వివిధ రకాల చీరలు

వెంకటగిరి చీరలు

వెంకటగిరి పేరు చెబితే గుర్తుకు వచ్చేది జీరీ చీరె. ముడున్నర శతాబ్ధాల చరిత్ర ఉన్న ఈ చీరెలను అతి సన్నని నూలు పోగుతో నేయటం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. వెంకటగిరి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక కళాకారుల సమూహం నివసించే గ్రామం. ఈ గ్రామం ఇదివరకు వెంకటగిరి రాజుల రాజవంశం పరిపాలనతో ఉండేది. ఇక్కడ తయారయ్యే చీరలలో వెంకటగిరి చీరలు మరియు రాజమాత చీరలు ప్రసిద్ది చెందినవి. వార్ప్ మరియు వెఫ్ట్ కోసం 100 మరియు 120 కౌంట్ లతో నూలుతో చక్కగా తయారైన అడ్డపోగులను ఉపయోగిస్తారు. ఈ చీరలు సాధారణ బంగారు అంచులతో నేయబడి పల్లూ మాత్రం బుటా వర్క్ తో నేయబడినవి జమ్దాని పద్ధతిలో పనిచేసే మందమైన రంగుల నూలుతో కలిపి నేయబడినవి. వెంకటగిరికి చెందిన దాదాపు 14 మంది కళాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 12 మందికి జాతీయ అవార్డులు, ఇద్దరికి ‘సంత్ కబీర్’ అవార్డులు లభించాయి. వెంకటగిరి నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరుకు బస్సు మరియు రైలు సౌకర్యం కలదు. నెల్లూరు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా. ఇక్కడ పేరుపొందిన దేవాలయాలు జొన్నవాడ కామాక్షిదేవి, తల్పగిరి రంగనాధ స్వామి ఇంకా అనేక దేవాలయాలు కలవు.
వెంకటగిరి చీరలకోసం ఈ వెబ్ సైట్ దర్శించండి
http://www.apcofabrics.com/venkatgiri.html

గద్వాల్ చీరెలు

గద్వాల్ చీరెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 2008 సం.లో ఈ చీరెలకు పేటెంట్ దక్కింది. గతంలో చేతితో డిజైన్లు వేసేవారు. ప్రస్తుతం కంప్యూటర్ సహాయంతో జాకార్డులతో డిజూన్లు రూపొందిస్తున్నారు. ప్రస్తతం 60 శాతం పైటానీ రకం చీరెలు తయారవుతున్నాయి.
గద్వాల్ చీరలలో కాటన్ ఎనభైశాతం, కొంగు, అంచులలో 20 శాతం సిల్క్ ఉంటుంది. ఈ చీరలు నేసే పద్ధతి మిగతా చీరల కంటే భిన్నంగా కష్టంగా ఉంటుంది. కుట్టు లేదా సిల్క్ అంచులను బట్టి గద్వాల చీరలను కనిపెట్టవచ్చు. బంగారు, రాగిపూత గల దారాలతో చిన్న, పెద్ద, మీడియం, ఒకవైపే ఉండేటట్లు రకరకాలుగా అంచులుంటాయి. ఈ చీరలు కాస్త బరువుగా ఉంటాయి చీర అంచులలో నెమళ్లు, లతలూ, పూలు చాలా రకాలలో ఉంటాయి. చీర మధ్య మధ్యలో పూలు, బుటాలు ఉంటాయి. సీకో, పట్టు టర్నింగ్, బూటా, బ్రోకెడ్ వంటి చీరలు ప్రత్యేకంగా తయారవుతున్నాయి. ఒకో చీర తయారీకి నెల నుండి మూడునెలల సమయం పడుతుంది. ఖరీదు వెయ్యురూపాల నుండి మొదలవుతాయి. తిరుమల బ్రహ్మోత్సవాలకు మొదటగా పోచంపల్లి పంచెను పంపించింది గద్వాల రాజు సీతారం భూపాల్. నలభై సంవంత్సరాలుగా గద్వాల నుంచే స్వామివారికి పట్టు వస్త్రాలు పంపటం ఇప్పటికి ఉంది. సీకో, తస్సర్, కాటన్, సిల్క్ రకాలలో గద్వాల్ చీరలు లభ్యమవుతాయి. గద్వాల్ చీరెలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రసిద్ధి గాంచాయి.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలోని స్త్రీలు ఈ చీరెలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
for gadwal sarees please visit http://tsco.co.in/219-gadwal-silk-sarees

ధర్మవరం చీరెలు

ధర్మవరం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. పట్టు నేతలలో ధర్మవరం పట్టు చీరలు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వెడల్పయిన అంచులతో పల్లూతో నేయబడి బంగారు నమూనాలను కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. రోజువారీ ఉపయోగం కోసం సాధారణ చీరల నుండి ప్రత్యేక సందర్భాలకోసం రెండు రంగులలో అల్లబడినవి ప్రత్యేకత కలిగి ఉంటాయి. ధర్మవరం చీరలు తమిళనాడు కాంచీపురం చీరలను పోలి ఉంటాయి. ధర్మవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నుండి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ధర్మవరానికి వెళ్లవచ్చు. ధర్మవరం చీరెల కొరకు దర్శించండి.

