తిరుమల – తిరుపతి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా ‘తిరు’, ‘పతి’ అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో ‘తిరు’ అంటే గౌరవప్రదమైన అనీ, ‘పతి’ అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం ‘గౌరవనీయుడైన పతి’ అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు. తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది. 1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

తిరుమల

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు’ (పవిత్ర), ‘మల’ (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం’ అని అనువదించబడింది.

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే. తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు. తిరుమల సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి నివాసముండే స్థలం… దీనికి నిదర్శనo.. వేర్వేరు కొండలు వేర్వేరు ఆకారాలు సంతరించుకోవడమే.. మనము శేషాచలం కొండను (శేషాద్రి) చూస్తే స్వామి నామాలు, కిరీటం, పూలమాల మనకు స్పష్టంగా కనిపిస్తాయి… లక్ష్మీసమేత వరహ స్వామి రూపంలో ఉన్న కొండలూ కనిపిస్తాయి… ఆంజనేయ స్వామి (అంజనాద్రి) రూపంలో ఉన్న కొండ కనిపిస్తుంది.. శ్రీవారి ఏనుగు ఆకారంలోని కొండ కనిపిస్తుంది… సాక్షాత్ గరుడవిగ్రహం(గరుడాద్రి) మనకు కనపడుతుంది.. శ్రీవారి ఆర్చి శిలా తోరణం కనపడుతుంది.. ఇలా అన్ని కొండలూ వాటి రూపాలు, సాక్షాత్ శ్రీవారి రూపం కొండలో గోచరించడం అద్భుతంకాదా!! అందుకే స్వామి వారిని దర్శించుకున్నంత భాగ్యం క్రింది వాటికి కల్పించారు…   1. స్వామిని సాక్షాత్ దర్శించుకోలేని వారు విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే చాలు… 2. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు… గోపురాన్ని దర్శించుకుంటే చాలు 3. గోపురాన్ని దర్శించుకోలేని వారికి గాలిగోపురాన్ని చూస్తే చాలు … 4. అక్కడకు కూడా వెళ్ళలేని వారు… కొండను చూస్తే చాలు… 5. కొండకు వెళ్ళలేని వారు అక్కడనుండి వచ్చిన తిలములను సమర్పించిన శిరమును(గుండు) తాకినా చాలు… మనకు స్వామిని దర్శించిన పుణ్యం వస్తుందట…

తిరుమల యాత్ర అంటే తిరుమల కొండమీద శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకోవటంతో పూర్తవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ తిరుమల వెళ్ళిన వారు ముందుగా ఆదివరాహస్వామిని దర్శనం చేసుకున్నాక మాత్రమే స్వామిని దర్శించుకోవాలి. ఇది శ్రీవేంకటేశ్వరుడు వరాహస్వామికి స్వయంగా ఇచ్చిన వరం. ఆనంద నిలయం(స్వామివారి ఆలయంపేరు) లోనే చూడవలసినవి చాలా ఉన్నాయి అంతేకాదు పచ్చని లోయలు, అడుగడుగునా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే స్వామివారి ఏడు శిఖరాలు, తిరుమల చుట్టుపక్కలా ఉన్న ఆకాశగంగ, కపిలతీర్ధం, తుంబుర, కపిలతీర్ధం, పాపనాశన తీర్ధాలు…. మరియు తిరుపతి సమీపంలోనే ఉన్న పవిత్ర ఆలయాలు, శ్రీనివాస మంగాపురం, నారాయణుడి వివాహం జరిగిన నారాయణవనం, నాగులాపురం… ఇంకా ఎన్నో ఆలయాలున్నాయి. 

ఆది వరాహాస్వామి

తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా పుష్కరిణికి వాయువ్య మూలన ఉన్న వరాహా దేవుడిని దర్శించుకుని తరువాత శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఈ వరం స్వయంగా శ్రీవేంకటేశ్వరుడే వరాహస్వామికి ఇచ్చాడు. తిరుమల మొత్తం వరాహాస్వామి ఆధీనంలో ఉండేది. శ్రీనివాసుడు తిరుమలలో నివాసం ఏర్పరుచుకోవటానికి వరాహాస్వామి నుండి అనుమతి పొందుతాడు. వరాహస్వామి ఆలయం చిన్నది. ధ్వజస్ధంభం కూడా ఉండదు. వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరుడు వేరు కాదు కాబట్టి వరాహస్వామికి ప్రత్యేక పూజలుండవు. సుమారు ఒక అడుగు ఎత్తున్న శిలా వేదిక మీద రెండడుగులు ఎత్తున్న వరాహస్వామి విగ్రహం దివ్య తేజస్సుతో దర్శనమిస్తుంది. పై రెండు చేతులలో శంఖు, చక్రాలుంటాయి. ఎడమ తొడమీద భూదేవి కూర్చుని ఉంటుంది. ఇక్కడే ఒక చతురస్రాకారపు రాగిరేకు కనబడుతుంది. ఇది శ్రీనివాసుడు వరాహాస్వామికి రాసి ఇచ్చిన అంగీకార పత్రమని అంటారు. లిపి బ్రహ్మలిపి లాగా ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారమే వరాహాస్వామి పూజలకు అవసరమైన ద్రవ్యాలన్నీ శ్రీనివాసుని భాండాగారం నుంచే అందుతాయి. ప్రయాణ బడలిక వలనో, లేక సమయం లేదనో ఈ స్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుని దర్శనానికి వెళతారు. కానీ అలా వెళ్ళటం వలన ఓ దివ్యమైన అనుభూతిని కోల్పోతాం. కనుక తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా మందుగా వరాహమూర్తిని దర్శించుకోవాలి. ఇది శ్రీనివాసుడు వరాహామూర్తికి ఇచ్చిన వరం.

ఆనందనిలయం విశేషాలు

శంఘనిధి-పద్మనిధి :
మహాద్వారానికి ఇరువైపులా రెండు విగ్రహాలుంటాయి. జగద్రక్షుకుడి సర్వసంపదలకు రక్షణగా నిలిచిన దేవతామూర్తులు వీరు. ఒకరు శంఘనిధి మరొకరు పద్మనిధి. వీరిద్దరిని నిధిదేవతలంటారు. స్వామివారి వజ్రవైఢూర్యాలను రత్నసంపదను మణుగుల కొద్ది బంగారంను అపారమైన ధనరాశులను కాపాడే బాధ్యత వీరిదే. ఈ దేవతల పాదాల వద్ద విజయనగర ప్రభువు అచ్యుతరాయల వారి విగ్రహాన్ని గమనించవచ్చు.

మహాద్వారం :
హరినివాసానికి తొలివాకిలి మహాద్వారం. దీనినే పడికావలి, ముఖద్వారం, సింహద్వారం, పెరియా తిరువాశల్ అని కూడా పిలుస్తారు. గడప దాటి లోనికి కాలుపెట్టగానే భక్తజనుల హృదయస్పందనలో గోవిందనామం. మహాద్వారంపై గోపుర నిర్మాణానికి అనువైన చౌకట్టు ఏర్పరచారు. గోపురమంటే తిరుమల గోపురమే. యాభై అడుగుల ఎత్తులో నయన మనోహరంగా విశ్వరూపదర్శన అనుభూతిని కలిగిస్తుంది. పదకవితా పితామహుడు అన్నమయ్య శ్రీకృష్ణుడికీ వేంకటేశ్వరునికి అభేద్యాన్ని పాటించాడు.

అతివరో శ్రీవేంకటగిరి మీద వీడె
కౌరవుల పాలిట విశ్వరూపమితడు
అని కీర్తించాడు.

కృష్ణరాయ మండపం :
దీనినే ప్రతిమా మండపమని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు…పరమ వైష్ణవుడు. ఆయన పేరుతో ప్రాచుర్యం పొందిన కృష్ణరాయ మండపం విజయనగర శిల్పకళా రీతికి ప్రతీక. నూరురాయర గండడు….భక్తిగా చేతులు జోడించిన రాగి విగ్రహం ఇక్కడ కనువిందు చేస్తుంది. ఇరువైపులా ముద్దుల దేవేరులు తిరుమలాదేవి, చిన్నాదేవి. ద్వారానికి ఎడమ పక్కన ఉన్న ప్రతిమ చంద్రగిరి పాలకుడు వేంకటపతి రాయలది. పక్కనే ఉన్న రాతి ప్రతిమలు వరదాజి అమ్మాణి, అచ్యుతరాయల దంపతులవి. కారే రాజుల్ రాజ్యముల్ ఎంతమంది ప్రభువులు పుట్టలేదు గిట్టలేదు శ్రీవారి భక్తులకే ఈ అదృష్ఠం.
వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజ కీటకముల మరెవ్వడెరుగు
అంటారు తాళ్ళపాకవారు. కల్పానికొకరు చొప్పున చాలా మందే బ్రహ్మదేవుళ్ళు వచ్చి వెళ్ళారు. వాళ్ల నామధేయాలను కూడా ఎవరూ గుర్తు పెట్టకోలేరు. అలాంటిది, నరమానవుల పేర్లేవరికి గుర్తుంటాయి? శ్రీనివాసుని దాసానుదాసుల పేర్లే నిత్యములూ సత్యములూ.

అద్దాల మండపం :
ముద్దుగారీ జూడరమ్మ మోహనమురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
అయినా మహల్ అద్దాల అలంకరణల మధ్య ముద్దుమోము స్వామి మరింత ముద్దొస్తాడు. ప్రతిమా మండపానికి ఉత్తరాన ఉంటుంది అద్దాల మండపం. ఒకప్పుడు ఇక్కడ ప్రసాదం అరలుండేవి. అర్చకులు తమ వంతుకు వచ్చే ప్రసాదాలకు విక్రయించుకునేవారట. ప్రస్తుతం ఈ విధానం లేదు. అరలూ లేవు. ప్రసాదం పట్టెడ అనే పేరు మిగిలింది. తూర్పు భాగంలో నిర్మించిన అంతరాళమే అద్దాల మండపం. డోలోత్సవం జరుగుతుందనడానికి గుర్తుగా …వేలాడే గొలుసులు, చుట్టూ గోడలకు పైకప్పుకు పెద్దపెద్ద అద్దాలు బిగించారు. క్రీస్తుశకం 1831 నాటికే డోలోత్సవ సంప్రదాయం ఉంది. వరాహస్వామి ఆలయం శిథిల స్థితికి చేరుకున్నప్పుడు..మూలమూర్తిని అద్దాల మండపంలో భద్రపరిచారని చెబుతారు.
రంగనాయక మండపం :
అనంతకరము లనంతాయుధము
లనంతుడు ధరించెలరగను
ఆయన కరములు అనంతం, ఆయుధాలు అనంతం, శరణువేడిన వారికి అనంతమైన అభయాన్ని ప్రసాదిస్తాడు. అతడే రక్షకులందరికీ రక్షకుడు. తురుష్కుల దండయాత్రల సమయంలో తమిళనాడులోని శ్రీరంగంలో వెలసిన రంగనాథుడి ఉత్సవమూర్తులకు స్వామి ఆశ్రయమిచ్చి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. పరిస్థితులు చక్కపడ్డాక సాదరంగా సాగనంపాడు. అపురూప ఆతిధ్యానికి గుర్తగా నిలిచిందీ రంగమండపం. సువిశాల మండపంలో పన్నెండు అడుగుల చతురస్రాకార మందిరం ఉంది. ఇప్పటికీ ఇత్సవాలలో సేవల్లో ద్రావిడ దివ్వ ప్రబంధ పారాయణం ఉంది. గతంలో కళ్యాణోత్సవాలు ఇక్కడే జరిగేవి. రద్దీ పెరగటంతో వేదిక మారింది.

తిరుమలరాయ మండపం :
ఉయ్యాల బాలునూచెదరుకడు
నొయ్యనొయ్య నొయ్యనుచు…
స్వామి హంసతూలికలో ఊగుతున్న దృశ్యాన్ని ఊహించుకున్నా చాలు.. హృదయానందకరం. ఆ వేడుకను కళ్లార చూసి తరించాలనే, సాళువ నరసింహరాయలు ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించాడు. అప్పట్లో హంస ఊయల ఉత్సవం ఏటా ఐదు రోజులపాటూ వైభోగంగా జరిగేదట. కృష్ణదేవరాయల అల్లుడు ఆళియ రామరాయలకు ఓ తమ్ముడుండేవాడు. పేరు తిరుమలరాయలు. ఈ మండపాన్ని విస్తరించిన మహానుభక్తుడు. అందుకే ఇప్పటికీ ఆయన పేరుతో పిలుచుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలపుడు ధ్వజారోహణ సమయంలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఇక్కడున్న చతురస్ర శిలావేదికపై వేంచేసి నివేదనలూ హారతులూ అందుకుంటారు. ఉదయాస్తమయాలలో ఇక్కడ కొలువుమేళం జరుగుతుంది. ఇక్కడే రాజా తోడరమల్లు విగ్రహము ఉంది. ఈయన ఒక మహావీరుడు. తురుష్కుల నుంచి తిరుమల ఆలయాన్ని కాపాడాడు. ఆశ్రితపాలకుడు ఆ భక్తికి మెచ్చి శ్రీహరివాసంలో చోటిచ్చాడు.

ధ్వజస్తంభము:
గరుడధ్వజ మెక్కి కమలాక్షు పెండ్లికి
పరుషలదివో వచ్చే పైపై సేవించను
…ఇదే ధ్వజస్తంభము. శ్రీనివాసుని జయకేతనం. బ్రహ్మోత్సవ సమయాల్లో ధ్వజారోహణ పూర్వకంగా ముక్కోటి దేవతలకూ ఆహ్వానపత్రం పంపడం తిరుమల సంప్రదాయం. గరుడుని బొమ్మ చిత్రించిన ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. లోపలి వస్తవుని బయటికి తీసుకువెళ్ళాలన్నా, బయటి వస్తువు లోపలికి తీసుకురావాలన్నా ధ్వజస్తంభం సాక్షిగానే జరగాలి. ప్రదక్షిణ తప్పనిసరి. ఊరేగింపులకు వస్తున్నపుడు వెళ్తున్నప్పుడు స్వామివారు కూడా ప్రదక్షిణ పూర్వకంగానే రాకపోకలు సాగిస్తాడు. ధ్వజస్తంభానికి అంత ప్రాధాన్యం. కర్రతో చేయడం వలన అప్పుడప్పడు దాన్ని మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నది నాలుగు దశాబ్దాల నాటిది. పైనుంచి కింది దాకా బంగారు పూత పూసిన రాగి రేకు తాపడం చేశారు. ధ్వజస్తంభానికి తూర్పున ఆనుకుని ఉన్నదే బలిపీఠం. ఇక్కడే బలి సమర్పిస్తారు. ఈశాన్యాన చిన్న శిలాపీఠం మీద క్షేత్రపాలక శిల కన్పిస్తుంది. రుద్రదేవుడు తిరుమల క్షేత్రపాలకుడు. తెల్లవారుజామున స్వామి కైంకర్యానికి వస్తున్నప్పుడు ఏకాంత సేవ తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నప్పుడూ అర్చకులు తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించడం ఓ నియమమం.

పుష్పమండపం :
దేవదేవుడు…పూలదేవుడు. అలంకారప్రియో హరి: ఎన్నిపూలు అలంకరిస్తే అంత పులకిస్తాడు. ఒకప్పటి తిరుమల గిరి…నిజంగానే పుష్పగిరి. పేరిందేవి తోట. అనంతాళ్యారు తోట. తాళ్లపాక వారి తోట, తరిగొండ వేంగమాంబ తోట, సురపురంవారి తోట…ఎటుచూసినా ఉద్యానవనాలే. అసలు, ఆనంద నిలయ ఆవరణలోనే ఓ సంపంగి తోట ఉండేదట. ఆ పూలనే స్వామివారికి సమర్పించేవారట. రానురాను తోట కనుమరుగైంది. ఇప్పటికీ ప్రాంతాన్ని సంపంగి ప్రదక్షిణ అని పిలుస్తారు. యోగానరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా ఓ పూల అర ఉంది. ఉదయం, సాయంత్రం జరిగే తోమాల సేవలో స్వామివారికి పుష్పాలంకరణ జరుగుతుంది. శ్రీవారికి నిత్యం అలంకరించే దండలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. కిరీటం నుంచి రెండు భుజాలవరకు అలంకరించే దండ శిఖామణి. రెండు భుజాలపై అలంకరించే దండ కంఠసరి. బొడ్డున ఉన్న ఖడ్గానికి అలంకరించే దండ కఠారిసరం. అన్నమాచార్యుల వారు ఓ శృంగార కీర్తనలో..ప్రేయసి ఐన అమ్మవారు ప్రియసఖుడైన శ్రీనివాసుని తనింటికి ఆహ్వనిస్తారు. ఆ పిలుపులోను పిసరంత రసికత. చిరునామా చెప్పారు కానీ, చెప్పీ చెప్పనట్లు చెప్పారు.
మరుని నగరిదండ మాయిల్లెరగవా..
విరుల తావులు వెల్లవిరిసిటి చోటు..
అంటూ చెప్పారు. పూలపరిమళాలు విరిసేచోటే పద్మావతీ దేవి ఉంటుంది. దేవేరి ఉన్నచోటే దేవదేవుడు ఉంటాడు.

పడిపోటు:
సంపంగి ప్రదిక్షిణ మార్గంలోనే సరుకులు నిల్వ చేసే ఊగ్రాణానికి ఆనుకుని పడిపోటు ఉంటుంది. స్వామివారికి నివేదించే లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియ, జిలేబి, తేన్తొళ మొదలైన ప్రసాదాలను ఇక్కడే వండుతారు. ఓ మూలన పోటు తాయార్ అనే అమ్మవారి విగ్రహం ఉంటుంది.
కళ్యాణమండపం:
కొమ్మకు నీవిట్టే పెండ్లి కొడుకవై వచ్చితివి
ఇమ్ముగ సిగ్గుపడక యేలుకోవయా.
వరుడేమో నల్లనివాడు పద్మనయనములవాడు. వధువు పుత్తడి బొమ్మ యీ పొలతి చక్కదనము. చక్కదనాల పెళ్ళికి చక్కని వేదిక శ్రీవారి కళ్యాణమండపం. ఉభయ దేవేరులతో శ్రీవారికి ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది. శుభాల స్వామికి ముహూర్తాలతో పనేమి? రాక్షసాంతకుడికి రాహుకాలాలతో నిమిత్తమేమి? ప్రతిదినం సుదినమే. ప్రతి ముహూర్తం సుముహూర్తమే. పూర్వపు రోజుల్లో బ్రహ్మోత్సవాది విశేత్సవాలలో మాత్రమే కళ్యాణం జరిగేదట. అన్నమయ్య కాలంలో నిత్యోత్సవమైంది. పదకవితా పితామహుడు కన్యాదాతగా మారి పురుషోత్తముడికి పిల్లనిచ్చిన మామ అయ్యాడు.

వెండివాకిలి :
ధ్వజస్తంభం దాటి కాస్త ముందుకు వెళ్లగానే కనిపించే రెండో ప్రవేశద్వారమే వెండివాకిలి. వాకిళ్లకు గడపలకు వెండిరేకు తాపడం చేయడంతో వెండివాకిలనే పేరు వచ్చింది. 1929 ప్రాంతంలో నైజాం రాష్ర్టానికి చెందిన ద్వారకాదాస్ పరభణీ అనే భక్తుడు రజితసేవ చేసినట్లు తెలుస్తోంది. మహాద్వారమంత పెద్దది కాదుకాని, కళాత్మకంగా తీర్చిదిద్దారు. వాకిళ్లమీద శ్రీనివాస కల్యాణం, బావాజీ శ్రీనివాసుల పాచికలాట, శ్రీరామ పట్టాభిషేకం తదితర చిత్రాలు కనువిందు చేస్తాయి. ద్వారాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు.

విమాన ప్రదక్షిణ :
గర్భాలయ గోపురమే ఆనందనిలయ విమానం. వి…మానం అంటే కొలవటానికి అసాధ్యమైనదని అర్థం. ఆ గోపుర శిల్పకళావైభోగాన్ని, ఆ బంగారు శిఖరాల బహుబ్రహ్మమయాన్ని మాటలలో వర్ణించలేము. చూసి తరించవలసినదే. ఈ గోపురాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని అంటారు. తర్వాత చాలా మంది పాలకులు పునరుద్దరించారు. కొత్త సొబగులు అద్దారు. సాళువ మంగిదేవుడు కొత్త స్వర్ణకలశాన్ని ప్రతిష్టించాడు. కృష్ణదేవరాయలు 30 వేల బంగారు వరహాలతో ఆనందనిలయ విమానానికి బంగారుపూత పూయించాడు. మహంతుల పాలనలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లు ఆధారాలున్నాయి. చివరిసారిగా 1958లో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఎంతో కాలంగా పోగై ఉన్న ఆభరణాలను కరిగించి బంగారు రేకులు సమర్పించారు. గోపురం ఉత్తర దిక్కున వాయువ్యమూలన విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. స్వామి మూలవిరాట్టును పోలి ఉంటాడు. ఆలయం లోపలి నుంచి విమానమూర్తకి నివేదనలు జరుగుతాయి.
ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాథుడు కన్పిస్తాడు. దక్షిణం నుంచి ప్రదక్షిణగా వెళ్తే వరదరాజస్వామి ఆలయం, బంగారుబావి, అంకురార్పణ మండపం, యాగశాల, సన్నిధి భాష్యకారులు (శ్రీరామానుజుల సన్నిధి) యోగ నరసింహస్వామి ఆలయం మొదలైనవి దర్శనమిస్తాయి. వీటన్నిటిని కలిపి చుట్టుగుళ్ళుగా పిలుస్తారు.
సంకీర్తనా భాండాగారం:
సకల వేదములు సంకీర్తనలు జేసి
ప్రకటించి నినుపాడి పావనుడైన
అకలంకుడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీ వేంకట నిలయ
ఇదే తాళ్లపాక కవుల సంకీర్తనా నిధి. రోజుకు ఒకటి తక్కువ కాకుండా ముప్పైరెండువేల సకీర్తనలను హరిపాదాలకు సమర్పించిన పరమ భక్తుడు అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య, పెదతిరుమలయ్య, చినతిరుమలయ్య తదితరులు శ్రీవారి సాహిత్యాన్ని రాగిరేకులలో రాయించి ఇక్కడ భద్రపరచారు. ఆ అరపై రెండు విగ్రహాలున్నాయి. ఒకటి అన్నమయ్యది. ఇంకొకటి ఆయన కుమారుడు పెదతిరుమలయ్యది. బ్రహ్మోత్సవాల సమయంలో సంకీర్తనా భాంఢాగారం దగ్గర అఖంఢ దీపారాధనలు నిర్వహించిన రోజులున్నాయి. ఇప్పటికీ, ప్రత్యేక సందర్భాలలో మలయప్పస్వామి సంకీర్తనా భాంఢాగారం దగ్గర హారతులు అందుకుంటాడు. మేలు కొలుపు మొదలు పవ్వళింపు సేవల దాకా ప్రతి సందర్భంలోనూ తాళ్లపాకవారి సంకీర్తనలు గానం చేయాల్సిందే.

పరిమళం అర :
ఆ పరిసరాలకు వెళ్ళగానే సువాసనలు వెదజల్లుతాయి. అదే పరమళం అర ప్రభావం. ప్రతి గురువారం మధ్యాహ్నం స్వామివారి తిరునామానికి ఉపయోగించే పచ్చకర్పూరాన్ని ఇక్కడున్న సాన మీద నూరుతారు. పదహారు తులాల పచ్చకర్పరం పొడితోనే…శుక్రవారం ఉదయం అభిషేకానికి అవసరమయ్యే సుగంధద్రవ్యాలను కూడా సిద్ధం చేస్తారు. చందనాన్ని తయారు చేయడానికి ప్రత్యేక పరిచారికలుంటారు. వీరిని చందనపాణి అని పిలుస్తారు.
పచ్చకప్పురమే నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నచ్చెమల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట…
అంటి అలమేల్ మంగ అండ నుండే స్వామిని.

ఏడు శిఖరాలు

శేషాద్రి

ఒకసారి వాయుదేవుడు స్వామి వారిని దర్శించుకునేందుకు వైకుంఠం వచ్చినపుడు ఆదిశేషుడు అడ్డగించాడట. స్వామివారు వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వతభాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని వుండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదలించ గలగాలి. ఆ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని వుండగా దాన్ని కదిలించేందుకు వాయుదేవుడు విశ్వప్రయత్నం చేస్తాడు. కొంతసేపటి తరువాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతుహలంతో పడగ ఎత్తి చూశాడు. పట్టు సడలింది. వాయువు ఆనందశిఖరాన్ని కదలించి స్వర్ణముఖి నదీతీరాన దించాడట. అదే శేషాచలమని పురాణాలద్వారా తెలుస్తుంది.

నీలాద్రి

స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే పేరుకూడా ఆమె పేరుమీదుగానే రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

గరుడాద్రి

దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు)ను సంహరించిన తరువాత గరుత్మంతుడు పాపపరిహరార్థం విష్ణువు గురించి తపస్సుచేశాడు. స్వామి ప్రత్యక్షమవ్వగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి తానే ఏడుకొండలమీద వెలయునున్నానని తెలిపి గరుత్మంతుడి నికూడా శైలరూపంలో అక్కడే వుండమని ఆదేశించిరట. అదే గరుడాచలం.

అంజనాద్రి

వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న తరువాత అంజనాదేవికి చాలాకాలం పిల్లలు కలుగలేదు. దాంతో ఆమె ఆకాశగంగ అంచునవున్న కొండలమీద ఏళ్ళ తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించగా ఆ పండును తిన్న ఫలితంగా ఆంజనేయుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.

వృషభాద్రి

కృతయుగంలో తిరుమలలోని తుంబురతీర్ధం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతి రోజూ తన తలనరికి శివునికి నైవేద్యం పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చి శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని చెప్పాడట. చాలాకాలం యుద్ధం జరిగిన తరువాత ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయి ప్రాణాలు విడిచేముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రిగా పేరొందినదని అంటారు.

నారాయాణాద్రి

విష్ణుదర్శనంకోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణమహర్షి తన తపానికి భంగం కలిగించని ప్రదేశం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు. అపుడు బ్రహ్మదేవుడు ఈ ప్రదేశం చూపాడు. ఇక్కడ స్వామి దర్శనం పొందిన నారాయణమహర్షి తను తపమాచరించిన పవిత్రస్థలాన్ని తనపేరుతో పిలిచే వరం ఇవ్వమని కోరాడు. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సుచేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది.

వేంకటాద్రి

కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన తిరుమలగిరి వేంకటాద్రి. వేం అంటే పాపాలు అని కట అంటే హరించటం అని అర్థం అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరికి వేంకటాద్రి అని పేరు.

అలిపిరి-తిరుమల మెట్ల దారి.

శ్రీవారి మెట్టు

This is a new route done by Reliance by which you can reach Tirumala by climbing only 2388 steps instead of 6588 steps in the old route

శ్రీవారిపాదం నుండి తీసిన ఆలయం ఫోటో.

This image has an empty alt attribute; its file name is photo-92-143414-8.jpg

ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి. మనలో చాలా మంది చాలా సార్లు తిరుమల కొండ నడిచి ఎక్కి ఉంటాము. అదొక మధుర అనుభూతి. స్వామి వారిని దర్శించటం కోసం చాల శ్రమతో మెట్లు ఎక్కుతాం (యువకులకు శ్రమ కొంచెం తక్కువ ఉంటుంది). అన్ని కొండలు ఎక్కి చివరికి కొండపైకి చేరుకొనే సరికి పడ్డ శ్రమ అంతా ఎవరో చేత్తో తేసేసినట్టు మాయమవుతుంది. ఇది ఎన్నో సార్లు నాకు అనుభవమైంది. అసలు మనం ఇన్ని మెట్లెక్కి ఇంత దూరం ఇంత సేపు నడిచాం అని ఏమాత్రం గుర్తు ఉండదు. ఇక కొండపైకి వెళ్లిన తరువాత గదులు చూసుకోవటం, కల్యాణకట్ట ఇంకా ఏమైనా ఇతర కార్యక్రమాలు ముగించుకోవటం చాల చక చకా అయిపోతాయి. ఇక శ్రీవారిని దర్శనం చేసుకోవటం.. ఆహా.. ఆ ఆనందం యేమని చెప్పను? ఆ అనుభూతి ఎలా వర్ణించను?

ఒకప్పటి తిరుమల సన్నిధి వీధి.

ఈనాటి తిరుమల శ్రీనివాసుని సన్నిధి

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామాలు

1. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం |2|   2. ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు |2|   3. మాత స్సమస్త జగతాం మధుకైటభారేః వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీల ే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం   4. తవ సుప్రభాత మరవింద లోచనే భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృష శైల నాథ దయితే దయానిధే 5. అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   6. పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   7. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   9. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   10. భృంగావళీచ మకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై స్సహ సేవనాయా నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   11. యోషా గణేన వర దధ్ని విమథ్య మానే ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   12. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం   13. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   14. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   15. శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   16. సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   17. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   18. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   19. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   20. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   21. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   23. కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం             24. మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   25. ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం   26. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం   27. బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   28. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం   29. ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!

There are 5 dieties (Pancha bheram) in the garba griha of Thirumala temple, not only 1 the moolamoorthy Lord Srinivasa.

The moola virat is called the Mula bheram.

గోవింద నామాలు

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       నందనందన గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్దనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖ మర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా       మత్స్యకూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్దకల్కిధర గోవిందా వేణుగాన ప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపద్భాంధవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       కమలదళాక్ష గోవిందా కామితఫలదాతా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్త ప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్ఙగదాధర గోవిందా విరజాతీర్థస గోవిందా విరోధిమర్దన గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా గజరాజరక్షక గోవిందా గోవిందా హరి గొవిందా గోకులనందన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణా గోవిందా రఘుకులనందన గోవిందా ప్రత్యక్షదేవ గోవిందా పరమదయాకర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా వడ్డీకాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీపుంరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్త రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా ఆపన్నివరణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా       రత్న కిరీటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రితపక్ష గొవిందా నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా ఆనందరూప గోవిందా ఆద్యంతరహిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గొవిందా       ఇహపరదయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభ హరి గోవిందా తిరుమలవాసా గోవిందా శేషాద్రి నిలయ గోవిందా శేష శాయిని గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం విశిష్టత, చరిత్ర

స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక తీర్థం, శఠారి తీసుకొని ,ఒక సాష్టాంగ నమస్కారం చేసుకొని నడుస్తుంటే..ఒక మూలకు వచ్చేసరికి ఒక్క సారి..అంతా ఆగిపోయి వుంటారు. చాలామంది పక్కన ఉన్న అరుగులు,మెట్లు ఎక్కి .. తలకాయ ఎత్తి చూస్తూ వుంటారు. అలా చూసేది అక్కడ వున్న విమాన వేంకటేశ్వర స్వామిని.

పైన ఉన్న స్వామి ఆలయ గోపురం పేరు “ఆనందనిలయం”.. ఈ బంగారు గోపురం ఎత్తు,కలశంతో కలిపి, 65అడుగుల 2 అంగుళాలు. ఇది మూడు అంతస్తులుగా వుంటుంది. మొదటి దాని మీద ఏవిధమైన బొమ్మలు లేవు.. లతలు,తీగలు,మకరతోరణాలు లాంటివి తప్ప. అలాగే మూడవ (గుండ్రని) అంతస్తు లో 20 బొమ్మలు వుంటాయి..కాకపోతే అవి.. మహపద్మం,8 సింహాలు..ఇలా. మనకు కనపడే దేవుళ్ళ విగ్రహాలు అన్నీ వున్నది రెండవ అంతస్తులో. ఇవి మొత్తం 40. నరసింహస్వామి,వరాహస్వామి,అనంతుడు, వైకుంఠనాథుడు,ఇంకా అనేక విష్ణురూపాలు,జయ విజయులు,విష్వక్సేనుడు.. ఇలా చెక్కబడి వుంటాయి.. మకర తోరణాలతో పాటు. ఇలా వున్నవాటితో పాటు..వాయవ్యం మూల ,ఉత్తరముఖంగా వుంటాడు మన విమాన వేంకటేశుడు. ఈయన పక్కన బాల కృష్ణుడు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి వారు వుంటారు .

ఇదిగో..పైన వున్న గోపురంలో..వెండి మకరతోరణంలో..వెలిగిపోతున్న స్వామియే..విమాన వేంకటేశ్వరుడు. ఈయన , లోపల వున్న మూలమూర్తిని పోలివున్న స్వామి. లోపల వున్న స్వామి దర్శనం బాగా అవలేదే అని మధన పడే వారికి స్వాంతన ఇచ్చే స్వామి.నిజంగా కూడా ఈ విమాన వేంకటేశుడి దర్శనం కూడా యాత్రా ఫలితం ఇస్తుంది అని చెప్తారు.

“తత ఆనందనిలయే తొండమాన్నృప నిర్మితే

విమానాగ్రే రరాజ శ్రీనివాస భగవాన్ హరిః !!”

వేంకటాచలమహాత్యం లోని ఈ శ్లోకం ప్రకారం విమానాన్ని తొండమాన్ మహారాజు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

“విమానం సర్వపాపఘ్నం విష్ణునాధిష్టితం సహా

పశ్యతాం సర్వభూతానాం ఆహ్లాద జనకం శుభమ్!!”

విమానంతో పాటు విమానం మీద ఉన్న శ్రీనివాసుని దర్శనం సర్వ జీవుల పాపాలు తొలగించటమే కాక సర్వ శుభాలు కలిగిస్తుందని పై శ్లోకం అర్ధం.

ద్వైత సంప్రదాయం త్రిమూర్తుల్లో ఒకరైన వ్యాస తీర్థులు తిరుమలలో 12ఏళ్లపాటు స్వామి అర్చనాదికాలు చేశారని, వారికి ఈ విమాన వెంకటేశు డంటే చాలా చాలా అభిమానం అనీ చెప్తారు. ఆయన కాలం నుంచి ఈ స్వామి సన్నిధిలో పారాయణలు అవీ ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్తారు.

ఈ విమాన వెంకటేశుడి గురించి గూగుల్ లో, ఇంగ్లీష్ కోరా లో రకరకాల కథలు వున్నాయి..అవి తితిదే పుస్తకాలలో లేవు. అందులో ఒకటి.. ఒక విజయనగర రాజు తిరుమల ఆలయంలో ఒక(కొన్ని) హత్య(లు) చేశాడని, ఆ కారణంచేత ఆలయాన్ని కొన్ని సంవత్సరాలు మూసివేసి,విమాన వేంకటే శుడి దర్శనం చేసేవారు అని.

Seven Hills – Teerthalu

Papanasana Teertham / పాపనాశనతీర్థం :

ఈ తీర్ధం స్వామివారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో వుంది. పవిత్రమైన పాపవినాశనంలో స్నానమాచరిస్తే పాపాలు కడిగి వేయబడతాయని భక్తుల విశ్వాసం. స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా దుస్తులు మార్చుకునే సౌకర్యం కలదు. చక్కని పార్కులతో, పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రకృతిని వీక్షించవచ్చును.

స్వామి పుష్కరిణి

గరుత్ముంతునిచే భూలోకాని తేబడిన పుష్కరిణిగా పేరుగాంచినది. తిరుమల ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. ఇక్కడ స్నానమాచరిస్తే పవిత్ర గంగానదిలో స్నానమాచరించి నట్లుగా భక్తులు భావిస్తారు. సకలపాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. ముల్లోకాలలోని సకలతీర్థాలు స్వామిపుష్కరిణిలో కలిసివుంటాయని స్వయంగా వరాహాస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెబుతుంది.స్వామివారి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తరువాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఆకాశగంగ

తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో షుమారు 3 కి.మీ. దూరంలో కలదు. స్వామివారి అభిషేకానికి నిత్యకార్యక్రమాలకు మూడు రజితపాత్రల నిండా ఇక్కడి నీరు వాడడం సాంప్రదాయం.

చక్రతీర్ధం

ఈ వున్న జలపాతం దర్శనీయమైన స్థలం. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవెంకటేశ్వస్వామి వారి అర్చామూర్తికి ఇక్కడ స్నానమాచరింప చేస్తారు

తలకోన

తిరుపతి షుమారు 50 కి.మి దూరంలో యర్రవారి మండలంలో వున్నది. షుమారు 300 అడుగుల ఎత్తున్న జలపాతం . పిల్లలకు, పెద్దలకు మంచి విహారకేంద్రం. రెండుకొండల మధ్యలో ఉన్న ఈ తీర్థంలో నీళ్ళు స్వచ్ఛంగా మెరుస్తు వుంటాయుయి. కోలనులో నీరు ప్రవహిస్తూ వుంటుంది, కాని ఎటువెళుతుందో కనిపించదు. ఈ తీర్థం పైభాగంలో అత్యంత ఎత్తులో పాపనాశనం వుంది. ఇక్కడ 3 శతాబ్ధాలనాటి గిల్లితీగ అనే చెట్టు తలనకోనకే విశేషం. ఈ మొక్కలోని ప్రతిభాగం ఔషధయుక్తమే. గిరిజనులు ఈమొక్కను రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. దీని కాయలు 3 అడుగుల నుండి నాలుగున్నర అడుగులదాకా వుంటాయట.
ఇక్కడ తెల్లని ఆర్కిడ్‌ పుష్పాలను చూడవచ్చును. మద్ది, జాలరి, చందనం, రక్తచందనం మొదలగు వృక్ష సంపదను చూడవచ్చును. అడవికోళ్ళు, నెమళ్ళు, దేవాంగపిల్లులు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులు మొదలగు వాటికి ప్రసిద్ధి ఈ ప్రాంతం. 40 అడుగుల ఎత్తున చెట్లమీద కట్టిన తాళ్ళవంతెన విశేషం. పడవ విహారాలకు అనుకూలం. పచ్చనిశాలువా కప్పుకున్నట్లున్న తూర్పుకనుమల అందాలని ఆస్వాదించవచ్చు. మంచి టూరిస్ట్‌ కేంద్రం కూడా. తిరుపతి నుండి ప్రతి ఉదయం 7 గంటలకు బస్సు సౌకర్యం వుంది.

కపిలతీర్ధం

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళేదారిలో తిరుపతికి 2.5 కి.మి. దూరంలో వున్నది కపిలతీర్ధం. శివ భగవానుడు కపిల మహర్హిని ఆశీర్వదించిన ప్రదేశంగా చెప్పబడుచున్నది. కృతయుగంలో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలసినట్లుగా చెప్తారు. ముల్లోకాలలోని సకలతీర్థాలు మక్కోటి పౌర్ణమినాడు మధ్యాహ్నంవేళ పది ఘడియలపాటు (నాలుగుగంటలు) కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆసమయంలో అక్కడస్నానంచేసి నువ్వుగింజంత బంగారాన్ని దానంఇస్తే అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింప బడుతుందని భక్తుల విశ్వాసం.

జపాలి తీర్ధం

అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడకు వచ్చాడని భక్తుల విశ్వాసం. తిరుమలకు 5 కి. మీ దూరంలో కలదు. ఇక్కడ వెలసివున్న శ్రీ ఆంజనేయస్వామి వారిని హనుమజ్జయంతి రోజున వేలాదిగా భక్తులు దర్శించుకొంటారు.

పాండవతీర్థం

దీనికే గోకర్ణతీర్థమనీ పేరుంది. వేకంటేశ్వరాలయానికి ఈశాన్యదిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం ఉన్నారని చెప్తారు. వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశిరోజు ఆదివారం నాడు పాండతీర్థంలో స్నానం చేయడంగాని లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారంనాడు స్నానం చేయడంగాని మంచిదని భక్తులు భావిస్తారు.

కుమారధారా తీర్థం

తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయువ్యదిశలో షుమారు 10 కిలోమీటర్ల దూరంలో వుంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానంచేస్తే పుణ్యప్రదమంటారు. ఆనాడు అక్కడ స్వామివారి ఆలయం నుండి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచడం మరో విశేషం. కుమారస్వామి ఇక్కడే శ్రీవారి ఆష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగా కుమారధారాతీర్థమన్న పేరు వచ్చిందని పేరు.

చక్రతీర్థం

ఈ తీర్ధం స్వామివారి ఆలయానికి వాయువ్యదిశలో వుంది. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారం కానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారంనాడు కానీ ఈ తీర్థంలో స్నానంచేస్తే పాపాలు నశించి, దీర్ఘాయువు, మోక్షసిద్ధి కలుగుతాయని ప్రతీతి.
విష్యక్సేన సరస్సు, పంచాయుధ తీర్థాలు, అగ్నికుండతీర్థం, బ్రహ్మతీర్థం, రామకృష్ణతీర్ధం, వైకుంఠతీర్థం, శేషతీర్థం, సీతమ్మతీర్థం, పుష్ఫతీర్థం, సనకసనందతీర్థం, సప్తర్షి తీర్థాల వంటివి ఇంకా అనేకం వున్నాయి.

ఏడుకొండలవాడా.. వెంకటరమణా గోవిందా గోవింద ..

నాటి తిరుమల

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది.

1955 Tirumala Video..

తిరుమల టికెట్లు లేవు,గోల,గందరగోళం లేదువ్యాపారం లేదు.క్యూలైన్ లేదు . అన్నివిషయాలలో సింపుల్ గా దర్శనం.ఎక్కడా దొరకనటువంటి అరుదైన వీడియో    

Finally after darshan,u will get the world famous and most delicious prasad of tirumala balaji that is nothing but laddu made of pure ghee and lot of cashews .It will melt in ur mouth. U will never forget.

శ్రీవారిసేవా పథకం

మానవసేవే మాధవసేవ అనే పెద్దల మాటనూ భక్తులు కోరుకునే పత్యేక దర్శనం అవకాశాన్ని కలిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 2001లో ప్రవేశపెట్టిన శ్రీవారిసేవా పథకం. పదిమందికి తక్కువకాకుండా ఒక బృందంగా ఏర్పడి వారం పాటు తాము తిరుమలలో స్వచ్ఛందసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శ్రీవారి సేవాసెల్‌కు ధరఖాస్తుచేసుకోవాలి.

ధరఖాస్తు చేయవలసిన అడ్రస్‌
శ్రీవారి సేవాసెల్‌, అన్నదానం కాంప్లెక్స్‌ ఎదురుగా
తిరుమల, ఫోన్‌ : 0877-2263293
ఇతర వివరాలకోసం : పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఫోన్‌ : 0877-2264217

సేవచేయవలసిన ప్రదేశాలు : అన్నదానసత్రం, క్యూలైన్లు, కళ్యాణకట్ట, భక్తులు అలిపిరి – తిరుమల కాలినడక మార్గం, ఉచితంగా సామాన్లు భద్రపరచే గదులు, పార్కింగ్‌ ప్రదేశాలు, పుష్కరిణి, సమాచారకేంద్రం శ్రీవారి ఆలయం వీటిటో ఎక్కడ సేవ చేయాలని వుందో ముందుగా తెలియపరిస్తే భక్తుల ఆసక్తిని బట్టి వారికి ఆయా స్థానాలు కేటాయిస్తారు. ఇక్కడ పేదా గొప్ప తారతమ్యంలేదు ఎవరైనా శ్రీవారిసేవలో పాల్గొనవచ్చును.

నియమ నిబంధనలు
మొదట అడిగినవారికి మొదట అనే పద్ధతిలో వీలునుబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు స్వచ్ఛంద సేవా అవకాశాన్ని కలిగిస్తారు. ఇక ఆ ఏడురోజులు దేవస్థానం వారు ఇచ్చిన కాషాయవస్త్రాన్ని భుజాల చుట్టూ ధరించి అనుక్షణం గోవిందనామస్మరణచేస్తూ వుండాలి. తెల్లవారుజామున నగర సంకీర్తనం చేయాలి. ఇందుకు కావలిసిన పరికరాలను దేవస్థానంవారు అందిస్తారు. దేవస్థానం సిబ్బందితో కలిసి ఈ ఏడురోజులు రోజుకు నాలుగు గంటలనుండి ఆరుగంటలపాటు సేవచేయాల్సి వుంటుంది. ఆ ఏడురోజులు దేవస్థానంవారే ఉచితభోజన సదుపాయం కల్పిస్తారు.

తిరుపతిలో వసతి గృహాల వివరాలు

ఈ సముదాయాలలో బసచేసిన వారు ఇక్కడనుండి తిరుమలకు ఉచిత బస్సులలో వెళ్లవచ్చు. బుకింగ్ కైంటర్ వద్ద తిరుమలకు వెళ్లేవారందరివి ఆధార్ ఒరిజనల్ కార్డులు చూపించాలి.
శ్రీనివాసం అతిథి గృహ సముదాయం :
నాన్- ఎ సిగదులు : రూ.200-
ఎసి గదులు : రూ.400-
ఎ సి డీలక్స్ గదులు : రూ.600-
సంప్రదించవలసిన చిరునామా :సూపరిండెంటెంట్ ఫోన్ : 0877-2264541
మాధవం అతిధి గృహం :
ఎసి ఆర్డనరి గదులు : రూ.800-
ఎ.సి. డీలక్స్ గదులు : రూ.1000-
శ్రీ వేంకటేశ్వరా ధర్మశాల : తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా
సింగల్ రూం : రూ.50-
డబుల్ రూం : రూ.100-
నాలుగు బెడ్ల రూంలు : రూ.100-
ఫోన్ : 0877-2225144
(S.V. Guest House) శ్రీ వేంకటేశ్వరా అతిధి గృహం : తిరుపతి రైల్వే స్టేషన్ కు ఉత్తరం పక్కగారైల్వేస్టేషన్ కు, ఆర్టీసీ బస్టాండ్ కు మధ్యలో ఉంటుంది.
ఎ.సి., నాన్ ఎ.సి గదులు 55 రూములు – రూ.150- ఒక్కొక్కటికి. వీటి బుకింగ్ మాత్రం విష్ణు నివాసంలోనే
ఫోన్ : 0877-2264507
శ్రీ గోవిందరాజా ధర్మశాల :
రైల్వే స్టేషన్ కు వెనుక వైపున కలదు. ఉచిత మరియు అద్దె గదలు ఇస్తారు. 192 గదులున్న సత్రం పూర్తిగా ఉచితం. 181 గదులున్న మరో సత్రంలో గదుల అదె రూ.50- మాత్రమే. మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజనం. వివరాలకు 0877-224503.
శ్రీ విష్ణు నివాసం :
నాన్ ఎ సి గదులు : 196 గదులు– రూ.300-
నాన్ ఎ సి సూట్స్ : 8 గదులు – రూ.500-
ఎసి గదులు : 196 గదులు – రూ.800-
ఎ.సి. సూట్స్ : 8 – రూ.1,300-

Srivari Darsanam Facilities, Tirumala Darsanam Facilities

వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు
శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది
సర్వదర్శనం :
ఉచిత దర్శనం : తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి ప్రతి రోజు సుమారు 60 నుండి 80 వేల మంది దాకా యాత్రికులు వస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా ఉచిత దర్శనం కల్పిస్తారు. మామూలు రోజులలో 18 గంటలు, పండుగ, ముఖ్యదినాలలో రోజుకు 20 గంటలు వీరికి కేటాయిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి అనుసంధానించబడిన అనేక హాల్స్ కలవు. ఈ హాల్స్ నందు ఉన్న భక్తులకు ఉచిత అన్న ప్రసాదం, ప్రతి మూడు గంటలకొకసారి, పాలు, కాఫీ, టీ ఉచితంగా ఇస్తారు. ఉచిత వైద్య సౌకర్యం ఉంటుంది. పరిశుబ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి. టి వీలలో దైవసంబంధమైన కార్యక్రమాలు వస్తుంటాయి.
శీఘ్రదర్శనం :
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
కాలినడక భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు :
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.

కపిలతీర్దం

తిరుపతి కొండకు అనుకుని అలిపిరి దిగువకు వెళ్తే సుందరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడకు వస్తే ప్రకృతి దృశ్యాలు, జపాతాలు కనువిందు చేస్తాయి..
స్థలపురాణం : కృతయుగం కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరునికి కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు పాతాళంనుండి భూమిని చీల్చుకుని వచ్చి వెలశాడని స్థలపురాణం.అందుకే ఈ స్వామిని కపిలేశ్వరుడని, లింగాన్ని కపిల లింగమని పిలుస్తారు. తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం ఇది. తిరుమల కొండ మీద నుండి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇక్కడవున్న పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈపుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవు ఆళ్వార్‌ తీర్థమని పిలుస్తారు. 11వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించి మొదటి రాజేంద్ర చోళుని కాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. కపిలతీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సక తీర్థాలు నాలుగు గంటలపాటు కపితీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తుల తాకిడి ఎక్కువతుంది. నిత్యం ఈ తీర్థంలో స్నానంచేసి దీపాలు వెలిగిస్తారు. కార్తీకంలో ఆరుద్రా నక్షత్రం రోజున శివునికి లక్షబిళ్వార్చన, అన్నాభిషేకం వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబరులో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజులపాటు బ్రహ్మోత్సవాు ఘనంగా జరుగుతాయి.
ఎలావెళ్ళాలి : తిరుపతి బస్టాండ్‌ నుండి అలిపిరి మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్‌ నుండి తిరుమల దేవస్థానం వారి ఉచిత బస్సులలో వెళ్ళవచ్చు.

తలకోన జలపాతం

సుమారు 300 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం పిల్లలకుకు మరియు పెద్దలకు మంచి విహారకేంద్రం. రెండు కొండల మధ్య ఉన్న ఈ జలపాతంలోని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. కొలనులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాని ఎటు వెళ్తుందో తెలియదు. ఈ తీర్థానికి అత్యంత ఎత్తులో పాపనాశనం ఉంది. 3 శతాబ్ధానాటి గిల్లితీగ అనే మొక్క తలకోనకే తలమానికమని చెబుతారు. ఈ మొక్కలోని ప్రతిభాగం ఔషధ యుక్తమే. గిరిజనులు ఈ మొక్కను వివిధ వ్యాధుల నివారణకు వాడతారట. ఈ మొక్క కాయలు మూడున్నర అడుగుల నుండి నాలుగడుగుల దాకా ఉంటాయంటారు. ఇక్కడ తెల్లని ఆర్కిడ్‌ పుష్పాలు, మద్ది, జాలరి, చందనం, రక్తచందనం మొలదగు వృక్ష సంపదను చూడవచ్చును. అడవికోళ్ళు, నెమళ్ళు దేవాంగన పిల్లులు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. 40 అడుగుల ఎత్తుమీద కట్టిన తాళ్ళవంతెన ప్రత్యేకం.పడవలలో విహారం చేయవచ్చును. పచ్చని శాలువా కప్పుకున్నట్లు తూర్పు కనుమల అందాలు కనువిందు చేస్తాయి. మంచి టూరిస్టు కేంద్రం
ఎలా వెళ్ళాలి : తిరుపతి నుండి సుమారు 50 కి.మీ దూరంలో యర్రవారి మండలంలో కలదు. తిరుపతి నుండి బస్సులలో వెళ్ళవచ్చు.

బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో దసరా పండగ నుండి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రోజుకు రెండు వాహనాల చొప్పున తొమ్మిది రోజుల పాటు తిరువీధులలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది.
మొదటి రోజు అంకురార్పణ :
బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం అవుతాయి. ఈ ఉత్సవాలకు సోముడు(చంద్రుడు) అధిపతి. ఆలయానికి నైరుతీ దిశలో ఉన్న వసంతమండపం వద్ద నుంచి మట్టిని సేకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి తొమ్మది కుండలలో(పాళికలు) ఆ మట్టిని నింపి నవధాన్యాలను పోసి మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం :
బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఎగురవేసే గరుడ పతాకమే ధ్వజారోహణం. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక కొత్త వస్త్రంపై గరుడుని బొమ్మని చిత్రిస్తారు. దీనిని గరుడధ్వజం అంటారు. నూలుతో పేనిన కొడితాడుకు దీనిని కట్టి ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. గోధూళిలగ్నమైన మీనలగ్నంలో ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గరుడపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలకు, అష్టదిక్పాలకులకు, యక్ష గందర్వులకు ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు తిరుమలలో కొలువై ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
పెద్దశేషవాహనం :
శ్రీనివాసుని పానుపు శేషుడు. శేష వాహనంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం రోజున స్వామివారు శ్రీదేవి, భూదేవీ సమేతంగా సర్వాలంకారభూషితుడై పెద్ద శేషవాహనం ఎక్కి తిరుమల ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగుతారు.
రెండవరోజు :
చిన్న శేషవాహనం రెండవ రోజు ఉదయం స్వామివారు తన ఉభయదేవేరులతో కలసి ఐదుశిరస్సుల చిన్నవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న వాహనాన్ని వాసుకిగా భావిస్తారు.
హంసవాహనం : రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వవిద్యా ప్రదాయని అయిన శారదా మాతరూపంలో హంసవాహన మొక్కి ఊరేగుతారు. హంస అనే శబ్ధానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే మనోమందిరం అని అర్ధం. అల్పమైన కోర్కెలు అనెడి అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని హంసవాహనం ద్వారా స్వామి వారు భక్తులకు చాటుతున్నారని భక్తుల విశ్వాసం.
మూడవ రోజు :
బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం సింహ వాహనంపై తిరుమల నాధుడు ఊరేగుతాడు. యోగాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమన శక్తికి సంకేతంగా భావిస్తారు. శ్రీనివాసుడు విశ్వానికి తనలోని పరాక్రమాన్ని చాటటానికి ఈ వాహనంపై భక్తలకు కనువిందు చేస్తాడని నమ్ముతారు.
ముత్యపు పందిరి వాహనం :
మూడవ రోజురాత్రి ముత్యపు పందిరి వాహనంపై వేంకటవల్లభుడు తిరువీధులలో ఊరేగుతాడు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనస్సు కావాలని, నిర్మల చిత్తం అలవరచుకోవాలని భక్తలకు చాటిచెప్పటం ఈ వాహన అంతర్యం.
నాలుగవ రోజు :
కల్పవృక్ష వాహనం – నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. కోరిన వరాలిచ్చే కల్పవృక్ష వాహనంపై అడగకనే అన్నీ ఇచ్చి ముక్తి ప్రసాదించే దేవదేవుడు కొలువు తీరి ఊరేగే ఈ ఉత్సవం కనుల పండుగగా సాగుతుంది.
సర్వభూపాల వాహనం :
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తనేనని చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. ఈ వాహన సేవ దర్శనం వలన మనలోని అహంకారం నశిస్తుందని నమ్మకం.
ఐదో రోజు :
బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. అన్నివాహన సేవలు వాహన మండపం నుంచి ఆరంభమైతే మొహిని అవతారం మాత్రం ఆలయం నుంచి వెలుపలకి వస్తుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీవారు మోహినీ అవతారంలో మాడ వీధులలో ఊరేగుతారు. మంచి కార్యాల వలన ఎలాంటి శుభాలు జరుగుతాయో చెప్పటానికి అలనాటి క్షీరసాగర మధనం సన్నివేశాలను గుర్తుకు తెస్తూ శ్రీవారు భక్తలను కనికరిస్తున్నారని నమ్మకం.
ఐదవ రోజు రాత్రి:
గరుడోత్సవం – శ్రీవారి అన్ని ఉత్సవాలకంటే ఘనమైనది గరుడోత్సవం. బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు రాత్రి గరుత్మంతుడి వాహనంమీద స్వామివారు ఊరేగుతారు. ఈ ఉత్సవంలో మూలవిరాట్ కంఠాభరణమైన మకర కంఠి, లక్ష్మీహారం, సహస్రనామాలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. వేంకటేశ్వర స్వామిని అనేకరీతుల కొనియాడిన గోదాదేవి పుట్టినల్లు అయిన శ్రీవిల్లి పుత్తూరు నుంచి పంపే తులసీమాల,నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. ఉత్సవమూర్తి మలయప్ప మొడలోని మకరకంఠి (గరుడపచ్చ) దర్శనంతో సర్వశుభాలు కలుగుతాయని భక్తు విశ్వాసం. అందుకే గరుడోత్సం రోజున తిరుమల కొండ లక్షలాది మందిభక్తులతో కిటకిటలాడుతుంది.
ఆరవరోజు :
ఆరవరోజు ఉదయం జరిగే వాహన సేవలో హనుమంతుడి వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. హనుమంతుని భక్తి తత్పరతను చాటిచెబుతూ, రాముడైనా కృష్ణుడైనా, శ్రీవేంకటేశ్వరుడైనా అన్నీ తానే అని వాహనం ద్వారా స్వామి చాటి చెబుతారు.
గజవాహనం:
ఆరవ రోజురాత్రి గోవిందుడు గజవాహనధారుడై భక్తులను కనికరిస్తాడు. గజవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే ఎంతపెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఏడో రోజు :
ఏడోరోజు ఉదయం భానుడు తన రథసారధిగా, సప్తాశ్యాలు కూర్చిన రథంపై ఎర్రటి పూలమాలలు ధరించి మలయప్పగా ఊరేగుతాడు. భక్తుల అజ్గ్నానాంధకారాన్ని తొలగించడానికి శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారు
చంద్రవాహనం:
ఏడో రోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూలమాలలు ధరించి చిరునవ్యులు చిందిస్తూ మలయప్ప చంద్రవాహనంపై ఊరేగుతారు. సర్వజనులు శాంతికాములై చల్లగా ఉండాలని దీవిస్తూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారని అంటారు.
ఎనిమిదవ రోజు :
గుర్రాలవంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపుచేయాలనే తత్వజ్గ్నానాన్ని శ్రీనివాసుడు ఎనిమిదవ రోజు రథోత్సవం ద్వారా తెలియజేస్తారు.
అశ్వవాహనం :
ఎనిమిదో రోజు రాత్రి శ్రీవారు అశ్వవాహనం మీద ఊరేగుతారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు గుర్రంమీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పటమే ఈ వాహన సేవ ఆంతర్యం.
తొమ్మిదవ రోజు :
చక్రస్నానం- ఎనిమిది రోజుల పాటు వాహన సేవలలో అలసిపోయిన స్వామి సెదతీరటం కోసం తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. ఈ సందర్భంగా వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో కూడిన స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు మరో రూపమైన చక్రతాళ్వార్ ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించటంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల పోతాయని భక్తుల నమ్మకం.
ధ్వజారోహణం :
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వనిస్తూ తొలిరోజు ఎగురవేసిన గరుడధ్వజ పతాకాన్ని అవరోహణం చేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

అన్నప్రసాదం

తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.

Under Nitya Annadanam scheme, which was started on a small scale in 1984. Tirumala Tirupati Devasthanams(TTD) is providing full meals to all devotees in Tirumala and Tiruchanoor temples.

Every day around 2 lakh devotees avail the free Annaprasadam in Matrusri Tarigonda Vengamamba Nithya Annaprasadam Complex, Tirumala.

Old picture of Nitya Annadanam in Tirumala.

Matrusri Tarigonda Vengamamba Nithya Annaprasadam Complex in Tirumala

TTD is also supplying food packets on a continuous basis to the pilgrims awaiting for darshan in the outside Q-lines which include milk to the awaiting children at free of cost.

In Tiruchanoor Padmavathi Ammavari Temple, nithya Annaprasadam facility being provided, daily for about 5000 pilgrims at free of cost.

Besides this T.T.D. is providing free food to the pedestrians in the Foot Path near Narasimhaswamy Temple.

This scheme is being run with the donations received from Devotees / Donors from all over the world.

If you could donate to the trust, please visit http://www.tirumala.org/SRIVENKATESWARAANNAPRASADAMTRUST.aspx

శ్రీవేంకటేశ్వర మ్యూజియం

1997 సం.లో ఆలయం ఉత్తర భాగం వైపు నిర్మించిన ఈ మ్యూజియం భారత దేశంలోనే అత్యధికులు సందర్శిస్తున్న ప్రదర్శనశాల అన్నమయ్య తిరుమలేశునికి వేల సంకీర్తనలు అర్చించాడు. ఆ వాగ్గేయకారుని పద సంపద దర్శించాలనుకుంటే. శ్రీవేంకటేశ్వర మ్యూజియానికి తప్పక వెళ్లాలి. 16వ శతాబ్దంలో అన్నమయ్య రాసిన సంకీర్తనలు అక్కడ రాగిరేకులపై చూడవచ్చు. ఏడుకొండలవాని వాహనాలు, అపురూప చిత్రాలు, అందమైన విగ్రహాలు, భిన్న కళాకృతులు ఎన్నిటినోఇక్కడ చూడవచ్చు. 1.25 లక్షల చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో వీటన్నిటినీ భద్రపరిచారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 నిమిషాల వరకు ఈ మ్యూజియం తెరచి ఉంటుంది. మ్యూజియం పైన మెడిటేషన్ చేయటానికి సౌకర్యం కలదు. కర్ణాటక గెస్ట్ హౌస్ దగ్గరలో మ్యూజియం కలదు.

ఆన్ లైన్ లో సేవల బుకింగ్, వసతి గృహాల బుకింగ్, దర్శనం…….

Best places to visit in Tirupati

First of all, if Tirupati is taken as a base, then how many km each temple is in it will be known approximately. In this three directions, three angles, you can continue your journey.

First there is Sri Kalahasti in the eastern direction . It is at a distance of 37 km from Ramaram. This is called Vayulingam. Shiva Temple Very ancient. Rahuketu Pujas are performed here every day. At least an hour’s drive. While coming back, you can go to the side road in the middle and see the Parasurameshwara temple in Gudimalam. It is known as the oldest temple in India.

Tiruchanur Padmavati temple is first in the southern direction . It is just five km away. It gets a little crowded here. Goddess Lakshmi is not necessary for everyone. Then a little side way, there is Appalaya Gunta Prasanna Venkateswara Swamy Temple . It is said that the married Lord Venkateswara appears here. Because he is in Abhayamudra, some say that he is excellent. Again in Adevarusa, on the way to Madras, in Narayana Vanam next to Puttur, there is Lord Venkateswara Swamy , and if you go a little further, there is a temple of Matsyavatara Vishnu Murthy in Nagalapuram . A little further up is the only sculpture in Suruthu Palli (Oothukota-Tamil Nadu ) with a Shayana figure.There is Palli Kondeswara Shiva Temple . In this temple there is a sculpture of Lord Shiva drunk with Garalam, lying on Parvati’s lap (no abhishekam as it is not made of stone). Heard that there is no such thing anywhere.

If you go back a little from there and continue along Tamil Nadu, Tiruthani (70km) and Kanchi will come.

Similarly, if you go west from Tirupati, you will come to Katpadi and Bangalore. This temple is located near Srinivasa Mangapuram . Here, Venkateswara is seen in a larger form than Tirumala Venkateswara Swamy on the hill. A little to the side, at Mukkoti or Thondawada , by the bed of a small river, is a Shiva temple. Also, at a distance of 60 km , there is a temple of Lord Kanipaka . This is the temple shown in the movie Gods. From here, about the same distance, next to Katpadi in Tamil Nadu, beyond Raya Vellore , is the Golden Temple , or Golden Ammavari Gudi. This is called Lakshminarayani temple.

These are the famous or lesser known stones that are located around Tirupati in a subtle way.

** Since most of the above-mentioned guls are TTD way, they are kept open from dawn to dusk. You can inquire about these at the information center. They drive a bus called Temple Darshan. They show many of these in it. Apart from that, you can see quickly if you have a car yourself.

%d bloggers like this:
Available for Amazon Prime