దేవస్థానం వారి వసతి సౌకర్యాలు
ద్వారావతి భక్తినివాస్ : బస్‌స్టాండ్ నుండి నడచి వెళ్ళవచ్చు ( ధర్మశా తరువాత రెండు నిమిషాలప్రయాణం) 334 రూములు. సత్రాలు, 6 నుండి 10 మంది సభ్యులకు సరిపోవు రూములు కలవు. 80 ఎ.సి రూములు కలవు. పార్కింగ్ స్పేస్, 24 గంటలు నీటివసతి, కరెంట్ సౌకర్యం కలదు.
సామాన్య భక్తులకు : కామన్ బాత్ రూమ్స్, టాయ్‌లెట్స్ : రూ.50 మాత్రమే.
ఎ.సి. సూట్స్ : ఒక రోజుకు రూ.700
భక్తినివాస్ (కొత్తది)542 రూములు గల విశామైన కాంప్లెక్స్ సాయి మందిరానికి దక్షిణము వైపున గల హైవేలో ఉన్నది. షుమారు 1 కిలో మీటరు దూరం. మందిరం కాంప్లెక్స్ నుండి న్యూ భక్తినివాస్కు 24 గంటలు ఉచిత బస్సులు కలవు. పార్కింగ్ సౌకర్యం, 24 గంటలు విద్యుత్ మరియు నీటి సౌకర్యం, ఫలహారశాలు కలవు. సోలార్ సిస్టమ్ ద్వారా వేడినీటి సౌకర్యం.
ధర్మశాల ప్రాంగణం
మందిరాని దక్షిణ పశ్ఛిమ దిశలో మరియు బస్స్టాండ్నకు పశ్చిమ దిక్కులో కలదు.15 నుండి 80 మంది గల సభ్యులకు విశాలమైన వసతి సదుపాయం సాధారణ రుసుముతో (ఒక్కొక్కరికి రూ.13. రూపాయలు)పార్కింగ్ స్పేస్, 24 గంటలు నీటి, కరెంట్ వసతి. పహారశాల కలదు
సాయి ప్రసాద్ భక్తి నివాస్ 1 మరియు 2 : ఇక్కడ భక్తుల కోసం165 గదుల మరియు లాకర్ల సౌకర్యం కలదు. (సమాధి) ఆలయ సముదాయానికి ఉత్తరము వైపున కలదు
సాయినివాస్ (వి ఐ పి) వసతి గృహం: పాత ప్రసాదాలయం సముదాయంలో లడ్డూ కౌంటర్ వెనుక భాగంలో కలదు.
సాయి ఆశ్రమం 1 : భక్తుల కొరకు 1536 రూములు కలవు.పలహారశాల సౌకర్యం కలదు.
సాయిబాబా భజనలు, కీర్తనలు మరియు సాంస్కృతిక కార్య క్రమాల కోసం ఓపెన్ ఎయిర్ ధియేటర్. సాయిబాబా సమాధి మందిరం నుండి దక్షిణ దిశలో నగర్-మన్మాడ్ జాతీయ రహదారిలో అహ్మద్‌నగర్‌కు వెళ్ళే దారిలో కలదు.
ఇతర ఉచిత వసతి సౌకర్యాలు
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య ట్రస్ట్ వారి నిత్యాన్న సత్రం
మతపర భేదం లేకుండా అన్ని వర్గాల వారికి 3 రోజుల పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పించ బడును.(కొద్దిపాటు రుసుము మాత్రమే నిర్వహణ ఖర్చు మాత్రమే) మూడు అంతస్తులలో 320 రూములతో రెండు ఎకరాల వైశాల్యములో కలదు.
అఖిల భారత సిద్ధిక్షేత్ర సాయిభక్త నివాస్ ట్రస్ట్
సాయి ద్వార్ లైన్, పింపుల్ వాడి రోడ్, షిర్డి ఫోన్ : : 02423-256178
శ్రీ ఆనందసాయి అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్ట్
డోర్ నెం.1613, పెంపుల్ వాడి రోడ్, దత్తా నగర్, షిర్డి.
ఫోన్ : 08888988822. 08888479756 దేవాలయం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో కలదు.
స్వామి నిత్యాన్నదానం : మధ్యాహ్నాం 1.00 నుండి 02.30 వరకు రాత్రి 08.00 నుండి 09.00 వరకు
(విరాళాలు ఇవ్వవచ్చు. మీ పేరుమీద అన్నదానం జరుపబడును) వసతి సౌకర్యం కలదు (ఒక్కొరికి రూ.100 మాత్రమే).
ఆలయ ప్రవేశానికి ముందు భక్తులకు సూచనలు
1 సరైన సమాచారం/సహాయం కోసం షిర్డి టెంపుల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న రిసెప్షన్ సెంటర్లో సంప్రదించగలరు. తరువాత సమాచార కేంద్రంలో రూముల కోసం సంప్రదించవచ్చు.
2. సమాధి మందిరం సమీపంలో ఉన్న దేవస్థానం బుక్‌షాప్‌లో సాయిబాబా సాహిత్యం అన్ని భాషలో లభించును.
3. పూజా సామాగ్రి అమ్ము వ్యాపారస్తులతోదేవస్థానమునకు ఎటువంటి సంబంధము లేదు. భక్తులే రేట్లు విచారించి కొనుగోలు చేయగలరు.
4. సమాచార కేంద్రం నందు సామానులు భద్రపరచుకొనుటకు నామమాత్రపు రుసుముతో లాకర్లు లభించును.
5. హారతి మరియు పండుగ సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండుట వలన భక్తులు తమ నగల పట్ల జాగ్రత్తగా ఉండగలరు.
6. బాబావారి పవిత్ర పాదుకలు సాయిబాబా మందిరంలో మాత్రమే కలవు.
7. దేవస్థానంచే నడుప బడుచున్న ప్రసాదాలయం మరి టీ దుకాణంలో భోజనం మరియు టీ తగ్గింపు రేట్లలో పొందగలరు.
8. డొనేషన్స్ ఇవ్వగోరు వారు దేవస్థానం ఆఫీస్ నందు మాత్రమే సంప్రదించగరు.
9. దేవాలయ ప్రాంగణములోనికి సెల్ ఫోన్స్, కెమేరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు. ఈ వస్తువులను మరియు చెప్పులను దేవాలయ ప్రాంగణమునకు దక్షిణ వైపున దేవస్థానం వారి చెప్పుల స్టాండ్ వద్ద భద్రపరచుకోవచ్చు.
10. ప్రసాదం కౌంటర్లు : భక్తుకుల గమనిక షిర్డి సంస్థానం (కో ఆపరేటివ్ సొసైటీ) వారిచే నడుపబడుచున్న కౌంటర్ల నందు మాత్రమే భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేయగరు.
కౌంటర్ల వివరాలు :
11. 2 మరియు 3 గేట్ల బయట ప్రక్కన, 5 సమాధుల వెనుక
12.లడ్డూ ప్రసాదం : లడ్డూ ప్రసాదాు 1వ గేటు ఎదురుగా, పాత ప్రసాదాలయం బిల్డింగ్‌లో మాత్రమే అమ్మబడును. ఉదయం 6 గంట నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మబడును.ఒక్కొక్క పాకెట్ ఖరీదు రూ.10 మాత్రమే. ఒక పాకెట్లో 3 లడ్డూలు ఉండును.
13. సాయిబాబా వారి శేష వస్త్రాలు : సాయిబాబా వారికి కప్పబడిన శేష వస్త్రాలు ఇక్కడ అమ్మబడును. మరియు సాయిబాబా వారిని ముద్రించిన బంగారు, వెండి నాణెము అమ్మబడును. ఇది రైల్వే బుకింగ్ ఆఫీసు మరియు డొనేషన్లు స్వీకరించు ఆఫీసుకు దగ్గరలో కలదు (2వ గేటుకు దగ్గరలో)
కియోస్క్ (టచ్ స్క్రీన్స్) సౌకర్యం
సాయిసంస్థానం గురించి మరింత సమాచారం కోసంసాయి సంస్థానం వారు రెండు కియోస్క్ లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.భక్తులు వీటి ద్వారా భక్తినివాస్ సమాచారం, సంస్థానం వారి పబ్లికేషన్స్, బస్ మరియు రైళ్ళ సమయలు మొదలగు వాటి గురించి తెలుకోవచ్చును. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇవి పనిచేయును.
రైల్వే బుకింగ్ ఆఫీస్ – షిర్డి: సాయిభక్తు సౌకర్వం కోసం రైల్వేవారు షిర్డిలో పారాయణ్ హాల్ దగ్గర కంప్యూటరైజ్డ్ బుకింగ్ ఆఫీసును నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుండి దేశంలో అన్ని ప్రాంతాకు టికెట్లు రిజర్వ్ చేయుంచుకొనవచ్చు. రిజర్వేషన్ స్టేటస్‌ను విచారించుకొనవచ్చును. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రిజర్వేషన్ కౌంటర్ పనిచేయును.
షిర్డికి దగరలో 5 రైల్వే స్టేషన్స్ కలవు
అవి : సాయినగర్ 2 కి.మీ దూరం
కోపర్గాన్ 16 కి.మీ. దూరం
శ్రీరాంపూర్ 39 కి.మీ.
నాగర్సోల్ 55 కి.మీ
మన్మాడ్ 60 కి.మీ.
ఈ స్టేషన్ ల నుండి షిర్డికి దేవస్థానం వారు బస్సులు నడుపుచున్నారు.
బాబా దర్శనవేళలు మరియు పూజలు
ఉదయం 04-00 – గుడి తెరచు సమయం
ఉదయం 04-15 – భూపాలి
ఉదయం 04-30 – కాకాడ్ ఆరతి
ఉదయం 05-00 – భజన
ఉదయం 05-05 – మంగళ స్నానం
ఉదయం 05-35 – ఆరతి – షిరిడి మహే పండరీపూర్
ఉదయం 05-40 – భక్తులకు సాయి సమాధి మందిరం దర్శనం మొదలు
ఉదయం 09-00 – అభిషేక పూజ
ఉదయం 07,9,1011 – సత్యన్నారాయణ స్వామి పూజ
ఉదయం 11-30 – ధుని పూజ (అన్నం నెయ్యితో)
మధ్యాహ్నం 12-00 – మధ్యాహ్న ఆరతి
సాయంత్రం 04-00 – పోతి ( భక్తి కార్యక్రమాలు)
రాత్రి 08-30, 1000 – ధూన్ ఆరతి భక్తి పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు
రాత్రి 09-00 – చావడి మరియు గురుస్థాన్ మూసివేయబడును
రాత్రి 09-30 – బాబా వారికి ద్వారకామాయి నీరు ఇవ్వబడును. బాబా వారికి దోమతెరవేయబడును
రాత్రి 09-45 – ద్వారకామాయి పైభాగం మూసివేయబడును
రాత్రి 10-30 – షెజ్ ఆరతి, బాబా వారికి శాలువా చుట్టబడును. బాబా మెడలో రుద్రాక్ష మాల ధారణ, బాబాకి దోమతెర వేసి అందులో గ్లాసుతో మంచినీరు పెట్టబడును
రాత్రి 11-15 – రాత్రి ఆరతి తరువాత మందిరం మూసివేయ బడును.
దేవాయాలనికి ప్రవేశ మార్గాలు
ప్రధాన ప్రవేశ ద్వారం : పింపుల్ వాడి రోడ్లో వున్న 2వ గేటు ప్రక్క న వున్న ప్రధాన ప్రవేశ ద్వారం దర్శనానికి వెళ్ళుట ఉత్తమం. ఇక్కడ క్వూ కాంప్లెక్స్ నుండి శాంతి హాల్‌కు తరువాత భక్తి హాల్ ఇక్కడ నుండి ఇంకా 6 ద్వారములు (కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య ద్వారములు)కలవు. మొత్తం తొమ్మిది ద్వారములు (నవ విధ భక్తి ద్వారములు) దాటిన తరువాత బాబావారి సమాధి మందిరానికి ప్రవేశం.
గెట్ 1 : ఆలయానికి పశ్ఛిమ దిశలో నగర్-మన్మాడ్ రోడ్డులో కలదు. ఈ గేటు ద్వారా భక్తులు ఆలయ ప్రాంగణములోనికి మాత్రమే ప్రవేశించగరు. సాయిబాబా వారిని దూరం నుండి కిటికీ ద్వారా ముఖదర్శనం మాత్రమే చూడవచ్చు. సాయిబాబా వారి విభూది తీసుకోవచ్చు. మ్యూజియం మరియు సమాధుల చూడవచ్చు.
లెండీ బాగ్ తోట, సాయిబాబావారి బావిని చూడటానికి వీలు పడదు. ఈ గేటు ద్వారా ప్రవేశించిన వారు 4 వ గేటు ద్వారా బయటకు రావచ్చు. పింపుల్ వాడి రోడ్లో వున్న 2వ గేటు ప్రక్క న వున్న ప్రధాన ప్రవేశ ద్వారం దర్శనానికి వెళ్ళుట ఉత్తమం.
గేట్ 3 : తూర్పు వైపున ఉన్న ఈ మార్గం పింపుల్ వాడి రోడ్ నుండి బయటకు దక్షణముఖ హానుమాన్ మందిరం, ద్వారకా మాయి, చావిడి,అబ్దుల్ బాబా ఆశ్రమమునకు వెళ్ళును. ఇక్కడ ఎడమ ప్రక్కనుండి సాయిబాబా ముఖదర్శనము మాత్రమే సాధ్యము. కుడి ప్రక్క నుండి నడవలేని వృద్ధులు, వికలాంగుకు మాత్రమే ప్రవేశము. వీరు తోడుగా ఒకరిని తీసుకు వెళ్ళవచ్చు.
సాయిబాబా మందిరంలో చూడ వలసినవి
మ్యూజియం
దీక్షిత్ వాడా ప్రక్కన మరియు గురుస్థాన్కు ఎదురుగా ఉన్నది. సాయిబాబా వారు వాడిన అనేక వస్తువులు ఇందులో ఉన్నవి. మ్యూజియం రెండు అంతస్తులలో కలదు.
ఉదయం మ్యూజియం 6-00 గంటకు తెరచి రాత్రి 09-00 గంటలకు మూయబడును
గురుస్థాన్
సాయిబాబా మందిరం నుండి బయటకు వచ్చు మార్గంలో కలదు. గురుస్థానంలో ఉన్న వేప చెట్టుకు భక్తులు 108 ప్రదక్షణు చేయటం రివాజు. ఇందు కోసం పాత గురుస్థాన్ ట్రస్ట్ వారిచే ఆధునీకరించబడినది.
టాకియా
గురుస్థాన్ ప్రక్కన, దీక్షిత్ వాడకు తూర్పు వైపున వేప చెట్టుకు ఎదురుగా ఉన్నది. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇటీవల కట్టబడినది. ఇది ఫకీర్లు విశ్రాంతి తీసుకొనే చోటు. మొదటిసారి బాబా వారు షిర్డి వచ్చినపుడు ఇక్కడ కొంత కాలం విశ్రాంతి తీసుకునేవారు.
లెండీ బాగ్ (లెండీ తోట)
లెండీ బాగ్ చూచుటకు భక్తులు 4 వ నెంబరు గేటునుండి ప్రవేశించవలసి యున్నది. ఇక్కడ దత్త మందిరం, గణపతిని మరియు బాబా వారు ఉపయోగించిన బావిని దర్శించవచ్చు. ఇటీవల లెండీ బాగ్‌లో సంస్థానం వారిచే కృత్రిమ వాటర్‌ఫాల్ ఏర్పాటు చేయబడినది.
నందదీప్
సాయిభక్తులు నందదీప్లో 108 ప్రదక్షిణలు చేయటం రివాజు. నందదీప్ చూడగోరు వారు 1వ నెంబరు గేటు లేక 3వ నెంబరు గేటు ద్వారా మాత్రమే ప్రవేశించగరు.
వేపచెట్టు
ఇది నందదీప్‌కు ఎడమ ప్రక్కన ఉన్నది. ఈ చెట్టు బాబాగారిచే స్వయంగా నాటబడినది. బాబా గారి జీవితంలో రోజూ ఈ చెట్టు క్రింద 2 నుండి 3 గంటల పాటు గడిపేవారు.
పీపుల్ చెట్టు
నందదీప్‌కు కుడి ప్రక్కన ఉన్నది.ఈ చెట్టు క్రింద కూడా బాబా గారు రోజూ 2 నుండి 3 గంటలు పాటు గడిపేవారు.
బాబావారు వాడిన బావి
కాంపౌండ్ వాల్‌కు కుడి ప్రక్కన ఉన్నది. సాయిబాబా చావిడి : సాయిబాబా వారి చావిడి అబ్దుల్ బాబా వారి ఆశ్రమమునకు ఎదురుగా ఉన్నది. ఇది రెండు భాగాలుగా విభజింపబడినది. ఎడమ ప్రక్క భాగంలోనికి ఆడవారికి మాత్రమే ప్రవేశం. కుడిప్రక్క భాగంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం. ఇది బాబా వారు రోజూ నిద్రించిన చోటు.
శని సింగనాపూర్
సూర్యభగవానుని పుత్రడైన శని దేవుడు ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవుడు. శని సింగనాపూర్ గ్రామంలో ఇళ్ళకు తలుపులు ఉండవు. శనిదేవుడే దొంగల బారి రక్షిస్తాడని గ్రామస్థుల నమ్మకం. నగర్-మన్మాడ్ రోడ్‌కు తూర్పున షుమారు 50 కి.మీ. దూరంలో శని సింగనాపూర్ కలదు. షిర్డి సంస్థానం వారి బస్సులు మరియు ప్రైవేటు వాహనములలో వెళ్ళ వచ్చును.
దేవస్థానం వారి ప్రసాదాలయం (భోజనశాల)
భక్తుల సౌకర్యం కోసం షిర్డి సంస్థాన్ వారు అత్యాధునిక భోజనశాల ఏర్పాటు చేశారు. నామమాత్రపు ధరతో కేవలం ఒకరికి రూ.10 తో భోజనం లభిస్తుంది. ఒక రోజుకు లక్షమంది భక్తులకు ఏర్పాట్లు గలవు. ప్రతి రోజు 30 నుండి 35 వేల మంది భోజనం చేస్తారు. పండుగలు మరియు సెలవులో 70 నుండి 80 వేల మంది భోజనం చేస్తారు. సంస్థానం వారు సంవత్పరానికి 190 మిలియన్ రూపాయలను భోజనం కోసం ఖర్చు పెడతారు. ప్రసాదాలయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రసాదం ముందు బాబా వారికి సమర్పించిన తరువాత భక్తులకు వడ్డిస్తారు. భక్తు అన్నదానంకు డొనేషన్స్ ఇవ్వవచ్చు. భక్తులకు నెలవారీ భోజన టికెట్స్ ఇస్తారు.
షిర్డి సంస్థానం వారు పాత ప్రసాదాలయం ఎదురుగా ఉన్న 2వ గేటు దగ్గర నుండి (లడ్డూ కౌంటర్ దగ్గర) ప్రసాదాలయంనకు ఉదయం గం॥ 09-30ని॥ నుండి రాత్రి 09-00 గంట వరకు ఉచిత బస్సులు నడుపుచున్నారు.
You must log in to post a comment.