………. Language Armenian ………. Currency Dram ………. 
Calling Code + 374 ………. Religion Christian

అర్మేనియా

అర్మేనియా పూర్తిపేరు రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా. రాజధాని యెరెవన్. అధికార భాష ఆర్మేనియన్ కరెన్సీ డ్రామ్. అక్షరాస్యత 99 శాతం. నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం!
రాజధాని యెరెవన్లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది. ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి పేరు ఉంది.
ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అర్మేనియా జనాభా ప్రస్తుతం 30 (2019) లక్షలు కాగా, అందులో సగం నగరంలోనే నివసిస్తున్నారు. చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో నివసించే అర్మేనియన్ల సంఖ్య 80 లక్షలు. ఆది నుంచీ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో ఈ దేశం నుంచి ప్రజలు దఫదఫాలుగా వలస వెళ్లిపోయారు.
బైబిలు ప్రకారం- జలప్రళయం సమయంలో నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను నౌకలో ఉంచి రక్షించగా, ఆ నౌక అరారత్ కొండల్ని చేరిందని అర్మేనియన్లు నమ్ముతారు. అలా అప్పటినుంచీ అక్కడ నివసిస్తోన్న అర్మేనియన్లు ఓ ప్రత్యేక సంతతిగా గుర్తింపు పొందారు. ఆ దేశంలో 97 శాతం మంది అర్మేనియన్లే. మిగిలిన కొద్దిశాతంలో కుర్దులూ, రష్యన్లూ, ఉక్రెయినీలు ఉన్నారు. అందుకే ఒకే తెగకు చెందిన దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
అరారత్ పర్వతాల ఒడిలో ఉన్నట్లు ఉండే అర్మేనియా దేశానికి తీర ప్రాంతం లేదు. టర్కీ, జార్జియా, ఇరాన్, అజర్బైజాన్ దేశాల మధ్యలో ఉన్న ఈ దేశానికి అక్కడి పర్వత ప్రాంతాల్లో దొరికే రాగి, బంగారం, తగరం... వంటి ఖనిజాలే ప్రధాన ఆదాయ వనరులు. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, జాతీయ చిహ్నంగా ఉన్న అరారత్ పర్వతాలు ప్రస్తుతం టర్కీలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ అర్మేనియన్లు వాటినే తమ జాతీయ చిహ్నంగా భావిస్తారు.
లేక్ సెవాన్

లేక్ సెవాన్ మంచినీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 6,250 అడుగుల ఎత్తులో ఉన్న రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్ అమెరికాలోని టిటికాకా సరస్సు. ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్ నుంచి సెవాన్కి 80 కిలోమీటర్లు. దాదాపు రెండు గంటల ప్రయాణం. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండటంతో చల్లగా ఉంటుంది చలి, వర్షం, ఎండ... ఇలా వెంటవెంటనే వాతావరణం మారిపోతుంది. వేసవి జూన్ నుంచి సెప్టెంబర్. అప్పుడు కూడా ఉష్ణోగ్రతలు 22 - 36 డిగ్రీల సెల్సియస్కి మించవు.
గార్ని... ఓ పురాతన ఆలయం!

ఇది అర్మేనియా రాజుల వేసవి విడిది. అక్కడే క్రీ.పూ. నాటి అర్మేనియా దేవాలయం ఉంది. 2100 సంవత్సరాలనాటి ఆ నిర్మాణాన్ని చూడాలంటే మాత్రం 2 డాలర్ల రుసుము చెల్లించాలి. ఆ దేశంలో మిగిలిన ఏ సందర్శనీయ స్థలానికీ రుసుము లేదు, యునెస్కో గుర్తింపు ప్రదేశాలకు తప్ప. ఆలయం లోపల ఓ రాతిపీఠం మాత్రం ఉంది. ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. ఆ దేశంలో గ్రీకు, రోమన్ శైలిలో నిర్మించిన ఏకైక నిర్మాణం ఇది. దొరికిన ఆధారాల ప్రకారం క్రీ.పూ. 77వ సంవత్సరంలో నిర్మించారనేది ఓ అంచనా. అయితే ఇది ఆలయం కాదనీ కేవలం సమాధి మాత్రమే అన్న మరో చారిత్రక వాదన ఉంది. దీనికి పక్కనే నేలమాళిగలో రోమన్ పవిత్ర స్నానానికి సంబంధించిన గదులు ఉన్నాయి. గెగార్డ్ చర్చి

ఇందులో మూడు వేర్వేరు చర్చిలు ఉన్నాయి. చిత్రంగా ఇవన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. వెలుతురుకోసం వెంటిలేటర్లు నిర్మించబడ్డాయి. డ్రైనట్స్ని ఒకలాంటి హల్వాలో ముంచి తయారుచేసిన సుజుక్ అనే క్యాండీలని ఇక్కడ అమ్ముతారు. మంచి పోషకభరితమైన ఈ క్యాండీలని యుద్ధ సైనికులు వెంట తీసుకెళ్లేవారట
క్రీస్తు ప్రధాన శిష్యులైన దాడియస్, బొర్లోలోమేవ్ల ప్రభావంతో క్రీ.శ. 301 సంవత్సరంలోనే అర్మేనియన్లు క్రైస్తవమతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొదటి అధికారిక క్రైస్తవ మత దేశంగా ఇది గుర్తింపు పొందింది.

Azerbaijan
azarbaizan flag 
Capital Baku ………. Language Azerbaijani ………. Currency Azerbaijan Dinar  
Calling Code + 994 ………. Religion Islam
అజర్బైజాన్

అజర్బైజాన్ అధికార నామం ‘రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్’. రాజధాని ‘బకూ’. 95 శాతం మంది ముస్లింలు. అజర్బైజానీ భాషలో ఎన్నో మాండలికాలు ఉన్నాయి.
పాక్షికంగా తూర్పు యూరప్లోనూ, పశ్చిమ ఆసియాలోనూ ఉన్న దేశం అజర్బైజాన్. 1920లో సోవియెట్ యూనియన్లో విలీనమైన ఈ దేశం... సోవియెట్ పతనానికి ముందు 1991 ఆగస్ట్ 30న స్వతంత్రదేశంగా అవతరించింది. 95 శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్బైజాన్... ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యతలో ఉన్నత స్థానంలో ఉంది. ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాల్లో దీనిది రెండో స్థానం.
పురాతన అశ్వజాతికి చెందిన కారాబాక్ గుర్రం వేగానికి, ఆవేశానికి, సౌందర్యానికి పేరుగాంచింది. ఇది అజర్బైజాన్ జాతీయ జంతువు.
అధికార భాష అయిన అజర్బైజానీతో పాటు 12 వరకు స్థానిక భాషలు ఈ దేశంలో మాట్లాడతారు. జీవవైవిధ్యంలో అజర్బైజాన్ ముందు వరుసలో ఉంది. 106 జాతుల జంతువులు, 97 జాతుల చేపలు, 363 జాతుల పక్షులు ఈ దేశంలో ఉన్నాయి. బోలెడన్ని పురాతన నదులు, సరస్సులు ఉన్నాయి. ‘కురా’ ‘ఆరిస్’ నదులు అన్నిటికంటే ముఖ్యమైనవి.
ఆయిల్, గ్యాస్, బంగారం, ఇనుము, టైటానియం, మాంగనీస్... మొదలైన నిధులు ఉన్న సుసంపన్నమైన దేశం అజర్బైజాన్. దేశంలో 54 శాతం వ్యవసాయ భూములే. వాటిలో చెరకు, పత్తి, పొగాకు మొదలైనవి పండిస్తారు. పాల సంబంధిత, మద్య ఉత్పత్తులు ఈ దేశ ప్రధాన ఉత్పత్తులు. విలువైన వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే తయారుచేసుకునే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం(2019) జరుగుతున్నాయి.
అజర్బైజాన్ 1991లో స్వతంత్రదేశంగా అవతరించిన తరువాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇస్లామిక్ డెవెలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవెలప్మెంట్ బ్యాంకు మొదలైన వాటిలో సభ్యత్వం తీసుకుని ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
ఒకప్పుడు అజర్బైజాన్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేది. సోవియెట్ యూనియన్ పతనం, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో పర్యాటక రంగం దెబ్బతిని ఆకర్షణ కోల్పోయింది. 2000 సంవత్సరం నుంచి మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పర్యాటక ఆదాయం పెరిగింది. అందుకే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భౌగోళిక విశిష్టత, అసాధారణ ప్రకృతి సంపదకు తోడు కళ, చారిత్రక, సాంస్కృతిక సంపద కూడా ఈ అగ్నితేజ దేశానికి అరుదైన ఆభరణాలు
అజర్బైజాన్ రాజ్యాంగం ఏ మతాన్నీ ‘అధికార మతం’గా ప్రకటించలేదు. మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ అజర్బైజాన్ రాజధాని ‘బకూ’లో జన్మించారు. చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల అజర్బైజాన్కు ‘ద ల్యాండ్ ఆఫ్ ఫైర్’ అని పేరు.
రాజధాని ‘బకూ’కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గొబుస్తాన్ నేషనల్ పార్క్’లో వందలాది రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. దేశంలో నూతన సంవత్సర వేడుకలను ‘నౌరోజ్’ పేరుతో జరుపుకుంటారు.
పరిపాలనా సౌలభ్యం కోసం అజర్బైజాన్ను పది ‘ఎకనామిక్ రీజన్’లుగా విభజించారు. ‘కురా’ అనేది అజర్బైజాన్లో పొడవైన నది. అజర్బైజాన్ ప్రజల ప్రీతిపాత్రమైన పానీయం ‘టీ’.

Bahrain
bahrain flag 
Capital Manama ………. Language Arabic ………. Currency Bahraini Dinar
Calling Code + 973 ………. Religion Islam

బహ్రేన్

33 చిన్న చిన్న దీవులతో ఉన్న బహ్రేన్ అరేబియా సింధుశాఖలో ఉన్నది. రాజవంశీయుల పాలనలో ఉంది. 1971 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అనేక దీవుల సముదాయం బహ్రేన్. ఈ దీవులలో బహ్రేన్ పెద్దదీవి. ఈ దీవి పేరుతోనే ఈ దేశానికి బహ్రేన్ అనే పేరు వచ్చింది. బహ్రేన్ రాజధాని మనామా. వీరి అధికార భాష అరబ్బీ. విస్తీర్ణం 690 చ.కి.మీ. ప్రజలు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. ప్రజలలో అరబ్బులు 68 శాతం, పర్షియన్, ఇండియన్, పాకీస్తానీయులు 25 శాతం మంది ఉన్నారు. ప్రజలలో 85 శాతం మంది ముస్లింలే.
అపారంగా ఉన్న పెట్రోలు నిక్షేపాల వలన చమురు ఎగుమతులతో ఈ దేశం సుసంపన్నంగా మారింది.
ఖర్జూరం, పండ్లు, కూరగాయలు, వ్యవసాయోత్పులు. పశుపోషణ, కోళ్ల పెంపకం కూడా ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణం చాలా ఎక్కువ.

Bangladesh
bangladesh
Capital Dhaka ………. Language Bengali ………. Currency Taka 
Calling Code + 880 ………. Religion Islam
బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌... భారతదేశానికి పొరుగు దేశం. ఉత్తర, తూర్పు, పడమర దిక్కుల్లో భారత దేశ సరిహద్దుల్ని, ఆగ్నేయంలో మయన్మార్‌ దేశాలు ఉన్నాయు ఈ దేశానికి దక్షిణ దిశలో బంగాళాఖాతం ఉంటుంది.
బంగాలదేశ్ రాజధాని ఢాకా. దేశ విస్తీర్ణం: 1,47,610 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాష బెంగాలీ. వీరి కరెన్సీ: టాకా. 1947 సంవత్సరానికి ముందు ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ స్వతంత్రరాజ్యంగా లేదు. 1947 సం.లో భారతదేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. తరువాత పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్రదేశంగా అవతరించింది
ఈ దేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేశంలోని గ్రామాలకు, ఎరుపు రంగు వృత్తం స్వేచ్ఛకు గుర్తులు.
- పాఠకుల సంఖ్య జనాభాలో 15 శాతమే ఉన్నప్పటికీ ఇక్కడ 2,000 దినపత్రికలు, వార, మాసపత్రికలు ప్రచురితమవుతాయి.
- నాలుగు వేల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన నాగరికత ఇక్కడిది. కొన్ని అధ్యయనాల ప్రకారం రాతి యుగంలోనే క్రీస్తుపూర్వం 20వేల సంవత్సరాల క్రితమే నాగరికత అభివృద్ధి చెందిందని చెబుతారు.
- బంగ్లాదేశ్‌ అంటే కంట్రీ ఆఫ్‌ బెంగాల్‌ అని అర్థం.
సగానికి పైగా జనాభా వృత్తి వ్యవసాయమే. రాజధాని ఢాకా 1608 సంవత్సరంలో ఏర్పడింది. కోటీ డెబ్బై లక్షల జనాభాతో ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఒకటి. తీరం వెంబడి మాంగ్రూవ్‌ అడవులు ఎక్కువగా ఉంటాయి. స్వాతంత్య్రం పొందిన మార్చి 26ను జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దేశంలో భవన నిర్మాణానికి అవసరమైన రాయి లేదు. అందుకని ఇటుకల్నే ఎక్కువగా వాడుతారు. ఇటుక బట్టీలు దేశం పొడవునా విరివిగా ఉంటాయి. జనాభా పరంగా ప్రపంచంలో ఈ దేశం ఎనిమిదో స్థానంలో ఉంది. 200 ఎకరాల్లో నిర్మించిన ఇక్కడి జాతీయ పార్లమెంటరీ భవనం ఆ తరహా నిర్మాణాల్లో పెద్దది.
కబడ్డీ ఈ దేశ జాతీయ ఆట. మన జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్‌ ఠాగూరే ఈ బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాశారు. ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా సంభవిస్తాయిక్కడ. తరచూ తుపాన్లు, వరదలు వచ్చి ప్రాణ,ఆస్తి నష్టం కల్గజేస్తుంటాయి. ప్రపంచ ప్రఖ్యాత రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఈ దేశ జాతీయ జంతువు. ఈ పులి గాండ్రింపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందిట.
ఇక్కడి కాక్స్‌స్‌ బజార్‌లోని తీరానికి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా ఉన్న సముద్ర తీరంగా పేరు. ఇది 120 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. బంగ్లాదేశ్‌ జనాలు ఎప్పుడోగానీ నవ్వరు. అలా అనీ వీరు స్నేహంగా ఉండరని కాదు. ఎక్కువగా నవ్వితే పరిపక్వతలేని వారిగా భావిస్తారని వారి ఉద్దేశం. ఇక్కడి మహస్థన్‌గాహ్‌ అనేది బంగ్లాదేశ్‌ అతి పురాతమైన ప్రాచీన నగరం. ఈ దేశ కరెన్సీ టాకా. బెంగాలీలో కరెన్సీ అని దీనర్థం.
Bhutan
bhutan flag
Capital Thimphu ………. Language Dzwongkha ………. Currency Ngultrum Indian Rupe Calling Code + 975 ………. Religion Buddhisim
భూటాన్

భూటాన్ దక్షిణ ఆసియాలో ఒక చిన్నదేశం. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ, తూర్పు, పడమర దిశలలో భారతదేశం, ఉత్తరాన టిబెట్ సరిహద్దులుగా కలిగి ఉంది.
భూటాన్ రాజధాని థింపూ. దేశ విస్తీర్ణం 38, 394 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారక భాషలు జోంఖా మరియు ఇంగ్లీష్. వీటితో పాటు దేశం మొత్తం మీద 24 భాషలు మాట్లాడుతారు. వీరి కరెన్సీపేరు గల్ ట్రామ్. భూటాన్ లో విద్య, వైద్యం ఉచితం. పర్యాటకులకు కూడా వైద్యం ఉచితం. ఈ దేశంలో పొగాకు అమ్మకాలు నిషిద్ధం. వీరి అధికారిక మతం బౌధ్దం.
పర్యావరణ పరంగా భూటాన్ ను ప్రత్యేకం చెప్పుకోవాలి. దేశ వైశాల్యంలో 60 శాతం అడవులు కలిగి ఉండాలన్నది ఈ దేశ రాజ్యాంగ నిబంధంన మొక్కలను కానుకలుగా ఇవ్వటం వీరి ఆచారం.
ఈ దేశంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని ఇక్కడి చెట్లు పీల్చుకున్నా కూడా ఇంకా కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకునే శక్తి ఇక్కడి చెట్లకు ఉంది. అందుకే ఈ దేశాని కార్బన్ నెగెటివ్ దేశంగా పేర్కొంటారు.
భూటాన్లో స్థూల జాతీయ ఉత్పత్తి కన్నా ప్రజల ఆనందానికి ప్రాముఖ్యతనిస్తారు. ఏటా ప్రజల ఆనందాన్ని మాత్రమే లెక్కిస్తారు. అందుకే సంతోష సూచిక ఉంటుంది.దీనినే గ్రాస్ నేషనల్ హ్యాపినెస్ అంటారు.
భూటాన్ లో 1999 వరకూ టివీ, మరియు అంతర్జాలం నిషేధం.1974లో మొదటిసారిగా ఇతర దేశాల పర్యాటకులను అనుమతించటం జరిగింది. 1999 సం. నుండి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
భూటాన్ లో మాత్రమే తల మేక లాగా, శరీరం జడల బర్రెలాగా కనిపించే టకిన్ అనే జంతువు భూటాన్ జాతీయ జంతువు.

Brunei
brunai flag 
Capital Bandar Seri Begawan ………. Language Malay ………. Currency Brunei Dollar Calling Code + 673 ………. Religion Islam(Sunni)
బ్రూనై...

బ్రూనై... పసిఫిక్ మహా సముద్రంలో ఆసియా ఖండానికీ ఆస్ట్రేలియాకు మధ్య ఉన్న బోర్నియో అనే ద్వీపంలో ఉందీ దేశం. ఈ ద్వీపం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ద్వీపం. ఈ ద్వీపంలో బ్రూనైతో పాటు ఇండోనేషియా, మలేసియా దేశాలూ ఉన్నాయి.
బ్రూనై రాజధాని బందర్ సెరీ బగవాన్ జనాభా: 4,17,200 (2019)
బ్రూనై విస్తీర్ణం: 5,765 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాష: మలయ్. అధికార భాషతో పాటు స్థానికులు అధికంగా ఇంగ్లిష్, చైనీస్ కూడా మాట్లాడుతారిక్కడ. బ్రూనై కరెన్సీ బ్రూనై డాలర్
బ్రూనై జెండా….. పసుపు, నలుపు, తెలుపు చారల్లో ఉండే బ్రూనై జెండా మీద ఇస్లాం, రాజరికానికి సంబంధించిన గుర్తులుంటాయి.
ఇక్కడ ప్రధాన వనరులు పెట్రోలు, సహజ వాయువు. వీటి వల్ల వచ్చే సంపదతోనే ఈ దేశం ప్రపంచంలోని ధనిక దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. బ్రూనై సహజ వాయువులు, చమురు ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది.
ఈ దేశంలో చదువు, వైద్యం ఉచితం. స్కూలు నుంచి విశ్వవిద్యాలయాల్లో పెద్ద చదువుల వరకూ వర్తిస్తుందిది. వ్యక్తిగత ఆదాయ పన్నులూ ఉండవు ఇక్కడ. ఈ దేశంలో అక్షరాస్యత శాతం 92.7
దాదాపు 600 సంవత్సరాల నుంచి ఈ దేశం మీద సుల్తానులదే పెత్తనమంతా. ఒకే కుటుంబానికి చెందిన రాజవంశం పాలన సాగిస్తోంది. పార్లమెంటు ఉన్నా అధికారాలన్నీ సుల్తానువే!
ఈ దేశ సుల్తాన్ ప్రపంచంలోని ధనిక రాజుల్లో ఒకడు. ఈయన ఐదు వేలకు పైగా కార్లను సేకరించాడు.
ఇక్కడ సొంత వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరిలో ఒకరికి తప్పకుండా కారు ఉంటుందట.
14వ శతాబ్దం నుంచీ బ్రూనై.. సుల్తానుల పాలనలోనే ఉన్నా ఇతర రాజ్యాల దాడులు, దేశంలో అంతర్యుద్ధాల వల్ల నెమ్మదిగా బలహీన పడింది. ఇదే సమయంలో బ్రిటన్ 1846లో బ్రూనైని ఆక్రమించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రూనై నిధానంగా నిలదొక్కుకుంది. బ్రిటిష్ పాలనలో ఉంటూనే విద్య, వైద్యం లాంటి వసతులకి ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు బ్రూనై సుల్తానులు. చివరకు ఈ దేశానికి స్వాతంత్య్రం జనవరి 1, 1984లో వచ్చింది. కానీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఫిబ్రవరి 23న చేసుకుంటారు.
ఇక్కడ అడవుల్ని కాపాడ్డానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఇప్పటికీ ఈ దేశంలో 70 శాతానికి పైగా భూభాగంలో అడవులు నిక్షేపంగా ఉన్నాయి
ఈ దేశంలో ఆడవాళ్లు, మగవాళ్లు షేక్ హేండ్ ఇచ్చుకోరు.
బెలలాంగ్ ట్రీ ఫ్రాగ్ అనే ఓ వింత కప్ప ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ దేశంలో మాత్రమే ఉండే ప్రత్యేకమైన 35 రకాల మొక్కలూ ఉన్నాయి.
యురోపియన్ దేశాలు, అమెరికా, ఐస్ లాండ్, మలేసియా, న్యూజిలాండ్, నార్వే, యూఏఈ, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ వంటి కొన్ని దేశాల ప్రజలను వీసా లేకుండానే బ్రూనై అనుమతిస్తుంది.

Cambodia
combodia flag
Capital Phonam Penh ………. Language Khmer ………. Currency Riyal  
Calling Code + 855 ………. Religion Theravada Buddhism
కంపూచియా (కంబోడియా)

కంపూచియా లేక కంబోడియా ఆగ్నేయ ఆసియాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి పూర్వ నామం క్మేర్ రిపబ్లిక్, రాజధాని నామ్ పెన్. పూర్యం కాంభోజ రాజ్యం అనే పేరుతో కూడా పిలిచేవారు. కంపూచియా విస్తీర్ణం 18,035 చ.కి.మీ. వీరి అధికార భాష క్మెర్ (కంబోడియా భాష). వీరి కరెన్సీ రియాల్. రాజధాని నగరం నామ్ పెన్. పూర్వం హిందూ సామ్రాజ్యమైనా ప్రస్తుతం ఈ దేశంలో బౌద్దమతం ప్రచారంలో ఉంది. 90 శాతం మంది ప్రజలు హీనయాన బౌద్దశాఖకు(తెరవాడ బుద్ధిజం) చెందినవారే.
ఈ దేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రతో సంబంధం కలిగి ఉంది. పూనాన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండి క్రీ.శకం 7వ శతాబ్దం వరకు గొప్ప వైభవంతో వెలుగొందింది.
8వ శతాబ్ధం నుండి 14వ శతాబ్దం వరకూ భారతదేశంతో సత్సంబంధాలు కలిగి హిందూ బౌద్ద రాజ్యంగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో కంపూచియా రాజధాని అంగ్ కోర్ వాట్, ఆనాటి క్మెర్ చక్రవర్తులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగ్ కోర్ వాట్ దేవాలయం, వాస్తు శిల్పసంపద నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంగ్ కోర్ వాట్ దేవాలయంలో నిర్మించిన శిల్పాలలో భారతదేశ దేవతల రూపాలు గోచరిస్తాయి.
1100 సంవత్సరం నాటికి నేటి లావోస్, ధాయ్ లాండ్, వియత్నాంలు కంపూచియాలో భాగంగా ఉండేవి.
తరువాత కంపూచియా పతనమైనపుడు రాజధానినిని నామ్ పెన్ కు తరలించారు.
19 వ శతాబ్దంలో కంపూచియాను ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్నారు. ద్వితీయ ప్రపంచ యుద్దం తరువాత 1953వ సం.లో ఫ్రెంచ్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
మికాంక్ నది కంపూచియాకు ప్రధాన జలవనరులను అందిస్తుంది. భూమి కూడా సారవంతమైనది. వరి, రబ్బరు, సోయా చిక్కుడు ప్రధానమైన పంటలు. పశుసంపద కూడా ఎక్కువే.
సిమెంట్, కాగితం, పైవుడ్, జవుళీ, మత్యపరిశ్రమలు ముఖ్యమైనవి.

China
china flag
Capital Beijing ………. Language Chineses ………. Currency Renminbi 
Calling Code + 86 ………. Religion Multi Religions
చైనా

తూర్పు ఆసియాలో చైనా పెద్ద దేశం. కెనడా మాత్రమే ఆసియాలో చైనా కంటే పెద్ద దేశం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఇదే. br/> చైనా విస్తీర్ణం 95,72,900 చ.కి.మీ. చైనా రాజధాని బీజింగ్. వీరి అధికార భాష మాండలిన్. జనాభా మొత్తంలో 70శాతం మంది మాండరిన్‌ భాష మాట్లాడుతారు. కరెన్సీ.... చైనీస్‌ యువాన్‌ చైనా ప్రజలు మంగోలాయిడ్ వర్గానికి చెందిన వారు. ప్రజలు కన్ ఫ్యూషియస్, బౌద్ధ, టావో బోధనలను పాటిస్తారు. మత ప్రచారం చైనాలో నిషిద్ధం. .
క్రీ.పూర్వం 1500 సంవత్సరం నుండి చైనాకు చరిత్ర ఉంది. అప్పట్లో షాంగ్ వంశీయులు పాలించేవారు. క్రీ.పూర్వం 202-220 సం. మద్య హాన్ రాజవంశీయుల పాలనలో చైనా శక్తివంతమైన దేశంగా రూపొందింది. క్రీ.శ 7వ శతాబ్దంలో చైనీయులు ముద్రణా పద్దతిని కనిపెట్టారు. వీరి కాలం నాటి చీనా యాత్రికుడు ఇత్సింగ్ భారతదేశానికి వచ్చాడు. తరువాత చైనాను సుంగ్ రాజవంశం, యాన్ రాజవంశం, మింగ్ రాజవంశం వారు పరిపాలించారు. ఇంత పెద్ద దేశం కూడా బ్రిటీష్ వారి ఆక్రమణకు గురైంది. 1912 సం.లో చైనా స్వతంత్ర దేశం ఐనది.
వీరి జెండాలో ఎరుపు రంగు కమ్యూనిస్ట్‌ విప్లవానికి సూచిక ఇక్కడి ప్రజల సంప్రదాయ రంగు కూడా. పెద్ద నక్షత్రం కమ్యూనిజానికి గుర్తు. నాలుగు చిన్న నక్షత్రాకారాలు సామాజిక తరగతులను సూచిస్తాయి. చైనీయులు ఎరుపు రంగును సంతోషానికి గుర్తుగా భావిస్తారు. అందుకే రకరకాల పండగల్లోనే కాదూ... ప్రత్యేక సందర్భాల్లో, వివాహం లాంటి వేడుకల్లోనూ ఉపయోగిస్తారు ఎరుపు రంగును ఉపయోగిస్తారు. 1928 సం.లో ఛాంగ-కై-షేక్ చైనాలోని అన్ని ప్రాంతాలను ఏకం చేసాడు. 1946-49 సంవత్సరాల మద్యకాలంలో మావో నాయకత్వంలో అంతర్యుద్ధం జరిగి నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది. 1949 సం.లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన తరువాత చౌ ఎన్ లై ప్రధాని కావటం జరిగింది. అప్పటి నుండి చైనా కమ్యునిస్ట్ దేశమే. .
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ మనకు తెలిసిందే
గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా పేరు పొందిన ఈ గోడ చైనాలోనే ఉంది. ఈ గోడ హాన్ రాజవంశీయుల కాలంలో నిర్మించబడింది. . దాదాపు 2600 ఏళ్ల నాటి నిర్మాణమిది. ఏటా ఇక్కడికి ఐదు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు. హుయాంగ్ హై. యాంగీట్జూ, గ్రాండ్ కెనాల్ నదులు జలాధారాలు. ఇంకా సియాంగ్ నది, చాలా సరస్సులు చైనాకు నీటి వనరులను అందిస్తున్నాయి. గోబీ ఎడారి చైనా ఉత్తర భాగంలో ఉన్నది.
చైనాలో వ్యవసాయ ఉత్పత్తులలో వరి పంట ప్రధానమైనది. తరువాత గోధుమ, సోయా చిక్కుడు, పొగాకు, చెరకు, చిరు ధాన్యాలు, వేరుసెనగ, మొక్కజొన్నలను పండిస్తారు. గొర్రెలను, పందులను పెంచుతారు. పశువుల పెంపకం తక్కువగా ఉంది. మత్స్య సంపద ఎక్కువ.
టాయిలెట్‌ పేపర్‌, మనకెంతో ఇష్టమైన గాలిపటాలు పుట్టింది చైనాలోనే. చైనాలో విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడితే ఏడేళ్ల శిక్ష విధిస్తారు. 2009 వరకు చైనాలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వాడటం నిషిద్ధం. ప్రపంచంలోని 70 శాతం ఆట బొమ్మలు తయారయ్యేది ఇక్కడే. ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది చైనా. దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది.
అతి ఎత్తయిన భవంతులు ఎక్కువగా ఉండటమే కాదు.. చైనాలో ప్రతి ఐదు రోజులకు సగటున ఓ ఆకాశహర్మ్యం లేస్తోంది. ప్రపంచంలోనే పురాతన, పొడవైన కాలువ ‘చైనా గ్రాండ్‌ కెనాల్‌’. దీని పొడవు 1,794 కిలోమీటర్లు. చైనాలో పెద్దవారి కోసం ప్రత్యేక చట్టం ఉంది. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే శిక్షలు పడతాయ్‌!
కొన్ని పెద్ద దేశాల్లో టైమ్‌ జోన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ పెద్ద దేశమైన చైనాలో మాత్రం ఒక్కటే ‘బీజింగ్‌ స్టాండర్డ్‌ టైమ్‌ జోన్‌’ ఉంది. అంటే ఈ దేశమంతా ఒకే సమయం ఉంటుంది. అందువల్లే ఇక్కడి పడమర రాష్ట్రాల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
దాదాపు 1400 సంవత్సరాల క్రితం డబ్బుగా కాగితపు నోట్లని మొదటిసారిగా వాడింది చైనాలోనే.
సముద్ర ప్రయాణాల్లో ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌), మొట్ట మొదటి ముద్రణాయంత్రం, వూగే వంతెనలు, తుపాకీ మందు, ముడుచుకునే గొడుగుల్ని తయారు చేసింది కూడా చైనీయులే. దాదాపు 1400 సంవత్సరాల క్రితం. సంఖ్యాపరంగా ప్రపంచంలోని మొత్తం పందుల్లో సగం చైనాలోనే ఉన్నాయి. చైనాలో కొంత మంది పోలీసులు కుక్కలకు బదులు పెద్ద బాతుల్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కుక్కల్లానే వీటికి దొంగల్ని గుర్తించే శక్తి ఉందట. ప్రపంచంలో ఉన్న పాండాలన్నీ ఇక్కడివే. దాదాపు 1400 సంవత్సరాల క్రితం. నేల బొగ్గు, ఇనుపరాయి, తగరం, సీసం వంటి ఖనిజాలు లభ్యమవుతాయి. అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కువ. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశం చైనా. అన్ని రకాల యంత్రసామాగ్రి, ఆటబొమ్మలు, మొబైల్స్, ప్లాస్టిక్ బొమ్మల ఎగుమతితో ప్రపంచాన్ని ముంచెత్తుతుంది.

