మలేషియా పర్యాటకం

Malaysia Tourism / మలేషియా పర్యాటకం…

ఆసియా ఖండంలోని ముఖ్య దేశాల్లో మలేషియా ఒకటి. పూర్వం డచ్‌, బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇది 1957లో పూర్తి స్వాతంత్య్రం పొందింది. ఇక్కడి జాతీయ రహదారుల పొడవు 65,877 కిలోమీటర్లు. అంటే మొత్తం భూమి చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ.
మలేషియా అనగానే జంట టవర్లే గుర్తొస్తాయి. వీటి పేరు ‘పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్లు’. ఒక్కోదాంట్లో 88 అంతస్తులుంటాయి. వీటి ఎత్తు 450 మీటర్లు. అంటే ఈఫిల్‌ ప్రపంచంలోనే పొడవైన(కేవ్‌ ఛాంబర్‌) గుహ గది ఉన్నది ఇక్కడి సర్వాక్‌ ఛాంబర్‌ గుహల్లోనే. వీటిలో కార్యాలయాలుంటాయి.
రబ్బరు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశమిది. 2011 సంవత్సరంలోనే 9,96,673 మెట్రిక్‌ టన్నుల రబ్బరును ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే రబ్బరు చేతి తొడుగులు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందీ దేశం.
ప్రపంచంలోనే అతి పెద్ద కార్తికేయుడి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి) విగ్రహం ఉన్నది ఇక్కడి బాటు గుహల్లోని ఆలయం దగ్గరే. దీని ఎత్తు 140 అడుగులు. అంటే ఓ పద్నాలుగు అంతస్తుల భవనమంత. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ దుస్తులు, ఆహారం, నివాస వసతుల కోసం అయ్యే ఖర్చు తక్కువే.
వీరి ఆహార అలవాట్లు మనకులాగే ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో గుడ్డు, కొబ్బరన్నం, కారంగా ఉండే సంబల్‌ చిల్లీ పేస్ట్‌, వేరుసెనగ గింజలు, దోసకాయ ముక్కలు… లాంటివి ఉంటాయి.
మలేషియా రాజధాని: కౌలాలంపూర్‌. కరెన్సీ మలేషియన్‌ రింగెట్‌. దీని విలువ ఇప్పుడు మన కరెన్సీలో దాదాపు 14 నుంచి 15 రూపాయలుంది(2017). వీరి జెండాపై ఉన్న ఎరుపు, తెలుపు రంగు గీతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమాన హోదాకూ, నక్షత్రం వారి ఐకమత్యానికీ నిదర్శనం. పక్కనున్న అర్ధ చంద్రుడు వారి అధికారిక మతం ఇస్లాంకు ప్రతీక.
మలేషియాలో 40,000 సంవత్సరాలకు ముందు ఆధునిక మానవుడు నివసించినట్టు ఆధారాలు దొరికాయి. క్రీస్తుశకం మొదటి శతాబ్దం నుంచి ఇక్కడికి భారత్‌, చైనా నుంచి వ్యాపారులు వలసవచ్చారట. రెండో, మూడో శతాబ్దాల్లో వాణిజ్య రేవులు, తీర ప్రాంత నగరాలు నిర్మించుకున్నారు. దీంతో ఈ దేశ ప్రజలపై భారతీయ, చైనా సంస్కృతులు, సంప్రదాయాల ప్రభావం పడటం మొదలైంది. వీధి గోడలపై బొమ్మలేసే కళకు ఇక్కడ చాలా ఆదరణ ఉంది. అందుకే ఇక్కడి వీధుల్లో ఎక్కడ చూసినా, ముఖ్యంగా కౌలాలంపూర్‌లో గోడలపై చాలా బొమ్మలు కనిపిస్తుంటాయి. మనిషికి దగ్గర పోలికలతో ఉండే తోకలేని కోతులు ‘ఒరాంగుటాన్లు’ తెలుసుగా. ప్రస్తుతం ఇవి ఈ దేశ సమీపంలోని బోర్నియో, సుమత్ర దీవుల్లో మాత్రమే ఉన్నాయి.
ప్రపంచంలోనే విడిపోకుండా ఉన్న అతి పెద్ద ఆకు ఇక్కడి సాభాలో ఉంది. అది అలొకాసియా మక్రోరైజ మొక్కది. 3.2 మీటర్ల పొడవు, 1.92 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక్కడున్న వలసదారుల్లో చైనీయులు, భారతీయులే ఎక్కువ.
ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న సింగపూర్‌ దేశం గతంలో మలేషియాలోని ఒక రాష్ట్రం.
మలేషియా 1957 ఆగష్టు 31 న స్వాతంత్ర్యం పొందినది మలేషియా దేశం ఇస్లాం మతాన్ని దేశీయమతంగా నిర్ణయించినా పౌరులకు మతస్వాతంత్ర్యం ఇచ్చింది
ఇస్లాం మతస్థులు ఎక్కువ. తరువాత కొద్ది సంఖ్యలో, హిందువులు, క్రిస్టియన్లు ఉన్నారు.
మలేషియా అధికారిక భాష మలేషియన్ . ప్రామాణికం చేయబడిన మలయా భాషయే మలేషియన్. వాస్తవంగా చారిత్రకమైన అధికారభాష ఆంగ్లభాషే అయినా 1969 జాతి కలవరం తరువాత మలయాభాష అధికారికభాషగా మార్చబడింది. ఆంగ్లం అధికంగా మాట్లాడుతున్న రెండవ భాష అయింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ మరియు గణితం ఆంగ్లభాషలో బోధించబడుతుంది. బ్రిటిష్ ఇంగ్లీష్ ఆధారిత ఆంగ్లభాష మలేషియన్ ఆంగ్లభాషగా గుర్తించబడుతుంది. వ్యాపారంలో మంగ్లీష్ భాషతో ఆంగ్లభాషను కూడా ఉపయోగిస్తుంటారు. మంగ్లీష్ భాష అధికంగా మలేయాభాషను ఉపయోగిస్తూ ఆంగ్లభాష, చైనీస్ భాష మరియు తమిళ్ భాషలను చేర్చి సామాన్యులు మాట్లాడే మిశ్రిత భాషను మంగ్లీష్ అంటారు.
మలేషియాలో చూడవలసినవి :

బాలి పర్యాటకం / Bali tourism
బాలి మలేషియా దేశంలోని ఒక చిన్న అందమైన దీవి. ఈ దీవిలో హిందూసంస్కృతి ఎక్కువ. అంతే కాదు ఎక్కువగా హిందువులే ఉంటారు. నాలుగురోడ్ల కూడలిలో ఎక్కడ చూసినా హిందూ దేవతల విగ్రహాలు ఉంటాయి. శబ్ద కాలుష్యం ఉండదు. వాహనాలూ పాదచారులూ ఓ పద్ధతిలో వెళతారు. వీధులు కాస్త ఇరుకు కానీ ట్రాఫిక్‌ నిర్వహణ తీరు బాగుంటుంది. రోడ్ల పక్కన కూడా దేవాలయాల్లో ఉండే ధ్వజ స్తంబాలు ఉన్నాయి. వాటిదగ్గరా నైవేద్యాలు పెడతారు.
ఎటు చూసినా దైవత్వమే…
హిందూ జనాభా బాలిలో 83.5 శాతం ఉందని తేలింది. అది ప్రస్తుతం 93 శాతానికి చేరిందని సర్వేలు తెలుపుచున్నాయి. అందువల్లే అక్కడ ఎక్కడ చూసినా హిందూ ధర్మమే కనిపిస్తుంటుంది.
రుద్రుడు, వినాయకుడు, వరుణుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, రాముడు, సీత, సరస్వతి, కృష్ణుడు… ఈ దేవుళ్లందరినీ వాళ్లూ కొలుస్తారు. రామాయణ, భారత కథలు వాళ్లకి ఆదర్శాలు. వేదాలు, ఉపనిషత్తులు, చతుర్విధపురుషార్థాలు, ఇలవేల్పులు, త్రికాల సంధ్య… వంటివన్నీ అక్కడ ఆచరణలో ఉన్నాయి. కుంకుమ ధరించరు. విభూతి, అక్షతలు పెట్టుకుంటారు. మగవారు ధోతీలూ ప్యాంటూ షర్టులూ ధరిస్తే, ఆడవాళ్లు లుంగీ, కుర్తీ ధరిస్తారు.
బాలిలో చిన్నాపెద్దా దేవాలయాలను కలిపితే మొత్తం వెయ్యికి పైగా ఉన్నాయి.
పవిత్ర జలదేవాలయం!
తంపక్‌సిరింగ్‌ జిల్లాలోని మనుకాయ గ్రామంలో ఉన్న జలదేవాలయాన్ని తీర్థ ఎంపల్‌ ఆలయం అనీ అంటారు. అక్కడ చాలా కోనేరులు ఉన్నాయి. వాటిల్లోకి దేవాలయంలోనే ఉన్న ఓ నీటి ఊట నుంచి పవిత్రజలం వస్తుందంటారు. ఈ ఆలయం ఇంద్రుడి సృష్టి అనీ ఈ నీళ్లలో స్నానం చేసినా, తలపై జల్లుకున్నా పవిత్రత సిద్ధిస్తుందనీ బాలి వాసుల నమ్మకం.
ఉలువతు దేవాలయం –పెకాటు
పెకాటు గ్రామంలోని ఉలువతు దేవాలయం సముద్ర అలలు తాకుతున్న ఓ ఎత్తైన కొండ అంచుమీద కట్టిన దేవాలయం. ఉలు అంటే అంచు, వతు అంటే ఎత్తైన కొండ అని అంటారు. ఆలయంలోపల ఉన్న ప్రధాన దైవం రుద్రుడు. అక్కడ పెద్ద శివలింగం ఉంది. పద్మాసన అనే ప్రార్థనాస్థలం కూడా ఉంది. గజ గుహాలయం!
బెడలు గ్రామంలో గజా నదీ ప్రవాహ సమీపంలో ఓ గుహ ఉంది. పచ్చని చెట్లూ రంగురంగుల పూలూ కోనేరూ దేవతా విగ్రహాలూ… ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ గుహ మరో విశేషం. గుహ ముఖ ద్వారం, చుట్టూ ఉన్న చెక్క శిల్పాలూ పాత జానపద చిత్రాల్లోని గుహల్ని గుర్తుకుతెచ్చాయి. గుహ లోపల ఓ వైపు వినాయకుడు, మరో వైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఏ గుడిలోనూ పూజారులు డరు. తీర్థ ప్రసాదాలు అసలే ఉండవు. కానీ పూజారులు దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెట్టి వెళ్లిపోతారు. దేవాలయానికి వెళ్లే ప్రతీ వ్యక్తీ ధోతీ ధరించాలి. స్త్రీలు నడుముకు కాషాయరంగు వస్త్రాన్ని కట్టుకోవాలి.
పాండవబీచ్…..
దీనికి దగ్గరలో ఉన్న గుహల్లో కుంతీ దేవి, పంచపాండవుల విగ్రహాలు ఉన్నాయి. అరణ్యవాసంలో పాండవులు ఇక్కడ కొంతకాలం ఉన్నారని బాలివాసుల నమ్మకం. బాలిలో అత్యంత ముఖ్యమైన తనహ్‌ లాట్‌ దేవాలయం దగ్గర సూర్యాస్తమయం చూడదగింది.
ఎటుచూసినా ప్రకృతి అందాలే
బాలిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లూ రంగురంగుల పూలూ కనువిందు చేస్తుంటాయి. సముద్రతీరాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి. కింతామణి అనే అగ్నిపర్వతం ఈ ద్వీపానికే ప్రత్యేకత. వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా పొగమంచు కమ్మేసినట్లుగా ఉంటుంది. వెదురు గడలతో కట్టిన వంతెనలూ, రోడ్ల పక్కన చెక్కతోనూ రాతితోనూ చేసిన రకరకాల బొమ్మలూ, అందమైన వస్తువులతో కూడిన అక్కడి దుకాణాలూ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటాయి.
