Posted in కవులు

కాళిదాసు మహాకవి

సంస్కృత భాషలో కవికుల గురువు, ప్రపంచంలోనే ఆగ్రశ్రేణి కవులలో ఒకరుగా పరిగణించబడుతున్న మహాకవి కాళిదాసు.
క్రీ.శ. ప్రధమార్ధం వాడని, 4 వ శతాబ్ధానికి చెందినవాడని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్రమార్కుని ఆస్ధానంలో వాడని, భోజరాజు ఆస్థానంలో వాడని మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్కమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడని చరిత్రకారులు భావిస్తున్నారు. .
కాళిదాసు రచించిన కావ్యాలలో ప్రధానమైనవి ఋతు సంహారం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం. కాళిదాసు రచించిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం. .
పురాకవీనాం గణన ప్రసంగే.
కనిష్ఠికా ధిషిటత కాళిదాసః.
అద్యాపి తత్తుల్య కావే రభావాత్.
అనామికా సార్ధ వతీ టూవ.
మన చేతివ్రేళ్లలో ఉంగరపు వ్రేలును సంస్కృతంలో అనామిక (పేరులేనిది) అంటారు. ఆ వ్రేలు అనామిక అనడానికి కారణం పూర్వ మహాకవులను లెక్కపెడుతూ మొదట కాళిదాసు అని చిటికెన వ్రేలు ముడిచారట. అంత గొప్పకవి మరి కనిపించకపోవటం వలన ప్రక్కనున్న ఉంగరపు వ్రేలును ముడవటం కుదరలేదట. అందుచేత ఆ వ్రేలు అనామిక అయింది. భారతీయులు కాళిదాసు మహాకవికి ఇచ్చే గౌరవ స్ధానాన్ని ఈ శ్లోకం చాటుతుంది.

కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు మాళవికాగ్నిమిత్రము విక్రమోర్వశీయము అభిజ్ఞాన శాకుంతలము వీటిలో అభిజ్ఞానశాకుంతలం అత్యంత ప్రాచుర్యము పొందిన నాటకము ఈ నాటకం ఆంగ్లంలోకి జర్మను లోకి కూడా అనువదించబడింది ఇలా అనువదించబడిన మొదటి కాళిదాసు రచన ఇది. మాళవికాగ్నిమిత్రము అగ్ని మిత్రుని యొక్క ప్రేమ గాధ ఇందులో అతని మిత్రుడు బహిష్కృతులు అయినా మాళవికను ఒక సేవ యొక్క ఛాయాచిత్రం చూసి ఆమెను ప్రేమించాడు ఈ విషయం తెలిసిన రాణి మాలికను కారాగృహ స్పందించింది కానీ విధి యొక్క లీలావిలాసం వల్ల చివరికి మాళవిక ఒక రాజు కుమార్తె అని తెలిసి వారిరువురు బంధానికి గల అడ్డంకులు తొలగిపోతాయి ఇలాయి కదా చెబుతుంది.

అభిజ్ఞాన శాకుంతలము దుష్యంత మహారాజు గూర్చి ఈ కథ చెప్పడం జరుగుతుంది దుష్యంతుని కి మహర్షి కలిగించి పెంచబడిన శకుంతల కనబడుతుంది అలా కలిసినప్పుడు ఇలా ప్రేమగా మారుతుంది ఆ తర్వాత కథల శాఖ శకుంతలను వివాహమాడెను చేస్తుంది వీటిలో దుష్యంతుడు కొన్ని పరిస్థితుల్లో శకుంతలను అక్కడే విడిచి రాజ్యానికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది ఇలా ఈ అభిజ్ఞాన శాకుంతలము సాగుతుంది.
కాళిదాసు ఇతర కావ్యాలు కుమార సంభవం రఘు వంశం మేఘ సందేశం ఋతు సంహారం బాగా చెప్పుకోదగ్గది. కాళిదాసు కాలము కాళిదాసు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి ఐదవ శతాబ్దం మధ్య కాలం వాడు కాళిదాసు యొక్క జీవితకాలం పై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చరిత్రకారుల్లో ఉన్నాయి. ఈ అభిప్రాయం ప్రకారం కాళిదాసు అగ్ని మిత్రుడు అశోకుడు రాజ్య పాలన గావించిన మధ్య కాలము నందు యాదవ కులం లో జీవించాడని వాదన.
మహాకవి కాళిదాసు సినిమా మహాకవి కాళిదాసు సినిమా సంస్కృత కవి కాళిదాసు గారి జీవిత కథ ఆధారంగా 1960వ సంవత్సరంలో తీయబడింది ఈ చిత్రంలో ఒక కమలాకర కామేశ్వర రావు గారు దర్శకత్వం వహించారు కాళిదాసు పాత్రను అక్కినేని నాగేశ్వరావు గారు పోషించారు నిజంగా ఈ చిత్రం చూడదగ్గది ఎస్వీ రంగారావు రేలంగి శ్రీరంజని రాజసులోచన సి.ఎస్.ఆర్ లింగమూర్తి సూరిబాబు కెవిఎస్ శర్మ సీతారం తారాగణం చేశారు పింగళి నాగేంద్రరావు కథ అందించారు పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు ఘంటసాల వెంకటేశ్వరరావు మాధవపెద్ది సత్యం పి.సుశీల పి.లీల పి జి కృష్ణవేణి తదితరులు నేపథ్య గానం చేశారు.

ఈ చిత్రంలో పాటలు కూడా చెప్పుకోదగ్గవి అవునులే అవునులే రసిక రాజు మని రాజ్యసభలో నన్ను చూడు నా కవనం చూడు వంటి పాటలు ఆకర్షించు పడ్డాయి. కాళిదాసు మేఘసందేశం కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్న కావ్యం కాళిదాసు రచనల్లో సంస్కృత సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది మేఘసందేశం లేదా మేఘదూతం సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక గొప్ప కావ్యం కాళిదాసు రచించిన కావ్యం అనే పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s