for Dharmavaram saree, please visit
http://www.apcofabrics.com/dharmavaram.html

ఉప్పాడ చీరెలు

అద్భుతమైన ఉప్పాడ జరీ నేత చీరెలు భారతదేశంలోనే గాక విదేశాలలో కూడా పేరుపొందినవి. ఉప్పాడ చేనేత చీరెలలో అడ్డపోగులు, నిలువుపోగుల కోసం అలాగే ఉపరితల వస్త్రం (zari కూడా వాడుతున్నారు) కోసం కాటన్ ను వాడతారు. ఇంటర్ లాకింగ్ అనే నిపుణతతో ఈ చీరలు అల్లబడతాయి. జమ్ధానీ ఉప్పాడ పట్టుచీరెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ చీరెలు తూర్పు గోదావరి ఉప్పాడ గ్రామంలో నేయబడతాయి. అందువలనే ఉప్పాడ చీరెలు అని అంటారు . ఈ సొగసైన చీరలు ప్రత్యేక సందర్భాలలో ధరించటానికి బాగుంటాయి. ఉప్పాడ జరీచీరెలు తక్కువ బరువుతో సున్నితమైన పనితనంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి తయారీకోసం స్వచ్చమైన వెండి జరీ మరియు లేసులు వాడతారు.ప్వచ్ఛమైన పట్టు, జరీ ఉపయోగించి తయారు చేస్తారు. వీటి తయారీకి 10 నుండి 60 రోజుల దాకా ఇద్దరు లేక ముగ్గరు పనివాళ్లు రోజుకు 10 గంటలపాటు శ్రమించవలసి ఉంటుంది. చీరల కొలతలు: 100 మరియు 120 వ కౌంట్ కాటన్ అడ్డపోగులు, నిలువు పోగులకు ఉపయోగిస్తారు. పొడవు 5.50 మీటర్లు వెడల్పు 45 అంగుళాలు. ఉప్పాడలో తయారైన చీరలో రెండువైపులా డిజైన్ ప్రింటింగ్ మాదిరిగా ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత. ఎంతో మంది సీనీతారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉప్పాడకు వెళ్లి చీరెలు కొనుగోలు చేస్తారు.
ఈ చీరెలకు పేటెంట్ హక్కు కూడా వచ్చింది. దేశంలో ఎక్కడా ఇటువంటి నేత కనిపించదు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చీరెల పనితనాన్ని మెచ్చుకుని జాతీయ స్థాయిలో తపాలా కవరు విడుత చేయబోతున్నారు. ఉప్పాడలో 300 వరకు చీరెల దుకాణాలు ఉన్నాయి. రోజుకు 500 చీరెలదాకా తయారవుతాయి.

కాంచీపురం చీరెలు

 సరిహద్దులో కనిపించే చాలా సాధారణ నమూనాలు మామిడి, నెమళ్ళు, హంస, ఏనుగులు, చక్రాలు మొదలైనవి. చీర యొక్క మూడు భాగాలు సాధారణంగా విరుద్ధమైన రంగులలో వస్తాయి. “పల్లు” లోని చాలా నమూనాలు దేవాలయాల గ్రంథాలు మరియు కళల నుండి వచ్చినవి. కొన్నిసార్లు, ఇది “పురాణాలు” మరియు ఇతర హిందూ ఇతిహాసాల నుండి ముఖ్యమైన ఇతివృత్తాలను కూడా వర్ణిస్తుంది. కొన్ని ఉదాహరణకు కృష్ణుడు మరియు యశోద. కుటుంబ వివాహం పట్టు వస్త్రాల కొనుగోలుకు కాంచీపురం ఉత్తమమైన ప్రదేశం. ఈ చీర యొక్క ప్రధాన ఆకర్షణ నేత శైలి మరియు అందమైన విస్తృత సరిహద్దు. ప్రతి భారతీయ మహిళ కాంచీపురం చీరను దాని అందం కోసం ఉపయోగించడానికి ఇష్టపడుతుంది.   ఇప్పుడు పద్ధతులు మార్చబడ్డాయి మరియు కాంచీపురం నమూనాలు కంప్యూటర్ తో తయారవుతున్నాయి. ప్రజల డిమాండ్ ప్రకారం పదార్థం ఇప్పుడు మార్చబడింది, కాని చీర యొక్క సాంప్రదాయిక రూపం ఇప్పటికీ మారలేదు. కాంచీపురం చీరలు భారీ బరువు మరియు అందమైన శైలికి ప్రసిద్ధి చెందాయి. కాంచీపురం నగరం రెండు కారణాల వల్ల మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక ప్రసిద్ధ నగరం. మొదట, ఇది అద్భుతమైన వాస్తుశిల్పం మరియు రెండవది నగరం పట్టు చీరలు వల్ల ప్రసిద్ది చెందింది.     చీరపై అందమైన డిజైన్లను నేయడానికి పట్టు దారం వెండి మరియు బంగారు ద్రవంలో ముంచబడుతుంది. ఈ జరీని సృష్టించడానికి సాధారణంగా 57% వెండి మరియు 0.6% బంగారం ఉపయోగించబడుతుంది. అందుకే ఈ చీరలు ఖరీథైనవి. దక్షిణ భారతదేశపు చీరలు ప్రతి దక్షిణ భారత వివాహం, వేడుక లేదా సందర్భానికి ఇవి సంస్కృతికి గుర్తు. పట్టు యొక్క మెరుపు మరియు మన్నిక ఈ చీరలను ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ప్రసిద్ది చెందాయి. పట్టు దాని నాణ్యత మరియు హస్తకళకు కూడా ప్రసిద్ది చెందింది, ఇది దాని పేరు సంపాదించడానికి సహాయపడింది. అద్భుతమైన ముగింపుతో కలిపి గొప్ప నాణ్యత వాటిని ఎక్కువసేపు ఉంచుతుంది.     ఈ అద్భుతమైన కళ మరియు వృత్తిని సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, ఈ వృత్తిని రక్షించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకున్నాయి. ఈ పట్టు నుండి నేసిన చీరలు ఉత్తమ సేకరణను రూపొందించడానికి ఎక్కువగా చేతితో నేస్తారు. డ్రై క్లీనింగ్ సరైన పద్ధతి. వాటిని ప్లాస్టిక్ సంచుల వెలుపల చక్కగా ముడుచుకున్న స్థితిలో ఉంచాలి. కొన్ని ప్రీ-వాషింగ్ టెక్నిక్‌లను కూడా ఉపయోగించవచ్చు.   సంవత్సరాలుగా, ఈ కళాఖండం అద్భుతంగా అభివృద్ధి చెందింది, ఇక్కడ మొత్తం సారాంశం మరియు అనుభూతి చెక్కుచెదరకుండా ఉంటుంది, అయితే వెండి లేదా బంగారు వాటికి బదులుగా రాగి సరిహద్దులలో కొన్ని బడ్జెట్ స్నేహపూర్వక ఎంపికలను కనుగొంటున్నారు. వాటి ప్రతిష్ట కారణంగా, పండుగలకు మరియు ఇతర ముఖ్యమైన సందర్భాలలో మాత్రమే వీటిని ధరిస్తారు. వారణాసి నుండి బనారసి పట్టు చీరలకు ఎంత ప్రాముఖ్యత ఉందో కంచి పట్టు వస్త్రాలకు అంతకంటే ఎక్కువే ఉంది. కనుక మీ జీవితంలోని ఏ ప్రత్యేక క్షణాలైనా అనుగ్రహించడానికి కంజీవరం తప్పనిసరి.

పోచంపల్లి చీరెలు

నల్గొండ జిల్లాలోని పోచంపల్లిని సిల్క్ సిటి ఆఫ్ ఇండియా అంటారు. కాటన్, పట్టు, సీకో వస్త్రాలకు పోచంపల్లి పేరు పొందింది. నిజాం కాలంలోనే చెట్లు, పూల నుంచి సహజసిద్ధమైన రంగులు తయారు చేసి వస్త్రాలకు వాడేవారు. ఇవి అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. 1970 నుండి ఇక్కడ పట్టచీరలు నేయటం మొదలు పెట్టారు. ఇక్కడ టై అండ్ డై పద్ధతిలో మగ్గాల మీద నేస్తారు. ఈ పద్ధతికి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో పేటెంట్ హక్కు సాధించింది. దేశంలోని పదకొండు రకాల చేనేతలలో పోచంపల్లి కూడా ఒకటి. టై మరియు డై పద్ధతి అంటే పద్దెనిమిది ప్రక్రియలు ఉంటాయి. నూలు కొనడం, రంగులద్దటం, డిజైన్లు వేయటం, మగ్గంపై నేయటం వరకూ ఇంటిలోని వారే చేస్తారు. ఎక్కువ భాగం ఆడవారే చేస్తారు. ఒక కుటుంబం వారం రోజులు పాటు కష్టపడి పడుగు, పేక దారాలను మగ్గంపై నేస్తే వీటి ద్వారా ఏడు చీరలు తయారు కావటానికి నెలరోజులు పడుతుంది. పోచంపల్లి చుట్టుపక్కల దాదాపు రెండొందల గ్రామాలలో అయిదు లక్షల మంది చేనేత పనుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. రంగులు పోవకపోవటం పోచంపల్లి చీరల ప్రత్యేకత. వీటిలో ఇక్కత్ చీరలకు గిరాకీ ఎక్కువ. పోచంపల్లి చీరలు రెండు వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది. ఇందిరా గాంధీ, ప్రతిభాపాటిల్ ఈ చీరలను ధరించారు. బ్రిటన్ శాసనసభ అలంకరణకు పోచంపల్లి వస్త్రాలను ఉపయోగించటం ఒక విశేషం. .

%d bloggers like this:
Available for Amazon Prime