Cyprus
cyprus flag
Capital Nicosia ………. Language Greek/Turkish     Currency Euro  
Calling Code + 357 ………. Religion Greek Orthodox

సైప్రస్

ఆసియా, ఆఫ్రికాకి, యూరప్ ఖండాలకు చాలా సమీపంలో ఉన్న స్వతంత్ర దేశం సైప్రస్. మధ్యధరా సముద్రానికి తూర్పు వైపున ఉంది. క్రీ.పూర్వం 7000 ఏళ్లనాటి నుండే ఈ దేశంలో నాగరికత వర్థిల్లినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇంత వైభవం కల దేశం కూడా 1960 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశాన్ని గ్రీక్ భాషలో ‘కైప్రియారీ డెమోక్రటిక్’ అని పిలుస్తారు. సైప్రస్ లో కొంత భూభాగం టర్కీ ఆక్రమణలో ఉంది. సైప్రస్ విస్తీర్ణం 5,896 చ.కి. మాత్రమే.. రాజధాని నగరం నికోసియా. వీరి అధికార భాషలు గ్రీక్, టర్కిష్. పైప్రస్ ప్రజలంతా గ్రీక్ జాతికి చెందినవారే. వీరు గ్రీక్ ఆర్తడాక్స్ క్రైస్తవ మతాన్ని పాటిస్తారు.
ఓహియారి జోస్, సెరికిస్, పెడియోస్ నదులు మరియు కౌకియా సరస్సులు సైప్రస్ కు ప్రధాన నీటివనరులు. గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు, గ్రేప్ ఫ్రూట్స్, ద్రాక్ష, గజనిమ్మ, నారింజ మొదలగునవి వ్యవసాయ ఉత్పత్తులు.
రాగి ఇనుపరాయి, జిప్సమ్, ఆస్బెస్టాస్, ఈ దేశం అని ఖనిజ సంపదలు.
సిమెంట్, ద్రాక్షా సారాయి, జవుళీ, పాదరక్షలు, దుస్తులు, కలప సామాగ్రి, ఆలివ్ నూనె, సమెంట్ సైప్రస్ లోని ముఖ్యమైన పరిశ్రమలు. ప్రాచీన నాగరికత చెందిన శల్పాలు, కళాఖండాలు ఎక్కువగా ఉన్న దేశం సైప్రస్. ఈ దేశం పర్యాటకంగా కూడా పేరు పొందింది.

Georgia
georgia flag
Capital Tbilisi ………. Language Georgian ………. Currency Georgian Lori 
Calling Code + 995 ………. Religion Georgean Orthodox

జార్జియా

జార్జియా 1991 సం. ఏప్రియల్ లో సోవియట్ రష్యా నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. జార్జియా రాజధాని Tbilisi ఈ దేశ వైశాల్యం 69,700 చ.కి. వీరి భాష జార్జియన్. ఈ దేశ కరెన్సీ జార్జియన్ లోరీలు. ప్రజలు జార్జియన్ ఆర్ధడెక్స్ (సాంప్రదాయ క్రిస్టియన్ మతం) మతాన్ని అనుసరిస్తారు.
జార్జియా దేశానికి రష్యా, టర్కీ, ఆర్మేనియా, అజర్ బైజాన్ లు సరిహద్దు దేశాలు. జార్జియా పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది. పర్యాటక పరంగా గణనీయమైన ఆదాయం ఈ దేశానికి వస్తుంది. ఈ దేశంలో 2000 మినరల్ జలప్రవాహాలు, సాంస్కృతిక, చారిత్రాత్మక కట్టడాలు వేలసంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఖుటసిలోని బగ్రాటి కేథడ్రల్, గెలాటీ త్సఖేతరీ, స్వనేటి చారిత్రాత్మక స్మారక చిహ్నాలు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపబడ్డాయి.
జార్జియా దేశంలో చిన్నపిల్లలకు ప్రాధమిక విద్య తప్పనిసరి. జార్జియాలో టీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. పొగాకు, పంచదార దుంపలు పండిస్తారు.
India
india flag
Capital Delhi ………. Language Hindi/Telugu/ Tamil/Malayam/ Punjabi… 
Currency Indian Rupees Calling Code + 91 Religion Hindu/Muslim/ christian/Sikh
భారతదేశం

భారత దేశం ఆసియాలోని పెద్ద దేశాలలో ఒకటి నూటఇరవై కోట్లకు పైగాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. (మొదటిది చైనా) వైశాల్యములో ప్రపంచంలో ఏడవది.
ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరియు అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటి. భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం. భారతదేశ కరెన్సీ రూపాయలు. భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఒరియా ఇంకా అనేక భాషలు మాట్లాడుతారు. దేశంలో గుర్తించ బడిన భాషలు 22. ఇంకా గుర్తింపు లేని అనేక భాషలు కలవు. హిందూ, సిక్, ముస్లిం, క్రిస్టియన్ ఇంకా అనేక మతాల వారు ఐకమత్యంతో నివసిస్తున్నారు.
భారతదేశం అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం. ఇండియా రాజధాని ఢిల్లీ. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక ఫెడరల్ రాజ్యాంగ గణతంత్రం.
దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉన్న దేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులు కలవు. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం, ఉత్తరదిశలో హిమాలయ పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది
పురాతన నాగరికతలకు పుట్టిల్లు. అనేక వేల సంవత్సరాల చరిత్ర కల దేశం. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కుమతాలకు భారత దేశమే జన్మస్ధానం.
ఇంత పెద్ద దేశంలో రాజుల మధ్య ఐకమత్యం లేక పోవటం వలన గజనీ, ఘోరీ, అలగ్జాండర్, తురుష్కల దండయాత్రలకు గురై నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రంతో పాటు అపార సంపద కొల్లగొట్టబడినది. తరువాత రాజులలో ఐకమత్యం లేక పోవటం వలన ఇంత పెద్ద దేశాన్ని కూడా 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమంగా ఆక్రమించటం వలన భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 1857 సం. సిపాయిల తిరుగుబాటు తరువాత 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15 వ తేదీన ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి .భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు ప్రపంచంలో అతిపెద్ద సైన్యం కలిగి ఉన్న మూడవ దేశం.
భారత దేశ జాతీయ పతాకము త్రివర్ణ పతాకము. జాతీయ చిహ్నం మూడు తలల సింహపు బొమ్మ. జాతీయ గీతం జనగణమన.... జాతీయ గేయం వందేమాతరం....
ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వరి, గోధుమ, పొగాకు, ప్రత్తి, అపరాలు, చిరుధాన్యాలు, చెరకు, పొద్దు తిరుగుడు గింజలు, వేరుశెనగ, కాఫీ, తేయాకు ముఖ్యమైన పంటలు. పాడి పరిశ్రమ, పశువుల పెంపకం కూడా ఎక్కువగా ఉంది. గంగ, గోదావరి, యమున, కావేరి, కృష్ణ ఇంకా అనేక జీవనదులు మరియు చిన్న చిన్న నదులు కలవు. అపారమైన జలరాశులున్న సరస్సులు చెరువులు కలవు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇంకా అనేక చారిత్రాత్మక నిర్మాణాలు కలవు. ప్రపంచలోనే పేరు పొందిన జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్ వంటి వారికి జన్మనిచ్చిన దేశం.
ఆద్యాత్మికంగా కూడా పేరు పొందినది భారతదేశం. వేదాలు, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఆవిర్భవించిన దేశం. బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఆవిర్భవించిన దేశం కూడా.
రమణ మహర్షి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఆదిశంకరాచార్యులు మొదలగు ఆధ్యాత్మిక గురువులకు జన్మస్థానం భారతదేశం. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం, నెమలి సింహానం భారతదేశానికి చెందినవే. భారత దేశం మంచి పర్యాటక దేశం కూడా. ప్రకృతి దృశ్వాలతో, లోయలతో, పచ్చదనంతో ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. భారత దేశం పర్యాటక పరంగా కూడా పేరుపొందిన దేశం.

Indonesia
indonesia flag
Capital Jakartha  Language Indonesian/Javanese/Malay 
Currency Indonesian Rupiah  Calling Code + 62 ………. Religion Islam

ఇండోనేషియా... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు. హిందూ, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉన్నది.
ఇండోనేషియా రాజధాని జకార్తా. దేశ విస్తీర్ణం 19,04,569 చదరపు కిలోమీటర్లు. ఇక్కడి అధికార భాష ఇండోనేషియన్ ఐనప్పటికీ ఇక్కడి ప్రజలు దాదాపు 600 భాషలు, మాండలికాల్లో మాట్లాడుతారు. ఈ దేశ కరెన్సీ రుపయా
వీరి జెండాలోని ఎరుపు రంగు మనిషి రక్తానికి, తెలుపు రంగు ఆత్మకు గుర్తులు.
ఈ దేశం ఎన్నో అరుదైన జీవజాతులకు నిలయం. 2010లో ఇక్కడ 200 రకాల కొత్త జీవుల్ని గుర్తించారు. జవన్‌ రైనో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
ప్రపంచంలో రెండో అతి పెద్ద తీర ప్రాంతం ఉండేది ఈ దేశానికే. ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని ‘గ్రాస్‌బెర్గ్‌’ ఇక్కడిదే. మూడో అతి పెద్ద రాగి గని కూడా ఈ దేశంలోనే ఉంది.
జీవవైవిధ్యంలో రెండో స్థానంలో ఉందది. అతి పెద్ద బల్లి జాతికి చెందిన ‘కొమడో డ్రాగన్‌’ ఈ దేశ జాతీయ జంతువు. ఈ దేశంలో సగభాగం అడవులతో నిండి ఉంటుంది.
ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లీసియా ఆర్నాల్డి’ని ఇక్కడ చూడొచ్చు. ఈ పూల రేకులు ఒకటిన్నర అడుగుల పొడవు, అంగుళం మందంతో ఉంటాయి.
తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగే పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’లో ఈ దేశమూ ఓ భాగం. మొత్తం 400 అగ్ని పర్వతాలుంటే వాటిలో 150 క్రియాశీలకమైనవి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదకర అగ్నిపర్వతాల్లో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.
ఇక్కడ ఓ ప్రత్యేకమైన అగ్నిపర్వతం ఉంటుంది. దీని నుంచి వచ్చే అగ్నిజ్వాలలు నీలం రంగులో ఉంటాయి.. అతి పెద్ద బుద్ధుడి గుడి ‘బొరొబుడుర్‌’ ఉన్నది ఇక్కడే. 504 బుద్ధుని విగ్రహాలతో ఉంటుందీ ఆలయం.
తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనాలు జరిగే ఫసిఫిక్ కు చెందిన ’రింగ్ ఆఫ్ ఫైర్‘ ప్రాంతంలో ఈ దేశం కూడా ఒకభాగమే. మొత్తం 400 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో 150 పర్వతాలు క్రియాశీలకమైనవి అంటే పేలటానికి ఆస్కారమున్నవి. ప్రపంచంలోని ఇలాంటి అగ్నిపర్వతాలలో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.
అతి పెద్ద గుడి ‘బోరోబుడుర్ ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేవాలయంలో 504 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.
ఇండోనేషియాలో వ్యభిచారాన్ని గౌరవం, నైతికతలకు భంగం కలిగించే నేరంగా పరిగణిస్తారు. అయినా సరే, ఇండోనేషియా సెక్స్ టూరిజంలో ముందుండటం గమనార్హం. ఈ వ్యభిచారాలకు ఆన్ లైన్ సోషల్ మీడియాలే వేదికలు. ఈ దేశంలో కూడా మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు. అయితే, ఇక్కడి చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించలేక చేతులెత్తేశాయి.

Iran
iran flag
Capital Tehran ………. Language Persian ………. Currency Riyal 
Calling Code + 98 ………. Religion Islam
ఇరాన్

ఇరాన్ దేశాన్ని పూర్వకాలంలో పర్షియా అని పిలిచేవారు. అస్సీరియా నాగరికత వర్ధిల్లిన దేశం. పారసీక భాషలో ఇరాన్ ను కేష్వారే షా ఇన్ షాయే అంటారు. రాజుల ప్రభుత్య పాలన సాగుతుంది. వీరి అధికార భాష పారసీకం. ఈ దేశ విస్తీర్ణం 16,43,503 చ.కి.మీ. ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇది ముస్లిం దేశం. షియా ముస్లింలు 83 శాతం మంది ఉన్నారు. ఫాట్ ఆల్ అరబ్ నది దీని ఉపనదులు కారూన్, సెఫిడ్, అత్రైక్ నదులు జలవనరులు. పెట్రోల్ ఖుజిస్తాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది.
బార్లీ, గోధుమ, నల్లమందు, తేయాకు, పొగాకు, మొక్కజొన్న, ట్రగాకాంత్ జిగుర్లు, ఖర్జూరం మొదలైనవి పండిస్తారు. .
నేలబొగ్గు, ఆర్సనిక్, రాగి, ఇనుము, పెట్రోల్, గంధకం ఖనిజ సంపదలు. తివీచీ నేత, సిమెంట్, సిగరెట్, పట్టు, జవుళీ పరిశ్రమలు ఉన్నాయి. .
భారతదేశాన్ని మొగలాయిలు పాలిస్తున్న చివరి దశలో ఇరాన్ రాజు నాదిర్షా భారతదేశంలోని ఢిల్లీ, లాహోర్ పట్టణాల మీద దురాక్రమణ చేసి అపార ధనరాసులను, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని దోచుకుపోయాడు.
Iraq
iraq flag
Capital Baghdad ………. Language Arabic/Kurdish ………. Currency Iraqi Dinar 
Calling Code + 964 ………. Religion Islam
ఇరాక్

పర్షియన్ సింధుశాఖ ముఖ ద్వారంలోని స్వతంత్ర దేశం. ఇది అరబ్ దేశం. అరబ్బీలో ఇరాక్ ను ఆల్-జు-మ్హూరియా ఆల్ – ఇరాఖియా అంటారు. యాఫ్రటీస్ నదీ లోయలలో క్రీ.పూర్వం 3000 సంవత్సరాల క్రితం వెలసిన బాబిలోనియా, అస్సీరియా, సుమేరు నాగరికతలతో వర్థిల్లిన దేశం. ఈ దేశాన్నే పూర్వకాలంలో మెసపొటేమియా అని అంటారు.
ఈ దేశ విస్తీర్ణం 4,38,317 చ.కి.మీ. రాజధాని బాగ్దాద్. వీరి అధికార భాష అరబ్బీ మరియు కుర్దిష్. ఈ దేశం ముస్లిం దేశం. ముస్లింలలో షియా తెగల వారు 54 శాతం, సున్నీలు 42 శాతం మంది ఉన్నారు. వీరి కరెన్సీ ఇరాకీ దీనార్ లు.
టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు ఈ దేశంలో ప్రవహిస్తున్నాయి. బార్లీ, వరి, చిరుధాన్యాలు, గోధుమ, ప్రత్తి, ఖర్జూరాలు, పొగాకు ఈ దేశంలో పండుతాయి. ఉన్ని, నూలు బట్టల పరిశ్రమలు ఉన్నాయి. పెట్రోలు లభిస్తుంది.

Israel
israel flag
Capital Jerusalem ………. Language Hebru/Arabic ………. Currency New Shekel 
Calling Code + 972 ………. Religion Jewish(Yuudu)/ Muslim
ఇజ్రాయెల్

ఈ దేశానికి ప్రాచీన చరిత్ర లేదు. ప్రపంచంలో చెల్లా చెదురుగా ఉన్న యూదులంతా కలసి 1948 సం.లో ఈ ప్రాంతానికి చేరి ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. బైబిల్ నాటి పాలస్తీనా యూదుల రాజ్యం కానీ పలు దాడులకు గురై యూదులు చెల్లాచెదురై ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోయారు. మతద్వేషానికి కూడా గురైయ్యారు. 1800 సంవత్సరం నుండి తమ జన్మభూమికై పోరాటం సాగించి చివరకు 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ ను ఏర్పరచుకొని స్వతంత్ర ప్రతిపత్తిని సాధించగలిగారు.
వీరికి దేశభక్తి, జాతీయ భావం ఎక్కువ. దీనితోనే ఈ దేశ పౌరులంతా కష్టించి పనిచేసి తమ దేశపు ఆర్ధిక స్థాయిని పెంచుకోవటం జరిగింది. దీనితో ఈ ప్రపంచంలోనే అత్యధిక జీవన ప్రమాణాలను అందుకోగలిగారు.
ఈ దేశ విస్తీర్ణం 20, 700 కి.మీ. దేశ రాజధాని జెరుసలేం. ఇజ్రయెల్ లోని ఇతర ప్రధాన పట్టణాలు టెల్ అవీస్, యఫో, హైఫా, హోలాన్, బట్ యామ్. ఇజ్రాయెల్ లో అధికార భాష హిబ్రూ..అరబిక్. వీరి కరెన్సీ న్యూ షెకెల్. ప్రజలలో యూదు మతస్థులు ఎక్కువ. ముస్లిం మతస్థులు కొద్ది శాతం మంది ఉన్నారు.
మృతసముద్రం ఇజ్రయెల్ లోనే ఉంది. ఈ దేశంలో నీటి ఎద్దడి ఎక్కువ. కానీ వీరు శాస్త్రవిజ్ఞానంతో సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీరుగా మార్చి నారింజ జాతి పండ్లను పండించి ఎగుమతి చేస్తున్నారు.
పాడిపరిశ్రమ పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రలు ఎక్కువ. జవుళీ. వజ్రాలు , రాగి, ఖనిజం, మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.

Japan
japan flag
Capital Tokyo ………. Language Japanese ………. Currency Japanese Yen ………. 
Calling Code + 81 ………. Religion
జపాన్

తూర్పు ఆసియాలో ద్వీపరాజ్యం జపాన్. ఫసిఫిక్ మహా సముద్రంలో ఉన్నది. జపాన్ రాజధాని టోక్యో. వీరి అధికార భాష జపనీస్. ఈ దేశ కరెన్సీ జపనీస్ యెన్ లు. ఈ దేశ వైశాల్యం 3,77,815 చ.కి.మీ. జపాన్ ప్రజలు మంగోలాయిడ్ వర్గానికి చెందినవారు. షింటో బౌద్ధ మతం, జెన్ బుద్ధిజం, టావూ మతాలను వీరు అనుసరిస్తారు
జపాన అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రెండవ ప్రపంచయుద్ధం, హీరోషిమా, నాగసాకీలు. రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికా ఈ రెండు నగరాలపై హైడ్రోజన్ బాంబులు ప్రయోగించటం వలన ఈ రెండు నగరాలు సర్వనాశనమైనవి. నాటి దారుణ సంఘటనలను నేడు కూడా చూడవచ్చు. రెండవ ప్రపంచం యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న జపాన్ కేవలం 50 సంవత్సరాల వ్యవధిలో ఆర్దికంగా, పారిశ్రామికంగా పురోగతి సాధించింది
13 వ శతాబ్ధంలో కుబ్లయ్ ఖాన్ సామ్రాజ్యంలో జపాన్ అంతర్భాగంగా ఉండటం వలన జపాన్ గురించి మార్కోపోలో వ్రాతల ద్వారా యూరోపియన్లకు తెలిసింది.
జపాన్ హూన్షూ, హూకియాడో, క్యూషియాడో, ఝికాకో అనే నాగులు దీవులు కలిపిన దేశం. జపాన్ లో భూకంపాలు ఎక్కువ. ఏడాదికి షుమారు 15,000 సార్లు భూమి కంపిస్తూ ఉంటుంది.1964 సం.లో పెద్ద భూకంపం వచ్చి షుమారు 1,40,000 మంది చనిపోయారు.
టోక్యో, యోకాహామా, ఒసాకా, నాగోయా, సపోరా, క్యోటూ, ఫూకౌకా, కవసాకి, హీరోషిమా, కీటా, క్యూషూ లు పెద్ద నగరాలు.
జపాన్ లో రైతాంగం అభివృద్ధి చెందినది. వరి ప్రధానమైన పంట. ఇంకా బార్లీ, పోగాకు, తేయాకు, బార్లీ, క్యాబేజి, బంగాళాదుంపలు, ముల్లంగి, సోయా చిక్కుళ్లు ఇతర వ్యవసాయ ఉత్పుత్తులు.
పారిశ్రామికంగా అభవృద్ధి చెందిన దేశం. ఎలక్ర్టానిక్ పరికరాలు, కార్లు, కంప్యూటర్స్ తయారీలో ముందంజలో ఉన్నది.

Jordan
joardan flag
Capital Amman ………. Language Arabic ………. Currency Jordianian Dinan ………. 
Calling Code + 962 ………. Religion Islam
జోర్డాన్

ఇజ్రాయేల్ కు పొరుగు దేఁశమైన జోర్డాన్ ఆసియాలో రాచరిక పాలనలో ఉన్న స్వతంత్ర దేశం.. మానవుని పుట్టుకకు ఆదిమ సాథనం జోర్డాన్ అంటారు. జోర్డాన నదీ పశ్చామ తీరాన జ్యూడ్, ఇజ్రాయేల్ దేశాలు ఉన్నాయి.
ఈ దేశ విస్తీర్ణం 89,206 చ.కి.మ. రాజధాని అమ్మాన్. అధికార భాష అరబ్బీ. వీరి కరెన్సీ జోర్డియన్ దీనార్ లు. జోర్డాన్ ముస్లిం దేశం. ప్రజలు సున్నీ శాఖ ముస్లింలు.
చాల్డియన్ లు, ఈజిఫ్షియన్ లు, ఫిలిస్టీన్, అస్సరీయన్ లు సర్షియన్ లు దాడులు జరిపి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు. అలెగ్జాండర్ కూడా క్రీ.పూర్యం 332 లో ఈ దేశాన్ని జయించాడు.
జోర్డాన్ లో ఏడారి భాగం ఎక్కువ. పశ్చిమ జోర్డాన్ లోని నది లోయ ప్రాంతం సారవంతమైనది. గోధుమ, బార్లీ, నారింజ జాతులు, చిక్కడు ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు గొర్రెల పెంపకం, మేకల పెంపకం కూడా సాగిస్తున్నారు.
పొటాష్, ఫాస్పేట్ ఖనిజాలు ప్రధానమైన ఎగుమతులు. ఈ దేశం పర్యాటక దేశం కావటంతో విదేశీ ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తుంది.

Kazakhstan
kazakistan flag
Capital Astana ………. Language Kazak/Turkey ………. Currency Tenj ………. 
Calling Code + 7 ………. Religion Islam/Christian
కజకిస్తాన్

1991 సంవత్సరానికి ముందు కజకిస్తాన్ అఖంఢ రష్యాలో ఒక భాగం. 1991సం.లో రష్యా విచ్ఛినం అయిన తరువాత చివరిగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న దేశం.
ఈ దేశ రాజధాని ఆస్తానా. వీరి భాషలు కజక్ మరియు టర్కీ రష్యన్ భాష కూడా ఇక్కడి ప్రజలు మాట్లాడుతారు. ఈ దేశ కరెన్సీ టుంజ్ లు. 76 శాతం మంది ముస్లింలు 24 శాతం మంది క్రిస్టియన్ లు ఈ దేశంలో ఉన్నారు. .
రష్యా, కిర్గిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు చైనాలు కజకిస్తాన్ కు సరిహద్దు దేశాలు. .
బార్లీ, పత్తి, గోధుమలు, వరి పండిస్తారు. పశుపోషణ కూడా కలదు. యూరేనియమ్, క్రోం, లీడ్, రాగి, మాంగనీస్, బొగ్గు, మొదలగు ఖనిజ సంపదలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ మరియు సహజవాయువు పుష్కలంగా లభిస్తాయి. పెంపుడు జంతువుల మాంసం, రోట్టెలు, బ్లాక్ టీ, పాలు వీరికి ఇష్టమైన ఆహారాలు.

Kuwait
kuwait flag
Capital Kuwait City ………. Language Arabic ………. Currency Kuwait Dinar 
Calling Code + 965 ………. Religion Islam
కువైట్

కువైట్ పశ్చమ ఆసియాలోని ఒక చిన్న దేశం. 17,820 చదరపు కిలీమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నది. కువైట్ అరబిక్ దేశం. ఈ అరబిక్ దేశం మొత్తం 9 దీవుల సముదాయం. రాజధాని కువైట్ నగరం. వీరి భాష అరబ్బీ. వీరి కరెన్సీ పేరు కువైటీ దీనార్స్. ఇవి వివిధ దేశాల కరెన్సీ కన్నా చాలా విలువైనవి. ఒక కువైట్ దీనార్ దాదాపు 211 భారతదేశపు రూపాయలకు సమానం (2017 మారకపువిలువ ప్రకారం). పెట్రోల్ నిల్వలు అపారంగా ఉన్న సంపన్న దేశం.
కువైట్ కు ఉత్తర, పశ్చిమ దిశలలో ఇరాక్ దేశం మరియు దక్షిణ దిశలో సౌదీ అరేబియా దేశాలున్నాయి.
కువైట్ లో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. అంతే కాదు అత్యధిక ఉష్ణోగ్రత గల దేశం. జూన్ మరియు ఆగష్ట్ నెలలో వేడి విపరీతంగా ఉంటుంది. దాదాపు 50 సెల్సియస్ డిగ్రీలు దాటుతుంది. సంవత్సరమంతా ఇసుక తుఫానులు వస్తుంటాయి.
కువైట్ 1961 సంవత్సరంలో బ్రిటన్ నుండి స్వాతంత్ర్వం పొందింది. వీరి ప్రధాన ఆదాయం ఇంధన వనరుల ద్వారా వస్తుంది. ప్రపంచదేశాలలో వాడే పెట్రోలియం 20 శాతం ఇక్కడి నుండే వస్తుంది.
కువైట్ లో మంచినీటి లభ్యత లేదు. మంచినీటి సరస్సులు, వనరులు కానీ లేవు. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరుచేసి తాగటానికి, అవసరాలకు వాడుకుంటారు. కొంతమేర మంచినీటిని ఇతరదేశాలనుండి దిగుమతి చేసుకుంటారు.
కువైట్ ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటి. కువైట్ ఆర్థికంగా బలమైన దేశం కనుక ఇతర దేశాల నుండి పనుల కోసం విదేశీయులు ఎక్కువగా వెళుతుంటారు.
ఈ దేశ జాతీయ పక్షి ఫాల్కన్. కువైట్ కరెన్సీ నోట్లపై. స్టాంపులపై ఫాల్కన్ బొమ్మ కనిపిస్తుంది.

Kyrgyzstan
kyrgistan flag
Capital Biskek ………. Language Russian Kyrgy ………. Currency Arab Soam 
Calling Code + 996 ………. Religion Islam
కిర్గిజిస్తాన్

కిర్గిజిస్తాన్ 1991 సంవత్సరానికి ముందు సోవియట్ రష్యాలోని ఒక ప్రాంతం. 1991 లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తరువాత బిష్కేక్ రాజధానిగా స్వతంత్ర దేశంగా అవతరించింది. వీరి అధికార భాషలు కిర్గిజ్ మరియు రష్యా భాషలు. వీరి కరెన్సీ అరబ్ సోమ్. ఈ దేశ వైశాల్యం 1,99,900 చ.కి.మీ. దేశంలో కిర్గీజీలు, రష్యన్లు అధికశాతంలో ఉన్నారు. 80 శాతం మంది ప్రజలు ముస్లింలే.
కొండలు పర్వతాలు ఈ దేశం చుట్టూ ఉన్నాయి. కిర్గజ్ అంటే వీరి భాషలో 40 తెగలని అర్థం. ఈ నలభై తెగలకు గుర్తుగా వీరి జాతీయ పతాకంపై నలభై సూర్యకిరణాలు కనిపిస్తాయి.
ఈ దేశంలో చెప్పుకో దగిన బంగారపు నిల్వలు కలవు. ఇంకా బొగ్గు, యురేనియం, అంటిమోని ఖనిజాలు కూడా లభిస్తాయి.
గోధుమ, చెరకు, బంగాళాదుంపలు, ప్రత్తి, పొగాకు, కూరగాయలు పండిస్తారు. వ్యవసాయం మీద ఎక్కువమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. పశువుల పెంపకం, పాడి పరిశ్రమ కూడా చెప్పుకోదగిన స్థాయులో ఉన్నాయి. కిర్గిజిస్తాన్ పర్యాటక దేశం కూడా.

Laos

Capital Vientiane ………. Language ………. Currency KIP ………. 
Calling Code + 856 ………. Religion Therewada Buddhisim
లావోస్

ఆగ్నేయ ఆసియాలో పర్వతాలతో నిండిన దేశం లావోస్.ఈ దేశాన్ని లావు పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని కూడా పిలుస్తారు. ఈ దేశానికి దక్షిణాన ధాయ్ లాండ్, కంపూచియా, తూర్పున వియత్నాం, పశ్చిమాన. ఉత్తరాన మయన్మార్ దేశాలున్నాయి.
లావోస్ విస్తీర్ణం2,36,800 కి.మీ. రాజధాని వియెంటినే. వీరి భాష లావు. వీరి కరెన్సీ కిప్. ఆదిమ భాషలు కూడా మాట్లాడుతారు. బౌద్ద మతస్తులు 58 శాతం మంది ఉన్నారు. ఆదిమ జాతుల మతాలు పాటించేవారు 34 శాతం ఉన్నారు.
మీకాంగ్ నదీలోయ ప్రాంతం సారవంతమైనది. వరి ప్రధానమైన పంట. మొక్కజొన్న. చెరకు, పొగాకు, కాఫీ, తేయాకు, నారింజ పంటలు పండిస్తారు. కర్రపెండలం, అనాస, ఉల్లి, ఏలకులు, మెంజాయిన్ ఓషధి, చింకోనా, నల్లమందు వీటిని పండించి ఎగుమతి చేస్తారు.
పశువుల పెంపకం, పట్టు పరిశ్రమ, షెల్లాక్, తోలు పరిశ్రమ, మట్టిపాత్రల పరిశ్రమలు ఉన్నాయి. జిప్సమ్, రాతి ఉప్పు, తగరం, జింకు ఖనిజ నిక్షేపాలు దొరకుతాయి. టేకు కలప కూడా లభిస్తుంది. లావోస్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం.

Lebanon
lebonan flag
Capital Beirut ………. Language Arabic ………. Currency Lebenese Lira ………. 
Calling Code + 961 ………. Religion Islam
లెబనాన్

ఫశ్చిమ ఆసియాలో మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న స్వతంత్ర దేశం లెబనాన్. వైభవోపేతమైన చరిత్ర కలిగిన దేశం. ఫోనీషియన్ ల పాలనలో ఈ దేశం అత్యంత వైభవంగా వెలిగింది. లెబనాన్ కు ఉత్తరాన సిరియా, దక్షిణాన ఇజ్రాయేల్ కలవు.
లెబనాన్ వైశాల్యం 10230, చ.కి.మీ. రాజధాని బీరూట్. వీరి అధికార భాష అరబ్బీ. దీని తరువాత ఫ్రెంచ్, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ లెబనీస్ లీరాలు. ప్రజలలో షియా ముస్లింలు 32 శాతం మంది, సున్నీ మతస్తులు 21 శాతం మంది. క్రైస్తవులు 41 శాతం మంది ఉన్నారు. ఈ దేశమంతా కొండలతో నిండి ఉంది. .
లితాని నది, ఒరెంటీస్ నది ముఖ్యమైన నదులు. ఇవి మధ్యధరా సముద్రంలో కలుస్తాయి. .
బార్లీ, మొక్కజొన్న, గోధుమ, ఆలివ్, పుచ్చ, దోస, ద్రాక్ష, యాపిల్, అరటి, నిమ్మ, నారింజ జాతుల పండ్లను పండిస్తారు. ఉప్పు, జిప్సమ్ ఆహార పదార్ధాలు, సిమెంట్, తోలు, జవుళీ ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు. కలప కూడా లభిస్తుంది. మత్స్య పరిశ్రమ కూడా ఉంది. పర్యాటకం వలన కూడా దేశానికి ఆదాయం లభిస్తుంది.

Malaysia
malasia
Capital Kaulalumpur ………. Language Bahasa Malaysia ………. Currency Ringgit ………Calling Code + 60 ………. Religion Islam/Buddhism
మలేషియా

మలేషియా ఆగ్నేయ ఆసియాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. రాజవంశీయులచే రాజ్యంగానికి లోబడి పరిపాలిస్తున్న దేశం మలేషియా. 13 రాష్ట్రాలు ఉన్న ఫెడరల్ రాజ్యం. 1957 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
మలేషియా విస్తీర్ణం 3,30,442 చ.కి.మీ. మలేషియా రాజధాని కౌలాలంపూర్. వీరి అధికార భాష మలేషియా (మలే). ప్రజలలో ఎక్కువ మంది మలే జాతీయులు తరువాత చైనీయులు, భారతీయులు కూడా ఉన్నారు. తెలుగు వారు కూడా మలేషియా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.
కౌలాలంపూర్, జార్జ్ టౌన్, పోర్ట్ స్వెట్టిన్ హామ్ ప్రధాన రేవు పట్టణాలు. ఇసో, పెనాంగ్, జోహూర్ బహారు, పెట్లాంగ జియా ఇతర ముఖ్య పట్టణాలు. కినాబా టెన్గన్, రాజాంగ్ నదులు ప్రధానమైన నదులు.
ప్రపంచంలో ఎక్కువగా రబ్బరు పండించే దేశం మలేషియా. కొబ్బరి పామ్, మిరియాలు, అనాసపండ్లు, వరి ముఖ్యమైన పంటలు. కలప పుష్కలంగా లభిస్తుంది.
బాక్సైట్, ఇనుపరాయి, తగరం ముఖ్యమైన ఖనిజ సంపదలు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా. మలేషియా పర్యాటక కేంద్రం కూడా.

Maldives
maldives flag
Capital Male ………. Language Divehi ………. Currency Rufiyaa 
Calling Code + 960 ………. Religion Islam
మాల్ దీవులు

భారతదేశానికి నైరుతీ దిశలో మరియు శ్రీలంకకు పశ్చిమాన ఉన్న చాలా చిన్న స్వతంత్ర ద్వీప దేశం మాల్ దీవులు. 2000 లకు పైగా ఉన్న ఈ పగడపు దీవులలో మాలే దీవి, హువేవీ దీవి, విల్లింగ్లీ దీవి కొంచెం పెద్దవి. కేవలం 21 దీవులలో మాత్రమే జనం ఉన్నారు.
మాల్దీవుల వైశాల్యం 298 చ.కి. మీ. రాజధాని మాలే. వీరి అధికార భాష దివేహీ. వీరి కరెన్సీ రుపయా ప్రజలు సున్నీ ఇస్లాం మతస్తులు.దీవులన్నీ 15 చ.కి.మీటర్లకు మించిలేవు.
ఉప్పునీటి కయ్యలు, తెల్ల ఇసుక తీరాలు ఎక్కువ. కొబ్బరి చెట్లు, పండ్ల చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. జలాధారాలు లేవు, వర్షాధారపు పంటలు మాత్రమే పండిస్తారు.
కొబ్బరి, అనాస, దానిమ్మ, బొప్పాయి, బ్రెడ్ ఫ్రూట్ దుంప జాతులను ఇక్కడ పండిస్తారు.
మత్స్య పరిశ్రమ ప్రజలకు ముఖ్యమైన జీవనాధారం.
పెద్ద పెద్ద పడవలలో చేపల వేట సాగిస్తారు. బొనిటో, టూనా వంటి చేపలను పట్టుకొని ఎండబెట్టి ఎగుమతి చేస్తారు. శ్రీలంకకు ఎక్కువగా ఎగుమతులుంటాయి.
పీచు పరిశ్రమ, క్వారీ గనులు. లక్కసామానులు, చాపలు మొదలగు వాటిని కుటీరపరిశ్రమలలో రూపొందిస్తారు. వరిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు.

Mongolia
mangolia flag
Capital Ulambatar ………. Language Mangolian ………. Currency Tagrag 
Calling Code + 976 ………. Religion Buddhisim/Islam
మంగోలియా

మంగోలియా... తూర్పు ఆసియాలో ఉంది. ఈ దేశ సరిహద్దుల్లో సముద్రతీరం లేదు. అన్ని వైపులా భూభాగాన్ని కలిగి ఉంటుంది. దక్షిణాన చైనా, ఉత్తరాన రష్యా దేశాలు ఈ దేశానికి సరిహద్దులు. అన్నివైపులా భూభాగమే కలిగిన దేశాల్లో ఇది రెండో అతిపెద్ద దేశం.
మంగోలియా రాజధాని ఉలాన్‌ బాటర్‌. ఈ దేశ విస్తీర్ణం 15,66,000 చదరపు కిలోమీటర్లు. వీరి భాష మంగోలియన్‌. దీనిని అవుటర్ మంగోలియా అని పిలుస్తుంటారు ఈ దేశ కరెన్సీ టోగ్రోగ్‌ .
వీరి జెండాలో నీలం రంగు ఆకాశానికి గుర్తు. ఎరుపు రంగు కఠిన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనే మంగోలియన్ల అభివృద్ధికి సూచిక. ఇక్కడ ఏడాదిలో 250 రోజులు సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్‌ బ్లూ స్కై, ల్యాండ్‌ ఆఫ్‌ ది ఎటెర్నల్‌ బ్లూ స్కై అని పిలుస్తుంటారు.
ఈ దేశ జనాభా చాలా తక్కువ. జన సాంద్రత ఒక చదరపు మైలుకు కేవలం నలుగురు మాత్రమే. దేశ జనాభాలో 45 శాతం రాజధాని ఉలాన్‌ బాటర్‌లోనే నివసిస్తున్నారు. ఈ దేశంలో దాదాపు 30 శాతం జనాభా సంచార జాతులే. ప్రపంచంలో సంచార జాతులు ఇంకా మిగిలి ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ప్రజలంతా మంగోలాయిడ్ వర్గానికి చెందినవారు. బౌద్ద మతంలో లామాయిజమ్ అనే శాఖను ప్రజలు అనుసరిస్తారు.
ఓ సిద్ధాంతం ప్రకారం మనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీం మొదటిసారిగా తయారైంది ఈ దేశంలోనే. మంగోలియాకు చెందిన ఓ గుర్రపు రౌతు ఓసారి జంతువుల పేగులతో తయారుచేసిన పాత్రల్లో క్రీం వేసుకుని గోబీ ఎడారి గుండా ప్రయాణం మొదలుపెట్టాడట. గుర్రం పరుగులకు ఆ క్రీం అటూ ఇటూ కదులుతూ శీతల వాతావరణంలో పూర్తిగా గడ్డకట్టిపోయింది. అలా అనుకోకుండా ఐస్‌క్రీం తయారైంది. ఆ పద్ధతే దేశదేశాల్లోకి పాకిపోయిందిట.
రెండు మూపురాలుండే అరుదైన ఒంటెలు ఈ దేశంలో ఉంటాయి.
ఇక్కడ నివసించే మనుషుల కన్నా గుర్రాల సంఖ్య 13 రెట్లు ఎక్కువ. గొర్రెలేమో ఒక మనిషికి 35 చొప్పున ఉంటాయి. ఆసియాలోనే అతి పెద్దది, ప్రపంచ ఎడారుల్లో ఐదో స్థానంలో ఉన్న గోబీ ఎడారి ఉండేది ఈ దేశంలోనే. ఇక్కడ టీ లేదా పాలతో తయారుచేసిన ఆహార పదార్థాల్ని ఇస్తే నిరాకరించడం అగౌరవంగా భావిస్తారు.
ప్రపంచంలోనే పురాతనమైన జాతీయ పార్కు మంగోలియాలోనే ఉంది.
ప్రపంచంలో పేరుపొందిన అత్యంత క్రూరుడు, యోధుడుగా పేరు పొందిన చెంగీజ్ ఘాన్, కుబ్లయ్ ఖాన్ లు పరిపాలించిన దేశం మంగోలియా. కానీ చెంఘీజ్ ఘాన్ మంగోలియాలోని అనేక జాతులను ఏక తాటిపై నిలిపి అనేక దేశాలను జయించాడు.1924 సం.లో కమ్యూనిస్ట్ రాజ్యంగా మారింది. ఈ దేశం అత్యంత శీతల ప్రాంతం.
డైనోసార్‌ గుడ్లను మొదటిసారి కనిపెట్టిన రాయ్‌ చాప్‌మన్‌ ఆండ్రూస్‌ అనే వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే.
చైనా గోడను ఆరో శతాబ్దంలో ఇన్నర్‌ మంగోలియాలోనే నిర్మించారు.
మంగోలియా అంతా ఎత్తైన ప్రదేశం. గోబీ ఎడారి ప్రక్కనే ఉండటం వలన సారవంతమైన భూమి కాదు. అల్టాయా పర్వత శ్రేణిలోని పీఠభూమి ప్రాంతం ఈ దేశం. ఈ దేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. యన్స్ సరస్సు పెద్దది. తూర్పు మంగోలియా అంతా పచ్చిక బయలు ప్రాంతం. .
పశువుల పెంపకం మీద ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పశువుల పెంపకం జరగుతుంది. గొర్రెల పెంపకం ఎక్కువ. గుర్రాలు, ఒంటెలు, ఆవులు కూడా పశువుల పెంపకంలో ఉన్నాయి. .
ఉన్ని పరిశ్రమ ఎక్కువ. ఆహార ధాన్యాలు, బంగాళాదుంపలు ప్రధానమైన పంటలు .
నేలబొగ్గు, ఫ్లోర్ స్పార్, తగరం, టంగ్ స్టన్, రాగి, బంగారం, ఇనుపరాయి, పెట్రోల్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. 

Myanmar (Burma)
myanmar flag
Capital Naypydaw ………. Language Burmees ………. Currency Kat 
Calling Code + 95 ………. Religion Therawada Busshisim
మయన్మార్

మయన్మార్ అగ్నేయాసియా దేశలలో ఒకటి. ఈ దేశ పూర్వ నామం బర్మా. ఈ దేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్ మరియు ధాయ్ లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. అడ్డంకులు లేని బంగాళా ఖాతం మరియు అండమాన్ సముద్రతీరాలు ఉన్నాయి. మయన్మార్ లో ప్యూ మరియు మాన్ నాగరికతలు ప్రాచీన నాగరికతలలో కొన్ని. ఈ దేశ రాజధాని Naypyidaw. అధికార భాష బర్మీస్. వీరి కరెన్సీ క్యాట్. తెరవాడ బుద్ధిజం ఈ దేశంలో ప్రధాన మతం. బర్మాలో బామర్ ప్రజల మాతృభాష మరియు అధికార బర్మీస్ భాష దేశమంతా విస్తరించి గౌరవాదరణ పొంది ఉంది. ఈ దేశంలో విద్య తప్పనిసరి. మాధ్యమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తారు.
బ్రిటిష్ పాలనలో దేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థగా ఉన్న మయన్నార్ దేశంలో పాలనా పరమైన మార్పులు వచ్చాయి. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశంలో సంభవించిన అంతర్యుద్ధాల కారణంగా బర్మాదేశం అతి దీర్ఘకాలం అంతర్యుద్ధాలు ఎదుర్కొన్న దేశంగా చరిత్రలో పేరు పొందింది. 1962- 2011 వరకూ దేశం సైనిక పాలనలోనే ఉంది. 2010లో సారస్వతిక ఎన్నికలను నిర్వహించిన తరువాత 2011లో రద్దు చేయబడి ప్రజాపాలన స్థాపించ బడింది. .
బర్మా అధిక వనరులు ఉన్న దేశం. అయినప్పటికీ 1962లో జరిగిన ఆర్థిక సంస్కరణల అనంతరం ఆర్థికంగా స్వల్పంగా అభివృద్ధి చెందిన బర్మాదేశం.

Nepal
nepal flag
Capital Khatmand ………. Language Nepali ………. Currency Nepali Rupees 
Calling Code + 977 ………. Religion Hindu/Buddhisims
నేపాల్

ఇండియాకు చైనాకు మధ్య ఉన్న హిమాలయ పర్వతాలలో ఉన్న చిన్న దేశం నేపాల్. నేపాల్ రాజవంశీయుల పాలనలో ఉంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఘుర్కా జాతి వారు.
నేపాల్ విస్తీర్ణం 1,47,181 చ.కి.మీ. నేపాల్ రాజధాని ఘాట్మాండ్. వీరి అధికార భాష నేపాలీ. వీరి కరెన్సీ నేపాల్ రూపాయలు. ఒకప్పుడు నేపాల్ ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యంగా ఉండేది. హిందూ మతస్తులు 89 శాతం మంది. బౌద్ద మతస్తులు 5 శాతం మంది నేపాల్ లో ఉన్నారు.
నేపాల్ అటవీ సంపదకు పేరు పొందినది. పర్వత సానువులలోనూ , దక్షిణ మైదానాలలోనూ వ్యవసాయం చేసి వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, నూనె గింజలు పండిస్తారు. పశువుల పెంపకం కూడా ఎక్కువే.
సున్నపు రాయి, మాగ్నపైట్, టాల్క్, గార్నెట్, ఖనిజాలు లభిస్తాయి.
ఈ దేశం నుండి ఓషదులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం నేపాల్ లోనే ఉంది. నేపాల్ పర్యాటక దేశం కూడా.

North Korea
morth korea flag
Capital Pyongyang Korean ………. Language Korean ………. Currency North Koren WON ……Calling Code + 850 ………. Religion Buddhisim
ఉత్తర కొరియా

ఉత్తర కొరియా విస్తీర్ణం 1,21,400 చ.కి.మీ. రాజధాని యాంగ్ యాంగ్. అధికార భాష కొరియన్. 700 కి.మి. పొడవైన యూలూ నది ఈ దేశ ప్రత్యేకం. వీరి కరెన్సీ నార్త్ కొరియన్ యన్ లు.
బార్లీ, మొక్కజొన్న, చిరుధాన్యాలు, వరి, గోధుమ ప్రధాన పంటలు. గ్రాఫైట్, మెగ్నీషియం, టంగ్ స్టన్ ఖనిజాలు లభిస్తాయి. మత్స్య సంపద పుష్కలంగా లభిస్తుంది.
1948 సంవత్సరంలో ఒకే దేశమైన కొరియా అంతర్యుద్ధం వలన నార్త్, సౌత్ కొరియాలుగా విడిపోయింది.. 1945 సం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసమయానికి కొరియా జపాన్ అధీనంలో ఉంది. కొరియాకు 30 వేల సంవత్సరాల నాగరికత ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

Oman
oman flag
Capital Maskot ………. Language Arabic ………. Currency Oman Tiyal ………. 
Calling Code + 968 ………. Religion Islam
ఓమన్

ఓమన్ దేశం అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక సంపన్న సుల్తాన్ దేశం. ఈ దేశ రాజధాని మస్కట్. వీరి అధికార భాష అరబ్బీ. ఈ దేశ విస్తీర్ణం 3,00,000 చ. కి.మీ. వీరి కరెన్సీ ఓమన్ రియాల్స్. ఓమన్ ముస్లిం దేశం.
ఈ దేశ జనాభాలో 15 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశంలోని బతీనా తీర ప్రాంతంలో వ్యయసాయ యోగ్యమైన భూములున్నాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. గోధుమ, పుచ్చకాయలు, అరటి, మామిడి, ఉల్లి, ఖర్జూరం, పొగాకు, కందమూలలు పండుతాయి. పశుపోషణ, పశువుల పెంపకం కూడా ప్రజల జీవనోపాదులు
ఓమన్ లో పెట్రోల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ ఎగుమతుల వలన అపారంగా విదేశీ ద్రవ్యాన్ని సంపాదించుకుంటుంది.

Pakistan
pakistan flag
Capital Islamabad ………. Language Urdu ………. Currency Pakistani Rupees ……
Calling Code + 92 ………. Religion Islam
పాకిస్తాన్

1947 సంవత్సరానికి ముందు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేదు. సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్న భారతదేశంలోని ఒక ప్రాంతం పాకిస్తాన్. 1947 సం.లో భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్నప్పుడు భారతదేశం నుండి విడిపోయి పాకిస్తాన్ గా అవతరించింది. భారతదేశానికి వాయువ్య దిశలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఇస్లాం మత ప్రాతిపపదిక మీద ఏర్పడిన దేశం. పేరుకు ప్రజాస్వామ్యదేశం. కానీ అధికారం అంతా సైన్యానిదే.
పాకిస్తాన్ విస్తీర్ణం 7,96,095 చ.కి.మీటర్లు. రాజధాని ఇస్లామాబాద్. వీరి భాష ఉర్దూ. లాహోర్, ముల్తాన్, పెషావర్, రావల్పిండి, ఫైసలాబాద్ పాకిస్తాన్ లోని ఇతర పెద్ద నగరాలు.వీరి కరెన్సీ పాకిస్తాన్ రూపాయలు.
పాకిస్తాన్ లోని స్ర్తీలకు పరదా, ఘోషా తప్పనిసరి. సింధునది, దీని ఉపనదులు సట్లేజ్, రావి. చీనాబ్, జీలం నదులు పాకిస్తాన్ లోని పంజాబ్ మైదానాన్ని సారవంతం చేస్తున్నాయి.
గోధుమ, చెరకు, ప్రత్తి, వరి, పొగాకు, మొక్కజొన్న ప్రధానమైన పంటలు. పశువుల పెంపకం, కోళ్ల పెంపకం ఉన్నాయి.
గ్రాఫైట్, రాతి ఉప్పు, ఆర్గోనైట్ ఖనిజాలు పాకిస్తాన్ లో లభిస్తాయి. పాకిస్తాన్ ఊగ్రవాద దేశంగా పేరుపడింది.

Palestine
palastaine flag
Capital East Jerusalem ………. Language Arabic ………. Currency Egyptian pound ………Calling Code + 970 ………. Religion
పాలస్తీనా

మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఒక చిన్న దేశం పాలస్తీనా. ఈ దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంతే కాదు చరిత్ర పరంగా పేరుపొందిన దేశం. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన యూదు మరియు క్రైస్తవ మతాలకు జన్మస్థానం పాలస్తీనా.
పాలస్తీనా రాజధాని తూర్పు జెరుసలేమ్. వీరి భాష అరబిక్. వీరి కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్ లు.
క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్ లో పాలస్తీనా గురించి చెప్పబడింది. ఇస్లాం మతస్తులవారికి కూడా పాలస్తీనా పవిత్ర పుణ్యక్షేత్రం. కానీ పాలస్తీనా ఎల్లప్పుడూ వివాదస్పదంగా ఉండిపోయింది. తరచూ యూదులు అరబ్బుల మధ్య యుద్దాలు జరుగుతుంటాయి.
1948 సంవత్సరంలో పాలస్తీనాను ఇజ్రాయేల్, జోర్డాన్ దేశాలుగా విభజించారు. గాజాను ఈజిప్టు ఆక్రమించిన తరువాత పాలస్తీనా తన ప్రాభవాన్ని కోల్పోయింది.

Philippines
phillipines flag
Capital Manila ………. Language Filipino/English Currency Pisco-int. Piso-nat Calling Code + 63 ………. Religion Christian/Islam
ఫిలిప్పీన్స్.

ఫిలిప్పీన్స్ కొన్ని వేల దీవుల సముదాయం. అన్నిటినీ కలిపి ఫిలిప్పీన్ గా వ్యవహరిస్తారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా . ఈ దేశ విస్తీర్ణం 300,000 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాషలు ఫిలిప్పినో, ఇంగ్లిష్. అత్యధికంగా ఇక్కడ 175 భాషలు మాట్లాడతారు. ఈ దేశ కరెన్సీ పెసో. ఇక్కడ మొత్తం 7,107 ద్వీపాలున్నాయి. వీటిల్లో 2000 మాత్రమే నివాసాలకు అనువైనవి. మిగిలిన ఐదువేల దీవులకు అసలు పేర్లే లేవు.
ఈ దేశపు జెండాలోని ఎరుపు రంగు గతంలోని యుద్ధ సమయానికి, నీలం ఇప్పటి శాంతికి చిహ్నం. తెలుపు ఐక్యతకు, సమానత్వానికి గుర్తు.
1945సం.లో అమెరికా నుంచి స్వతంత్రం పొందింది. ఫిలిప్పీన్స్ దేశంలో తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. సరాసరిన చూసుకుంటే రోజుకు పది నుంచి ఇరవై భూకంపాలు సంభవిస్తాయి అని నిపుణుల అంచనా కొండల్లో వ్యవసాయం ఫిలిప్పీన్స్ మొత్తం కొండలు మయం. ప్రజలు వారు కొండలపైనే వ్యవసాయం చేస్తారు. కొండలపై గట్లుగట్లుగా కట్టి చదును చేసి వరి పండిస్తారు. వీటిని ‘ఫిలిపైన్ కార్డిలెరాస్’ అని పిలుస్తారు. యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగానూ గుర్తించింది.
కొబ్బరి కాయలు ఎక్కువగా పండే దేశాల్లో ఈ దేశం ఒకటి. అంతేకాదు ఇతర దేశాలకు కొబ్బరిని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఫిలిప్పీన్స్ మొదటిది.
ఇక్కడి వారు టెక్ట్స్ మెసేజింగ్ని చాలా ఎక్కువగా వాడతారు. అందుకే దీనికి ‘టెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’ అనే ముద్దుపేరూ ఉంది. ఇక్కడున్న పదికోట్లకు పైగా జనం రోజుకు నలభైకోట్లకు పైగా మెసేజ్లు పంపుతారట.
ఇక్కడ ఎదిగే మడ అడవుల్లో తెలుపుగా ఉండే ‘నిలాడ్’ అనే పూలు పూస్తాయి. వాటి పేరులోంచే దీని రాజధాని నగరానికి ‘మనీలా’ అనే పేరొచ్చింది. కోటిమందికి పైగా జనాభా రాజధాని మనీలా నగరంలోనే నివసిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద పది షాపింగ్ మాల్లలో మూడు ఇక్కడే ఉన్నాయి. అవి ఎస్ఎమ్ మెగామాల్, ఎస్ నార్త్ ఎడ్సా, ఎస్ఎమ్ మాల్ ఆఫ్ ఏషియా.
ప్రజా రవాణాలో జీప్నీస్ అనే వాహనాలు ఇక్కడే కనబడతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1940ల్లో అమెరికా సైనికులు తిరిగేందుకు ఇక్కడకి జీపులను తీసుకొచ్చారు. తర్వాత వాళ్లు వాటిని ఇక్కడే వదిలి వెళ్లిపోవటం జరిగింది. వాటిని మినీ బస్సుల్లా తయారు చేసి ఇప్పుడు ప్రజా రవాణా కోసం వాడుతున్నారు.
ఈ దేశం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూఫలకాలు సర్దుకుంటూ ఉంటాయి. అలా పుట్టే ఒత్తిడి వల్లే ఇక్కడీ ప్రకంపనలు.
తరచూ భూకంపాలు వస్తాయి. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే పెద్ద భూకంపాలు వస్తాయి. మిగిలినవన్నీ రిక్టరు స్కేలుపై చిన్నగా నమోదవుతాయి. అందుకే చిన్న భూకంపాల వల్ల పెద్ద ప్రమాదమేం ఉండదు.
ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండటం వల్లనే ఇక్కడ అగ్ని పర్వతాలూ ఎక్కువ. ఇక్కడ 14మైళ్లున్న ఓ దీవిలో టౌన్లు ఐదుంటే అగ్ని పర్వతాలు మాత్రం ఏడున్నాయి. అతి కొద్ది భూభాగంలో ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నది ఇక్కడే. మౌంట్ పినాటుబో, టాల్, మయన్ ఎప్పుడూ లావాను కక్కుతూనే ఉంటాయిక్కడ.
ఫిలిప్పీన్స్ సముద్రం మధ్యలో ఉండే ద్వీప దేశం కాబట్టి చుట్టూ సముద్రమే ఉంటుంది. ఏ దేశంతోనూ సరిహద్దులు ఉండవు. తైవాన్, ఇండోనేషియాల మధ్య ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఫిలిపైన్స్.
గద్దల్లో అతి పెద్దది మంకీ ఈటింగ్ ఈగల్ ఈ దేశంలోనే కనిపిస్తుంది. ఈ పక్షి వీరి జాతీయ పక్షి కూడా.. ఈ పక్షి ఏకంగా కోతులను కూడా చంపి తింటుంది. ఈ పక్షి రెక్కల్ని పూర్తిగా విప్పితే ఆ పొడవే ఆరడుగుల పైన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయట.
నల్లని ఉడుతల్లా ఉండే ‘స్కన్క్స్’ ఈ దేశంలోనే మాత్రమే కనిపిస్తాయి. గత పదేళ్లలోనే ఇక్కడ 16 రకాల కొత్త జీవ జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది.

Qatar
quatar flag
Capital Doha ………. Language Arabic ………. Currency Riyal ………. 
Calling Code + 974 ………. Religion Islam (sunni)
ఖతార్

ఖతర్ ఆసియా ఖండంలో సింధు శాఖలోనికి చొచ్చుకు వచ్చిన చిన్న దేశం. 1971 సం.లో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుని స్వతంత్ర్య రాజ్యంగా అవతరించింది. రాజవంశీయులు పాలిస్తున్న అరబ్ దేశం ఖతార్. ఖతార్ రాజధాని దోహా, వీరి అధికార భాష అరబ్బీ. వీరి కరెన్సీ రియాల్. విస్తీర్ణం 11,400 చ.కి.మీ. దేశ రాజదాని దోహ పరిసరాలలో జనం ఎక్కువగా నివసిస్తున్నారు. సున్సీ ఇస్లాం మతాన్ని పాటిస్తారు. ప్రజలలో పాకిస్తాన్, ఓమన్ నుండి వలస వచ్చినవారే ఎక్కువ.
పెట్రోల్ సంపద ఎక్కువ. పెట్రోల్ ఎగుమతుల మీద దేశ ఆర్థకసంపద ఆధారపడి ఉంది.
ఖర్జూరం, కూరగాయలు, పండ్లు ప్రధాన పంటలు. ఒంటెలు, గొర్రెల, మేకల పోషణ ఎక్కువ. మత్స్య పరిశ్రమ ఎక్కువ. సిమెంట్, యూరియా ఎరువుల ఫ్యాక్టరీలు ప్రధాన పరిశ్రమలు.

Russia
russia flag
Capital Moscow ………. Language Russian ………. Currency Russian ruble (RUB) ……Calling Code + 7 ………. Religion
 రష్యా

1991 కి పూర్వం రష్యా స్వరూపం...
రష్యా ఆసియా మరియు యూరప్ ఖండాలకు వ్యాపించిన అతి పెద్ద దేశం . ఈ దేశాన్నే USSR అని పిలిచేవారు. కానీ 1991 సం.లో అంతర్యద్దం వలన రష్యా అనేక చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. అఖండ రష్యాలో 1917 సం.నుండి కమ్యూనిస్ట్ పరిపాలన సాగింది. 1917లో రష్యా జాతిపిత లెనిన్ రాజ్యాధికారం చేపట్టి కమ్యూనిస్ట్ పరిపాలన ప్రారంభించాడు.
నేటి రష్యా రాజధాని మాస్కో. కరెన్సీ రూబుల్స్. వీరి భాష రష్యన్.

Saudi Arabia
saudi arabia flag
Capital Riyad ………. Language rabic ………. Currency Riyal ………. 
Calling Code + 966 ………. Religion Islam
సౌదీ అరేబియా

అతి పెద్ద అరబ్ దేశం ఐన సౌదీ అరేబియా లేక కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా పశ్చిమాసియాలో ఉంది. పరిపాలన రాజరికం. సౌదీ అరేబియా ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటి
సౌదీ అరేబియా వైశాల్యం 21,50,000 చ.కి.మీ. ఈ దేశ అధికారిక భాష అరబిక్. సౌదీ అరేబియా ముస్లిం దేశం. సున్నీ మతస్తులు, షియా మతస్తులు నివసిస్తున్నారు. ఈ దేశ రాజధాని రియాధ్. జెడ్డా, మెక్కా, మెదీనా, ఆల్ తయూఫ్ ఇతర ప్రధాన పట్టణాలు. ఈ దేశ కరెన్సీ రియాల్. ఈ దేశ కాలింగ్ కోడ్ +966
దేశానికి ఉత్తరాన జోర్డాన్ మరియు ఇరాక్, ఈశాన్యం వైపున కువైట్, తూర్పున ఖతార్, బహ్రయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆగ్నేయ సరిహద్దులో ఓమన్ మరియు దక్షిణ సరిహద్దులో యెమన్ దేశాలు ఉన్నాయి.
ఎర్రసముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ సముద్రతీరాలు ఉన్న ఒకేఒక దేశం సౌదీ అరేబియా మాత్రమే. దేశంలో ఎక్కువగా ఇసుక ఎడారులు మరియు జనవాసాలు లేని భూభాగాలు ఉన్నాయి. జలసంపద ఈదేశంలో లేదు. వర్షం పడినపుడు నీరు లోయలలో నిలుస్తుంది. ఒయాసిస్ లు ఉన్నచోట కొద్దిగా ఆహార ధాన్యాలు పండుతాయి. గోధుమ బార్లీ, చిరుధాన్యాలు, ఖర్జూరం, ఉల్లి, గుమ్మడి కొద్దిగా పండుతాయి.
పెట్రోల్ నిక్షేపాలు పుష్కలంగా ఉండటం వలన దేశం ఆర్థికంగా బలమైన దేశంగా రూపొందింది. మరియు సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఎగుమతి చేసే దేశం కూడా. మేలైన గుర్రాలకు అరేబియా పేరు పొందింది. ప్రజలు ఒంటెలను, గొర్రెలను, గాడిదలను పెంచుతారు.
ముస్లింలు పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలైన మెక్కా, మదీనా సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ఇక్కడకు వచ్చే యాత్రికులను హజ్ యాత్రికులంటారు. ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు హజ్ యాత్ర చేస్తారు.
సౌదీ అరేబియాలో శిక్షలు క్రూరంగా ఉంటాయి. మరణశిక్ష, శారీరక శిక్ష అమలులో ఉంది. శిరచ్ఛేధం, చనిపోయే దాకా రాళ్ళతో కొట్టడం, శిలువ వేయడం కొరడా దెబ్బలు, శరీర భాగాలను ఖండించటం వంటి శారీరక శిక్షలు ప్రధానమైనవి.
హత్య, మానభంగం,ఆయుధాలతో బెదిరించి దోపిడీ, మాదకద్రవ్యాల వాడుక, మతమార్పిడి, వ్యభిచారం, మంత్రవిద్య మరియు వశీకరణ.... మొదలైన నేరాలకు శిక్ష మరణశిక్షే.

Singapore

Capital Singapore City, language Malay/English/Chinese 
Currency:Singapore Dollar Calling Code +65 Religion Buddhisim/Christian/Muslim
సింగపూర్

సింగపూర్ ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. 1965 సం.లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. జనసంఖ్య ఎక్కువగా గల దేశం. చైనా వారు ఎక్కువగా ఉన్నారు. నాల్గింట మూడు వంతులు చైనా వారే. వీరు వ్యాపార దక్షత గలవారని పేరు. వ్యాపారాలన్నీ వీరి చేతులమీదుగానే జరుగుతాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత చాలా తక్కువ సంవత్సరాలలోనే ఈ దేశం అభివృద్ధి చెందింది. దీనికి కారణం ఈ దేశ నాయకత్వం మరియు ప్రజల సహకారం.
సింగపూర్ వైశాల్యం 622 చ.కి.మీ. రాజధాని పేరు సింగపూర్ సిటీ. వీరి అధికార భాషలు మలే, చైనీస్, తమిళం, ఇంగ్లీష్. ఈ దేశ కరెన్సీ సింగపూర్ డాలర్. వీరికి భూభాగం చాలా తక్కువ. సముద్రాన్ని కూడా పూడ్చివేసి కొంత భూభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ దేశంలో బౌద్ద మతస్తులు 27 శాతం మంది ఉన్నారు ఇస్లాం మతస్తులు 16 శాతం, టావోలు 29 శాతం మంది, క్రైస్తవులు 10 శాతం మంది, హిందువులు 4 శాతం మంది ఉన్నారు
సిందపూర్ ఆగ్నేయ దేశాలన్నిటికీ వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది. చెరువులు, చిన్న చిన్న సరస్సులు ప్రధాన జలాధారాలు. కొబ్బరి తోటలు, పండ్ల తోటలు రబ్బరు, పొగాకు, కాయకూరలు పండిస్తారు. వరి, ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటారు.
మత్స్య పరిశ్రమ ఎక్కువ. ఎలక్ట్రానిక్ పరికరాలు, రవాణా వాహనాలు,, యంత్ర సామాగ్రి, ఔషధాలు, తగరపు సామాగ్రి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేయటం మొదలగునవి ప్రధాన పరిశ్రమలు.
అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం కావటం వలన నౌకాపరిశ్రమ, మరమ్మత్తులు ఎక్కువ. సింగపూర్ హార్బర్ కు చిన్న పెద్ద నౌకలు సంవత్సరానికి 40,000 వేల దాకా వస్తూ పోతూ ఉంటాయి. ఈ హార్బర్ సహజ వనరులతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నౌకాశ్రయం. నౌకా వ్యాపారానికి అనుకూలం.

South Korea

south korea flag
Capital Ciyal ………. Language Korean ………. Currency South Korean WON ………. 
Calling Code + 82 ………. Religion Buddhisim
దక్షిణ కొరియా

దక్షిణ కొరియా ఆసియా ఖండంలో ఓ చిన్న దేశం.. ద్వీపకల్ప దేశం.. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌. ఈ దేశ విస్తీర్ణం 605 చ. కిలోమీటర్లు ఈ దేశ కరెన్సీ సౌత్‌ కొరియన్‌ ఓన్‌ వీరి అధికారిక భాష కొరియన్‌. పారిస్‌ తర్వాత జనసాంద్రత ఎక్కువ ఉన్నదిక్కడే.
కొరియా 1948లో ఉత్తరకొరియా, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఈ రెండు దేశాలకూ మధ్య విబేధాలతో 1950-1953 మధ్య కొరియా యుద్ధం వచ్చింది. అది ముగిశాక కూడా ఈ దేశాలు శత్రువులుగానే ఉంటున్నాయి. కొరియన్‌ యుద్ధంలో ఈ నగరం మొత్తం నాశనమైంది. దాన్నుంచి కోలుకుని మరో 50 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో స్థానం దక్కించుకుంది. సముద్రంలో రెండు దీవుల మధ్య ఖాళీని పూడ్చి ఇక్కడి ఇంచియోన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే విమానాశ్రయాల్లో ఇదీ ఒకటి.
ఈ దేశం ఉత్తర కొరియాతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. అత్యంత అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల్లో ఈ దేశ రాజధాని నగరం సియోల్‌ ఒకటి. ఇప్పుడు ఉన్న జనాభాలో 82 శాతం మంది పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తున్నారు. 6,398 అడుగుల ఎత్తయిన పర్వతం జేజు ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేశంలో పుట్టిన యువకులు 21 నుంచి 24 నెలలపాటు తప్పనిసరిగా మిలటరీలో పనిచేయాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయ వృత్తిని ఇక్కడ గౌరవంగా, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఉపాధ్యాయులకు అత్యధిక వేతనమూ వస్తుంది. వీరు 4 అంకెను దురదృష్ట సంఖ్యగా భావిస్తారు. అందుకే చాలా భవనాల్లో నాలుగో అంతస్థును కట్టరు. పదమూడు సంఖ్య కూడా అంతే.
పిల్లలకు పేర్లు పెట్టడానికి చాలానే డిమాండ్‌ ఉంటుందిక్కడ. 60 శాతం కుటుంబాల వారు నిపుణుల్ని సంప్రదించి మాత్రమే వారి పిల్లలకు పేర్లు పెడతారు. ఈ సేవలందించేందుకు అక్కడ కార్యాలయాలూ ఉంటాయి.
ఇక్కడ 20శాతం మంది పేర్ల చివర కిమ్‌ ఉంటుంది. లీ, పార్క్‌ అనే పేర్లూ ఎక్కువగా చివరన పెట్టుకుంటారు. వయసు లెక్కించడంలో ఇక్కడి పద్ధతి వేరు. పుట్టిన పిల్లలను ఏడాది వయసున్న వారిగా లెక్కిస్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వారి వయసును లెక్కిస్తారు. అలాగే సంవత్సరం మారిపోతే వయసూ ఒక సంవత్సరం పెరిగిపోయినట్టు భావిస్తారు. అంటే డిసెంబర్‌లో పుట్టిన పాపాయికి జనవరి రాగానే రెండేళ్లు వచ్చేస్తాయి.
ఓటు హక్కు రావాలంటే ఖచ్చితంగా 19ఏళ్లు వచ్చి ఉండాలి. శరీరంపై ఎవరైనా టాటూ వేయించుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా వైద్యుడిచ్చిన అనుమతి పత్రం ఉండాల్సిందే.
స్త్రీలతో పాటు ఈ దేశంలోని పురుషులూ ఎక్కువగా మేకప్‌ని ఇష్టపడతారు. 20 శాతం మంది మగవాళ్లు రోజూ మేకప్‌ వాడతామని చెబుతున్నారట.
ప్రపంచంలోనే ప్లాస్టిక్‌ సర్జరీలకు పెట్టింది పేరు ఈ దేశం. అందుకే దీన్ని ‘వరల్డ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ’ అని పిలుస్తారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు తప్పకుండా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న వారే ఉంటారంటారు.
పక్కనే ఉన్న ఉత్తర కొరియా ఈ దేశానికి శత్రుదేశం. ఉత్తరకొరియా అధినేతలపై ఎవ్వరూ జాలి చూపించకూడదు. ఆయనకు అనుకూలంగా మాట్లాడకూడదు. అలాంటి బ్లాగులూ నడపకూడదు. ఈ నిబంధనల్ని లెక్కచేయకుండా ఆ పనిచేసిన వారికి జైలు శిక్ష తప్పదు
ప్రపంచంలో వేగంగా ఇంటర్నెట్‌ వచ్చే దేశాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. దాదాపుగా అన్ని చోట్లా ఉచిత వైఫై జోన్లుంటాయి. 95 శాతం ఇళ్లకు బ్రాడ్‌ బ్యాండ్‌ ఉంది. ఈ దేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాల్ని కచ్చితంగా ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ నుంచే చెయ్యాలి. ఇందుకు వేరే ఏ బ్రౌజర్‌నీ ఉపయోగించకూడదు. దాన్నే వాడాలని ఇక్కడ చట్టమే ఉంది.
. ప్రముఖ ఎలాక్ట్రానిక్స్‌ సంస్థ శామ్‌సంగ్‌ ఈ దేశానికి చెందినదే. మరియు ఎల్జీ, హుందాయ్‌...లాంటి సంస్థలు ఈ దేశానికి చెందినవే.
. ప్రపంచం మొత్తం వాడే సీవీడ్‌ అనే సముద్రపు నాచులో 90శాతం ఇక్కడే వినియోగిస్తారు. దీనితో చేసుకునే సీవీడ్‌ సూప్‌ వీరి సంప్రదాయ వంటకం. పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో దీన్ని చేసుకుంటారు. ఆక్టోపస్‌లను ఎక్కువగా తింటారు. వరి, బార్లీ, దుంపల్ని ఎక్కువగా పండిస్తారు.
. ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యునికేషన్స్‌కి సంబంధించిన పరికరాల తయారీ కోసం ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి.
ఉత్తర కొరియా ప్రత్యేకతలు

ప్రపంచంలోని అతి పెద్ద చర్చిల్లో ఒకటైన యోధోఫుల్‌ గోస్పెల్‌ చర్చి ఉన్నదిక్కడే. దీంట్లో ఒకేసారి పది లక్షల మంది ప్రార్థనలు చేసుకునే వీలుంది.
2003 నుంచి ఏడాదిలో నాలుగుసార్లు ఇక్కడ ‘హాయ్‌ సియోల్‌ ఫెస్టివల్‌’ పేరుతో పండుగలు చేసుకుంటారు..
ఇక్కడి లాట్‌ వరల్డ్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్‌ థీమ్‌ పార్క్‌. చుట్టూ ఎత్తయిన కొండల మధ్యలో ఉంటుందీ నగరం. దీని మీదుగా హేన్‌ నది ప్రవహిస్తుంటుంది. షాపింగ్‌కి పెట్టింది పేరు. 20కిపైగా షాపింగ్‌మాళ్లు, 30వేలకు పైగా మామూలు దుకాణాలూ ఉన్నాయి. ఎన్‌సియోల్‌ టవర్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఇది అబ్జర్వేషన్‌, కమ్యూనికేషన్‌ టవర్‌. 1971లో నిర్మించారు.
ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జ్‌ ఫౌంటేన్‌ ఇక్కడుంది. జలపాతం ఎగసి పడుతున్నట్టు వంతెన నుంచి ఫౌంటేన్‌ చిమ్ముతుంటుంది. ఏడు రంగుల ఎల్యీడీ లైట్లను దీనికి అమర్చారు. దీంతో ఆ దీప కాంతుల ఇంద్రధనుస్సు జలపాతం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. సాయంత్రం చీకటి పడినప్పటి నుంచీ ఈ వింత దీప కాంతుల్ని అంతా చూడొచ్చు. దీనికి గిన్నిస్‌ బుక్‌ రికార్డూ ఉంది. ఈ ఫౌంటేన్‌ మొత్తం 370 అడుగుల పొడవుంటుంది.
ఆహారం : వీరి భోజనంలో బియ్యం, మాంసం, కూరగాయలతో చేసిన వంటకాలుంటాయి. రోజువారీ భోజనంలోనూ తక్కువలో తక్కువ ఏడెనిమిది సైడ్‌ డిష్‌లు కనిపిస్తాయి.

Sri Lanka

Capital Colombo ………. Language Simhal/Tamil/English  Currency Srilankan Rpuee Calling Code + 94 ………. Religion Buddhisim
శ్రీలంక

ప్రపంచంలోనే అందమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న పొరుగు దేశం కూడా. శ్రీలంక రాజధాని కొలంబో. ప్రధాన భాష సింహళం. తరువాత ఎక్కువగా తమిళం మాట్లాడతారు. వీరి కరెన్సీ శ్రీలంక రూపాయి. దక్షిణ దేశాలలో అత్యధిక అక్షరాస్యత కల దేశం. దాదాపు 92 శాతం మంది విద్యాధికులు.
రామాయణ కాలం నాటి రావణుడి రాజ్యం శ్రీలంక ఇదేనని చాలామంది నమ్ముతారు. 1972 వరకు శ్రీలంకను సిలోన్ అని పిలిచేవారు. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశంలో 100కు పైగా నదులున్నాయి. జలపాతాలు కూడా ఎక్కువే. జలవిద్యుత్ ఎక్కువ. అతి ప్రాచీనమైన మహాబోధియా అనే వృక్షం ఉంది ఇక్కడ.
ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన సిలోన్ టీపొడి ఇక్కడే తయారవుతుంది. తేయాకు ఎక్కువగా పండిస్తారు. తేయాకు ఎగుమతులు కూడా ఎక్కువే.
శ్రీలంక చూడటానికి వెళ్లేవారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలున్నాయి. శ్రీలంక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మాదకద్రవ్యాలతో పట్టుబడితే మరణశిక్ష కూడా విధిస్తారు. శ్రీలంకకు వేళ్లేటపుడు అపరిచితులు కానీ, తెలిసిన వారు కానీ విమానాశ్రయాలలో శ్రీలంకలో అందచేయమని ఇచ్చిన ఎటువంటి ప్యాకెట్లను గానీ, వస్తువులను కానీ మొహమాటానికి కూడా తీసుకువెళ్లటం మంచిది కాదు. వాటిలో మాదకద్రవ్యాలు ఉండవచ్చు.
శ్రీలంక పర్యాటకపరంగా కూడా పేరుపొందిన దేశం.

Syria
syria flag
Capital Damascus ………. Language Arabic ………. Currency Sirian Pound ………. 
Calling Code + 963 ………. Religion Islam
సిరియా

పశ్చిమాసియాలోని దేశం సిరియా. 1944 జనవరి 1 న ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సిరియా రాజధాని డమాస్కస్. కరెన్సీ సిరియన్ పౌండ్ సిరియా దేశ అధికారిక భాష అరబిక్. ఇది ముస్లిం దేశం 90 శాతం మంది ముస్లింలు, వీరిలో సున్నీ శాఖ వారు ఎక్కువ. 8 శాతం మంది క్రైస్తవులు కలరు. ఈ దేశ వైశాల్యం 1,85,180 చదరపు కిలోమీటర్లు.
ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ మరియు మధ్యధరా సముద్రం సరిహద్దులు. వేల సంవత్సరాల క్రితం వైభవోపేతమైన నాగరికతలు వర్ధిల్లిన దేశం సిరియా. డమాస్కస్, అపెప్పో, పాల్మయిరా నగరాలు క్రీ.పూర్వం 2000 సంవత్సరాల నాటికే ఉన్నాయి. ఓరోంటిక్ నది, యూఫ్రటీస్ నది దీని ఉపనదులు యార్మక్ ప్రదాన నీటి వనరులు. ప్రజలకు వ్యవసాయమే ముఖ్య వృత్తి. పశుపోషణ కూడా జీవనోపాధియే.
బార్లీ, గోధుమ, అపరాలు,ఆలివ్, ప్రత్తి, బీటు దుంపలు, పండ్లు ప్రధానమైన పంటలు. పెట్రోల్ నిక్షేపాలు కలవు.
పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు పండిస్తారు. చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు కలవు.
ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలతో చిన్నపాటి యుద్ధాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
2013 లో జరిగిన రసాయన దాడిలో ఈ దేశం ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. సిరియన్లు ఎక్కువగా వ్యాపారరంగంలో ఉన్నారు.
క్రీస్తుశకం 632లో మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని ఆక్రమించారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలపాటు ఖలీఫాలు పరిపాలించారు. తరువాత 11 వ శతాబ్దంలో క్రైస్తవులు ఈ దేశాన్ని ఆక్రమించారు కానీ తరువాత ముస్లిం రాజులచే తరిమి వేయబడ్డారు.

Taiwan
taiwan flag
Capital Taipei ………. Language Yami ………. Currency New Taiwan dollar ………. 
Calling Code + 886 ………. Religion 
తైవాన్

తైవాన్ ఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి . తైవాన్ దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లేదు. చైనాలోని అంతర్భాగముగా గుర్తించ బడుచున్నది. తైవాన్ చైనా నుండి 1950 సం.లో స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. తైవాన్ రాజధాని తైపి. తైవాన్ వైశాల్యం36,188 చ.కి.మీ. తైవాన్ అధికార భాషలు మాండరీన్ (చైనా) స్థానిక మాండరీన్
బౌద్దమతం, టావోయిజం మరియు ఏ మతానికి సంబంధించని వారు అధికంగా ఉన్నారు. వరి చెరకు పండించి ఎగుమతి చేస్తారు. మంచి వర్షపాతం కల దేశం. తైవాన్ వైశాల్యం 35,883 చదరపు కిలోమీటర్లు. ఉత్తరదిశలో తూర్పు చైనా సముద్రతీరం, తూర్పు దిశలో ఫిలిప్పైన్స్ సముద్రం, దక్షిణదిశకు నేరుగా ల్యూజాన్ స్ట్రైట్ మరియు ఆగ్నేయంలో దక్షిణ చైనా సముద్రం ఉన్నాయి.
21వ శతాబ్ధంలో అత్యధిక నేలబొగ్గు నిల్వలను తైవాన్ లో కనుగొన్నారు. జవుళీ పరిశ్రమ, కంప్యూటర్ విడి భాగాలకు, కంప్యూటర్ టెక్నాలజీ లో తైవాన్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. సాంకేతికంగా అభవృద్ధి చెందినదేశం.

Tajikistan
tazakistan flag
Capital Dushanbe ………. Language Tajik/Ujbek/Russian ………. Currency Dushombe ………Calling Code + 992 ………. Religion Islam
తజకిస్తాన్

తజకిస్తాన్ మధ్య ఆసియాలోని దేశం. రాజధాని ముషాంబే. వీరి మాతృభాష తజిక్..ఈ దేశ వైశాల్యం 1,43,100 చ.కి.మీ తజికిస్థాన్ లోని 80% ప్రజలకు తజిక్ భాష మాతృభాష. తజికిస్థాన్ లోని 80% ప్రజలకు తజిక్ భాషలోనే మాట్లాడుతారు. ఉజ్బెక్, రష్యన్ భాషలు కూడా మాట్లాడుతారు. తజకిస్తాన్ ముస్లిం దేశం వీరిలో 98 శాతం సున్నీ ముస్లింలే.
1991 సంవత్సరంలో రష్యా విచ్ఛిన్నం తరువాత రష్యానుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశంలో 90 శాతం భూమి పర్వతమయమే. అల్యూమినియం పరిశ్రమ మరియు ప్రత్తి పంటలమీద దేశ ఆర్ధికాభివృద్ధి ఆధారపడి ఉంది.
వఖ్ష్ నది మరియు పంజ్ నదులు ద్వారా జల విద్యుత్ తయారవుతుంది.

Thailand
yhailand flag
Capital Bankak ………. Language Thai ………. Currency Bath ………. 
Calling Code + 66 ………. Religion Buddhisim
ధాయ్ లండ్

ధాయ్ లాండ్ ఆగ్నేయ ఆసియాలో సింధు శాఖ తీరాన ఉన్న దేశం. ఈ దేశానికి చుట్టు ప్రక్కలా బర్మా, లావోస్, కంపూచియా, మలేషియా దేశాలు కలవు. ధాయ్ లాండ్ అంటే స్వతంత్ర దేశం అని అర్ధం. ఈ దేశానికి పూర్వ చరిత్ర లేదు 1939 సం.లో ఈ దేశం ఏర్పడింది.
ఈ దేశ విస్తీర్ణం 5,13,115 చ.కి.మీ.. ఈ దేశ రాజధాని బ్యాంకాక్. వీరి అధికార భాషలు ధాయ్, ఇంగ్లీష్, చైనీస్ మలే. ప్రజలందరూ ఎక్కువ భాగం బౌద్ధ మతస్తులు. క్రైస్తవులు. ముస్లింలు తక్కువ మంది ఉన్నారు.
వరి, జొన్న, రబ్బరు, చెరకు, కొబ్బరి విస్తారంగా పండుతాయి. పశు సంపద కూడా ఎక్కువ. జనపనార పరిశ్రమ కలదు. జవుళి, సిమెంట్, పొగాకు, చమురు ఉత్పత్తులు, కాగితం పరిశ్రమ ప్రధానమైనవి.
టంగ్ స్టన్, ఇనుపరాయి, తగరం, మాంగనీస్, జిప్సమ్ మొదలైన ఖనిజాలు ఇక్కడ లభిస్తాయి. రబ్బరు ఉత్పత్తులకు, ఖనిజాలకు ఈ దేశం పేరు పొందింది. ధాయ్ లండ్ మంచి పర్యాటక దేశం. సంవత్సరమంతా పర్యాటకులతో సందడిగా ఉంటుంది.

Timor-Leste
timorleste flag
Capital Dili ………. Language Tetum/Portugese ………. Currency US Dollar 
Calling Code + 670 ………. Religion Cathelics
తిమోర్ లెస్టె...

ఈ దేశం ఆగ్నేయ ఆసియా మారిటైమం ప్రాంతంలో ఉన్నది. ఈ దేశాన్నే ఈస్ట్ తిమోర్ అనికూడా పిలుస్తారు. ఈ దేశ రాజధాని డిలీ. దేశ జనభా 11,67,242 (2019) ఈ దేశ విస్తీర్ణం 15,410 చ.కి.మీటర్లు. ఈ దేశ భాషలు టెటుమ్ మరియు పోర్చ్ గీస్. ఈ దేశ కరెన్సీ అమెరికన్ డాలర్స్
ఈ దేశ జెండాలో పసుపు రంగు వలస చరిత్రకు గుర్తు. నలుపు రంగులో ఉన్న త్రిభుజం పారదర్శకతను తెలుపుతుంది. ఎరుపు రంగు విముక్తి పోరాటానికి, తెలుపు రంగు శాంతికి గుర్తులు. ఈ దేశం 1975 సం.వరకు పోర్చుగీసు వారి ఆధీనంలో మరియు 1999 వరకు ఇండోనేసియా ఆధీనంలో ఉంది. 21వ శతాబ్ధంలో స్వాతంత్యం సాధించి సౌరభౌమాధికారం సాధించింది.
ఇక్కడ నివసించే స్థానిక ప్రజలు ఈ దేశాన్ని తిమోర్ లొరొసె అని పిలుస్తారు. అండే ఉదయించే సూర్యుడు అని అర్ధం.
ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామిక పద్ధతిలో 2001 సం.లో ఎన్నికలు జరిగాయి. ఈ దేశం మొసలి ఆకారంలో ఉంటుంది
ఈ దేశంలో బంగారం, పెట్రోలియం, సహజ వాయువు, మాంగనీస్, మార్బుల్ ఎక్కువగా లభిస్తాయి. కాఫీ, గంధపు చెక్కలు, మార్బుల్స్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.
ఈ దేశ ఉద్యమకారులైన బిషప్ కార్లోస్, ఫిలిపె గ్జిమినెన్ బెలో, హోస్ రమోస్ హోర్జాలకు 1996 సం.లో నోబుల్ శాంతి బహుమతి వచ్చింది. అహింసాయుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినందుకు ఈ బహుమతి లభించింది.
ఈ దేశ ప్రజల ప్రధాన ఆహార ధాన్యం మొక్కజొన్న. ఆసియా దేశాలలో ఇది అతి పేద దేశం. ఆడవారికి ఇక్కడ ప్రత్యేకంగా దుస్తులు ఉంటాయి. వీరు ఒంటరిగా తిరగకూడదు. బహిరంగంగా అరవటం, వాదించటం ఈదేశంలో నిషేధం.
ఈ దేశంలో పేరుపొందిన వందలాది కవులున్నారు.

Turkey

Capital Ankara ………. Language Turkish ………. Currency Turkish Lira ………. 
Calling Code + 90 ………. Religion Islam
టర్కీ దేశం

టర్కీ దేశం ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంటుంది. దేశమంతా కలిపినా అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే. ఇస్తాంబుల్‌ నగరం దేశం మొత్తంలో అతి పెద్దది. ప్రపంచంలో రెండు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఇదే. టర్కీ ఎనిమిది దేశాల సరిహద్దులున్న దేశం.
టర్కీ రాజధాని అంకారా. ఈ దేశ జనాభా 7,94,63,663 (2019). విస్తీర్ణం: 7,83,356 చ.కి.మీ వీరి భాషలు టర్కిష్‌. ఈ దేశ కరెన్సీ టర్కిష్‌ లీరా. ఈ దేశం ముస్లిం దేశం.
ఈ దేశ జెండాలో నక్షత్రం, నెలవంక ఇస్లాం మతానికి గుర్తు, ఎరుపు రంగు 17వ శతాబ్దంలో ఈ దేశాన్ని పాలించిన ఒట్టోమన్‌ రాజ్యానికి చిహ్నం.
కార్లు, విమానాలు, ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం.
టర్కీ పక్షి నిజానికి ఈ దేశానికి చెందినది కాదు. అమెరికాకు చెందింది. కానీ తొలిసారిగా టర్కీలో కనిపించడంతో పొరపాటున ఈ పేరు పెట్టారు.
ప్రాచీన ప్రసిద్ధ ట్రాయ్‌ నగరం ఇక్కడిదే. ఒట్టోమన్‌ రాజ్యం పతనం తర్వాత 1923లో ఆధునిక టర్కీ ఏర్పడింది. ఒట్టోమన్‌ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లోనే 14 వందల ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు.
ఆస్పెండోస్‌ రోమన్‌ ప్రదర్శనశాల ఎంతో ప్రాచీనమైంది. వార్షిక వేసవి ఉత్సవం ఇప్పటికీ నిర్వహిస్తారు. దీన్ని 15వేల మంది ఇక్కడ కూర్చుని చూస్తారు. 1502లో ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం ఇస్తాంబుల్‌.
ప్రముఖ రచయిత్రి అగాథా క్రిస్టీ ‘మర్డర్‌ ఆన్‌ ది ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ఇస్తాంబుల్‌లోనే రచించారు. నాలుగు వేల దుకాణాలతో ఉండే ఇక్కడి ‘గ్రాండ్‌ బజార్‌’ ప్రపంచంలోనే అతి పురాతమైన పేద్ద దుకాణ సముదాయం.
ఇస్తాంబుల్‌లో పెద్ద ఎత్తున మంచు కురుస్తూ ఉంటుంది. అందుకే ఇది పర్యటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. హాలండ్‌కు చిహ్నమైన తులిప్‌ పూలు టర్కీవే. ఇస్తాంబుల్‌ నుంచి నెదర్లాండ్స్‌కు ఎగుమతి అయ్యాయివి.
ఫోన్‌ తీయగానే ‘హలో’ అన్నట్టే టర్క్‌లు ‘మై మాస్టర్‌’ అంటారట. ఇక్కడి కప్పడోసియా భూగర్భ నగరాలు మంచి సందర్శక ప్రాంతాలు. వీటి నిర్మాణానికి వందల ఏళ్లు పట్టింది.
దాదాపు 11వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో పంటలు పండించినట్టు ఆధారాలున్నాయి.
16, 17 శతాబ్దాల్లో ఇక్కడ కాఫీ తాగడం నేరంగా ఉండేది. కాఫీ కేంద్రాల్లో రాజకీయ విప్లవ కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో వాటిని అరికట్టడానికి ఒట్టోమన్‌ సుల్తాన్‌ ఈ నిబంధన పెట్టారు.

Turkmenistan
turkmenistan flag
Capital Ashgabat ………. Language Turkmen ………. Currency Turkenistan Manat 
Calling Code + 993 ………. Religion Islam
తుర్కమేనిస్తాన్

మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లో ఒక భాగం. రష్యానుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. తుర్కమేనిస్తాన్ రాజధాని అస్గాబాత్. వీరి అధికార భాష తుర్క్ మెన్. వీరి కరెన్సీ తుర్క్ మెన్ మానట్ లు. నగరాలలో రష్యా భాష వాడుక భాషగా ఉంది
ఈ దేశం ముస్లిం దేశం. ముస్లిముల శాతం 89%, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన ప్రజలశాతం 9% మరియు ఏ మతానికి చెందని వారు 2% ఉన్నారు
ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు మరియు తూర్పున కాస్పియన్ సముద్రము సరిహద్దులు.
క్రీ.పూ. 4వ శతాబ్దములో అలెగ్జాండర్ భారతదేశం వెళ్లే మార్గములో తుర్కమేనిస్తాన్ ను జయించాడు
7వ శతాబ్దములో అరబ్బులు ఈ ప్రాంతాన్ని జయించి ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశారు. ఆసియా మరియు ఐరోపాల మధ్య అతిపెద్ద వాణిజ్య మార్గముగా ప్రఖ్యాత సిల్క్ రోడ్ అభివృద్ధి చెందినది.

United Arab Emirates (UAE)
united arab emirates flag
Capital Abudhabi ………. Language Arabic ………. Currency Dirham ………. 
Calling Code + 971 ………. Religion Islam
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

1971లో ఏడు ఏమిరట్లు 1. అభూదాభి, 2. అజ్మన్, 3. దుబాయ్, 4. ఫుజిరా, 5. రసల్ ఖైమా, 6. షార్జా, 7.ఉమ్మాల్ కలసి సమైక్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమాఖ్యగా ఏర్పడినది. వీటిలో అభూదాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు.
ఈ సమాఖ్య ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. వీరి అధికార భాష అరబిక్.
ఈ సమాఖ్య సరిహద్దులు ఆగ్నేయ దిక్కున పర్షియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా మరియు దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు.
ఈ సమాఖ్య జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారు. ఈ ఎమిరేట్లలో ఇస్లాం అధికారిక మతం. 80 శాతం మంది సున్నీలు, 20 శాతం మంది షియా సున్నీలు. అరబిక్ అధికారిక భాష. ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఇతర మతాల ప్రచారం నిషిద్ధం
యు.ఎ.ఇ. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది, ప్రపంచంలోనే పదిహేడవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు కలిగి ఉంది.
దేశం మొత్తంలో 31 చర్చీలు మరియు బుర్ దుబాయిలో ఒక హిందూ ఆలయం, జెబెల్అలీ లో ఒక సిక్కు గురుద్వార్)మరియు అల్ గర్హౌడ్ లో ఒక బౌద్ధ ఆలయం ఉన్నాయి.
ఈ సమాఖ్య ఆర్ధికంగా పెట్రోల్ ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. అభూధభీ, దుబాయ్ దేశాలలో పెట్రోల్ నిక్షేపాలు పుష్కంగా ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో ఖర్జూరం పండుతుంది.

Uzbekistan
uzbekistan flag
Capital Tashkent ………. Language Uzbek ………. Currency Uzbekistan Som ………. 
Calling Code + 998 ………. Religion Islam
ఉజ్బెకిస్తాన్

రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ (Republic of Uzbekistan) మధ్య ఆసియాలోని దేశం. రాజధాని నగరం తాష్కెంట్. వీరి అధికార భాష ఉజ్బెక్. ప్రజలలో 85% ప్రజలు టర్కీ భాష మాట్లాడుతారు, రష్యన్ భాష కూడా దేశమంతటా వ్యాపించి ఉంది. ఉజ్బెకి ప్రజలు 81%, రష్యన్లు 5.4%, తజకీలు 4%, కజఖ్ ప్రజలు 3% ఇతరులు 6.5% ఉన్నారు. ఈదేశం ముస్లిం దేశం. ఈ దేశం ఒకప్పటి అఖండ రష్యాలోని ఒక భాగం
ఈ దేశానికి పడమర మరియు ఉత్తరాన కజకిస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్ మరియు తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులు.
సోవియట్ రష్యా విచ్ఛిన్నం తరువాత 1991 ఆగస్టు 31న ఉజ్బెకిస్థాన్ " ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ "గా ప్రకటించబడింది. మరుసటి రోజున అధికారికంగా స్వతంత్ర దినం జరుపుకుంది.
పత్తి, బంగారం, యురేనియం మరియు సహజవాయువు మొదలైన వాటి ఉత్పత్తి మీద ఈ దేశ ఆర్దిక పరిస్థితి ఆధారపడి ఉంది.

Vietnam
vietnam flag
Capital Hanoi ………. Language Vietnamese ………. Currency Dong ………. 
Calling Code + 84 ………. Religion Folk Religion
వియత్నాం

తూర్పు ఆసియాలోని సోషలిస్ట్ రిపబ్లిక్ దేశం వియత్నాం. ఇందులో ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంలు ఉన్నాయి. వియత్నాం పర్వతాలతో ఉన్న దేశం. అన్నామైట్ పర్వత శ్రేణికి రెండు పక్కలా ఉత్తరాన ఎర్రనది, దక్షిణాన మీకాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో డెల్టాలు ఏర్పడడంతో నేల సారవంతమై దేశానికి ధాన్యాగారాలుగా మారాయి.
వియత్నాం విస్తీర్ణం 3,31,653 చ.కి.మీ. రాజధాని హానోయ్. వీరి భాష వియత్నామీస్. వీరి కరెన్సీ డాంగ్ లు. ప్రజలలో వియత్నామీలు 88 శాతం మంది ఉన్నారు. చైనీస్, ధాయ్, క్మర్, మూవాంగ, మాంగ్ తెగలవారు కొద్ది మంది నివసిస్తున్నారు. బౌద్దమతంలోని టావో శాఖను 55 శాతం ప్రజలు పాటిస్తున్నారు.
వరి ప్రధానమైన పంట. రబ్బరు, కొబ్బరి, చెరకు, కాఫీ పంటలను పండిస్తారు.
నేలబొగ్గు, తగరం, రాగి, జింకు, క్రోమైట్, ఫాస్పేట్ రాయి మొదలగు ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి.
సిమెంట్, కాగితం, సిగరెట్లు, తోలు సామాగ్రి, వ్యయసాయ సామాగ్రి ప్రధానమైన పరిశ్రమలు. సరస్సులలో చేపల వేట సాగిస్తారు.

Yemen
yemen flag
Capital Sanaa Aden ………. Language Arabic ………. Currency Yemeni Rial ………. 
Calling Code + 967 ………. Religion Islam
%d bloggers like this:
Available for Amazon Prime