వెండి నగిషీ వస్తువుల తయారీకి కూడా బాలి ద్వీపం ప్రసిద్ధి చెందింది. అవి కళ్లు చెదిరే అందాలతో మెరుస్తుంటాయి. రామాయణ భారత కథలూ, ధర్మసంరక్షణకోసం పోరాడిన వారి గాథలూ, ప్రాచీన, ఆధునిక నాగరికతలు ప్రతిబింబించే అనేకానేక కార్యక్రమాలను బాలిలో విభిన్న రూపాల్లో నిత్యం ప్రదర్శిస్తుంటారు. మనదేశంలో వాల్మీకి రామాయణం ప్రాచుర్యంలో ఉంటే, అక్కడ కంబ రామాయణం ప్రసిద్ధి.. ఉలువతు స్టేడియంలో ప్రతిరోజూ రామాయణ జానపద నృత్య ప్రదర్శన చేస్తుంటారు
నూసాడువా బీచ్‌
ఈ దీవిలో జలక్రీడలూ, సాహసక్రీడలూ ఉన్నాయి. బినోవా హార్బరులోని బౌంటీక్రూయిజ్‌కి బాగుంటుంది. ప్రముఖ నటరాజ రామకృష్ణగారి జన్మస్థలం కూడా బాలి.
శ్రావణ పూర్ణిమ. అది బాలీలోని హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. పురుషులు ధోతీ చొక్కా తలపాగా టోపీ ధరిస్తే, స్త్రీలు లుంగీ, కుర్తీ, తలకు స్కార్ఫ్‌ ధరించారు. వాళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. చూడాలేగానీ బాలిలో ఎన్నో ప్రకృతి అందాలూ… హిందూ ఆలయాలూ… కనబడతాయి.

కౌలాలంపూర్ బర్డ్ పార్క్……
కౌలాలంపూర్ బర్డ్ పార్క్ను ఏ ఒక్కరూ మిస్ కారు. స్వేచ్ఛగా సంచరిస్తోన్న పక్షుల మధ్య మనుషులు కూడా తిరిగే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు! ప్రపంచంలోని ఈ తరహా పార్కుల్లో ఇదే అతి పెద్దది. పెద్ద పెద్ద నెమళ్లతో సహా 200 రకాల దేశ, విదేశీ పక్షులున్న ఈ పార్కులో జలపాతం, యాంఫీ థియేటర్, బర్డ్ స్కూల్, ఫ్లెమింగో పాండ్, కియోస్క్… ఇలా రకరకాల ఆకర్షణలున్నాయి.
ట్విన్ టవర్స్ వంటి ఆకర్షణలతో పాటు కౌలాలంపూర్లో భారీ షాపింగ్ మాల్స్కు కొదవ లేదు. చైనా టౌన్ను ఆనుకుని ఉండే పురాతన సెంట్రల్ మాల్కి అయితే ఓ ప్రత్యేకత ఉంది. అందులోని ఒక బ్లాకు మొత్తం ఆర్టిస్టులు, వారి పెయింటింగ్స్ తో నిండి ఉంటుంది. కమల్హాసన్, రజనీకాంత్, శివాజీ గణేశన్ వంటి సౌత్ స్టార్ల పెయింటింగ్లూ కనిపిస్తాయక్కడ.
రాయల్ సెలంగూర్ అనేది ఉన్నత స్థాయి కళాకృతుల చెయిన్. ఇక్కడి వస్తువులన్నీ ‘ప్యూటర్’తో తయారైనవే. ప్యూటర్ అంటే దాదాపు తగరమే కానీ… 1 నుంచి 15 శాతం వరకూ రాగి, ఆంటి మొనీ, సీసం, వెండి వంటి ఇతర లోహాలూ కలుస్తాయి. అందుకే ధర రూ. 3 వేల నుంచి రూ.3 కోట్ల వరకూ ఉంది.
ఇక కౌలాలంపూర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హిందూ యాత్రాస్థలం ‘బటు గుహల’ గురించి. బంగారు వర్ణంలో మెరిసే భారీ మురుగన్ విగ్రహం స్వాగతం పలుకుతుండగా… కొండపైన ఉంటాయి ఈ గుహలు. ప్రధాన గుహ వద్ద మురుగన్ ఆలయం… లోపల ఇతర ఆలయాలు ఉంటాయి. కౌలాలంపూర్కు 40 నిమిషాల దూరంలో నిర్మించిన పాలన రాజధాని పుత్రజయ కూడా సందర్శకుల స్పెషలే.
నీటిపై తేలుతున్నట్లుగా కనిపించే అతి పెద్ద మసీదు, రోడ్డు చివర నుంచి చూసినా ఠీవిగా కనిపించే ప్రధాని కార్యాలయం, 70 ఎకరాల బొటానికల్ గార్డెన్, 76 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆఫీసులు, 39 ఇతర ప్రభుత్వ భవనాలు, 3000 మంది సమావేశమయ్యే కన్వెన్షన్ సెంటర్… ఇవీ పుత్రజయ విశేషాలు.
మద్యం కానీ, నైట్క్లబ్లు గానీ ఉండవిక్కడ. రెండు నదుల్ని కలిపేసి… వాటి మధ్య దీవిలా నిర్మించారు దీన్ని.
కౌలాలంపూర్ ఎయిర్పోర్టు సమీపంలో నిర్మించిన సెపంగ్ రేసింగ్ సర్క్యూట్లో తరచూ జరిగే ఫార్ములావన్, బైక్ గ్రాండ్ప్రిక్స్ తదితర ఈవెంట్లకు విదేశాల నుంచి భారీగా అభిమానులు వస్తుంటారు.
మలక్కా….
మలక్కా గురించి చెప్పాలంటే, అది ప్రధానంగా సాంస్కృతిక నగరం. ఇక్కడి కట్టడాల్లో డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ నిర్మాణ శైలి కలినిస్తుంది. మలక్కా వరల్డ్ హెరిటేజ్ సిటీ, హార్మొనీ స్ట్రీట్లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హెరిటేజ్ సిటీ హస్త కళాకృతుల కేంద్రం కాగా… హార్మొనీ స్ట్రీట్లో పురాతన హిందూ ఆలయం, చర్చి, మసీదు పక్కపక్కనే కనిపిస్తాయి. మ్యూజియములూ ఎక్కువే. మలక్కా మొత్తాన్నీ చూపించే బోట్ క్రూజ్ కూడా చూడాల్సిందే.
జొహోర్ బహ్రు రాష్ట్రం ……..
మలక్కా తరవాత వచ్చేది జొహోర్ బహ్రు రాష్ట్రం. సింగపూర్ను ఆనుకుని ఉండే ఈ రాష్ట్రంలో… ఆసియాలోనే మొట్ట మొదటి లెగోలాండ్ థీమ్పార్క్తో పాటు పిల్లల కోసం హలోకిట్టీ థీమ్పార్క్ ఉన్నాయి. జొహోర్ శివార్లలో… అర్మాని, బర్బెర్రీ, జెగ్నా, కెల్విన్ క్లీన్, మిఖాయెల్ కోర్స్ వంటి 80కి పైగా విదేశీ దిగ్గజ బ్రాండ్లు ప్రత్యేక ఔట్లెట్లలో కొలువుదీరి ఉంటాయి. 25 శాతం నుంచి 65 శాతం డిస్కవుంట్తో విక్రయాలు చేయటం ఇక్కడ ప్రత్యేకం. సింగపూర్కు జొహోర్ సమీపంలోనే ఉండటంతో… అక్కడి నుంచి వచ్చి కొనుగోళ్లు చేసేవారు కూడా ఎక్కువే.
Kulalampur, Balu Caves, Genting, Highlands, Kaulalampur Tower, Merdeka Tower, Kaulalampur City centre,Petronas Towers, KLCC Park, Colonial Architecture, Golden Trangle…Kaulalampur Bird Park, Butterfly Park, National Muesuem ….. ఇంకా ఎన్నో ఉన్నాయి.
మరిన్ని వివరాలకోసం మలేషియా అధికారిక వెబ్ సైట్ ను చూడండి…
http://www.malaysia.travel/en/in
మలేషియాలో తెలుగువారికి సంబంధించిన అసోసియేషన్ ఉంది…..వివరాల కోసం….
Telugu Association of Malaysia
9-1A, Udarama Complex
Jalan 1/64A, Off Jalan Ipoh
53500 Kuala Lumpur
Malaysia
Website : http://www.telugu.org.my
Email Id : tamhq@telugu.org.my

%d bloggers like this: