ఫిలిప్పీన్స్

philippines tourism

ఫిలిప్పీన్స్‌ పచ్చని వరి చేలు, నీలి జలాలతో మెరిసిపోయే సముద్రం, అంచున తెల్లని ఇసుక తిన్నెలు! నివురుగప్పిన అగ్నిపర్వతాలు, పచ్చదనాలతో నిండిన వనాలు వీటిన్నింటికీ చిరునామా…. ఫిలిప్పీన్స్‌
సుమారు ఏడు వేల ద్వీపాలతో అలరారుతున్న ఈ దేశంలో హనీమూన్‌ జంటలకు కావాల్సినంత ఏకాంతం లభిస్తుంది. ఒకప్పుడు స్పెయిన్‌, అమెరికా వలస రాజ్యంగా ఉన్న ఫిలిప్పీన్స్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు విలాస కేంద్రంగా ఎదిగింది. ఫిలిఫైన్స రాజధాని మనీలా, వీరి కరెన్సీ ఫిలిఫైన్స్ పెక్సోలు.
వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఫిలిఫైన్స్ లో చూడవలసినవి
బోహోల్‌ ద్వీపంలో తీరం వెంట ఫెర్రీ ప్రయాణం మధురానుభూతిగా మిగిలిపోతుంది. చాక్లెట్‌ హిల్స్‌గా పేరున్న గుట్టలు చూడముచ్చటగా ఉంటాయి. పాలవాన్‌ ద్వీపంలో సబ్‌టెర్రానియన్‌ నది భూగర్భం నుంచి ప్రవహిస్తుంటుంది. నదిపై జెట్టీలో పయనం అద్భుతంగా ఉంటుంది.
పాలవాన్‌ ద్వీపం జలక్రీడలకు పెట్టింది పేరు. స్కూబా డైవింగ్‌, బనానా రైడింగ్‌, జెట్‌ స్కీయింగ్‌ వంటి ఆటలు సాహసవంతులకు సరదానిస్తాయి.
మనీలాలో షాపింగ్‌, క్రూజ్‌ విహారం భలేగా ఉంటాయి. ఇక్కడ ఎదిగే మడ అడవుల్లో తెలుపుగా ఉండే ‘నిలాడ్’ అనే పూలు పూస్తాయి. వాటి పేరులోంచే దీని రాజధాని నగరానికి ‘మనీలా’ అనే పేరొచ్చింది. కోటిమందికి పైగా జనాభా రాజధాని మనీలా నగరంలోనే నివసిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద పది షాపింగ్ మాల్లలో మూడు ఇక్కడే ఉన్నాయి. అవి ఎస్ఎమ్ మెగామాల్, ఎస్ నార్త్ ఎడ్సా, ఎస్ఎమ్ మాల్ ఆఫ్ ఏషియా.
గద్దల్లో అతి పెద్దది మంకీ ఈటింగ్ ఈగల్ ఈ దేశంలోనే కనిపిస్తుంది. ఈ పక్షి వీరి జాతీయ పక్షి కూడా.. ఈ పక్షి ఏకంగా కోతులను కూడా చంపి తింటుంది. ఈ పక్షి రెక్కల్ని పూర్తిగా విప్పితే ఆ పొడవే ఆరడుగుల పైన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయట.
నల్లని ఉడుతల్లా ఉండే ‘స్కన్క్స్’ ఈ దేశంలోనే మాత్రమే కనిపిస్తాయి. గత పదేళ్లలోనే ఇక్కడ 16 రకాల కొత్త జీవ జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది.

%d bloggers like this: